Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.40

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.40🌺
🌷
మూలమ్--
యస్య మిత్రేణ సమ్భాషో యస్య మిత్రేణ సంస్థితిః ।
యస్య మిత్రేణ సంలాపస్తతో నాస్తీహ పుణ్యవాన్॥౧.౪౦॥

🌺
పదవిభాగః--
యస్య మిత్రేణ సమ్భాషః యస్య మిత్రేణ సంస్థితిః । యస్య మిత్రేణ సంలాపః తతః న అస్తి ఇహ పుణ్యవాన్॥౧.౪౦॥
🌸
అన్వయః--
యస్య మిత్రేణ సమ్భాషః, యస్య మిత్రేణ సంస్థితిః, యస్య మిత్రేణ సంలాపః (చ) తతః పుణ్యవాన్ ఇహ న అస్తి॥౧.౪౦॥
🌼
ప్రతిపదార్థః--
యస్య మిత్రేణ = సుహృదా సహ ; సమ్భాషః = ఆలాపః ; సంస్థితిః = సహావస్థానమ్., సహవాసః ; సంలాపః = ముహుర్ముహః కథా, గోష్ఠీబన్ధః ; తతః = తదపేక్షయా ; ఇహ జగతి ; పుణ్యవాన్ = సుకృతీ॥౧.౪౦॥
🌻
తాత్పర్యమ్--
యః నిత్యం సఖ్యా ఆలపతే, సహ తిష్ఠతి, వార్తాలాపరతో భవతి, తతః భాగ్యవాన్ నరః న భవతి అన్యః॥౧.౪౦॥
🌿
హిన్ద్యర్థః--
జో అపనే మిత్ర కే సాథ సమ్భాషణ (మధుర భాషణ) కరతా హై ఔర జో అపనే మిత్ర కే సాథ రహతా హై ఔర జో అపనే మిత్ర కే సాథ ప్రేమ పూర్వక 'వార్తాలాప కరతా హై, ఉససే బఢ़కర ఇస పుణ్యవాన్ సంసార మేం దూసరా కోఈ నహీం హై॥౧.౪౦॥
🙏
ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సమ్భాషః = మాట, ముచ్చట ; యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సంస్థితిః = కలిసి ఉండడం ; యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సంలాపః = పరస్పరసంభాషణము ; ఇహ = ఈ సంసారంలో ; తతః = అంతకంటే ; పుణ్యవాన్ = పుణ్యాత్ముడు ; నాస్తి = లేడు, ఉండడు అని అర్థము. ॥౧.౪౦॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎవనికి స్నేహితునితో మాట, ముచ్చటకు అవకాశం కలదో, ఎవనికి స్నేహితునితో స్వేచ్ఛగా కలిసి ఉండే అవకాశం కలదో, ఎవనికి స్నేహితునితో ఇష్టానుసారము పరస్పరసంభాషణము చేయు అవకాశం కలదో, ఈ సంసారంలో అంతకంటే పుణ్యాత్ముడు, లేడు, ఉండడు. అనగా తనను అర్థం చేసుకుని ఆదరించే స్నేహితుని కలిగియున్న వాడు చాలా అదృష్టవంతుడని భావము. ॥౧.౪౦॥

No comments:

Post a Comment