Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.41

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.41🌺
🌷
మూలమ్--
కాచః కాఞ్చనసంసర్గాద్ ధత్తే మారకతీర్ద్యుతీః ।
తథా సత్సన్నిధానేన మూర్ఖో యాతి ప్రవీణతామ్ ॥౦.౪౧॥

🌺
పదవిభాగః--
కాచః కాఞ్చన-సంసర్గాద్ ధత్తే మారకతీః ద్యుతీః । తథా సత్సన్నిధానేన మూర్ఖః యాతి ప్రవీణతామ్ ॥౦.౪౧॥
🌸
అన్వయః--
కాచః కాఞ్చన-సంసర్గాద్ మారకతీః ద్యుతీః ధత్తే । తథా మూర్ఖః సత్సన్నిధానేన ప్రవీణతామ్ యాతి॥౦.౪౧॥
🌼
ప్రతిపదార్థః--
కాచః = మృత్తికాభేదః ; కాఞ్చనసంసర్గాద్ ~కాఞ్చనమ్ = సువర్ణమ్ ; సంసర్గాద్ = సమ్పర్కాత్ ; మారకతీః= మరకతమణి-సమ్బన్ధినీః, తత్తుల్యతామితి యావత్ [మరకతః=ఒక మణి] ; ద్యుతీః = ప్రకాశాన్ ; సత్సన్నిధానేన = సతాం సాఙ్గత్యేన ; ప్రవీణతాం = కుశలతాం, పాణ్డిత్యఞ్చ ; యాతి = లభతే ॥౦.౪౧॥
🌻
తాత్పర్యమ్--
కాఞ్చనస్య సమ్పర్కేణ కాచః అపి మరకతమణిరివ కాన్తిం ప్రాప్నోతి। తథైవ బుద్ధిహీనోఽపి సజ్జనానాం సఙ్గతౌ కౌశల్యం లభతే ॥౦.౪౧॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి-జైసే కాచ భీ సువర్ణ కే సమ్బన్ధ సే మరకత మణి (పన్నా) కీ సీ శోభా కో పాతా హై, ఇసీ ప్రకార సజ్జనోం కే సంసర్గ సే మూర్ఖ భీ చతుర హో జాతా హై॥౦.౪౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
కాచః = ("కాచః క్షారః" = అని నిఘంటువు) గాజు పెంకు ; కాఞ్చనసంసర్గాత్ = బంగారంతో కలిసినందువలన ; మారకతీః = మరకతమణుల వంటి ; ద్యుతీః = (కాంతులను) ప్రకాశములను ; ధత్తే = ధరించుచున్నది ; తథా = అదే విధముగా ; సత్సన్నిధానేన = (సతాం సన్నిధానం సత్సన్నిధానం) సజ్జనసాంగత్యముచేత ; మూర్ఖః = అల్పజ్ఞుడు కూడా ; ప్రవీణతాం = ప్రావీణ్యమును ; యాతి = పొందుచున్నాడు. ॥౦.౪౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
"కాచః క్షారః" = అని నిఘంటువు. కాచః అనగా గాజు పెంకు. అది బంగారంతో కలిసినందువలన మరకతమణి వంటి కాంతిని ధరించుచున్నది. అదే విధముగా, సజ్జనసాంగత్యముచేత అల్పజ్ఞుడు కూడా, సజ్జనసంబధమైన ప్రావీణ్యమును పొందుచున్నాడు అని భావము. ॥౦.౪౧॥
🙏

No comments:

Post a Comment