🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.32🌺
🌷
మూలమ్--
యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ।
తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌺
పదవిభాగః--
యథా హి ఏకేన చక్రేణ న రథస్య గతిః భవేత్ । తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌸
అన్వయః--
యథా హి ఏకేన చక్రేణ రథస్య గతిః న భవేత్ । తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌼
ప్రతిపదార్థః--
యథా = యేన ప్రకారేణ ; ఏకేన ; చక్రేణ = రథాఙ్గేన ; రథస్య ; గతిః = అగ్రే చలనం ; న భవేత్ = న భవతి ; ఏవం = తథైవ ; పురుషకారేణ = మానవప్రయత్నేన, సహాయభూతేన పౌరుషేణ ; వినా ; దైవమ్ = కేవలమ్ అదృష్టం ; న సిధ్యతి = నైవ ఫలతీత్యర్థః॥౦.౩౨॥
🌻
తాత్పర్యమ్--
యథా రథః ద్వయోః చక్రయోః చలతి, ఏకేన చక్రేణ నాగ్రే గన్తుం పారయతి, తథైవ మనుష్యస్య ప్రయత్నేన వినా కేవలం భాగ్యేన కార్యం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌿
హిన్ద్యర్థః--
🙏
జైసే ఏక చక్ర సే రథ నహీం చల సకతా హై, ఉసీ ప్రకార ఉద్యోగ కే వినా కేవల భాగ్య సే హీ సిద్ధి నహీం హో సకతీ హై॥౦.౩౨॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
యథా = ఎట్లైతే ; ఏకేన చక్రేణ = ఒకే చక్రముతో ; రథస్య = రథముయొక్క ; గతిః = (ప్రయాణము) గ మనము ; న భవేత్ = అగుచు లేదో ; ఏవం = ఆలాగే ; పురుషకారేణ వినా = మానవప్రయత్నం లేకుండా ; దైవమ్ = (కేవలం) అదృష్టము ; న సిధ్యతి = సిద్ధించదు ; (కార్యసాధనకు సహకరించదని అర్థము). ॥౦.౩౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎలాగైతే ఒకే చక్రముతో రథముయొక్క ప్రయాణము అనగా గమనము అగుచు లేదో, అదే విధంగా... మానవప్రయత్నం లేకుండా, కేవలం అదృష్టము వలననే కార్యము సిద్ధించదు . కార్యసాధనకు తన స్థిరప్రయత్నము కూడా ఉండవలెనని భావము . ॥౦.౩౨॥
🙏
No comments:
Post a Comment