Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.43

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.43🌺
🌷
మూలమ్--
నాద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ భవేత్ ।
న వ్యాపారశతేనాపి శుకవత్ పాఠ్యతే బకః ॥౦.౪౩॥

🌺
పదవిభాగః--
న అద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ భవేత్ । న వ్యాపార-శతేన అపి శుకవత్ పాఠ్యతే బకః ॥౦.౪౩॥
🌸
అన్వయః--
అద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ న భవేత్ । వ్యాపార-శతేన అపి బకః శుకవత్ న పాఠ్యతే॥౦.౪౩॥
🌼
ప్రతిపదార్థః--
దేవ = హే రాజన్ ; అద్రవ్యే = అయోగ్యే, అపాత్రే చ ; నిహితా = యోజితా, స్థాపితా చ ; క్రియా = సంస్కారః, శిక్షా చ = శిక్షణం ; ఫలవతీ = సఫలా ; వ్యాపార-శతేన అపి= ఉపాయ-శతేన అపి ; బకః = పక్షివిశేషః ; న ఖలు ; పాఠ్యతే=పాఠయితుం శక్యతే ॥౦.౪౩॥
🌻
తాత్పర్యమ్--
అపాత్రం శిక్షయిత్వా సంస్కారయితుం కృతాని ప్రయతనాని న కదాపి సఫలాని భవన్తి। బకః శుకవత్ భణితుం న పారయతి। అతః తం శిక్షయితుం ప్రయత్నః వ్యర్థః భవతి ॥౦.౪౩॥
🌿
హిన్ద్యర్థః--
అయోగ్య అపాత్ర మేం కోఈ భీ సుధార సఫల నహీం హోతా హై । అనేక ఉపాయ కరనే పర భీ కోఈ భీ బగులే కో శుక (సుగ్గే) కీ తరహ కభీ నహీం పఢా సకతా హై॥౦.౪౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
దేవ = ఓ రాజా ; అద్రవ్యే = (అర్హత లేని దానియందు), అయోగ్యమైన దానియందు ; నిహితా = (చేయబడిన) ఉంచబడిన ; కాచిత్ = ఏదైనా ; క్రియా = (ప్రయత్నము), పని ; ఫలవతీ = సఫలమైనదై ; న భవేత్ = కాజాలదు ; (యథా = ఎట్లనగా), వ్యాపార-శతేన అపి = వంద ఉపాయములచేత కూడా ; బకః = కొంగ ; శుకవత్ = చిలుక వలే ; న పాఠ్యతే= నేర్పింప బడజాలదు. ॥౦.౪౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ రాజా ! అర్హత లేని దానియందు అనగా, అయోగ్యమైన దానియందు చేయబడిన ఏ ప్రయత్నము, పనియు సఫలమైనదిగా కాజాలదు. ఎట్లనగా, వంద ఉపాయములచేత కూడా ఒక కొంగ, చిలుక వలే నేర్పింప బడజాలదు.మాట్లాడ లేదు కూడా అని భావము.॥౦.౪౩॥
🙏

No comments:

Post a Comment