Wednesday, December 23, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.50

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.50🌺
🌷
మూలమ్--
శరీరస్య గుణానాం చ దూరమత్యన్తమన్తరమ్ ।
శరీరం క్షణవిధ్వంసి కల్పాన్తస్థాయినో గుణాః॥౧.౫౦॥

🌺
పదవిభాగః--
శరీరస్య గుణానాం చ దూరమ్ అత్యన్తమ్ అన్తరమ్ । శరీరం క్షణ-విధ్వంసి కల్పాన్త-స్థాయినః గుణాః॥౧.౫౦॥
🌸
అన్వయః--
శరీరస్య గుణానాం చ అన్తరమ్ అత్యన్తం దూరమ్ । శరీరం క్షణ-విధ్వంసి । గుణాః కల్పాన్త-స్థాయినః॥౧.౫౦॥
🌼
ప్రతిపదార్థః--
శరీరస్య = దేహస్య ; అత్యన్తం దూరం = నితరాం విప్రకృష్టమ్ ; అన్తరం = ప్రభేదః ; క్షణవిధ్వంసి = అచిరవినాశి, క్షణభఙ్గురమ్ ; గుణాః = దయాదాక్షిణ్యాదయః, యశ ఇతి యావత్ । కల్పాన్తస్థాయినః = ప్రలయపర్యన్తస్థాయినః॥౧.౫౦॥
🌻
తాత్పర్యమ్--
దేహస్య గుణానాం చ మధ్యే భేదః మహాన్। కాయః అవిలమ్బేన వినశ్యతి। గుణాస్తు సృష్టివిలయం యావత్ తిష్ఠన్తి ॥౧.౫౦॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి- శరీర మేం ఔర గుణోం మేం బహుత బడా భేద హై, శరీర తో క్షణ హీ మేం నష్ట హో జాతా హైం, పరన్తు గుణ ప్రలయ కాల తక రహతే హైం॥౧.౫౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
శరీరస్య = దేహమునకు ; గుణానాం చ = దయాదాక్షిణ్యాది గుణములకు ;అత్యన్తం = చాలా ; దూరం = దూరము ; (అపి చ = మరియు) అన్తరం (అపి) = భేదము (కూడా) ; (ఎట్లనగా), శరీరం = శరీరము ; క్షణవిధ్వంసి = క్షణంలో నశించునది ; (కింతు = కానీ) గుణాః = దయాదాక్షిణ్యాదివిశిష్ట)గుణములు ; కల్పాన్తస్థాయినః = సృష్టిపర్యంతము ఉండునవి అని అర్థము. ॥౧.౫౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
దేహమునకు, దయాదాక్షిణ్యాది గుణములకు స్వభావస్వరూపలక్షణాలలో చాలా తేడా ఉంటుంది. ఎట్లనగా...ఈ శరీరము ఏ క్షణంలో నైనా నశించవచ్చు. నశించడం అనివార్యం కూడా. కానీ దయాదాక్షిణ్యాదివిశిష్టగుణములు మాత్రము ఈ ఆకల్పాంతము అనగా సృష్టిపర్యంతము ఉంటాయి అని భావము. అనగా మానవుడు ఈ శరీరం పై అహంకారమమకారములను వదిలి, శాశ్వతత్వాన్ని అందించే ఉత్తమగుణములను ఆశ్రయిస్తూ, వాటిని కలిగియుండవలెనని భావము. ॥౧.౫౦॥
🙏

No comments:

Post a Comment