🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.7🌺
🌷
మూలమ్--
న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి ।
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి॥౧.౭॥
🌺
పదవిభాగః--
న సంశయమ్ అనారుహ్య నరః భద్రాణి పశ్యతి । సంశయం పునః ఆరుహ్య యది జీవతి పశ్యతి॥౧.౭॥
🌸
అన్వయః--
నరః సంశయమ్ అనారుహ్య భద్రాణి న పశ్యతి । పునః సంశయం ఆరుహ్య యది జీవతి, పశ్యతి॥౧.౭॥
🌼
ప్రతిపదార్థః--
నేతి । నరః = మానవః ; సంశయం= సఙ్కటం, ప్రాణసన్దేహమ్। అనారుహ్య = అననుభూయ, అనవాప్య చ ; భద్రాణి = శ్రేయాంసి, సుఖం, ధనాదిసమ్పత్తిఞ్చేతి యావత్ ; పునః =కిన్తు ; సంశయం = జీవనశఙ్కామ్ ; జీవతి = జీవన్నేవ సంశయదోలాయా యది ఉత్తరతి తర్హి ; పశ్యతి = అవశ్యం భద్రాణి పశ్యతీత్యర్థః॥౧.౭॥
🌻
తాత్పర్యమ్--
మానవః సన్దేహమ్ (ప్రాణసఙ్కటాదికం) అప్రాప్య సుఖాదికం న లభతే। తాదృశస్య విపత్తేః ప్రాప్తేరనన్తరం యది ప్రాణైః విహీనో న భవతి, తర్హి సుఖం భుఞ్జతే। (కష్టం వినా సుఖం అసమ్భవమితి భావః।) ॥౧.౭॥
🌿
హిన్ద్యర్థః--
మనుష్య బినా సంశయ మేం పడ़ే కభీ లాభ నహీం ఉఠా సకతా హై, యది సంశయ మేం పద కర భీ జీతా బచ జాతా హై, తో బహ (లాభ కా) సుఖ భోగతా హై॥౧.౭॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
సంశయం = సందేహమును ; అనారుహ్య = (జయించక) అధిష్టించక ; నరః = మానవుడు ; భద్రాణి = మంగళకరములైన వాటిని ; న పశ్యతి = (అనుభవించ లేడు) చూడలేడు ; (అతః = అందువలన), పునః = మళ్ళీ ; సంశయం = సందేహమును ; ఆరుహ్య అపి = (అధిగమించియు) అధిష్టించియు ; జీవతి యది = (సందేహాతీతుడై ధైర్యంగా) జీవించుచున్న వాడైతే ; భద్రాణి = మంగళకరములైన వాటిని ; పశ్యతి = (తప్పకుండా) చూస్తాడు అని అర్థము. సందేహనివృత్తిపూర్వకజీవనం శ్రేయోదాయక మని సారాంశము. ॥౧.౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
సందేహనివృత్తి కాకుండా, మానవుడు మంగళకరములైన వాటిని అనుభవించ లేడు...చూడలేడు . అందువలన సందేహమును అధిగమించి, ధైర్యంగా జీవించుచున్న వాడైతే, మంగళకరములైన జీవనసంబంధవిషయాలను తప్పకుండా చూస్తాడు అని భావము. సందేహనివృత్తిపూర్వకజీవనవిధానం శ్రేయోదాయక మని సారాంశము. ॥౧.౭॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.7
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment