Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.28

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.28🌺
🌷
మూలమ్--
అసమ్భవం హేమమృగస్య జన్మ
తథాపి రామో లులుభే మృగాయ ।
ప్రాయః సమాపన్నవిపత్తికాలే
ధియోఽపి పుంసాం మలినా భవన్తి॥౧.౨౮॥

🌺
పదవిభాగః--
అసమ్భవం హేమమృగస్య జన్మ తథాపి రామః లులుభే మృగాయ । ప్రాయః సమాపన్న-విపత్తి-కాలే ధియః అపి పుంసాం మలినాః భవన్తి॥౧.౨౮॥
🌸
అన్వయః--
హేమమృగస్య జన్మ అసమ్భవమ్। తథాపి రామః మృగాయ లులుభే । ప్రాయః సమాపన్న-విపత్తి-కాలే, పుంసాం ధియః అపి మలినాః భవన్తి॥౧.౨౮॥
🌼
ప్రతిపదార్థః--
హేమమృగస్య = స్వర్ణమృగస్య ; జన్మ = ఉత్పత్తిః ; అసమ్భవమ్ = సమ్భావనావిషయీభూతమపి న భవతి ; తథాపి రామః = సకల-జ్ఞాన-నిధిః భగవాన్ దాశరథిః అపి ; మృగాయ = స్వర్ణ-మృగమ్ ఆదాతుం ; లులుభే = లోభమకరోత్ ; ప్రాయః = బాహుల్యేన ; సమాపన్న-విపత్తి-కాలే ~ సమాపన్నాః = సన్నిహతాః, ఆపతితాః, యా విపదః, తాసాం కాలః = సమయః, తస్మిన్ ; పుంసాం = పురుషాణాం, మనుష్యాణాం ; ధియః అపి = బుద్ధయః అపి ; మలినాః = మలావిలాః, మలేన కుణ్ఠితాః ; భవన్తి = జాయన్తే ; 'ఇతి తర్కయామీ'తి శేషః॥౧.౨౮॥
🌻
తాత్పర్యమ్--
‘స్వర్ణః మృగః లోకే కుత్రచిదపి న భవితుమర్హతి’ ఇతి జానన్నపి సాక్షాత్ పురుషోత్తమః శ్రీరామః అపి (మారీచధృత) కాఞ్చనం మృగరూపం దృష్ట్వా తం ప్రాప్తుమ్ అకామయత। బహుధా ఏవం భవతి- ఆపత్సు సమాపన్నేషు జనానాం బుద్ధయః అపి భ్రాన్తాః భవన్తి।
 (అతః విపత్తౌ ప్రాప్తే సతి జాగరూకతయా భవితవ్యమ్। యత్ర ధీరపి ప్రమాద్యతే, తత్ర అన్యచిత్తవృత్తీనాం కిం వా కథనమ్? నిర్ణయకరణసమయే అత్యన్తం విచక్షణైః భవితవ్యమ్- ఇతి తాత్పర్యమ్। న పునః శ్రీరామస్య విమర్శనమత్రార్థః।) ॥౧.౨౮॥
🌿
హిన్ద్యర్థః--
సోనే కే మృగ కా హోనా యద్యపి అసమ్భవ హై, తథాపి భగవాన్ శ్రీ రామచన్ద్రజీ మహారాజ భీ సోనే కే మృగ కే లోభ మేం బహ గఏ। ఠీక హీ హై- ప్రాయః విపత్తి కాల సన్నిహిత హోనే పర మనుష్యోం కీ బుద్ధి భీ మలిన హో జాతీ హై॥౧.౨౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
హేమమృగస్య = బంగారు జింకయొక్క ; జన్మ = పుట్టుక ; అసమ్భవమ్ = (సృష్టిలో) సంభవము కానిది ; తథాపి = అయినప్పటికి ; రామః = (సకలసద్గుణసంపన్నుడైన) రాముడు ; మృగాయ = (ఆ బంగారు) జింక కొరకు ; లులుభే = ఆశ పడెను ; ప్రాయః = తరచుగా ; సమాపన్న-విపత్తి-కాలే = ఆపదలు (సంభవించాలని ఉన్నప్పుడు) సంభవించబోవు సమయమున ; పుంసాం = (మేధావులయొక్క)పురుషులయొక్క ; ధియః అపి = బుద్ధులు కూడా ; మలినాః = (వివేకరహితములై) మలినములై ; భవన్తి = అగుచున్నవి ; ॥౧.౨౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
సృష్టిలో బంగారు జింకయొక్క పుట్టుక అనునది సంభవము కానిది. అయినప్పటికి సకలసద్గుణసంపన్నుడైన రాముడు కూడా ఆ బంగారు జింక కొరకు ఆశ పడ్డాడు. అందుకేనేమో ఆపదలు సంభవించాలని ఉన్నప్పుడు, మేధావులయొక్క, అనగా సదసద్వివేకము కలవారియొక్క బుద్ధులు కూడా వివేకరహితములై, మలినములగుచున్నవి అని భావము. ఎప్పుడైనా, ఎవరికైనా, ఉన్న వివేకాన్ని వాడనప్పుడే ప్రమాదములు సంభవిస్తాయని, దీనికి ఎవరూ అతీతులు కాదని సారాంశము. ॥౧.౨౮॥
🙏

No comments:

Post a Comment