🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.24🌺
🌷
మూలమ్--
శఙ్కాభిః సర్వమాక్రాన్తమన్నం పానం చ భూతలే ।
ప్రవృత్తిః కుత్ర కర్తవ్యా జీవితవ్యం కథం ను వా ॥౧.౨౪॥
🌺
పదవిభాగః--
శఙ్కాభిః సర్వమ్ ఆక్రాన్తమ్ అన్నం పానం చ భూతలే । ప్రవృత్తిః కుత్ర కర్తవ్యా జీవితవ్యం కథం ను వా ?॥౧.౨౪॥
🌸
అన్వయః--
భూతలే సర్వమ్ అన్నం పానం చ శఙ్కాభిః ఆక్రాన్తమ్ । కుత్ర ప్రవృత్తిః కర్తవ్యా? కథం ను వా జీవితవ్యం?॥౧.౨౪॥
🌼
ప్రతిపదార్థః--
భూతలే = లోకే ; సర్వం = అశేషం ; అన్నం = భక్ష్యమ్, భోజనమ్ ; పానం = పాతుం యోగ్యం పదార్థం జలాదిః ; శఙ్కాభిః = (అత్ర భోజన-సమ్బన్ధి-శఙ్కాః ఇతి) వాత-పిత్త-కఫాది-జన్య-రోగాది-శఙ్కాభిః ; ఆక్రాన్తం = వ్యాపృతం ; కుత్ర = కస్మిన్ భోజ్యే పదార్థే ; ప్రవృత్తిః కర్తవ్యా = (అత్ర) ఖాదితవ్యమ్ ; కథం ను = కేన ప్రకారేణ? ; జీవితవ్యమ్ = లోకే స్థాతవ్యమ్; ॥౧.౨౪॥
🌻
తాత్పర్యమ్--
జగతి యత్కిఞ్చిత్ ఖాద్యం, పానయోగ్యం చ వస్తు వర్తతే, తత్ సమస్తం (వస్తునః గుణ-ప్రభావాదిషు) నానావిధసన్దేహైః ఆపృతం వర్తతే। (అనేన కారణేన) కిం ఖాదనీయం, కిం న (ఇతి భ్రాన్తాః), కథం వా జీవనయాత్రాం యాపయామ ఇతి (విచారయామశ్చ) ॥౧.౨౪॥
🌿
హిన్ద్యర్థః--
ఇస పృథ్వీ తల పర అన్న ఔర పాన సన్దేహోం సే భరా హై, కిస వస్తు మేం ఖానే-పీనే కీ ఇచ్ఛా కరే యా కైసే జియే ? క్యోం కి-సంసార మేం సభీ బాతేం శఙ్కా సే భరీ హుఈ హైం, ఫిర కహా ప్రవృత్తి కీ జాయ ఔర కహాఁ ప్రవృత్తి న కీ జాయ ఔర కిసీ ప్రకార జీవన నిర్వాహ కియా జాయ?॥౧.౨౪॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
భూతలే = ఈ భూలోకమందు ; అన్నం = ఆహారము ; పానం = దుగ్ధజలాది పానీయములు ; సర్వం చ = (ఇలా) అన్నియును ; శఙ్కాభిః = (మంచిదో, కాదో, రోగకారకమో మొదలైన) సందేహములచేత ; ఆక్రాన్తం = వ్యాపింపబడినది ; (అతః = అందువలన) కుత్ర = (ఏ యే పదార్థములయందు) ఎక్కడ ; ప్రవృత్తిః కర్తవ్యా = ఆసక్తి కలిగియుండవలెను ; కథం ను = ఎలా ; జీవితవ్యమ్ = బ్రతుకవలెను ? ఇలా అన్నింటినీ అనుమానిస్తే జీవితం దుర్భరమౌతుంది. విచక్షణతో వ్యవరిస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అని అర్థము. ॥౧.౨౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈ భూలోకమందు , ప్రాణాధారకములైన ఆహారాదులయందు, దుగ్ధజలాది పానీయముల యందు, ఇలా అన్నింటియందు మంచిదో, కాదో, రోగకారకమో మొదలైన సందేహములను కలిగియుంటే, ఇక ఏ యే పదార్థములను తినవలేను. వేటియందు ఆసక్తిని కలిగియుండవలెను. ఏమి తిని బ్రతుకవలెను ? అనే పరిస్థితి ఏర్పడుతుంది. కావున ఇలా అన్నింటినీ అనుమానిస్తే జీవితం దుర్భరమౌతుంది. బ్రతుకు భారమౌతుంది. అందువలన విచక్షణతో వ్యవరిస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని అని భావము. ॥౧.౨౪॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.24
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment