Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.33

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.33🌺
🌷
మూలమ్--
పూర్వజన్మకృతం కర్మ తద్ దైవమితి కథ్యతే ।
తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాదతన్ద్రితః ॥౦.౩౩॥

🌺
పదవిభాగః--
పూర్వ-జన్మ-కృతం కర్మ తద్ దైవమ్ ఇతి కథ్యతే । తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాద్ అతన్ద్రితః ॥౦.౩౩॥
🌸
అన్వయః--
పూర్వ-జన్మ-కృతం కర్మ తద్ దైవమ్ ఇతి కథ్యతే । తస్మాత్ పురుషకారేణ అతన్ద్రితః యత్నం కుర్యాద్॥౦.౩౩॥
🌼
ప్రతిపదార్థః--
పూర్వజన్మని = గతే జన్మకాలే ; కృతం యత్కర్మ = ఆచరితాని కార్యాణి ; తత్ = తదేవ ; దైవమితి కథ్యతే = ‘దైవపదవాచ్యమ్, ఇతోఽన్యద్దైవం నామ కిఞ్చిదపి నాస్తి ; తస్మాత్ = పురుషకారేణ వినా దైవస్య సిద్ధేరభావాత్ ; పురుషకారేణ = పురుషార్థమాస్థాయ, ప్రయత్నం కృత్వా; అతన్ద్రితః = ఆలస్యవర్జితః, సావధానః సన్ ; పుమాన్ = పురుషః, మనుష్యః ; యత్నం కుర్యాత్ = ఉద్యమం కుర్యాత్ ॥౦.౩౩॥
🌻
తాత్పర్యమ్--
గతే జన్మని యద్యదాచరితం కర్మ వర్తతే, తదేవ అస్మిన్ జన్మని భాగ్యరూపేణ పరిణమతి। అతః (పూర్వకాలే వా భవతు) ప్రయత్నేనైవ భాగ్యస్యాపి కల్పితత్వాత్, సావధానో భూత్వా ప్రయత్నః అవశ్యం కరణీయః ॥౦.౩౩॥
🌿
హిన్ద్యర్థః--
పూర్వజన్మ మేం కియా హుఆ కర్మ హీ దూసరే జన్మ మేం భాగ్య కహా జాతా హై । ఇసలియే మనుష్య కో పురుషార్థం (ఉద్యోగ, కర్మ) కరనా హీ చాహిఏ॥౦.౩౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
పూర్వజన్మని = గత జన్మయందు ; కృతం = ఆచరించిన ; యత్కర్మ = ఏ (వ్యవహారమో) పనియో ; తత్ = ఆ పనినే ; దైవమితి = (భాగ్యమని) దైవమని ; కథ్యతే = చెప్పబడుచున్నది ; (దైవమనగా మరియొకటి కాదు) ; తస్మాత్ = అందువలన ; అతన్ద్రితః = వాయిదాలు లేని ; పురుషకారేణ = స్వశక్తియుక్తులతో ; (స్థిరచిత్తంతో), యత్నం = (సత్కార్యాచరణకై), (తీవ్ర) ప్రయత్నమును ; కుర్యాత్ = చేయవలయును. (జీవనసార్థక్యమునకు అన్యోపాయము లేదు అని అర్థము). ॥౦.౩౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
గత జన్మయందు ఆచరించిన ఏ వ్యవహారము లేక పనియో దానినే భాగ్యమని లేక దైవమనియు శాస్త్రమందు చెప్పబడుచున్నది. దైవమనగా మరియొకటి కాదు. అందువలన, వాయిదాలు వేయకుండా, స్వశక్తియుక్తులతో, స్థిరచిత్తంతో, సత్కార్యాచరణకై తీవ్రప్రయత్నమును చేయవలయును.జీవనసార్థక్యమునకు ఇక అన్యోపాయము లేదు అని భావము. ॥౦.౩౩॥
🙏

No comments:

Post a Comment