🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.45🌺
🌷
మూలమ్--
ధనాని జీవితఞ్చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్ ।
సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి॥౧.౪౫॥
🌺
పదవిభాగః--
ధనాని జీవితం చ ఏవ పరార్థే ప్రాజ్ఞః ఉత్సృజేత్ । సన్నిమిత్తే వరం త్యాగః వినాశే నియతే సతి॥౧.౪౫॥
🌸
అన్వయః--
ప్రాజ్ఞః ధనాని జీవితం చ ఏవ పరార్థే ఉత్సృజేత్ । వినాశే నియతే సతి సన్నిమిత్తే త్యాగః వరమ్॥౧.౪౫॥
🌼
ప్రతిపదార్థః--
ప్రాజ్ఞః = విద్వాన్ ; జీవితం = ప్రాణాన్ ; పరార్థే = పరోపకారాయ ; ఉత్సృజేత్ = దద్యాత్ ; వినాశే = మరణే ; నియతే = నిశ్చితే సతి ; సన్నిమిత్తే = సత్కార్యసిద్ధయే, పరోపకారాయ ; త్యాగః = ప్రాణపరిత్యాగః ; వరం = కిఞ్చిత్ శ్రేష్ఠః॥౧.౪౫॥
🌻
తాత్పర్యమ్--
బుధజనః పరేషాముపయోగాయ విత్తం జీవనం చార్పయతి। నాశనమేవ యది (అశాశ్వతేఽస్మిన్) లోకే నియమః భవతి, తర్హి సత్కార్యాచరణార్థం ధనప్రాణయోః ఉపయోగః ఏవ శ్రేష్ఠః ॥౧.౪౫॥
🌿
హిన్ద్యర్థః--
కిసీ నే ఠీక హీ కహా హై, కి- విద్వాన్ లోగోం కో అపనే ధన తథా ప్రాణోం కో స్వరోం కే ఉపకార కే లిఏ సమర్పణ కర దేనా చాహిఏ । క్యోం కి జబ ఉన ప్రాణోం కా ఔర ధన కా నాశ హోనా నిశ్చిత హీ హై, తో ఉన్హేం సదుపయోగ మేం లగా దేనా హీ అచ్ఛా హై॥౧.౪౫॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ప్రాజ్ఞః = విద్వాంసుడు ; ధనాని = సంపదలను ; జీవితం = (తన) జీవితాన్ని; పరార్థే = పరోపకారము కొరకు ; ఉత్సృజేత్ = (నిశ్శంకగా) వదలవలెను ; వినాశే = మరణము ; నియతే = నిశ్చయమై ఉండగా ; సన్నిమిత్తే = (ఉత్తమఫలసాధకమైన పరోపకారమనే) ఉత్తమకారణము కొరకు ; త్యాగః = (సర్వ)పరిత్యాగము ; వరం = శ్రేష్ఠమైనది అని అర్థము. ॥౧.౪౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
విద్వాంసుడు తనవైన సంపదలను, చివరకు తన జీవితాన్ని కూడా పరోపకారము కొరకు నిశ్శంకగా వదలవలెను. ఎందుకనగా ఈ జీవితంలో మరణము నిశ్చయమై ఉండగా, ఉత్తమఫలసాధకమైన పరోపకారమనే ఉత్తమకారణము కొరకు ఎవరికైనా వారి వారి ధనజీవితాదులను త్యాగము చేయగలుగుట అనునది ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ధన్యతను అందించునది అని భావము. ॥౧.౪౫॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.45
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment