Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.39

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.39🌺
🌷
మూలమ్--
రూపయౌవనసమ్పన్నా విశాలకులసమ్భవాః ।
విద్యాహీనా న శోభన్తే నిర్గన్ధా ఇవ కింశుకాః ॥౦.౩౯॥

🌺
పదవిభాగః--
రూప-యౌవన-సమ్పన్నాః విశాల-కుల-సమ్భవాః । విద్యాహీనాః న శోభన్తే నిర్గన్ధాః ఇవ కింశుకాః ॥౦.౩౯॥
🌸
అన్వయః--
రూప-యౌవన-సమ్పన్నాః విశాల-కుల-సమ్భవాః (అపి) విద్యాహీనాః నిర్గన్ధాః కింశుకాః ఇవ న శోభన్తే॥౦.౩౯॥
🌼
ప్రతిపదార్థః--
రూప-యౌవన-సమ్పన్నాః ~రూపేణ = సౌన్దర్యేణ, శరీరకాన్త్యా చ ; యౌవనేన = యువత్వకృతేన వపుః ; సమ్పన్నాః = శోభితాః అపి ; కిఞ్చ--విశాలకులసమ్భవాః = మహాకులప్రసూతా అపి ; విద్యాహీనాః = మూర్ఖాః ; నిర్గన్ధాః = (సురూపా అపి) గన్ధశూన్యాః, కింశుకాః = పలాశకుసుమానీవ, న శోభన్తే = లోకే న విరాజన్తే॥౦.౩౯॥
🌻
తాత్పర్యమ్--
సున్దరాః, యువకాః, ఉన్నత-కులే జాతాః అపి నరాః జ్ఞానేన వినా, గన్ధహీన-కింశుక-పుష్పాణీవ న శోభన్తే॥౦.౩౯॥
🌿
హిన్ద్యర్థః--
అచ్ఛే కుల మేం ఉత్పన్న, సున్దర, యువా మనుష్య భీ విద్యాహీన హోనే సే నిర్గన్ధ పలాశ (ఢాక) కే ఫూల కే సమాన శోభా నహీం పాతే హైం॥౦.౩౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
రూప-యౌవన-సమ్పన్నాః ~ రూప = (అందము) సౌన్దర్యము ; యౌవన = (యూనో భావః యౌవనమ్), తారుణ్యము ; (అను వాటిని) సమ్పన్నాః (అపి) =కలిగి యున్నవారైనను ; (కిఞ్చ=మరియు) విశాలకులసమ్భవాః (అపి) = మహాకులమందు జన్మించిన వారైనను ; విద్యాహీనాః = విద్య రానివారు ; నిర్గన్ధాః = (చూచుటకు అందంగా ఉండియు) సుగంధము లేని ; కింశుకాః = (పలాశకుసుమముల వలే) మోదుగుపువ్వుల వలే ;, న శోభన్తే = (సమాజంలో) శోభించరు. (గౌరవింపబడరని అర్థము).॥౦.౩౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అందము,మరియు శక్తిసమన్వితమైన యౌవనము,అను వాటిని కలిగి యున్నవారైనను, మరియు గొప్పనైన కులమందు జన్మించిన వారైనను, విద్య రానివారు,అనగా సంస్కారం లేనివారు, చూచుటకు అందంగా ఉండియు సుగంధము లేని మోదుగుపువ్వుల వలే ఈ సమాజంలో శోభించరు.అనగా గౌరవింపబడరని అర్థము. ॥౦.౩౯॥
🙏

No comments:

Post a Comment