🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.22🌺
🌷
మూలమ్--
సుజీర్ణమన్నం సువిచక్షణః సుతః
సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః ।
సుచిన్త్య చోక్తం సువిచార్య యత్ కృతం
సుదీర్ఘకాలేఽపి న యాతి విక్రియామ్॥౧.౨౨॥
🌺
పదవిభాగః--
సుజీర్ణమ్ అన్నం సువిచక్షణః సుతః సుశాసితా స్త్రీ నృపతిః సుసేవితః । సుచిన్త్య చ ఉక్తం సువిచార్య యత్ కృతం సుదీర్ఘ-కాలే అపి న యాతి విక్రియామ్॥౧.౨౨॥
🌸
అన్వయః--
సుజీర్ణమ్ అన్నం, సువిచక్షణః సుతః, సుశాసితా స్త్రీ, సుసేవితః నృపతిః, సుచిన్త్య చ ఉక్తం, సువిచార్య యత్ కృతం, (తత్) సుదీర్ఘ-కాలే అపి విక్రియామ్ న యాతి॥౧.౨౨॥
🌼
ప్రతిపదార్థః--
సుజీర్ణం = సుపక్వమ్ ; సువిచక్షణః = నితరాం శిక్షితో విద్వాన్ ; సుతః = పుత్రః ; సుశాసితా = సుష్ఠు ఆత్మనా అనుశాసితా, ఆత్మనః వశే యా అస్తి, సా; సుదీర్ఘకాలేఽపి = గతేఽపి బహుతిథే కాలే ; విక్రియాం = వికారమ్। న యాతి = వికృతం న భవతి॥౧.౨౨॥
🌻
తాత్పర్యమ్--
భోజనం సుపక్వం, పుత్రః కార్యాకార్యవిచారశీలః, ఆత్మనః అనుశాసనేన సన్మార్గగామినీ స్త్రీ, మన్త్రి-సేనాపత్యాదిభిః సమ్యక్ అనుగతః రాజా, విచార్య ఉక్తం వచనం, కృతం కార్యం చ ఏతాని సర్వాణి బహుకాలానన్తరమపి దుష్టాని న భవన్తి॥౧.౨౨॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి-భలీ భాఁతి పకా హుఆ అన్న, బుద్ధిమాన్ పుత్ర, శిక్షిత స్త్రీ, అచ్ఛీ తరహ సే సేవిత రాజా, సోచ కర కహీ హుఈ బాత, ఔర విచార కర కియా హుఆ కామ- యే సబ కభీ బిగడ़తే నహీం హైం॥౧.౨౨॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
సుజీర్ణం = పూర్తిగా జీర్ణమయ్యే ; అన్నం = ఆహారము ; సువిచక్షణః = మంచి చెడులను తెలుసుకోగలిగిన ; సుతః = కుమారుడు ; సుశాసితా = అనుకూలవతియైన ; స్త్రీ = ఆడుది ; సుసేవితః = ప్రజలను సంతోషపెట్టగలిగే ; నృపతిః = రాజు ; సుచింత్య = (పూర్వాపరములను) చక్కగా ఆలోచించి ; ఉక్తం = చెప్పబడిన మాట ; సువిచార్య = (మంచిచెడులను) క్షుణ్ణంగా ఆలోచించి ; యత్ చ కృతం = ఏది చేయబడినదో ; తత్ = (పైన చెప్పినవన్నియు) అది ; సుదీర్ఘకాలే అపి = చాలాకాలం గడిచినను ; ; విక్రియాం = వికారమును ; న యాతి = పొందదు. అనగా పైన చెప్పినవన్నియు శాస్త్రప్రకారం ఉన్నందున వరుసగా మంచి ఫలితములను ఇస్తూనే ఉంటాయి అని అర్థము. ॥౧.౨౨॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తిన్నది పూర్తిగా జీర్ణమయ్యే అన్నం అనగా ఆహారం, మంచి చెడులను తెలుసుకోగలిగిన, వినయవంతుడైన కుమారుడు, పద్ధతిగా పెంచబడిన, అనుకూలవతియైన స్త్రీ, ప్రజలను సంతోషపెట్టగలిగే రాజు, పూర్వాపరములను చక్కగా ఆలోచించి, సందర్భోచితంగా పలికిన మాట, మంచిచెడులను క్షుణ్ణంగా ఆలోచించి, చేయబడిన పని, ఇలా పైన చెప్పినవన్నియు చిరకాలము వికారమును పొందక, సత్ఫలితాను ఇస్తూ మురిపిస్తూ ఉంటాయి. ఎందుకనగా... పైన చెప్పినవన్నియు శాస్త్రప్రకారం ఉన్నందున వరుసగా మంచి ఫలితములతో ఆనందాలను అందిస్తూ ఉంటాయి అని భావము. ॥౧.౨౨॥
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.22
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment