Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.47

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.47🌺
🌷
మూలమ్--
గుణా గుణజ్ఞేషు గుణా భవన్తి
తే నిర్గుణం ప్రాప్య భవన్తి దోషాః ।
ఆస్వాద్యతోయాః ప్రవహన్తి నద్యః
సముద్రమాసాద్య భవన్త్యపేయాః॥౦.౪౭॥

🌺
పదవిభాగః--
గుణాః గుణజ్ఞేషు గుణాః భవన్తి తే నిర్గుణం ప్రాప్య భవన్తి దోషాః । ఆస్వాద్య-తోయాః ప్రవహన్తి నద్యః సముద్రమ్ ఆసాద్య భవన్తి అపేయాః॥౦.౪౭॥
🌸
అన్వయః--
గుణాః గుణజ్ఞేషు గుణాః భవన్తి। తే నిర్గుణం ప్రాప్య దోషాః భవన్తి । నద్యః ఆస్వాద్య-తోయాః ప్రవహన్తి । సముద్రమ్ ఆసాద్య అపేయాః భవన్తి॥౦.౪౭॥
🌼
ప్రతిపదార్థః--
గుణా ఇతి । గుణాః = దయాదాక్షిణ్య-సత్కుల-ప్రసూతత్వాదయః ; గుణజ్ఞేషు = గుణి-జనసమవధానే, యే గుణం జానన్తి, తేషు ; గుణా భవన్తి = గుణత్వం వహన్తి । తే = గుణాః । నిర్గుణం = గుణశూన్యమ్ ; దోషా భవన్తి ; ఆస్వాద్యం తోయం యాసాన్తాః ~ ఆస్వాద్య-తోయాః = సుపేయపానీయాః, మధురజలాః ; ప్రవహన్తి = ప్రచరన్తి ; 'ప్రభవన్తీ'తి పాఠేఽపి స ఏవాఽర్థః ; ఆసాద్య = ప్రాప్య ; అపేయాః = క్షారోదకాః ; ఏవఞ్చ త్వత్సంనిధానేన (భవత్సఙ్గేన) కులీనా మత్పుత్రా విద్వాంసో భవిష్యన్తీత్యాశయః॥౦.౪౭॥
🌻
తాత్పర్యమ్--
గుణజ్ఞా నామ యే గుణం జానన్తి, తేషు గుణాః గుణాః భవన్తి। గుణహీనం ప్రాప్య తే దోషా భవన్తి। అత్ర సాదృశ్యమ్ నదీభిః। నద్యః యావత్ ప్రవహణశీలాః తావత్ మధురజలైః యుక్తాః, పానయోగ్యాః భవన్తి। తాః ప్రవాహాన్తే సముద్రం యదా ప్రాప్నువన్తి తదా పానాయ అయోగ్యజలయుక్తా సమ్పద్యన్తే। [అత్ర నదీజలానాం సన్దర్భే, పానయోగ్యత్వమధికృత్య సముద్రః క్షారజలత్వాత్ నిర్గుణ ఇతి అభిహితః। తావన్మాత్రేణ అన్యసల్లక్షణానాం సన్దర్భే సముద్రస్య గుణహీనత్వం న కీర్తనీయమ్।]॥౦.౪౭॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి గుణీ మనుష్య కే సమ్బన్ధ సే గుణగుణ హీ రహతే హై, అర్థాత్ ఉనకా ఆదర హోతా హై । పర వే హీ గుణ-నిర్గుణ మనుష్య కే సమ్బన్ధ సే హో జాతే హైం । దేఖో, నదియోం కా జల స్వభావ సే హీ స్వాదిష్ట హోతా హై, పరన్తు వహీ జల జబ సముద్ర మేం జాకర పడ़తా హై, తో వహ ఖారా హో జాతా హై॥౦.౪౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గుణాః = విద్యాదాక్షిణ్యాది (ఉత్తమ) గుణములు ; గుణజ్ఞేషు = ( ఉత్తమ) గుణములు కలవారియందు ; గుణాః (ఏవ) = (ఉత్తమ) గుణములు గానే ; భవన్తి = అగుచున్నవి ; తే (ఏవ) = ఆ గుణము (లే) లు ; నిర్గుణం = (ఉత్తమ) గుణశూన్యున్ని ; ప్రాప్య = పొంది ; దోషాః = దుర్గుణములై ; భవన్తి = అగుచున్నవి ; (యథా = ఎట్లనగా), ఆస్వాద్య-తోయాః = త్రాగుటకు యోగ్యమైన నీరు కలిగిన ; నద్యః = నదులు ; ప్రవహన్తి = ప్రవహించుచున్నవి ; (తాః ఏవ నద్యః = ఆ మంచినీటి నదులే), సముద్రం = (లవణజలసమన్వితమైన), సముద్రమును ; ఆసాద్య = పొంది ; అపేయాః = త్రాగుటకు పనికి రానివిగా ; భవంతి = అగుచున్నవి. ॥౦.౪౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
విద్యాదాక్షిణ్యాది ఉత్తమగుణములు, సద్గుణసంపన్నులను ఆశ్రయించినప్పుడు, ఉత్తమగుణములు గానే ఉంటున్నవి ; ఆ ఉత్తమగుణములే, గుణహీనున్ని పొందినప్పుడు, దుర్గుణములుగా అగుచున్నవి . ఎట్లనగా, త్రాగుటకు యోగ్యమైన నీటితో ప్రవహించుచున్న నదులు, లవణజలసమన్వితమైన సముద్రమును పొంది, త్రాగుటకు పనికి రానివిగా అగుచున్నట్లుగా...అని భావము ॥౦.౪౭॥
🙏

No comments:

Post a Comment