Wednesday, December 23, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.62

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.62🌺
🌷
మూలమ్--
బాలో వా యది వా వృద్ధో యువా వా గృహమాగతః ।
తస్య పూజా విధాతవ్యా సర్వస్యాభ్యాగతో గురుః॥౧.౬౨॥

🌺
పదవిభాగః--
బాలః వా యది వా వృద్ధః యువా వా గృహమ్ ఆగతః । తస్య పూజా విధాతవ్యా సర్వస్య ఆభ్యాగతః గురుః॥౧.౬౨॥
🌸
అన్వయః--
యది బాలః వా, వృద్ధః వా, యువా వా గృహమ్ ఆగతః, (తర్హి) తస్య పూజా విధాతవ్యా । ఆభ్యాగతః సర్వస్య గురుః (వర్తతే) ॥౧.౬౨॥
🌼
ప్రతిపదార్థః--
గృహమాగతః = స్వగృహ-ద్వారి సముపస్థితః, అతిథిః ; తస్య = అతిథేః ; పూజా = సత్క్రియా ; విధాతవ్యా = కర్తవ్యా ; అభ్యాగతః = అన్య-గ్రామాదాగతః అతిథిః ; గురుః = పూజ్యః॥౧.౬౨॥
🌻
తాత్పర్యమ్--
గేహస్య పురతః ఆగతః అతిథిః బాలకః, యువా, వృద్ధో వా భవతు- తస్య సముచితః సత్కారః కర్తవ్యః। అభ్యాగతః సర్వేషాం (సర్వవర్ణాశ్రమధర్మిణాం) పూజ్యః వర్తతే॥౧.౬౨॥
🌿
హిన్ద్యర్థః--
అతిథి యది బాలక హో యా వృద్ధ హో యా జవాన హో, వహ యది అపనే ఘర పర ఆ జాయ, తో ఉసకీ పూజా అవశ్య కరనీ చాహియే। క్యోం కి అతిథి సభీ కా గురు ఔర పూజ్య హోతా హై॥౧.౬౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
🍀
బాలో వా = పిల్లవాడైన ; వృధ్ధో వా = ముసలివాడైన ; వా = లేక ; యువా వా = యువకుడైనా ; యది గృహమాగతః = ఇంటికి వచ్చినట్లైతే ; తస్య = అతనికి ; పూజా = అర్హమైన సపర్య ; విధాతవ్యా =చేయవలెను ; (యతః = ఎందుకనగా) అభ్యాగతః = అతిథి ; సర్వస్య = ప్రతివానికి ; గురుః = పూజనీయుడే అని అర్థము.  ॥౧.౬౨॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
పిల్లవాడైనను, ముసలివాడైనను, లేక యువకుడైనను, (ఇలా ఏ వయసు వాడైనను,) ఇంటికి వచ్చినట్లైతే, అతనికి ; అర్హమైన సపర్యలను చేయవలెను. ఎందుకనగా...ఇంటికి వచ్చిన అతిథి, ప్రతి గృహస్థునకు  పూజనీయుడే, (ఆదరింపబడువాడే) అని భావము.  ॥౧.౬౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.61

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.61🌺
🌷
మూలమ్--
తృణాని భూమిరుదకం వాక్ చతుర్థీ చ సూనృతా ।
ఏతాన్యపి సతాం గేహే నోచ్ఛిద్యన్తే కదాచన॥౧.౬౧॥

🌺
పదవిభాగః--
తృణాని భూమిః ఉదకం వాక్ చతుర్థీ చ సూనృతా । ఏతాని అపి సతాం గేహే న ఉచ్ఛిద్యన్తే కదాచన॥౧.౬౧॥
🌸
అన్వయః--
సతాం గేహే- తృణాని, భూమిః, ఉదకం, వాక్, చతుర్థీ చ సూనృతా - ఏతాని అపి కదాచన న ఉచ్ఛిద్యన్తే॥౧.౬౧॥
🌼
ప్రతిపదార్థః--
తృణాని = ఆస్తరణార్థం పలాల-కుశాదీని ; భూమిః = నివాస-స్థానమ్ ; ఉదకం = పానాద్యర్థే శీతలం పయః ; ఏతత్ త్రితయం ; కిఞ్చ-చతుర్థీ- ; సూనృతా = ప్రియా, సత్యా చ ; వాక్ = వాణీ ; ['సూనృతం మఙ్గలేఽపి స్యాత్ ప్రియసత్యే వచస్యపీ'తి మేదినీ] ; ఏతాని = చత్వారి ; అపి = తు ; సతాం = సాధూనాం ; గేహే = గృహే ; న ఉచ్ఛిద్యన్తే కదాచన = న కదాచన విరలీభవన్తి ; సదైవ సులభాని ఏవ ఇత్యాశయః॥౧.౬౧॥
🌻
తాత్పర్యమ్--
సజ్జనానాం గృహే- (ఉపవేశనాయ, శయనాయ చ) తృణాని, (వాసయోగ్యా) ధరా, (తృషాశాన్త్యర్థం) జలం, మధురా చ వాణీ-ఏతాని వస్తూని కదాపి అనుపలబ్ధతాం న యాన్తి॥౧.౬౧॥
🌿
హిన్ద్యర్థః--
బిఛానే కే లిఏ ఔర బైఠనే కే లిఏ పుఆల ఆది ఘాస ఫూస, రహనే కో స్థాన, జల- యే తీన చీజ़ ఔర చౌథా మీఠా వచన, ఇన చార చీజ़ోం కీ కమీ తో సజ్జనోం కే ఘర మేం కభీ భీ నహీం హోతీ హై । అర్థాత్ కుఛ భీ ఘర మేం దేనే కో న హో తో భీ ఇన చార వస్తుఓం సే హీ అతిథి కా సత్కార కరనా చాహియే॥౧.౬౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
తృణాని = తృణనిర్మితాసనములు ; భూమిః = నివాసస్థానము ; ఉదకం = (పానయోగ్యమైన) నీరు ; చతుర్థీ- నాల్గవదైన ; సూనృతా = సత్యమై, ప్రియమైన ; వాక్ = మాట ;  ఏతాని అపి = ఇవి(నాలుగు)ఐతే ; సతాం = సజ్జనులయొక్క ; గేహే = గృహము యందు ; కదాచన = ఎప్పుడు కూడా ; న ఉచ్ఛిద్యన్తే = లోపించవు అని అర్థము. ॥౧.౬౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తృణనిర్మితాసనములు అనగా గడ్డితో తయారు చేయబడిన చాపలు, నివాసయోగ్యమైన స్థలము, పానయోగ్యమైన నీరు, మరియు నాల్గవదైన సత్యమై, ప్రియమైన మాట, ఇవి నాలుగు కూడా సజ్జనులయొక్క, గృహము యందు  ఎప్పుడు కూడా లోపించవు (అనగా కొరత ఉండదని) భావము. ॥౧.౬౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.60

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.60🌺
🌷
మూలమ్--
అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే ।
ఛేత్తుః పార్శ్వగతాచ్ఛాయాం నోపసంహరతే ద్రుమః॥౧.౬౦॥

🌺
పదవిభాగః--
అరౌ అపి ఉచితం కార్యమ్ ఆతిథ్యం గృహమ్ ఆగతే । ఛేత్తుః పార్శ్వగతాత్ ఛాయాం న ఉపసంహరతే ద్రుమః॥౧.౬౦॥
🌸
అన్వయః--
అరౌ అపి గృహమ్ ఆగతే (సతి) ఉచితం ఆతిథ్యం కార్యమ్ । ద్రుమః ఛేత్తుః అపి పార్శ్వగతాత్ ఛాయాం న ఉపసంహరతే॥౧.౬౦॥
🌼
ప్రతిపదార్థః--
అరావితి । అరౌ = శత్రౌ-అపి ; గృహమాగతే సతి- ఉచితం = యోగ్యమ్, ఆతిథ్యమ్ = అతిథిసత్కారః ; ద్రుమః = వృక్షః ; పార్శ్వగతాత్ = నికటస్థితాత్ ; ఛేత్తుః = స్వచ్ఛేదకాత్, తక్ష్ణః సకాశాదపి ; స్వచ్ఛాయాం నోపసంహరతే = న సఙ్కోచయతి॥౧.౬౦॥
🌻
తాత్పర్యమ్--
 (గృహస్థ-ధర్మః చ ఏషః–) యదా శత్రుః గృహమాగచ్ఛతి, తదాపి యోగ్యా సత్క్రియా కార్యా । (అత్రోపమానమ్) యదా (తరుం ఖణ్డశః కర్తుం) ఛేదకః పరితః ఆగచ్ఛతి, తదాపి వృక్షః (తం) ఛాయాం (ప్రదదాతి), న నివర్తయతి ॥౧.౬౦॥
🌿
హిన్ద్యర్థః--
శత్రు భీ యది అపనే ధర పర ఆ జాఏ తో ఉసకా భీ ఉచిత ఆతిథ్య సత్కార కరనా చాహిఏ । దేఖో- వృక్ష అపనే కాటనే వాలే బఢఈ, సుతార ఆది కీ ఓర సే భీ అపనీ సుశీతల ఛాయా కో కభీ నహీం హటాతా హై॥౧.౬౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గృహం ఆగతే = ఇంటికి వచ్చిన ; అరౌ అపి = శత్రువు విషయమంలో కూడా ; ఉచితం = తగిన రీతిలో ; ఆతిథ్యమ్ = (భోజనవసతి సౌకర్యాలను) అతిథిసత్కారములను ; కార్యం = చేయాలి ; (యతః = ఎందుకనగా), ద్రుమః = చెట్టు ; ఛేత్తుః (అపి)=(తనను) నరికే వాడికి (కూడా) ;  పార్శ్వగతాం = (తన)సమీపమందున్న ;  ఛాయామ్ = నీడను ; న ఉపసంహరతే = ఇవ్వకుండా ఉండడం లేదు అని అర్థము. ॥౧.౬౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఇంటికి వచ్చిన శత్రువును కూడా, తగిన రీతిలో (భోజనవసతి సౌకర్యాలను కల్పించి  గౌరవించాలి) అతిథిసత్కారములను చేయాలి. (అదే ధర్మము). (ఎట్లనగా), చెట్టు తనను నరికే వాడికి కూడా, తన నీడను ఉపసంహరించుచు లేదు.(అందిస్తూ గౌరవిస్తుంది, సుఖపెడుతుంది)  అని భావము. ॥౧.౬౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.59

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.59🌺
🌷
మూలమ్--
జాతిమాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ ।
వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యోఽథవా భవేత్॥౧.౫౯॥

🌺
పదవిభాగః--
జాతి-మాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ । వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యః అథవా భవేత్॥౧.౫౯॥
🌸
అన్వయః--
జాతి-మాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ । వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యః అథవా భవేత్॥౧.౫౯॥
🌼
ప్రతిపదార్థః--
కశ్చిదపి ; క్వచిత్ = కస్మింశ్చిత్ స్థలేఽపి ; జాతిమాత్రేణ = 'అయం ఏవంజాతీయ' ఇత్యేతావన్మాత్రేణైవ ; కిం వధ్యతే = కిం హన్యతే ; కిం పూజ్యతే = కిం సత్క్రియతే ; నైవేత్యర్థః ; వ్యవహారం = తదాచారమ్ ; పరిజ్ఞాయ = దృష్ట్వా, అనురుధ్యైవ వధ్యః = హన్తవ్యః ; పూజ్యః = సత్కారయోగ్యః ॥౧.౫౯॥
🌻
తాత్పర్యమ్--
జన్మమాత్రేణ ప్రాప్తేన జీవాకారేణ ఏవ కోఽపి సత్క్రియార్హత్వం వా, హన్తవ్యత్వం వా న ప్రాప్నోతి । తస్య ప్రవృత్త్యా జ్ఞాయతే యత్ సః వ్యాపాదితవ్య ఉత సత్కారపాత్రం వేతి॥౧.౫౯॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి-కోఈ భీ వ్యక్తి జాతిమాత్ర హీ సే మారనే వా పూజనే లాయక నహీం హోతా హై, కిన్తు ఉనకా వ్యవహార దేఖ కర హీ ఉసే మారనా యా పూజనా చాహిఏ॥౧.౫౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
క్వచిత్ = ఎక్కడైనా ; కశ్చిత్ =ఎవడైనా ; జాతిమాత్రేణ = (చాండాల, బ్రాహ్మణాది) కులవివక్ష చేత ; కిం వధ్యతే = (అవమానింపబడుతాడా) చంపబడుతాడా ? కిం పూజ్యతే = పూజింపబడుతాడా ? వ్యవహారం = (ఆ వ్యక్తియొక్క) జీవనసరళిని ; పరిజ్ఞాయ = తెలుసుకుని ; వధ్యః = చంపబడేవాడుగా : అథవా = లేక; పూజ్యః = పూజింపబడువాడుగా ; భవేత్ = అగు గాక అని అర్థము. ॥౧.౫౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎక్కడైనా, ఎవడైనా, చాండాల, బ్రాహ్మణాది కులవివక్ష చేత అవమానించడం గాని, చంపబడడం గాని, లేక పూజింపబడడం గాని శాస్త్రవిరుద్ధము. అన్యాయము. ఎక్కడైనా, ఏ కాలమందైనా, ఏ కులం వాడైనా, ఆ వ్యక్తియొక్క జీవనసరళిని, స్వరూపస్వభావాలను తెలుసుకున్నాక మాత్రమే, చంపబడేవాడా ? లేక పూజింపబడేవాడా ? అని నిర్ణయించాలి. అంతేగాని కులచర్చ అప్రస్తుతం అని భావము. అనగా అవమానగౌరవాది విషయాలలో కులంకంటే. గుణమే ప్రధానమని భావము. ॥౧.౫౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.58

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.58🌺
🌷
మూలమ్--
తావద్ భయస్య భేతవ్యం యావద్ భయమనాగతమ్ ।
ఆగతం తు భయం వీక్ష్య నరః కుర్యాద్ యథోచితమ్॥౧.౫౮ ॥

🌺
పదవిభాగః--
తావద్ భయస్య భేతవ్యం యావద్ భయమ్ అనాగతమ్ । ఆగతం తు భయం వీక్ష్య నరః కుర్యాద్ యథోచితమ్॥౧.౫౮॥
🌸
అన్వయః--
యావద్ భయమ్ అనాగతం, తావద్ భయస్య భేతవ్యమ్ । ఆగతం భయం తు వీక్ష్య నరః యథోచితం కుర్యాత్॥౧.౫౮॥
🌼
ప్రతిపదార్థః--
భయస్య = భయజనకస్య చౌరవ్యాఘ్రాదేః ; భేతవ్యం = భీతిః కార్యా ; భయం = భయప్రదం చోరవ్యాఘ్రాదికమ్, ఆగతమ్ = ఉపస్థితమ్ ; వీక్ష్య = దృష్ట్వా తు ; యథోచితం = యథాయోగ్యం తత్ప్రతీకారోపాయమ్ ; కుర్యాత్ = విదధీత॥౧.౫౮॥
🌻
తాత్పర్యమ్--
ధైర్యహారకం, భీతిజనకం చ యద్యద్ కారణం భవతి, తస్య ఆగమనాత్ పూర్వమేవ భీతిర్న కార్యా। (తస్మాత్ ప్రాక్ ధైర్యం వోఢవ్యమ్ ।) తస్మిన్ ఆగతే సతి సకృత్ పరిశీల్య యద్ యోగ్యం తత్ కర్తవ్యమ్॥౧.౫౮॥
🌿
హిన్ద్యర్థః--
ఇసలిఏ మనుష్య కో సభీ ప్రకార కే అపనే బహుత సే మిత్ర కరనే చాహియే। దేఖో, చిత్రగ్రీవ కే మిత్ర చూహే నే కబూతరోం కో బన్ధన సే ఛుడ़ా దియా థా॥౧.౫౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యావత్ = ఎంతవరకు ; భయం = (భయపెట్టే సంఘటన) భయము ; అనాగతమ్ = రాలేదో ; తావత్ = అంతవరకు ; భయాత్ = భయము వలన ; భేతవ్యం = (ఎలా భయసంఘటన వస్తుందో అని) భయపడాలి ; తు = కానీ ; ఆగతం = వచ్చిన ; భయం = భయమును ; వీక్ష్య = చూచి ; నరః = మానవుడు ; యథోచితం = (భయనివారణ కొరకు) తగినట్లుగా ; కుర్యాత్ = చేయవలెను అని అర్థము. అనగా భయసంఘటన పట్ల జాగరూకతతో, జాగ్రత్తగా వ్యవహరించవలెనని అర్థము. ॥౧.౫౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎంతవరకు భయపెట్టే సంఘటన మరియు భయము రాలేదో, అంతవరకు భయము వలన ; ఎలా భయసంఘటన వస్తుందో అని భయపడాలి. కానీ వచ్చిన భయసంఘటనను భయమును చూచి, మానవుడు, భయనివారణ కొరకు తగినట్లుగా చర్యలు చేపట్టవలెను అని భావము. అనగా భయసంఘటన పట్ల జాగరూకతతో, జాగ్రత్తగా వ్యవహరించవలెనని భావము. ॥౧.౫౮॥
🙏