🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.29🌺
🌷
మూలమ్--
న గణస్యాగ్రతో గచ్ఛేత్ సిద్ధే కార్యే సమం ఫలమ్ ।
యది కార్యవిపత్తిః స్యాన్ముఖరస్తత్ర హన్యతే॥౧.౨౯॥
🌺
పదవిభాగః--
న గణస్య అగ్రతః గచ్ఛేత్ సిద్ధే కార్యే సమం ఫలమ్ । యది కార్య-విపత్తిః స్యాత్ ముఖరః తత్ర హన్యతే॥౧.౨౯॥
🌸
అన్వయః--
గణస్య అగ్రతః న గచ్ఛేత్ । కార్యే సిద్ధే (సతి) సమం ఫలమ్ (ప్రాప్యతే) । యది కార్య-విపత్తిః స్యాత్, తత్ర ముఖరః హన్యతే॥౧.౨౯॥
🌼
ప్రతిపదార్థః--
గణస్య = సఙ్ఘస్య, సమూహస్య, వర్గస్య ; అగ్రతః = అగ్రే, సర్వస్మాత్ పురతః ; కార్యే = కర్త్తవ్యే కర్మణి ; సిద్ధే = నిష్పన్నే సతి, సఫలత్వే ప్రాప్తౌ సతి ; సమం = తుల్యం, సమానం ; కార్యవిపత్తిః = కార్యహానిః, అసాఫల్యమ్ ; ముఖరః = అగ్రణీః, ప్రవర్త్తకశ్చ, నాయకః ; హన్యతే = వధ్యతే ;॥౧.౨౯॥
🌻
తాత్పర్యమ్--
న కదాపి సమూహే సర్వేభ్యః అగ్రే భవితవ్యమ్। కార్యే సఫలత్వం ప్రాప్తే సతి తు (సమూహసదస్యానాం నాయకస్య చ) సర్వేషామపి ఫలే సమానతా భవతి। పరన్తు కార్యనాశే తు అగ్రే విద్యమానస్య నాయకస్యైవ క్షతిః న తు ఇతరేషామ్।
[అత్ర పక్షీణాం ప్రసఙ్గః। ‘కదాపి తథా అగ్రే మా గచ్ఛతు’ ఇతి న అస్యార్థః। అగ్రే గమనస్య పరిణామాన్ మనసి నిధాయ ప్రవర్తతామితి, యది ధైర్యః అస్తి, తథైవ గచ్ఛతు ఇతి వా భావనా।]॥౧.౨౯॥
🌿
హిన్ద్యర్థః--
కిసీ కార్య మేం సబకే ఆగే కభీ నహీం హోనా చాహియే, క్యోం కి కార్య కీ సిద్ధి హోనే పర తో ఫలమేం సమాన తా హో రహతీ హై, పరన్తు యది దైవాత్ కార్య మేం కోఈ విఘ్న హో గయా తో పహిలే అగుఆ హీ మారా జాతా హై॥౧.౨౯॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
గణస్య = జనసమూహమునకు ; అగ్రతః = (నాయకత్వం వహిస్తూ) ముందు ; న గచ్ఛేత్ = వెళ్ళకూడదు : కార్యే = (అనుకున్న) పని ; సిద్ధే సతి = సాధింపబడ్డప్పుడు ; ఫలం = ఫలితము ; సమం = (అందరితో) సమానము ; (యది = ఒకవేళ) కార్యవిపత్తిః = (అనుకున్నది సిద్ధించనిచో) కార్యహాని ; స్యాత్ = జరిగినచో ; తత్ర = (సిద్ధించని విషయంలో) అక్కడ ; ముఖరః = (బహుభాషణశీలుడైన) ముందున్నవాడు ; హన్యతే = (జనసమూహముచేత) బాధింపబడుతాడు అని అర్థము. ॥౧.౨౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
జనసమూహమునకు నాయకత్వం వహిస్తూ ముందు వెళ్ళకూడదు. ఒకవేళ అనుకున్న పని సాధింపబడ్డప్పుడు, ఫలితము మాత్రము అందరితో సమానంగానే ఉంటుంది. కానీ అనుకున్న పని జరుగకుంటే మాత్రం ముందుండి నాయకత్వం వహించినవాడు ఆ జనసమూహముచేత బాధింపబడుతాడు, దూషింపబడుతాడు అని భావము. ॥౧.౨౯॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.29
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment