🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.11🌺
🌷
మూలమ్--
మరుస్థల్యాం యథా వృష్టిః క్షుధార్తే భోజనం తథా ।
దరిద్రే దీయతే దానం సఫలం పాణ్డునన్దన॥౧.౧౧॥
🌺
పదవిభాగః--
మరు-స్థల్యాం యథా వృష్టిః క్షుధా-ఆర్తే భోజనం తథా । దరిద్రే దీయతే దానం సఫలం పాణ్డు-నన్దన॥౧.౧౧॥
🌸
అన్వయః--
పాణ్డు-నన్దన, యథా మరు-స్థల్యాం వృష్టిః, క్షుధా-ఆర్తే భోజనం, తథా దరిద్రే (యత్) దానం దీయతే (తత్) సఫలం (భవతి) ॥౧.౧౧॥
🌼
ప్రతిపదార్థః--
పాణ్డునన్దన = హే యుధిష్ఠిర! ; మరుస్థల్యాం = మరుభూమౌ, నిర్జలప్రదేశే ; యథా వృష్టిః = యథా వృష్టిః సఫలా, నితరాముచితా ; క్షుధార్తే = బుభుక్షయా పీడితాయ ; తథా = తథైవ ; దరిద్రే = ధనహీనాయ ; యద్దానం దీయతే తదపి సఫలమిత్యన్వయః॥౧.౧౧॥
🌻
తాత్పర్యమ్--
హే యుధిష్ఠిర, యథా జలరహితదేశే వర్షణేన వృష్టిః సఫలా భవతి, భోజనేచ్ఛోః అన్నదానేన క్షుధానివారణేన చ అనన్దానం సఫలం భవతి, తథైవ నిర్ధనాయ దత్తం దానం సఫలం భవతి। (జలం యత్ర ప్రభూతం తత్ర వృష్టయే న కోఽపి ఆర్తః। అన్నం ఖాదిత్వా యః తృప్తః తస్య అన్నస్యావశ్యకతా నాస్తి। తథైవ ధనికాయ ధనదానేన న లాభః। యత్ర యన్నాస్తి, తత్ర తద్దాతవ్యమ్ ఇతి యావత్।) ॥
🌿
హిన్ద్యర్థః--
హే యుధిష్ఠిర! జైసే మరుస్థల (మారవాడ़) మేం వర్షా సఫల హై ఔర భూఖే కో భోజన దేనా సఫల హై, వైసే దరిద్ర కో దియా హుఆ దాన భీ సఫల హోతా హై॥౧.౧౧॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
పాణ్డునన్దన = ఓ యుధిష్ఠిరుడా! ; యథా = ఎట్లైతే ; మరుస్థల్యాం = ఎడారియందు ( నిర్జలప్రదేశమునందు) ; వృష్టిః = వర్షము ; సఫలా = సఫలమగుచున్నదో ; తథా = అలాగే ; క్షుధార్తే = ఆకలితో బాధపడుతున్న వాని విషయంలో ; భోజనం = ఆహారము సఫలా = సఫలమగుచున్నది ; తథా =అలాగే ; దరిద్రే = ధనహీనుడైన వాని విషయమున ; దానం = దానము (వితరణము) ; దీయతే = ఇవ్వబడుతుందో ; తదపి = (ఆ దానం) అదికూడా ; సఫలం = ఫలవంతమైనదై ; భవతి = అగుచున్నది ;అని అర్థము.. ॥౧.౧౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ యుధిష్ఠిరుడా! ఎట్లైతే ఎడారియందు అనగా నిర్జలప్రదేశమునందు వర్షము పడినచో సఫలమగుచున్నదో ; అలాగే ఆకలితో బాధపడుతున్న వానికి విషయంలో ఆహారము పెడితే, సఫలమగుచున్నది, అలాగే ధనహీనుడైన అనగా దరిద్రునికి ఇవ్వబడిన దానము కూడా ఫలవంతమైనదై, మరియు సార్థకమైనదై అగుచున్నది అని భావము.. ॥౧.౧౧॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.11
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment