🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.1🌺
🌷
మూలమ్--
కావ్యశాస్త్రవినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్ ।
వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన వా ॥౧.౧॥
🌺
పదవిభాగః--
కావ్య-శాస్త్ర-వినోదేన కాలః గచ్ఛతి ధీమతామ్ । వ్యసనేన తు మూర్ఖాణాం నిద్రయా కలహేన వా ॥౧.౧॥
🌸
అన్వయః--
ధీమతామ్ కాలః కావ్య-శాస్త్ర-వినోదేన గచ్ఛతి । మూర్ఖాణాం తు వ్యసనేన, నిద్రయా కలహేన వా (గచ్ఛతి) ॥౧.౧॥
🌼
ప్రతిపదార్థః--
కావ్యశాస్త్రవినోదేన ~ కావ్యఞ్చ శాస్త్రఞ్చ- కావ్యశాస్త్రే, తాభ్యాం యో వినోదస్తేన ~ యద్వా- కావ్యమేవ శాస్త్రన్తేన వినోద ఇతి విగ్రహః = కావ్యశాస్త్ర-పర్యాలోచనేనేత్యర్థః ; ధీమతాం చ = విదుషాం ; కాలః = జీవితసమయః ; గచ్ఛతి = సుఖం యాతి ; మూర్ఖాణాన్తు వ్యసనేన = స్త్రీద్యూత-మద్యపానాదివ్యసనేన ; కిఞ్చ- నిద్రయా = స్వాపేన ; కలహేన = వివాదేన చ ; కాలో గచ్ఛతి॥౧.౧॥
🌻
తాత్పర్యమ్--
విదుషాం, విజ్ఞానాం చ జీవనసమయః సత్కావ్యానాం, శాస్త్రవిజ్ఞానగ్రన్థానాం చ పఠన-చర్చాదినా యాతి। మూఢజనానాం కాలస్తు ఆత్మనః అవనతికారకైః దుర్వ్యసనైః వా, శయనేన, పరస్పరం వివాదైః వా యాతి ॥౧.౧॥
🌿
హిన్ద్యర్థః--
బుద్ధిమాన్ మనుష్యోం కా సమయ కావ్యోం వ శాస్త్రోం కే విచార మేం హీ బీతతా హై, పరన్తు మూర్ఖోం కా సమయ తో వ్యసన (బురే కామ) ఏవం నిద్రా తయా ఝగడోం మేం హీ బీతతా హై॥౧.౧॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
కావ్యశాస్త్రవినోదేన ~ కావ్యఞ్చ శాస్త్రఞ్చ- కావ్యశాస్త్రే, తాభ్యాం యో వినోదస్తేన ~ఇతి విగ్రహః ~ కావ్యశాస్త్రవినోదేన, కావ్య (పఠన) శాస్త్ర (అవగాహన) ముల వలన కలిగిన ఆనందం చేత ; ధీమతాం = బుద్ధిమంతులైన వారి యొక్క ; కాలః = సమయము ; గచ్ఛతి = గడుచుచున్నది ; మూర్ఖాణాం (తావత్) మూఢులయొక్క ; సమయః = కాలము ; వ్యసనేన = (స్త్రీ-ద్యూత-మద్యపానాదిదుర్) వ్యసనముల చేత ; నిద్రయా = (అకాల) నిద్ర చేత ; (కిఞ్చ = మరియు) కలహేన = (కల్పిత) వివాదముల చేత ; కాల = (మూర్ఖులయొక్క) సమయము ; గచ్ఛతి = గడుచుచున్నది. అని అర్థము. ॥౧.౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
కావ్యపఠన,శాస్త్రావగాహనముల వలన కలిగిన ఆనందంతో, బుద్ధిమంతులైన వారి యొక్క సమయము గడుచుచున్నది. ఇక మూర్ఖులయొక్క కాలము, స్త్రీ-ద్యూత-మద్యపానాదిదుర్వ్యసనముల చేత, అకాలనిద్ర చేత, మరియు కల్పిత వివాదముల చేత, మూర్ఖులయొక్క సమయము గడుచుచున్నది. అనగా... ఉత్తముల కాలము సద్విషయాలతో, అధముల సమయము దుర్విషయాచరణతో గడుస్తూ ఉంటుందని అని భావము. ॥౧.౧॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment