🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.21🌺
🌷
మూలమ్--
స హి గగనవిహారీ కల్మషధ్వంసకారీ
దశశతకరధారీ జ్యోతిషాం మధ్యచారీ ।
విధురపి విధియోగాద్ గ్రస్యతే రాహుణాసౌ
లిఖితమపి లలాటే ప్రోజ్ఝితుం కః సమర్థః॥౧.౨౧॥
🌺
పదవిభాగః--
సః హి గగన-విహారీ కల్మష-ధ్వంస-కారీ దశ-శతకర-ధారీ జ్యోతిషాం మధ్యచారీ । విధుః అపి విధి-యోగాద్ గ్రస్యతే రాహుణా అసౌ లిఖితమ్ అపి లలాటే ప్రోజ్ఝితుం కః సమర్థః॥౧.౨౧॥
🌸
అన్వయః--
సః (విధుః) హి గగన-విహారీ, కల్మష-ధ్వంస-కారీ, దశ-శతకర-ధారీ, జ్యోతిషాం మధ్యచారీ, (అస్తి, తథాపి తాదృశః) అసౌ విధుః అపి విధి-యోగాద్ రాహుణా గ్రస్యతే । లలాటే లిఖితమ్ అపి ప్రోజ్ఝితుం కః సమర్థః॥౧.౨౧॥
🌼
ప్రతిపదార్థః--
సః = త్రిలోకీప్రసిద్ధః ; గగన-విహారీ = ఆకాశ-సఞ్చారీ ; కల్మష-ధ్వంస-కారీ = అన్ధకార-వినాశకః ; దశశత-కర-ధారీ = సహస్ర-కిరణః ; జ్యోతిషాం = తారాణాం ; మధ్యచారీ = మధ్యవర్తీ ; అసౌ విధురపి = చన్ద్రోఽపి ; విధియోగాత్ = దైవవిపర్యయాత్ ; గ్రస్యతే = గృహ్యతే ; రాహుణా = గ్రహవిశేషేణ ; లిఖితం = విధాత్రా లిఖితమ్ ; లలాటే = ఫాలభాగే ; ప్రోజ్ఝితుం = త్యక్తుం, పరిహర్తుం, పారం గన్తుం॥౧.౨౧॥
🌻
తాత్పర్యమ్--
చన్ద్రః ఆకాశే విహరతి, తమః వినాశయతి, అనన్తకిరణాన్ ధరతి, తారాణాం మధ్యే భ్రమతి। తథాపి సః రాహుగ్రహేణ ప్రతిగృహ్యతే। భాగ్యం అతిక్రాన్తుం కః వా శక్నోతి?॥౧.౨౧॥
🌿
హిన్ద్యర్థః--
ఆకాశ మార్గ మేం విహార కరనే వాలే, అన్ధకార కో నాశ కరనే వాలే, హజారోం కిరణోం వాలే, తారాగణ కే మధ్య మేం విహార కరనేవాలే చన్ద్రమా కో భీ భాగ్యవశ రాహు గ్రస లేతా హై । ఠీక హీ హై, భాగ్య మేం లిఖీ హుఈ విధి కో రేఖా కో కోఈ మిటా నహీం సకతా హై ॥౧.౨౧॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
గగన-విహారీ = ఆకాశంలో సంచరించు వాడైన ; కల్మషధ్వంసకారీ = అన్ధకార మనే అసౌకర్యాన్ని ధ్వంసం చేయువాడైన ; దశశతకరధారీ = వెలకొలది కిరణములను ధరించు వాడైన ; జ్యోతిషాం = నక్షత్రముల ; మధ్యచారీ = మధ్య చరించువాడైన ; సః = అలాంటి ; అసౌ విధురపి = ఈ చంద్రుడు కూడా ; విధియోగాత్ = విధియోగం(ప్రభావం)వలన ; రాహుణా = రాహువు చేత ; గ్రస్యతే = ఆక్రమింపబడుచున్నాడు ; హి = ఎందుకనగా; లలాటే = నొసటి యందు ; లిఖితం = (సృష్టికర్తచే) వ్రాయబడిన దానిని ; ప్రోజ్ఝితుం అపి = తుడిచి వేయుటకును ; కః = ఎవడు ; సమర్థహ్ = సమర్థుడు. అనగా విధిని మార్చే శక్తి ఎవరికీ లేదని, అసాధ్యమని, అనుభవించాల్సిందే అని అర్థము. ॥౧.౨౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఆకాశంలో సంచరించు వాడైన , అంధకార మనే అసౌకర్యాన్ని ధ్వంసం చేయువాడైన, వెలకొలది కిరణములతో ప్రకాశించు వాడైన, నక్షత్రముల మధ్య చరించువాడైన, అలాంటి విశిష్టలక్షణాలు కలిగిన ఈ చంద్రుడు కూడా విధిప్రభావంవలన రాహువు చేత ఆక్రమింపబడుచున్నాడు. ఎందుకనగా... నొసటి యందు సృష్టికర్తచే వ్రాయబడిన అనుభవాలను తుడిచి వేసే శక్తి , అనగా విధిని మార్చే శక్తి ఎవరికీ లేదని, అలా చేయడం అసాధ్యమని, అనుభవించాల్సిందే అని భావము. ॥౧.౨౧॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.21
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment