Friday, August 2, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.31

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.31🌺
🌷
మూలమ్--
ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః
దైవేన దేయమితి కాపురుషా వదన్తి ।
దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా
యత్నే కృతే యది న సిధ్యతి కోఽత్ర దోషః ॥౦.౩౧॥

🌺
పదవిభాగః--
ఉద్యోగినం పురుష-సింహమ్ ఉపైతి లక్ష్మీః దైవేన దేయమ్ ఇతి కాపురుషాః వదన్తి । దైవం నిహత్య కురు పౌరుషమ్ ఆత్మ-శక్త్యా యత్నే కృతే యది న సిధ్యతి కః అత్ర దోషః ॥౦.౩౧॥
🌸
అన్వయః--
ఉద్యోగినం పురుష-సింహమ్ లక్ష్మీః ఉపైతి । కాపురుషాః ‘దైవేన దేయమ్’ ఇతి వదన్తి । దైవం నిహత్య, ఆత్మ-శక్త్యా పౌరుషం కురు । యత్నే కృతే యది న సిధ్యతి కః అత్ర దోషః ॥౦.౩౧॥
🌼
ప్రతిపదార్థః--
ఉద్యోగినమ్ = ప్రయత్నశీలం ; పురుషసింహం = (~పురుషః సింహ ఇవ, పురుషసింహస్తం) సింహవద్ విక్రమశాలినం పురుషశ్రేష్ఠమ్ ; లక్ష్మీః = ధనం, సమ్పత్తిః, సఫలతా, జయః ; స్వయమేవ = స్వత ఏవ ; ఉపైతి = ఆగచ్ఛతి ; కాపురుషాః = ఉద్యోగశక్తిశూన్యాః, భయశీలాః, కాతరా ఏవ, న శూరాః ; ‘దైవేన దేయమ్’ ఇతి = ‘భాగ్యేన ఏవ దీయతే (సర్వం సుఖం దుఃఖం వే’తి) ; వదన్తి = కథయన్తి ; దైవమ్ = భాగ్యం, అదృష్టం ; నిహత్య = తన్ముఖప్రేక్షితాం విహాయ, తదుపేక్ష్యేతి వా ; పౌరుషమ్ = ఉద్యోగం ; కురు ; యత్నే = ఉద్యోగే ; కృతే సతి ; యది = చేత్ ; కార్యం న సిధ్యతి (తర్హి అస్మిన్విషయే) ; కః = కో వా పుంసః ; దోషః = అపకర్షకారకం ; (నైవ కశ్చిద్దోష ఇత్యర్థః) । యద్వా-అత్ర = యత్నే ఏవ కః = కోఽపి దోషః = త్రుటిరస్తీతి విభావ్యమ్, అన్యథా బలవతి యత్నే సతి అవశ్యమేవ కార్యం భవత్యేవేత్యవధేయమిత్యన్యే వ్యాచక్షతే ॥౦.౩౧॥
🌻
తాత్పర్యమ్--
యః ప్రయత్నశీలః సింహవత్ విక్రమశాలీ పురుషః, సః సఫలత్వం ప్రాప్నోతి। భయశీలినః తు ‘భాగ్యేనైవ దీయతే’ ఇతి బ్రువన్తి। అతః భాగ్యముపేక్ష్య, ప్రయత్నం కురు। యది యత్నం కృత్వా అపి ఫలం న ప్రాప్యతే, తర్హి న కోఽపి దోషస్తత్ర। అథవా, యది న ప్రాప్యతే ఫలం, తర్హి ‘యత్నే కో దోషః?’ ఇతి చిన్తనీయమ్ ॥౦.౩౧॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ-ఉద్యోగశీల పురుషసింహ కే పాస స్వయం హీ లక్ష్మీ ఆతీ హై । 'ధన భాగ్య సే హీ మిలతా హై' యహ తో కాయర పురుష హీ కహా కరతే హైం । ఇసలియే మనుష్య కో భాగ్య కా భరోసా ఛోడ़కర అపనీ శక్తి కే అనుసార ఉద్యోగ కరనా చాహియే, యది ఉద్యోగ కరనే పర భీ కార్య కీ సిద్ధి న హోనే తో ఇస ఉద్యోగ మేం క్యా దోష హై। ఇసకా విచార కరో । అర్థాత్- దేఖో కి తుమారే ఇస ఉద్యోగ మేం క్యా త్రుటి హై, న కి ఉద్యోగ కో హీ ఛోడ దో ॥౦.౩౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఉద్యోగినమ్ = ప్రయత్నశీలుడైన ; పురుషసింహం = పురుషశ్రేష్ఠున్ని ; లక్ష్మీః = (విజయము) సంపద; ఉపైతి = పొందుచున్నది ; కాపురుషాః = (స్వశక్తిని మరిచి) ప్రయత్నశూన్యులైనవారు ; దైవేన = భాగ్యము చేతనే ; (విజయము కాని,సంపద కానీ), దేయమ్ = ఇవ్వబడాలి ; ఇతి = అని ; వదన్తి = పలుకుచున్నారు ; (కిన్తు = కాని), దైవమ్ = అదృష్టమును ; నిహత్య = (తృణీకరించి), లెక్కించకుండా ; ఆత్మశక్త్యా = స్వసామర్థ్యముతో ; పౌరుషమ్ = (తనదైన), ప్రయత్నమును ; కురు = చేయుము ; యత్నే కృతే సతి = ప్రయత్నము చేయబడినదగుచుండగా ; యది = ఒకవేళ ; కార్యం న సిధ్యతి = పని(ఫలితం)సిద్ధించకున్నను ; అత్ర = (ఈ ప్రయత్నంలో) ఇక్కడ ; కః = ఏమి ; దోషః = దోషము! ; (దోషమే లేదని అర్థము) ॥౦.౩౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ప్రయత్నశీలుడైన పురుషశ్రేష్ఠున్ని, విజయము కాని సంపద కాని పొందుచున్నది . స్వశక్తిని మరిచి, ప్రయత్నశూన్యులైన జనులు మాత్రము, భాగ్యము చేతనే విజయము కాని, సంపద కానీ ఇవ్వబడాలి అని పలుకుచున్నారు. కాని అదృష్టంపై భారము వేయక, స్వసామర్థ్యముతో ప్రయత్నమును చేయాలి. ప్రయత్నము చేసిననూ... ఒకవేళ పని యొక్క ఫలితం సిద్ధించకున్నను, ఈ ప్రయత్నంలో దోషమే లేదని భావము . మళ్ళీ కార్యోన్ముఖుడై ఉద్యమించి, సాధించవలెనని భావము. ॥౦.౩౧॥౹
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.30

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.30🌺
🌷
మూలమ్--
న దైవమపి సఞ్చిన్త్య త్యజేదుద్యోగమాత్మనః ।
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి ॥౦.౩౦॥

🌺
పదవిభాగః--
న దైవమ్ అపి సఞ్చిన్త్య త్యజేద్ ఉద్యోగమ్ ఆత్మనః । అనుద్యోగేన తైలాని తిలేభ్యః న ఆప్తుమ్ అర్హతి ॥౦.౩౦॥
🌸
అన్వయః--
దైవమ్ అపి సఞ్చిన్త్య ఆత్మనః ఉద్యోగం న త్యజేద్ । (అత్రోదాహరణమ్) అనుద్యోగేన తిలేభ్యః తైలాని న ఆప్తుమ్ అర్హతి ॥౦.౩౦॥
🌼
ప్రతిపదార్థః--
దేవమ్ అపి = దైవమ్ అస్తి ఇతి, భాగ్యమ్ (తదేవ సర్వకార్యసాధకమితి) ; సఞ్చిన్త్య = విభావ్య, చిన్తయిత్వా ; ఆత్మనః = ఆత్మాధీనమ్ ; ఉద్యోగం = పురుషార్థం ; (యత్ స్వయం కర్తుం శక్యతే తత్) న త్యజేత్ ; (యతః) అనుద్యోగేన = ఉద్యోగవికలేన, ఆలస్యేన వా ; (గృహకోణస్థితేభ్యోఽపి తైలపూర్ణేభ్యోఽపి) తిలేభ్యః ; తైలాని ; ఆప్తుం = ప్రాప్తుం ; న అర్హతి = న యోగ్యో భవతి ॥౦.౩౦॥
🌻
తాత్పర్యమ్--
భాగ్యమస్తి ఇతి చిన్తయిత్వా స్వస్య హస్తే యదస్తి, తత్ ప్రయత్నం న త్యక్తవ్యమ్ । ప్రయత్నం వినా తిలేషు సత్సు అపి తైలం న ప్రాప్నోతి। (ఉద్యోగాఽభావే హి గృహకోణస్థతిలేభ్యోఽపి తైలలాభో న భవతి, కిం పునరభ్యుదయసమ్పత్తిసుఖాదిలాభః । ఏవఞ్చ దైవస్య ఆశాం విహాయ, పురుషేణ ఉద్యోగోఽవశ్యం విధేయ ఇత్యర్థః) ॥౦.౩౦॥
🌿
హిన్ద్యర్థః--
బుద్ధిమాన్ మనుష్య కో అపనా ఉద్యోగ కభీ నహీం ఛోడ़నా చాహిఏ । క్యోంకి వినా ఉద్యోగ కే కియే తో తిల సే తేల భీ నహీం నికల సకతా హై ॥౦.౩౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
దైవమ్ = అదృష్టమును గురించి ; (అదృష్టంలో ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుందని ) ; సఞ్చిన్త్య అపి = ఆలోచించియు ; ఆత్మనః = (తన అధీనంలో ఉన్న) ఆత్మాధీనమైన ; ఉద్యోగం = ప్రయత్నమును ; న త్యజేత్ = వదలకూడదు ; (ఎందుకనగా), అనుద్యోగేన = (ఏ) ప్రయత్నము లేకుండా ; (తన అందుబాటులో ఉన్నప్పటికీ), తిలేభ్యః = నువ్వుల నుండి ; తైలాని = నూనె మొదలగు తత్సంబంధవిషయములను ; ఆప్తుం = పొందుటకు ; న అర్హతి = వీలగుటలేదు కదా ; ॥౦.౩౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తన అదృష్టంలో ఉంటేనే కార్యసిద్ధి కలుగుతుందని ఆలోచిస్తూ, ఆత్మాధీనమైన ప్రయత్నమును వదలకూడదు. ఎందుకనగా... తన అందుబాటులో ఉన్న నువ్వుల నుండి తన ప్రయత్నము లేకుండా, నూనె మొదలగు తత్సంబంధవిషయములను తాను పొందుటకు వీలగుటలేదు కదా. ॥౦.౩౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.29

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.29🌺
🌷
మూలమ్--
యదభావి న తద్ భావి భావి చేన్న తదన్యథా ।
ఇతి చిన్తావిషఘ్నోఽయమగదః కిం న పీయతే ॥౦.౨౯॥

🌺
పదవిభాగః--
యద్ అభావి న తద్ భావి భావి చేద్ న తద్ అన్యథా । ఇతి చిన్తా-విషఘ్నః అయమ్ అగదః కిం న పీయతే ॥౦.౨౯॥
🌸
అన్వయః--
యద్ అభావి, న తద్ భావి ; భావి చేద్ తద్ న అన్యథా ఇతి చిన్తా-విషఘ్నః అయమ్ అగదః కిం న పీయతే ॥౦.౨౯॥
🌼
ప్రతిపదార్థః--
యత్ = సుఖాది ; అభావి = న భావి ; తత్ న భావి = న భవితుం న శక్యతే ; చేత్ = యది ; భావి = సుఖదుఃఖాదికం భావి, తత్ = భావిసుఖాది ; న అన్యయా = న దూరీకర్తుం శక్యమ్ ; ఇతి = ఇత్యయం ; చిన్తా ఏవ విషం, తద్-హన్తి ఇతి చిన్తావిషఘ్నః = చిన్తావిషాపహారీ ; అగదః = ఔషధం, కిం న = కుతో న ; పీయతే = సేవ్యతే ॥౦.౨౯॥
🌻
తాత్పర్యమ్--
యద్భావి, తత్తు వినా ప్రయత్నమపి భవతి। యన్న భావి తత్ ప్రయత్న-సహస్రేణాపి న సమ్భవతి। అతః అలం చిన్తయా ఇతి-- చిన్తానామ విషం హరన్ విచార-ఔషధః జనైః కిమర్థం న సేవ్యతే?
    అర్థాత్- యద్భావి తద్భవిష్యత్యేవ ; యచ్చ న భావి తన్న భవిష్యత్యేవ, దైవాధీనమేవ సర్వమ్ ; తత్ర కిం వృథా చిన్తయా ఆయాసేన చ - ఇత్యాశయః ॥౦.౨౯॥
🌿
హిన్ద్యర్థః--
జో బాత నహీం హోనే వాలీ హై, వహ కభీ నహీం హోగీ ఔర జో హోనే వాలీ హై, వహ కిసీ ప్రకార మిట నహీం సకతీ హై ఇస విచారరూపీ ఔషధ కో- జో కి సబ చిన్తాఓం కో నాశ కరనేవాలీ హై లోగ క్యోం నహీం పీతే హైం? ॥౦.౨౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యత్ = ఏది(సుఖదుఃఖాదివిషయము) అభావి = సంభవించునది కాదో ; తత్=అది(ఆ సుఖదుఃఖాదివిషయము); న భావి = (ఎంత ప్రయత్నించినను) సంభవించదు ; యది = ఒక వేళ ; భావి చేత్ = సంభవించునదైనచో ; తత్ = అది(ఆ సుఖదుఃఖాదివిషయము) ; అన్యథా = వేరే విధముగా ; న = కాదు(సంభవించదు, మార్పు చెందదు); ఇతి = అని(ఈ అనివార్యమైన విషయమును) ; చిన్తావిషఘ్నః = చింత(బాధ)అనే విషాన్ని చంపే ; అయం = ఈ (ఆలోచన అనే) ; అగదః = ఔషధము ; కిం  = ఎందుకు ;(జనైః = జనులచేత) ; న పీయతే = త్రాగబడదో ? అని అర్థము ॥౦.౨౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ సుఖదుఃఖాదివిషయమైతే సంభవించునది కాదో , ఆ సుఖదుఃఖాదివిషయము, ఎవరు ఎంత ప్రయత్నించినను అది సంభవించదు. ఒక వేళ సంభవించునదైనచో ఆ సుఖదుఃఖాదివిషయము ఎంత ప్రయత్నించినను వేరే విధముగా సంభవించదు. అనగా జరుగదు. ఈ అనివార్యమైన విషయమును మరియు బాధ అనే విషాన్ని చంపే ఈ మంచి ఆలోచన అనే ఔషధము జనులచేత ఎందుకు త్రాగబడదో ? అని భావము ॥౦.౨౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.28

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.28🌺
🌷
మూలమ్--
అవశ్యం భావినో భావా భవన్తి మహతామపి ।
నగ్నత్వం నీలకణ్ఠస్య మహాహిశయనం హరేః ॥౦.౨౮॥

🌺
పదవిభాగః--
అవశ్యం భావినః భావాః భవన్తి మహతామ్ అపి । నగ్నత్వం నీలకణ్ఠస్య మహా-అహి-శయనం హరేః ॥౦.౨౮॥
🌸
అన్వయః--
మహతామ్ అపి భావాః అవశ్యం భావినః భవన్తి । నీలకణ్ఠస్య నగ్నత్వం, హరేః మహా-అహి-శయనం (చాత్ర ప్రమాణమ్) ॥౦.౨౮॥
🌼
ప్రతిపదార్థః--
మహతామపి = మహాత్మానామపి ; భావాః = భవితవ్యాని ; అవశ్యం భావినః = నిశ్చయేన భవమానాః ఘటనాః ; నీలకణ్ఠస్య = శివస్య ; నగ్నత్వం = దిగమ్బరత్వమ్ ; హరేః = విష్ణోః, మహాహిశయనం = శేషశయ్యా ॥౦.౨౮॥
🌻
తాత్పర్యమ్--
యే ఘటనాః నూనం భవమానాః భవన్తి, తే (న కేవలం సామాన్యానామ్ అపి తు) మహాపురుషాణామపి జీవనే ఘటన్తే ఏవ। (యద్యపి జగద్రక్షకౌ, తథాపి తయోః భాగ్యమేవం భవతి యేన) శివస్య తు దిగమ్బరత్వం, విష్ణోస్తు శేషే శయ్యా (పరికల్పితే స్తః) ॥౦.౨౮॥
🌿
హిన్ద్యర్థః--
జో బాత అవశ్య హానే వాలీ హై, వహ తో అవశ్య హీ హోతీ హై, ఉసకో తో కోఈ భీ నహీం హటా సకతా హై। ఇసమేం శివజీ కా నగ్న రహనా ఔర విష్ణు కా శేషనాగ కా శయ్యా పర సోనా హీ ప్రమాణ హై । అర్థాత్ యద్యపి యే దోనోం సంసార కే ప్రభు హైం, తథాపి ఇనకే ప్రారబ్ధ మేం యహీ బిడమ్బనా లిఖీ హై ॥౦.౨౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
మహతామపి = మహాత్ములకు కూడా ; అవశ్యం భావినః = నిశ్చయముగా సంభవించు సుఖదుఃఖాదులు ; (మొదలగు)భావాః = (వివిధ) సందర్భములు ; భవంతి = సంభవించుచున్నవి ; (యథా = ఎట్లనగా) నీలకణ్ఠస్య = శివునికి ; నగ్నత్వం = దిగంబరత్వము ; హరేః = శ్రీమన్నారాయణునికి ; మహాహిశయనం = (వేయుపడగలు గల)మహాసర్పముపై నిద్రించడం... అని అర్థము. ॥౦.౨౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
నిశ్చయముగా విధివలన సంభవించు సుఖదుఃఖాది వివిధ సందర్భములు మహాత్ములకు కూడా సంభవించుచునే ఉన్నవి. ఎట్లనగా శివునికి దిగంబరత్వము , ఆ శ్రీమన్నారాయణునికి వేయుపడగలతో ఉన్న మహాసర్పముపై నిద్రించడం ఇలాంటివి... కావున సమస్యలు ఈ జీవనవిధానంలో ఒక భాగమే అని భావము. ॥౦.౨౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.27

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.27🌺
🌷
మూలమ్--
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ ।
పఞ్చైతాని హి సృజ్యన్తే గర్భస్థస్యైవ దేహినః ॥౦.౨౭॥

🌺
పదవిభాగః--
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమ్ ఏవ చ । పఞ్చ ఏతాని హి సృజ్యన్తే గర్భస్థస్య ఏవ దేహినః ॥౦.౨౭॥
🌸
అన్వయః--
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమ్ ఏవ చ– ఏతాని పఞ్చ హి గర్భస్థస్య ఏవ దేహినః సృజ్యన్తే ॥౦.౨౭॥
🌼
ప్రతిపదార్థః--
ఆయుః = జీవితకాలః ; కర్మ = జీవికాసాధనం కర్మ, శుభాశుభమాచరణం వా ; విత్తం = ధనమ్ ; విద్యా ; నిధనం = మృత్యుః ; ఏతాని పఞ్చ ; గర్భస్థస్య = మాతుః కుక్షిస్థస్యైవ ; దేహినః = ప్రాణినః, జీవినః, శరీరిణః ; సృజ్యన్తే = కల్ప్యన్తే ॥౦.౨౭॥
🌻
తాత్పర్యమ్--
శరీరిణః పఞ్చ విషయాః– ౧. జీవనపరిమాణం, ౨. పోషణాయ వృత్తిః శుభాశుభకార్యాణి వా, ౩. ఆర్థికస్థితిః, ౪. జ్ఞానం, ౫. మరణసమయశ్చ– సర్వే జన్మనః పూర్వం గర్భే స్థితే ఏవ నిర్ధృతాః భవన్తి। (కోఽపి ఏతేషామభావస్య కారణం ప్రయత్నలోప ఇతి వక్తుం న శక్నోతి। ప్రాణినః మాతృగర్భస్థితేః పూర్వమేవ తస్య పూర్వజన్మనః కర్మ అనుసృత్య ఆయుఃప్రమాణాదికం నిర్దిశ్యతే। అనేన నిష్కర్షేణ, స్థితౌ పరిణామః నితరామ్ అసమ్భవ ఇతి కథితుం న శక్యతే। అభ్యాసప్రయత్నాభ్యాం తత్ర కర్మ-ధన-విద్యావిషయేషు లాభో భవేత్। యది లాభో న దృశ్యేత, తర్హి శుచా న కార్యా ఇత్యేవాస్య శ్లోకస్యార్థః।) ॥౦.౨౭॥
🌿
హిన్ద్యర్థః--
కుఛ లోగ జో కహా కరతే హైం కి- జబ మనుష్య గర్భ మేం రహతా హై తభీ ఉసకీ ఆయు, కర్మ (వ్యవసాయ, ధన, విద్యా కౌర మృత్యుకా సమయ- యే (చార వస్తు) నిశ్చిత హో జాతే హైం ॥౦.౨౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గర్భస్థస్య = తల్లి గర్భమందున్న ; దేహినః ఏవ = (శరీరికి) జీవునికి ; ఆయుః = (జీవితకాలము) ఆయుష్షు ; కర్మ = జీవించడానికి చేయు పని లేక వృత్తి ; విత్తం = ధనము ; విద్యా = జ్ఞానము ; నిధనం = చావు ; ఏతాని పఞ్చ = ఈ (నిర్దిష్టములైన) ఐదు ; సృజ్యన్తే = సృష్టించబడతాయి. అనగా నిర్ణయింపబడుతాయి అని అర్థము. ॥౦.౨౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తల్లి గర్భమందున్న శరీరికి అనగా జీవునికి, అతని యొక్క జీవితకాలము అనగా ఆయుష్షు, జీవించడానికి చేయు పని లేక వృత్తి , ధనము, జ్ఞానము మరియు చావు అనే ఈ నిర్దిష్టములైన ఐదు కూడా, ఆ దశయందే సృష్టించబడతాయి. అనగా నిర్ణయింపబడుతాయి అని భావము. ॥౦.౨౭॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.26

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.26🌺
🌷
మూలమ్--
ధర్మార్థకామమోక్షాణాం యస్యైకోఽపి న విద్యతే ।
అజాగలస్తనస్యేవ తస్య జన్మ నిరర్థకమ్ ॥౦.౨౬॥

🌺
పదవిభాగః--
ధర్మ-అర్థ-కామ-మోక్షాణాం యస్య ఏకః అపి న విద్యతే । అజా-గల-స్తనస్య ఇవ తస్య జన్మ నిరర్థకమ్ ॥౦.౨౬॥
🌸
అన్వయః--
యస్య ధర్మ-అర్థ-కామ-మోక్షాణాం ఏకః అపి న విద్యతే, తస్య జన్మ అజా-గల-స్తనస్య ఇవ నిరర్థకమ్ ॥౦.౨౬॥
🌼
ప్రతిపదార్థః--
యస్య = యస్య పుంసః ; ధర్మ-అర్థ-కామ-మోక్షాణాం = ధర్మార్థ-కామ-మోక్షాఖ్య-పురుషార్థ-చతుష్టయస్య మధ్యే ; ఏకోఽపి ; పురుషార్థః = ధర్మాదిరూపో ; న విద్యతే = (ధ్యేయత్వేన) న భవతి ; తస్య = తస్య పుంసః ; అజాగలస్తనస్య ఇవ = అజా-గల-స్థిత-స్తన-వత్ లమ్బమాన-చర్మ-ఖణ్డస్య ఇవ ; జన్మ = జననం ; నిరర్థకం = నిష్ఫలమేవ ; ॥౦.౨౬॥
🌻
తాత్పర్యమ్--
యస్య పురుషస్య పురుషార్థ-చతుష్టయస్య మధ్యే ఏకః అపి పురుషార్థః ధర్మో అర్థో కామో మోక్షో వా న విద్యతే, తస్య ధర్మాదీనసేవమానస్య పుంసః దుగ్ధాది-రహిత-బర్కర-గలచర్మ-ఖణ్డమివ వృథైవ జన్మ ఇత్యాశయః ॥౦.౨౬॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి-ధర్మ అర్థ, కామ, మోక్ష-ఇన చారోం మేం సే జిసకే పాస ఏక భీ నహీం హై, ఉస మనుష్య కా జన్మ వైసే హీ వ్యర్థ హై, జైసే బకరీ కే గలే కా స్తన (చమడ़ేకీ స్తనాకార లమ్బీ థైలీ) ॥౦.౨౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య = ఏ వ్యక్తి కి ; ధర్మ-అర్థ-కామ-మోక్షాణాం = ధర్మార్థ-కామ-మోక్షములలో ; ఏకోఽపి = ఒక్కటి కూడా ; న విద్యతే = (స్వభావముగా) లేదో ; తస్య = ఆ పురుషునియొక్క; జన్మ = పుట్టుక ; అజాగలస్తనస్య ఇవ = మేకయొక్క కంఠమందున్న స్తనమువంటి చర్మభాగము వలే ; నిరర్థకం = నిష్ఫలమే, నిరుపయోగమే అని అర్థము. ॥౦.౨౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ వ్యక్తికైతే ధర్మార్థ-కామ-మోక్షములనే చతుర్విధపురుషార్థములలో ఏదో ఒక్కటి కూడా స్వభావముగా లేదో , ఆ పురుషునియొక్క పుట్టుక , మేకయొక్క కంఠమందున్న స్తనమువంటి చర్మభాగము వలే నిష్ఫలమే, నిరుపయోగమే అని భావము. ॥౦.౨౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.25

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.25🌺
🌷
మూలమ్--
ఆహారనిద్రాభయమైథునఞ్చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥౦.౨౫॥

🌺
పదవిభాగః--
ఆహార-నిద్రా-భయ-మైథునఞ్చ సామాన్యమ్ ఏతత్ పశుభిః నరాణామ్ । ధర్మః హి తేషాం అధికః విశేషః ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥౦.౨౫॥
🌸
అన్వయః--
ఆహార-నిద్రా-భయ-మైథునఞ్చ ఏతత్ నరాణామ్ పశుభిః సామాన్యమ్ । హి తేషాం ధర్మః అధికః విశేషః । ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥౦.౨౫॥
🌼
ప్రతిపదార్థః--
ఆహార-నిద్రా-భయ-మైథునఞ్చ ~ ఆహారశ్చ, నిద్రా చ, భయఞ్చ, మైథునం చ = రతిశ్చ, ఏషాం సమాహారః ~ ఆహార-నిద్రాభయమైథునమ్ । ఏతత్ ; నరాణాం = పుంసాం ; పశుభిః = గవాదిభిః పశుభిః ; సామాన్యం= తుల్యమ్ ఏవ ; హి = యతః ; తేషాం = నరాణామ్ ; ధర్మః = విద్యా-వినయ-ధర్మాచారాదిః ఏవ ; అధికః = అసదృశః, అతిరిక్తః అంశః, తత్ర అవర్తమానః ; విశేషః = భేదకః ; ధర్మేణ హీనాః = రహితాః నరాస్తు ; పశుభిః సమానాః = పశుతుల్యా ఏవ ఇత్యర్థః ॥౦.౨౫॥
🌻
తాత్పర్యమ్--
అన్నాదనం, శయనం, ప్రాణభీతిః, రతీచ్ఛా చ చతుష్పాదజన్తూనాం మనుష్యాణాం చ సమానధర్మాః భవన్తి। తయోః ద్వయోః ధర్మాచరణమేవ భేదః। నరాణాం ధర్మః అతిరిక్తతయా విశేషాంశో భవతి। యే పురుషాః ధర్మాచరణరహితాః తే పశుసదృశాః భవన్తి ॥౦.౨౫॥
🌿
హిన్ద్యర్థః--
భోజన, నీంద, భయ ఔర మైథున- యే చార బాతేం తో మనుష్యోం ఔర పశుఓం మేం సమాన హీ హైం। మనుష్య మేం కేవల ధర్మ (గుణ) హీ అధిక హై, ఇస లిఏ ధర్మహీన (విద్యా వినయ ఆది గుణోం సే రహిత) మనుష్య పశు కే హీ సమాన హై ॥౦.౨౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఆహార-నిద్రా-భయ-మైథునం చ = తిండి - నిద్ర - భయం - రతియును (అనే) ఏతత్ = (ఈ విషయసమూహము)ఇది ; నరాణాం = మనుష్యులకు ; పశుభిః = పశువులకు ; సామాన్యం= సమానమే (సాధారణమే) ; హి = (కాని) ఎట్లనగా ; తేషాం = నరులకు ; ధర్మః = విద్యా-వినయ-ధర్మాచరణము ; అధికః = అతిరిక్తము ( అనగా పశువులకు లేని) విశేషః = విశేష (గుణ)ము ; (అతః = అందువలన) ధర్మేణ = పుణ్యముచేత ; హీనాః= హీనులైన వారు ; పశుభిః = పశువులతో ; సమానాః = సమానమైనవారు అని అర్థము. ॥౦.౨౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తిండి - నిద్ర - భయం - రతిక్రియ అనే ఈ విషయసమూహము మనుష్యులకు పశువులకు సమానమే మరియు సాధారణమే. కాని నరులకు విద్యా -వినయములతో కూడిన ధర్మాచరణము అనునది పశువులకు లేని ఒక విశేషగుణము. అందువలన పుణ్య హీనులైన వారు, ధర్మహీనులైనవారు కేవలం పశువులతో సమానమైనవారే అగుదురు అని భావము. ॥౦.౨౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.24

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.24🌺
🌷
మూలమ్--
హా హా పుత్రక నాధీతం గతాస్వేతాసు రాత్రిషు ।
తేన త్వం విదుషాం మధ్యే పఙ్కే గౌరివ సీదసి ॥౦.౨౪॥
🌺
పదవిభాగః--
హా హా పుత్రక, న అధీతం గతాసు ఏతాసు రాత్రిషు । తేన త్వం విదుషాం మధ్యే పఙ్కే గౌః ఇవ సీదసి ॥౦.౨౪॥
🌸
అన్వయః--
పుత్రక, హా హా! ఏతాసు రాత్రిషు గతాసు న అధీతమ్ । తేన విదుషాం మధ్యే పఙ్కే గౌః ఇవ త్వం సీదసి ॥౦.౨౪॥
🌼
ప్రతిపదార్థః--
పుత్రక = హే పుత్ర (సమ్బోధనమ్) ; హా హా = ధిక్, అహో, (దుఃఖకరం) ; ఏతాసు రాత్రిషు గతాసు = వృథా-అపయాతాసు రాత్రిసమయేషు (దినసామాన్యార్థే) ; న అధీతం = శాస్త్రం న అభ్యస్తమ్, జ్ఞానం న సమ్ప్రాప్తమ్ ; తేన = కాలయాపనేన, అనధ్యయనేన చ ; విదుషాం = పణ్డితానాం, విద్యావతాం ; మధ్యే = సభాయాం, పురతః ; పఙ్కే = కర్దమే ; గౌః ఇవ = జన్తువిశేష-సదృశః ; త్వం సీదసి = క్లేశమనుభవసి, విషణ్ణో, ఆకులో భవసి ॥౦.౨౪॥
🌻
తాత్పర్యమ్--
హే సుత, ధిక్। త్వం ఏతావన్తి నక్తందినాని వినా విద్యాభ్యాసం వ్యర్థం కాలమపనీతవాన్। అతః త్వం ఇదానీం విద్వజ్జనసమ్ముఖం యథా పఙ్కే పతితః గౌః, తథా ఖిన్నః భవసి ॥౦.౨౪॥
🌿
హిన్ద్యర్థః--
హే పుత్ర! ఖేద హై కి తుమనే బాల్యకాలకీ బీతీ హుఈ రాత్రియోం మేం కుఛ నహీం పఢా, ఇసీలిఏ విద్వానోం కీ మణ్డలీ మేం ఆజ తుమ్హారీ యహ దశా హో రహీ హై, జో దశా కీచడ़ మేం ఫఁసీ హుఈ గాయ కీ హోతీ హై ॥౦.౨౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
హా హా = అయ్యయ్యో ; పుత్రక = ఓ కుమారా! ; గతాసు ఏతాసు రాత్రిషు = గడిచిన ఈ రాత్రులయందు (గడిచిన దినములలో అని భావము) ; న అధీతం = చదువకపోతివి (వృథాగా కాలం గడిపితివి) ; తేన = (వృథాకాలక్షేపంచేత) అందుచేత ; త్వం = నీవు; విదుషాం మధ్యే= పండితుల నడుమ ; పఙ్కే = బురదయందు ; గౌః ఇవ = దున్నపోతు వలె ; (అధునా = ఇప్పుడు) సీదసి = దుఃఖించుచున్నావు. ॥౦.౨౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అయ్యయ్యో ! ఓ కుమారా! గడిచిన దినములలో శాస్త్రాదిసాహిత్యవిషయములను శ్రద్ధగా చదువకపోతివి, వృథాగా కాలం గడిపితివి. ఆ వృథాకాలక్షేపంచేత నీవు నేడు పండితుల మధ్యన బురదయందు చిక్కిన దున్నపోతు వలె దుఃఖించుచున్నావు అని భావము ॥౦.౨౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.23

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.23🌺
🌷
మూలమ్--
యస్య కస్య ప్రసూతోఽపి గుణవాన్ పూజ్యతే నరః ।
ధనుర్వంశవిశుద్ధోఽపి నిర్గుణః కిం కరిష్యతి ॥౦.౨౩॥

🌺
పదవిభాగః--
యస్య కస్య ప్రసూతః అపి గుణవాన్ పూజ్యతే నరః । ధనుః వంశ-విశుద్ధః అపి నిర్గుణః కిం కరిష్యతి ॥౦.౨౩॥
🌸
అన్వయః--
గుణవాన్ నరః, యస్య కస్య ప్రసూతః అపి, పూజ్యతే । వంశ-విశుద్ధః అపి ధనుః (చేత్) నిర్గుణః, కిం కరిష్యతి? ॥౦.౨౩॥
🌼
ప్రతిపదార్థః--
యస్య కస్య = అజ్ఞాతకులశీలస్య, అకులీనస్యాపి ; ప్రసూతః = తత ఉత్పన్నః ; అపి ; గుణవాన్ = గుణీ, సద్గుణసమ్పన్నః, (అథవా ధనుషః పక్షే) తన్తుయుతః, మౌర్వీయుతః చ ; నరః ; పూజ్యతే = సత్క్రియతే, ఆద్రియతే ; వంశ-విశుద్ధః అపి = శ్రేష్ఠవంశనిర్మితమపి ; ధనుః = కోదణ్డం ; నిర్గుణః = గుణశూన్యం, జ్యారహితమ్ ; కిం కరిష్యతి = కిం లక్ష్యం హన్తుం సమర్థో భవతి? ॥౦.౨౩॥
🌻
తాత్పర్యమ్--
సామాన్యపురుషాత్ ఉత్పన్నోఽపి (కులవైశిష్ట్యరహితః, వంశవిశుద్ధరహితోఽపి యావత్ ) నరః యది సద్గుణసమ్పన్నః తర్హి సర్వైః ఆద్రియతే। (అస్యైవ వాక్యస్య సమర్థనాయ ఉదాహరణం దీయతే।) ఉత్తమకోటిధనుః అపి యది జ్యారహితం, తర్హి న కిమపి లక్ష్యం భేత్తుం ఉపయుజ్యతే। (జ్యా ఇత్యస్య గుణ ఇతి పర్యాయశబ్దః। అతః శ్లేషః పురుషేఽపి అనువర్తతే। శ్రేష్ఠవంశే జాతోఽపి సన్ పురుషః గుణహీనః అర్థరహితః భవతి) ॥౦.౨౩॥
🌿
హిన్ద్యర్థః--
గుణీ మనుష్య చాహే కిసీ కుల మేం ఉత్పన్న హో, సర్వత్ర పూజిత హీ హోతా హై, పరన్తు యది అచ్ఛే కుల మేం ఉత్పన్న హోకర భీ మనుష్య నిర్గుణ హో, తో వహ క్యా కర సకతా హై, కిస కామ కా హై? జైసే ధనుష అచ్ఛే బాఁస కా బనా హోనే పర భీ యది ఉస మేం గుణ (తాత యా డోరో) న హో తో వహ క్యా కామ కర సకతా హై? కుఛ భీ నహీం । యహాఁ వంశ శబ్ద కే దో అర్థ హైం, బాంస ఔర కుల ॥౦.౨౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య కస్య = (గొప్పవాడైన లేక నీచుడైన)ఎవనికో ఒకనికి ; ప్రసూతః అపి= పుట్టిన వాడైనప్పటికిని ; నరః = మనుష్యుడు ; గుణవాన్ = సద్గుణసమ్పన్నుడైనవాడు (మాత్రమే) ; పూజ్యతే = పూజింపబడుతాడు ; (హి = ఎట్లనగా) వంశ-విశుద్ధః అపి = శ్రేష్ఠమైన వెదురుచే నిర్మితమైనను ; ధనుః = బాణము ; నిర్గుణః = అల్లెత్రాడు లేనిదైనచో ; కిం కరిష్యతి = ఏమి చేయగలదు (ఏమి ఉపయోగము) అని అర్థము. ॥౦.౨౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
గొప్పవాడైన వానికి గాని లేక నీచుడైన వానికి గాని, ఇలా ఎవనికో ఒకనికి పుట్టిన మనుష్యుడైనను ,అతడు సద్గుణసమ్పన్నుడైనవాడు ఐతే మాత్రమే ఈ లోకులచే పూజింపబడుతాడు. ఎట్లనగా , శ్రేష్ఠమైన వెదురుచే నిర్మితమైనను, అల్లెత్రాడు లేనిదైనచో అట్టి బాణము వలన ఏమి ఉపయోగము. ఎవరు అలాంటి ధనుస్సును ఆదరిస్తారు ? అలా గుణరహితమైతే శ్రేష్ఠమైన కులమందు పుట్టినను, పూర్తిగా ప్రయోజనశూన్యమని భావము. ॥౦.౨౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.22

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.22🌺
🌷
మూలమ్--
అనభ్యాసే విషం విద్యా అజీర్ణే భోజనం విషమ్ ।
విషం సభా దరిద్రస్య వృద్ధస్య తరుణీ విషమ్ ॥౦.౨౨॥

🌺
పదవిభాగః--
అనభ్యాసే విషం విద్యా అజీర్ణే భోజనం విషమ్ । విషం సభా దరిద్రస్య వృద్ధస్య తరుణీ విషమ్ ॥౦.౨౨॥
🌸
అన్వయః--
అనభ్యాసే (సతి) విద్యా విషమ్ (ఇవ) । అజీర్ణే భోజనం విషమ్ । దరిద్రస్య సభా విషమ్ । వృద్ధస్య తరుణీ విషమ్ ॥౦.౨౨॥
🌼
ప్రతిపదార్థః--
అనభ్యాసే (సతి) = పునఃపునరనుశీలనాభావే, పౌనఃపున్యేన కరణాభావే ; విద్యా = జ్ఞానం ; విషం = అపమానస్థానత్వాత్ విషవద్ దుఃఖప్రదా ; అజీర్ణే = కుక్షౌ అపక్వే ఆహారే (సతి) ; భోజనం = అన్నం ; విషమ్ = జీవితాపహారకత్వాత్ విషవద్ దుఃఖప్రదమ్ ; దరిద్రస్య = ధనహీనస్య, నిర్ధనస్య ; సభా = సదః, పరిషద్ ; విషం = సన్తాపజనకత్వాత్ విషవద్ దుఃఖప్రదా ; వృద్ధస్య = విగతయౌవనస్య ; తరుణీ = యువా స్త్రీ ; విషమ్ = అయోగ్యత్వాత్ విషవద్ దుఃఖప్రదా ; ॥౦.౨౨॥
🌻
తాత్పర్యమ్--
అభ్యాసాభావే విద్యా హానికరీ భవతి । (ఆవృత్త్యభావే నరః అధిగతవిద్యోఽపి సన్ ఆవశ్యకతాయాం సత్యాం తాం నోపయోక్తుం పారయేత్ । అతః తస్య విద్యావత్త్వమేవ శఙ్క్యతే జనైః ।) (ఉదరే జీర్ణమభూత్వా యదాన్నం యథాతథం తిష్ఠేత్, తదా అస్వాస్థ్యం జనయతి । అతః) అపాకే ఖాద్యం విషం భవతి । (ధనాభావే ఉత్తమవస్త్రాదీనాం రాహిత్యాత్ జనసమూహేషు అపమానమనుభవేదితి) అకిఞ్చనస్య సదః విషతుల్యం భవతి । (తరుణ్యా సహ సమ్పర్కః యౌవనే సుఖ-సన్తానాదికారకం భవతి । తదనావశ్యకత్వాత్ శరీరశైథిల్యాచ్చ) వయోఽధికస్య స్త్రీసమ్పర్కః విషం (అనారోగ్యకరః) భవతి ॥౦.౨౨॥
🌿
హిన్ద్యర్థః--
వినా అభ్యాస కే విద్యా భీ విష హై, అజీర్ణ హోనే పర భోజన భీ విష హై దరిద్ర మనుష్య కేలిఏ సభీ సంసార హీ విష తుల్య హై ఔర వృద్ధ పురుష కే లిఏ ఉసకీ యువతీ స్త్రీ భీ విష కే సమాన హీ హై ॥౦.౨౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అనభ్యాసే = అభ్యాసమందు లేని (మననయోగ్యము కాని); విద్యా = విద్య (జ్ఞానము) ; విషం = విషము ( హానికరము); అజీర్ణే = అరగని దశయందు ; భోజనం = తినే పదార్థము (భుజించడము); విషమ్ = విషము (ప్రాణహరము); దరిద్రస్య = (జ్ఞాన) ధనహీనునికి; సభా = (వేడుక)వేదిక; విషం = విషము (దుఃఖకారకము) ; (ఏవమేవ = ఇదే విధముగా),వృద్ధస్య = ముసలివానికి (వయసుడిగిన వానికి) ; తరుణీ = యౌవ్వనవతియైన స్త్రీ ; విషమ్ = విషము (నిష్ప్రయోజనము) అని అర్థము. ॥౦.౨౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అభ్యాసమందు లేని అనగా మననయోగ్యము కాని విద్య మరియు జ్ఞానము విషంతో సమానము మరియు హానికరము. తింటే అరగని దశయందు భుజించడం విషము మరియు ప్రాణహరము. జ్ఞాన - ధనహీనునికి వేడుకలు,వేదికలు విషము మరియు దుఃఖకారకము. అదే విధముగా వయసుడిగిన ముసలివానికి యౌవ్వనవతియైన తరుణి విషము అనగా వ్యర్థము మరియు నిష్ప్రయోజనము అని భావము. ॥౦.౨౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.21

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.21🌺
🌷
మూలమ్--
ఋణకర్తా పితా శత్రుర్మాతా చ వ్యభిచారిణీ ।
భార్యా రూపవతీ శత్రుః పుత్రః శత్రురపణ్డితః ॥౦.౨౧॥

🌺
పదవిభాగః--
ఋణ-కర్తా పితా శత్రుః మాతా చ వ్యభిచారిణీ । భార్యా రూపవతీ శత్రుః పుత్రః శత్రుః అపణ్డితః ॥౦.౨౧॥
🌸
అన్వయః--
పితా ఋణ-కర్తా శత్రుః। మాతా చ వ్యభిచారిణీ (శత్రుః) । భార్యా రూపవతీ శత్రుః । పుత్రః అపణ్డితః శత్రుః ॥౦.౨౧॥
🌼
ప్రతిపదార్థః--
పితా = జనకః ; ఋణ-కర్తా = యః పునః పునః అన్యేభ్యః ఋణం స్వీకృత్య జీవతి ; శత్రుః = అయశోహేతుత్వాత్ శత్రురివ ; మాతా = జననీ ; వ్యభిచారిణీ = పరపురుషరతా ; భార్యా = పత్నీ ; రూపవతీ = సున్దరీ ; శత్రుః = వివాద-ఈర్ష్యాది-హేతుత్వాత్ శత్రురివ ; పుత్రః = సుతః ; అపణ్డితః = మూర్ఖః ; శత్రుః = మనస్తాపహేతుత్వాత్ శత్రురివ ; ॥౦.౨౧॥
🌻
తాత్పర్యమ్--
యస్య పితా ఋణం కరోతి, సః పుత్రస్య శత్రురివ భవతి (తస్య పుత్రేణైవ తదృణ-ప్రత్యర్పణధుర్యాః భారవహనత్వాత్) । మాతా చ నైకపతివ్రతా (సమాజే జ్ఞాతిషు చాకీర్తికరత్వాత్) శత్రుః భవతి। సున్దరీ పత్నీ తు (సర్వజనైః ఆకృష్టా, దృశ్యా చ భూత్వా, పత్యుర్మనసి ఈర్ష్యాదిదుర్భావాన్ జనయతీతి కారణేన) శత్రుర్భవతి। పుత్రస్తు విద్యాహీనః, మూర్ఖశ్చ (కులస్యోద్గమే అయోగ్యః సన్) శత్రుః భవతి ॥౦.౨౧॥
🌿
హిన్ద్యర్థః--
ఋణ కరనే వాలా పితా శత్రుతుల్య హై, వ్యభిచారిణీ మాతా శత్రుతుల్య హై, రూపవతీ స్త్రీ భీ శత్రుతుల్య హై ఔర మూర్ఖ పుత్ర భీ శత్రుతుల్య హై ॥౦.౨౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఋణ-కర్తా = అప్పు చేయవాడు (ఐన);పితా = తండ్రి; శత్రుః = శత్రువు; వ్యభిచారిణీ = ఇంటిని వదిలి తిరిగునది (ఐన);మాతా చ = ( పరపురుషేచ్ఛ కలిగిన) తల్లియును; శత్రుః = శత్రువు; రూపవతీ = అందమైనది (ఐన) భార్యా = భార్య; శత్రుః = శత్రువు; అపణ్డితః = పండితుడు కానివాడు (ఐన); పుత్రః = కుమారుడు; శత్రుః = శత్రువు. ॥౦.౨౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అప్పులు చేయవాడు ఐన తండ్రి శత్రువు, వ్యభిచారిణి ఐన అనగా ఇంటిని వదిలి తిరిగునది ఐన,మరియు పరపురుషేచ్ఛ కలిగిన తల్లియును శత్రువు, అందమైనది ఐన భార్యయును శత్రువు, పండితుడు కానివాడు ఐన కుమారుడు కూడా శత్రువు అని అర్థము. ॥౦.౨౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.20

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.20🌺
🌷
మూలమ్--
కో ధన్యో బహుభిః పుత్రైః కుశూలాపూరణాఢకైః ।
వరమేకః కులాలమ్బీ యత్ర విశ్రూయతే పితా ॥౦.౨౦॥
🌺
పదవిభాగః--
కః ధన్యః బహుభిః పుత్రైః కుశూల-ఆపూరణ-ఆఢకైః । వరమ్ ఏకః కుల-ఆలమ్బీ యత్ర విశ్రూయతే పితా ॥౦.౨౦॥
🌸
అన్వయః--
కుశూల-ఆపూరణ-ఆఢకైః కః ధన్యః బహుభిః పుత్రైః ఏకః కుల-ఆలమ్బీ వరమ్ । యత్ర పితా విశ్రూయతే ॥౦.౨౦॥
🌼
ప్రతిపదార్థః--
కుశూల-ఆపూరణ-ఆఢకైః = ధాన్య-కోష్ఠక-పూరణ-అసమర్థైః ఆఢకపాత్రైః ఇవ [కుశూలం- = ధాన్యావపనమ్- ఆఢకమ్- = ఆఢకపరిమితమ్ ధాన్యపాత్రమ్ (అఢాఈ సేర కా) ]; = స్వల్పాశయైః తుచ్ఛైః ; బహుభిః పుత్రైరపి ; కః ధన్యః = కః పుణ్యవాన్ ; ఏకః కుల-ఆలమ్బీ = యేన కుల ఆలమ్బ్యతే ; వరమ్ = శ్రేష్ఠః ; యత్ర = యస్మిన్ పుత్రే జాతే ; పితా = జనకః ; విశ్రూయతే = లోకే మహీయతే ; ॥౦.౨౦॥
🌻
తాత్పర్యమ్--
కః పుమాన్ అల్పాశయైః పుత్రైః సుకృతీ ఇతి లోకే విశ్రూయతే? యః పుత్రః కులం ధరతి, యస్య జాతేన కులస్య ఆలమ్బనం భవతి, స ఏవ పుత్రత్వార్హః ; తేనైవ పితా జగతి కీర్తిం విన్దతి।
(అథవా అన్యే తు– ఖరీవాహాదిపరిమితైః, ఆఢకపరిమితైః చ పుత్రస్థానీయధాన్యాదిభిః కః ధనీ ఇతి గణ్యతే? కుశూలాదిమితేనాపి ధాన్యరాశినా న కోపి ధన్యతాం లభతే। ఏకేన కులదీపకేన- రత్నాదినా, కౌస్తుభమణినా సాగర ఇవ- పితా ధనీ శ్రేష్ఠశ్చ భవతి– ఇత్యర్థమాహుః) ॥౦.౨౦॥
🌿
హిన్ద్యర్థః--
అన్న కీ కోటీ (ఓవరీ, కోఠలా) కో భరనే మేం అసమర్థ ఆఢకపాత్రోం (అఢైయా, పసేరీ ఆది నాప కే పాత్రోం) కే సమాన బహుత సే పుత్రోం సే క్యా లాభ హై, వంశ కీ సహాయతా కరనేవాలా తో ఏక హీ పుత్ర అచ్ఛా హై, జిససే పితా కీ ప్రసిద్ధి ఔర ప్రశంసా హోతీ హో ॥౦.౨౦ ॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
కుశూల-ఆపూరణ-ఆఢకైః = ధాన్యాన్ని కొలిచే పాత్రలతో; (సమానమైన), బహుభిః పుత్రైః = చాలామంది కొడుకులచేత; కః పితా = ఏ తండ్రి; ధన్యః = కృతార్థుడు; (భవతి = అగుచున్నాడు) కుల-ఆలమ్బీ = వంశాధారభూతుడు (ఐన); ఏకః = ఒక్కడు (ఐన); వరమ్ = శ్రేష్ఠము; యత్ర = ఏ (కొడుకు)విషయమందు; పితా = తండ్రి ; విశ్రూయతే = లోకులచే కీర్తింపబడుచున్నాడు. అని అర్థము. ॥౦.౨౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
స్వల్పప్రయోజనములు గల, ధాన్యాన్ని కొలిచే పాత్రలతో సమానమైన, కొడుకులచేత, ఏ తండ్రి కృతార్థుడు కాగలడు.
వంశోన్నతికి ఆధారభూతుడైన ఒక్క కొడుకైనను ఎంతో శ్రేష్ఠము. ఎందుకనగా ఆ కొడుకుయొక్క గొప్పతనంచేత ఆతని తండ్రి ఆ వంశము కూడా లోకులచేత కీర్తింపబడుతాయి అని భావము. ॥౦.౨౦॥
🙏

Thursday, August 1, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.19

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.19🌺
🌷
మూలమ్--
అర్థాగమో నిత్యమరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ ।
వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా షడ్ జీవలోకస్య సుఖాని రాజన్ ॥౦.౧౯॥
🌺
పదవిభాగః--
అర్థ-ఆగమః నిత్యమ్ అరోగితా చ ప్రియా చ భార్యా ప్రియ-వాదినీ చ । వశ్యః చ పుత్రః అర్థకరీ చ విద్యా షడ్ జీవ-లోకస్య సుఖాని రాజన్ ॥౦.౧౯॥
🌸
అన్వయః--
రాజన్, ౧) నిత్యమ్ అర్థ-ఆగమః, ౨) అరోగితా చ, ౩) ప్రియ-వాదినీ (భార్యా), ౪) ప్రియా చ భార్యా, ౫) వశ్యః చ పుత్రః, ౬) అర్థకరీ విద్యా (ఏతాని) షడ్ జీవ-లోకస్య సుఖాని చ ॥౦.౧౯॥
🌼
ప్రతిపదార్థః--
రాజన్ = హే యుధిష్ఠిర, నిత్యం = (అత్ర) నిర్బాధః ; అర్థ-ఆగమః = ధనప్రాప్తిః ; అరోగితా చ = శరీరసౌఖ్యం, స్వాస్థ్యమ్ ; ప్రియ-వాదినీ = మధురభాషిణీ ; ప్రియా =హృద్యా ; భార్యా = పత్నీ ; వశ్యః = అనుకూలః ; పుత్రః ; అర్థకరీ = ధనకరీ ; విద్యా ; ఏతాని షట్ జీవ-లోకస్య = మానవలోకస్య ; సుఖాని = సుఖకారకాణి ॥౦.౧౯॥
🌻
తాత్పర్యమ్--
హే రాజన్, నిరాఘాత-ధనప్రాప్తిః, శరీరస్వాస్థ్యం, మధురం వదన్తీ, ప్రియతమా చ పత్నీ, ఆజ్ఞాకారీ పుత్రః, ధనప్రాపయిత్రీ విద్యా చ– ఏతాని షట్ మానవలోకే సుఖకరాణి ఇతి మన్యన్తే ॥౦.౧౯॥
🌿
హిన్ద్యర్థః--
హే రాజన్! సంసార మేం కేవల ఛే హీ సుఖ హైం- ౧. నిత్య ధనప్రాప్తి, ౨. ఆరోగ్యతా, ౩. ప్రియతమా భార్యా, ౪. మధుర బోలనే వాలీ స్త్రీ, ౫. ఆజ్ఞాకారీ పుత్ర, తథా ౬. ధన దేనేవాలీ విద్యా ॥౦.౧౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
రాజన్ = ఓ రాజా!, నిత్యం = నిరంతరము; అర్థ-ఆగమః = ధనం రావడం; అరోగితా చ = రోగం లేకుండా ఉండడము; ప్రియ-వాదినీ = ఇష్టమయ్యేట్లుగా మాట్లాడునది; చ = మరియు; ప్రియా చ = ఇష్టమైనది (ఐన); భార్యా = భార్య; వశ్యః = అనుకూలుడు (ఐన); పుత్రః = కుమారుడు; అర్థకరీ = ధనాన్నిచ్చునది (ఐన); విద్యా = చదువు; ఏతాని షట్ = ఈ ఆరు; జీవ-లోకస్య = ప్రాణిప్రపంచంలో; సుఖాని = సుఖకారకములు. ॥౦.౧౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ రాజా! నిరంతరం ధనం రావడం, రోగం లేకుండా ఉండడము, ఇష్టమయ్యేట్లుగా మాట్లాడునదైన మరియు ఇష్టమైనదైన భార్య, అనుకూలుడైన కుమారుడు, ధనాన్నిచ్చే చదువు, ఈ ఆరుకూడా ఈ ప్రపంచంలో సుఖకారకములు అని భావము. ॥౦.౧౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.18

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.18🌺
🌷
మూలమ్--
పుణ్యతీర్థే కృతం యేన తపః క్వాప్యతిదుష్కరమ్ ।
తస్య పుత్రో భవేద్ వశ్యః సమృద్ధో ధార్మికః సుధీః ॥౦.౧౮॥
🌺
పదవిభాగః--
పుణ్య-తీర్థే కృతం యేన తపః క్వ-అపి అతి-దుష్కరమ్ । తస్య పుత్రః భవేద్ వశ్యః సమృద్ధః ధార్మికః సుధీః ॥౦.౧౮॥
🌸
అన్వయః--
యేన క్వాపి పుణ్య-తీర్థే అతి-దుష్కరం తపః కృతం, తస్య పుత్రః వశ్యః, సమృద్ధః, ధార్మికః, సుధీః చ భవేత్ ॥౦.౧౮॥
🌼
ప్రతిపదార్థః--
యేన క్వాపి పుణ్య-తీర్థే = మహాక్షేత్రే ; కృతం ; అతి-దుష్కరం = కఠినం ; తపః ; తస్య = (పుణ్యాత్మనః) ; పుత్రః ; వశ్యః = వశంవదః ; సమృద్ధః = గుణగణ-అలఙ్కృకృతః, ధనీ చ ; ధార్మికః = ధర్మాత్మా ; సుధీః = విద్వాన్, వినీతశ్చ ; భవేత్ = స్యాత్ ॥౦.౧౮॥
🌻
తాత్పర్యమ్--
యేన పిత్రా కుత్రచిత్ మహాపుణ్యస్థలే అతికఠినం తపః ఆచరితం, తస్య ఏవ నియతః, సమ్పన్నః, ధర్మానుష్ఠానపరః, ధీశాలీ చ పుత్రో భవేత్। (అతిమహతస్తపసః ఫలమేతద్యత్పుత్రో విద్వాన్ వినీతశ్చ భవతీతి భావః।) ॥౦.౧౮॥
🌿
హిన్ద్యర్థః--
జిస మనుష్య నే కిసీ పుణ్యతీర్థం మేం కఠిన తపస్యా కీ హై, ఉసీకా పుత్ర ఆజ్ఞాకారీ, సమృద్ధ, ధార్మిక తథా విద్వాన్ హోతా హై ॥౦.౧౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యేన = ఏ వ్వక్తిచేత; క్వాపి = ఏదో ఒక; పుణ్య-తీర్థే = పవిత్రమైన పుణ్య క్షేత్రమునందు; అతి-దుష్కరం = అతికఠినమైన; తపః = తపస్సు; కృతం = చేయబడిందో; తస్య = (అలా తపమాచరించిన) అతనికి; వశ్యః = అధీనుడు (అర్థం చేసుకునే యోగ్యత గలవాడు); సమృద్ధః = గుణగణసమృద్ధుడు; ధార్మికః = ధర్మాచరణశీలుడు; చ= మరియు; సుధీః = విద్వాంసుడు; (ఐన) పుత్రః = కుమారుడు; భవేత్ = (పుడుతాడు) అవుతాడు. ॥౦.౧౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ వ్వక్తిచేతనైతే ఏదో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రమునందు అతికఠినమైన తపస్సు చేయబడిందో, అలా తపమాచరించిన వానికి మాత్రమే... అధీనుడైన అనగా అర్థం చేసుకునే యోగ్యత గల, గుణగణసమృద్ధుడైన, ధర్మాచరణశీలుడైన మరియు విద్వాంసుడైన పుత్రుడు జన్మిస్తాడు అని భావము. ॥౦.౧౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.17

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.17🌺
🌷
మూలమ్--
వరమేకో గుణీ పుత్రో న చ మూర్ఖశతాన్యపి ।
ఏకశ్చన్ద్రస్తమో హన్తి న చ తారాగణోఽపి చ ॥౦.౧౭॥

🌺
పదవిభాగః--
వరమ్ ఏకః గుణీ పుత్రః న చ మూర్ఖ-శతాని అపి । ఏకః చన్ద్రః తమః హన్తి న చ తారా-గణః అపి చ ॥౦.౧౭॥
🌸
అన్వయః--
ఏకః అపి గుణీ పుత్రః వరమ్। (కిన్తు) మూర్ఖ-శతాని న చ। ఏకః చన్ద్రః తమః హన్తి। తారా-గణః అపి న చ ॥౦.౧౭॥
🌼
ప్రతిపదార్థః--
ఏకః అపి ; గుణీ = సుగుణసంయుక్తః ; పుత్రః = సుతః ; వరమ్ = శ్రేష్ఠః ; (కిన్తు) న చ ; మూర్ఖ-శతాని = జడ-మన్దపుత్రాణాం శతమపి ; ఏకః చన్ద్రః ; తమః = అన్ధకారం ; హన్తి = నాశయతి ; న చ తారా-గణః అపి చ = నక్షత్రకోటీరపి ॥౦.౧౭॥
🌻
తాత్పర్యమ్--
గుణవతా పుత్రేణ ఏకేనాపి అలమ్। యది ఏకశతం పుత్రాః అపి మన్దబుద్ధయః భవన్తు, తేన న కోఽపి లాభః। యథా– రాత్రౌ చన్ద్రః ఏక ఏవ అన్ధకారం అపనేతుం సమర్థః। అసఙ్ఖ్యకాని నక్షత్రాణి మిలిత్వా అపి కాన్తిం న కుర్వన్తి ॥౦.౧౭॥
🌿
హిన్ద్యర్థః--
సౌ మూర్ఖ పుత్రోం కీ అపేక్షా ఏక హీ పుత్ర గుణీ హో తో భీ అచ్ఛా హై। బహుత సే తారాగణోం సే అన్ధకార దూర నహీం హోతా హై, పర చన్ద్రమా అకేలా హీ ఉసే దూర కర దేతా హై ॥౦.౧౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గుణీ = గుణవంతుడైన; పుత్రః = కొడుకు; ఏకః అపి = ఒక్కడైనను; వరమ్ = శ్రేష్ఠము; (కిన్తు = కాని) మూర్ఖ-శతాని = మూర్ఖులైన వంద మంది; (కొడుకులు). న చ (వరమ్ = ఉపయోగమైన వారు) కాలేరు; (యథా = ఎట్లనగా) ఏకః అపి = ఒక్కడైనను; చన్ద్రః = చంద్రుడు; తమః = అన్ధకారమును; హన్తి = నశింపచేయుచున్నాడు; తారా-గణః = నక్షత్రసమూహము; న చ = కాదు; (అన్ధకారమును నశింపచేయజాలదు) ॥౦.౧౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
గుణవంతుడైన కొడుకు ఒక్కడైనను ఉపయోగమే. కాని మూర్ఖులైన వంద మంది కొడుకులతో ఉపయోగమేముంటుంది. ఎట్లనగా చంద్రుడు ఒక్కడైనను అన్ధకారమును నశింపచేయుచున్నాడు. కోట్లకొలది నక్షత్రసమూహమున్నను, అన్ధకారమును నశింపచేయజాలదుకదా ! అని భావము ॥౦.౧౭॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.16

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.16🌺
🌷
మూలమ్--
దానే తపసి శౌర్యే చ యస్య న ప్రథితం యశః ।
విద్యాయామర్థలాభే చ మాతురుచ్చార ఏవ సః ॥౦.౧౬॥

🌺
పదవిభాగః--
దానే తపసి శౌర్యే చ యస్య న ప్రథితం యశః । విద్యాయామ్ అర్థలాభే చ మాతుః ఉచ్చారః ఏవ సః ॥౦.౧౬॥
🌸
అన్వయః--
దానే తపసి శౌర్యే చ విద్యాయామ్ అర్థలాభే చ యస్య యశః న ప్రథితం, సః మాతుః ఉచ్చారః ఏవ ॥౦.౧౬॥
🌼
ప్రతిపదార్థః--
దానే = ధనాదివితరణే ; తపసి = ధర్మాచరణాదౌ ; శౌర్యే = వీరత్వే ; విద్యాయామ్ = జ్ఞానే ; అర్థలాభే = ధనోపార్జనే ; యస్య = పుంసః ; యశః = కీర్తిః ; న ప్రథితం = న ప్రసృతమ్ ; సః ; మాతుః = జనన్యాః ; ఉచ్చారః = విష్టా, మలం ; ఏవ = మాత్రమ్ ॥౦.౧౬॥
🌻
తాత్పర్యమ్--
ధనాదివితరణే, ధర్మాచరణాదౌ, వీరత్వే, జ్ఞానే, ధనోపార్జనే యస్య పుంసః కీర్తిః న ప్రసృతమ్, సః జనన్యాః విష్ఠామాత్రమ్ । నాసౌ పుత్రః కేషామపి ఉపయోగాయ భవతి। తస్య జన్మ వృథా భవతీతి అభిప్రాయః ॥౦.౧౬॥
🌿
హిన్ద్యర్థః--
జిస మనుష్య కా మన-దాన, తపస్యా, వీరతా, విద్యా తథా ధనోపార్జన మే న లగా, వహ మనుష్య కేవల మాతా కే మల కే సమాన హై ॥౦.౧౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య = ఏ పురుషుని యొక్క; మనః = మనస్సు; దానే=ధనాది వితరణమునందు; తపసి =ధర్మాచరణమునందు; శౌర్యే = పరాక్రమమునందు; విద్యాయామ్ = శాస్త్రజ్ఞానమునందు; అర్థలాభే = ధనోపార్జనయందు; నప్రథితం=ప్రవర్తిల్లునది కాదో; సః = అతడు (అలాంటి వాడు); మాతుః = తల్లియొక్క; ఉచ్చారః ఏవ = మలమే (మలంతో సమానము) ॥౦.౧౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ పురుషుని యొక్క మనస్సు, ధనాది వితరణ కార్యక్రమముల యందు, ధర్మాచరణముల యందు, అనుకున్న దానిని సాధించగలిగే పరాక్రమమునందు , శాస్త్రజ్ఞానమునందు మరియు ధనోపార్జననందు ప్రవర్తిల్లేది కాదో, అలాంటి వ్యక్తి తల్లియొక్క మలముతో సమానము అనగా నిష్ప్రయోజకుడు అని భావము. ॥౦.౧౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.15

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.15🌺
🌷
మూలమ్--
గుణిగణగణనారమ్భే న పతతి కఠినీ సుసమ్భ్రమాద్ యస్య ।
తేనామ్బా యది సుతినీ వద వన్ధ్యా కీదృశీ భవతి ? ॥౦.౧౫॥

🌺
పదవిభాగః--
గుణి-గణ-గణనా ఆరమ్భే న పతతి కఠినీ సుసమ్భ్రమాద్ యస్య । తేన అమ్బా యది సుతినీ వద వన్ధ్యా కీదృశీ భవతి ? ॥౦.౧౫॥
🌸
అన్వయః--
గుణి-గణ-గణనా-ఆరమ్భే సుసమ్భ్రమాద్ యస్య కఠినీ న పతతి । తేన అమ్బా యది సుతినీ, వన్ధ్యా కీదృశీ భవతి, (ఇతి) వద ? ॥౦.౧౫॥
🌼
ప్రతిపదార్థః--
గుణి-గణ-గణనా-ఆరమ్భే ~ గుణినాం గణాః తేషాం గణనాయాః ఆరమ్భే = విదుషాం సఙ్ఘాః, తేషాం ప్రారమ్భావసరే ; సుసమ్భ్రమాద్ = సహసైవ ; యస్య = యస్య పుంసో నామని ; కఠినీ = లేఖనసాధనమ్ (=పేంసిల్) ; న పతతి = (అత్ర) లేఖాధారే కాష్ఠపట్టే, పత్రాదౌ వా తన్నామోల్లేఖార్థం న ఝటితి ప్రసరతి ; తేన అమ్బా = మాతా ; యది = యదా ; సుతినీ = పుత్రవతీ ; వన్ధ్యా = పుత్రహీనా, అపుత్రా స్త్రీ ; కీదృశీ = కా ; భవతి = భణ్యతే ; (ఇతి) వద = కథయ తావత్ ; ॥౦.౧౫॥
🌻
తాత్పర్యమ్--
విద్వత్సఙ్ఘానాం గణనాయాః ప్రారమ్భావసరే సహసైవ యస్య లేఖకస్య కఠినీ కస్యచిత్ పురుషస్య నామలేఖనాయ లేఖనపత్రే న పతతి, యది తత్పురుషస్య మాతా పుత్రవతీ ఇతి ఉచ్యతే, తర్హి కా వా స్త్రీ వన్ధ్యా ఇతి కథ్యేత?
గుణిసమవాయే యస్య పుంసః శోభనం యశో వర్తతే, స ఏవ, సుజన్మేతి హృదయమ్। సైవ తు ఖలు వన్ధ్యా ॥౦.౧౫॥
🌿
హిన్ద్యర్థః--
గుణియోం కీ గినతీ కే ఆరమ్భ మేం జిసకే నామ పర సబసే పహలే సహసా లోగోం కీ కలమ న ఉఠే, ఉస పురుష కే జన్మ సే భీ యది ఉసకీ మాతా పుత్ర-వతీ కహలావే, తో కహో వన్ధ్యా కిసే కహేంగే? [జిసే అపనే సద్గుణోం కే కారణ లోగ నహీం పహచానతే, ఐసే పుత్ర కా హోనా నా హోనే కే సమాన హై।] ॥౦.౧౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గుణి-గణ-గణనా- విద్వత్సమూహమును లెక్కించు(టకు) (ఉపక్రమించి)నప్పుడు; ఆరమ్భే = మొట్టమొదట;  యస్య = ఎవని(ఏ పుత్రుని)విషయంలో; కఠినీ = అక్షర లేఖనసాధనము; సుసమ్భ్రమాత్ = ఆశ్చర్యాదులవలన; న పతతి = పడుచు లేదో(వ్రాయుచు లేదో) ; తేన = అలాంటి వానిచేత; అమ్బా = తల్లి ; యది సుతినీ = పుత్రవతి ఐతే ; వన్ధ్యా = పుత్రహీనురాలైన స్త్రీ, ; కీదృశీ = ఎటువంటిదై ; భవతి = అగుచున్నది;  వద = చెప్పుమా ?. (ఇద్దరూ గొడ్రాల్లే అని భావము.) ॥౦.౧౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
వద్వత్సమూహమును లెక్కించుటకు ఉపక్రమించినప్పుడు, మొట్టమొదట ఏ పుత్రుని విషయంలో అక్షరలేఖనసాధనము అతిశయాశ్చర్యాదులవలన  వ్రాయుట లేదో ,అలాంటి కొడుకును కనడంచేత  తల్లి ఒకవేళ సంతానవతి ఐతే , పుత్రహీనురాలైన వంధ్యను ఏమని పిలువవలెనో చెప్పండి , అనగా ఇద్దరూ గొడ్రాల్లే అని భావము. ॥౦.౧౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.14

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.14🌺
🌷
మూలమ్--
స జాతో యేన జాతేన యాతి వంశః సమున్నతిమ్ ।
పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే ॥౦.౧౪॥

🌺
పదవిభాగః--
సః జాతః యేన జాతేన యాతి వంశః సమున్నతిమ్ । పరివర్తిని సంసారే మృతః కః వా న జాయతే ॥౦.౧౪॥
🌸
అన్వయః--
యేన జాతేన వంశః సమున్నతిం యాతి, సః (వస్తుతః) జాతః । పరివర్తిని సంసారే కః వా మృతః? (కః వా) న జాయతే? ॥౦.౧౪॥
🌼
ప్రతిపదార్థః--
యేన జాతేన = యస్య జన్మనా; వంశః = ఆత్మకులం; సమున్నతిం = ఖ్యాతిం, ఔన్నత్యం చ; యాతి = భజతే, ప్రాప్నోతి; సః; జాతః = సుజాతః; పరివర్తిని = పరివర్తనశీలే; సంసారే = అనాదౌ అస్మిన్ జగతి; కో వా న మృతః? కో వా న జాయతే? ॥౦.౧౪॥
🌻
తాత్పర్యమ్--
యస్య జన్మనా కులం (కుటుమ్బః) ఔన్నత్యం ప్రాప్నోతి, సః పుత్రః జాతః ఇతి వక్తుం శక్యతే। అన్యే జీవాః బహవో సంసారేఽస్మిన్ జీవన్తి, మ్రియన్తే చ।
[కోటిశో జీవాః అస్మిన్ జగతి ప్రత్యహముద్యన్తే, విలీయన్తే చ, స ఏవ తు సుజన్మా ధన్యజీవితో యస్య జన్మనా స్వకులం మహీయతే ఇత్యాశయః] ॥౦.౧౪॥
🌿
హిన్ద్యర్థః--
ఔర ఇస జగత్ మేం ఉసీ కా జన్మ లేనా సఫల హై, జిసకే జన్మ సే అపనే వంశ ఔర జాతి కీ ఉన్నతి హోతీ హై । అన్యథా (ఇస తరహ తో) ఇస పరివర్తనశీల సంసార మేం కౌన నహీం జీతా ఔర మరతా హై ॥౦.౧౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
జాతేన = పుట్టిన; యేన = ఏ (కొడుకు) చేత; వంశః = (అతనియొక్క) వంశము; సమున్నతిం = గొప్ప పేరును, ప్రఖ్యాతిని; యాతి = పొందుచున్నదో; సః = అతడు (మాత్రమే); జాతః = పుట్టినవాడు (సార్థకజన్ముడు); పరివర్తిని = మారుచున్నదైన దాని యందు; సంసారే = (ఈ) సంసారము యందు; మృతః = (పుట్టియు, ఏమీ సాధించక) చనిపోయే; కో వా = ఎవడైనను (అప్రయోజకుడు) న జాయతే?= పుట్టుచులేడు? (అట్టి జన్మ నిరర్థకమని సారాంశము) ॥౦.౧౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈ లోకంలో, పుట్టిన ఏ కొడుకు చేత , అతనియొక్క వంశము గొప్ప పేరు, ప్రఖ్యాతులను పొందుచున్నదో; అతడు మాత్రమే పుట్టినట్టు. అనగా సార్థకజన్ముడు. ఎందుకనగా... నిరంతర పరిణామశీలమైన ఈ సంసారము యందు పుట్టియు, ఏమీ సాధించక చనిపోయే ఎవడైనను మరణించే అప్రయోజకుడు పుట్టినను ఉపయోగమేమి? అట్టి జన్మ నిరర్థకమని సారాంశము. ॥౦.౧౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.13

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.13🌺
🌷
మూలమ్--
అజాతమృతమూర్ఖాణాం వరమాద్యౌ న చాన్తిమః ।
సకృద్దుఃఖకరావాద్యావన్తిమస్తు పదే పదే ॥౦.౧౩॥
🌺
పదవిభాగః--
అజాత-మృత-మూర్ఖాణాం వరమ్ ఆద్యౌ న చ అన్తిమః । సకృద్-దుఃఖ-కరౌ ఆద్యౌ అన్తిమః తు పదే పదే ॥౦.౧౩॥
🌸
అన్వయః--
అజాత-మృత-మూర్ఖాణాం (ఇతి త్రివిధానాం పుత్రాణాం మధ్యే) వరమ్ ఆద్యౌ (ద్వౌ) న చ అన్తిమః (మూర్ఖః)। సకృద్ దుఃఖ-కరౌ ఆద్యౌ అన్తిమః తు పదే పదే (దుఃఖ-కరః) ॥౦.౧౩॥
🌼
ప్రతిపదార్థః--
అజాతః = అనుత్పన్నః; మృతః = ఉత్పన్నోఽపి విగతప్రాణః; మూర్ఖః = మూఢః, జడః; వరమ్ = శ్రేష్ఠౌ; ఆద్యౌ = అజాత-మృతౌ; న చ అన్తిమః = న మూర్ఖః; సకృద్-దుఃఖ-కరౌ = ఏకవారమేవ దుఃఖం దత్తః; ఆద్యౌ = అజాత-మృతౌ; అన్తిమః = మూర్ఖః; తు పదే పదే = సర్వదా, యావజ్జీవమ్ ॥౦.౧౩॥
🌻
తాత్పర్యమ్--
అనుత్పన్నపుత్రః మృతపుత్రః వా ఏకవారమేవ దుఃఖం దదాతి। మూర్ఖపుత్రస్తు ఆజన్మమరణం దుఃఖయతి। అతః అనుత్పన్న-మృత-పుత్రౌ మూర్ఖపుత్రాత్ వరమ్ ॥౦.౧౩॥
🌿
హిన్ద్యర్థః--
జో ఉత్పన్న హీ నహీం హుఆ హై (అజాత), అథవా ఉత్పన్న హోకర మర గయా హై (మృత), ఔర మూర్ఖ - ఇన తీనోం మేం సే పహలే దో తో కుఛ అచ్ఛే హైం, పరన్తు అన్తిమ (మూర్ఖ) పుత్ర తో కభీ అచ్ఛా నహీం హై, క్యోం కి ప్రథమ దో పుత్ర తో ఏకహీ బార దుఃఖ దేతే హైం, పరన్తు అన్తిమ (మూర్ఖ) తో సదా దుఃఖదాఈ హోతా హై ॥౦.౧౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అజాత-మృత-మూర్ఖాణాం - అజాత = పుట్టని వాడు; మృత = పుట్టియు మరణించిన వాడు; మూర్ఖాణాం = (విచక్షణాజ్ఞానం లేనివాడు) మూర్ఖుడు, ఈ ముగ్గురిలో; ఆద్యౌ = (పుట్టని వాడు,మరియు పుట్టియు మరణించిన వాడు) మొదటి ఇద్దరు; వరమ్ = శ్రేష్ఠమైన వారు; అన్తిమః న చ = చివరి వాడు (మూర్ఖుడు) (శ్రేష్ఠుడు) కానే కాడు; (యతః = ఎందుకనగా) ఆద్యౌ = (పుట్టని వాడు,మరియు పుట్టియు మరణించిన వాడు) మొదటి ఇద్దరు; సకృద్-దుఃఖకరౌ, సకృద్ = ఒకసారి మాత్రమే; దుఃఖకరౌ = దుఃఖాన్ని కలిగిస్తారు; అన్తిమః తు = మూర్ఖుడైతే; పదే పదే = బ్రతికి యున్నంతవరకు (దుఃఖాన్ని కలిగిస్తాడు) ॥౦.౧౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
పుట్టనివాడు, పుట్టియు మరణించిన వాడు, విచక్షణాజ్ఞానం లేని మూర్ఖుడు, ఈ ముగ్గురిలో, పుట్టని వాడు మరియు పుట్టియు మరణించిన వాడు ఐన మొదటి ఇద్దరు శ్రేష్ఠమైన వారు. చివరి వాడైన మూర్ఖుడు మాత్రం శ్రేష్ఠుడు కానేరడు. ఎందుకనగా పుట్టని వాడు,మరియు పుట్టియు మరణించిన వాడు అనే మొదటి ఇద్దరు, ఒకసారి మాత్రమే దుఃఖాన్ని కలిగిస్తారు. ఇక మూర్ఖుడైతే తాను బ్రతికి యున్నంతవరకు దుఃఖాన్ని కలిగిస్తూనే ఉంటాడని భావము. ॥౦.౧౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.12

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.12🌺
🌷
మూలమ్--
కోఽర్థః పుత్రేణ జాతేన యో న విద్వాన్ న ధార్మికః ।
కాణేన చక్షుషా కిం వా చక్షుః పీడైవ కేవలమ్ ॥౦.౧౨॥

🌺
పదవిభాగః--
కః అర్థః పుత్రేణ జాతేన యః న విద్వాన్ న ధార్మికః । కాణేన చక్షుషా కిం వా చక్షుః పీడా ఏవ కేవలమ్ ॥౦.౧౨॥
🌸
అన్వయః--
యః (పుత్రః) విద్వాన్ న (భవతి) ధార్మికః న (వర్తతే) (తేన) పుత్రేణ జాతేన కః అర్థః (ప్రయోజనమ్) ? (అత్ర ఉదాహరణమ్-) కాణేన చక్షుషా కిం వా (ప్రయోజనమ్?) చక్షుః పీడా ఏవ కేవలం (భవతి) ॥౦.౧౨॥
🌼
ప్రతిపదార్థః--
యః = పుత్రః; న విద్వాన్ న ధార్మికః = ధర్మాచరణప్రవణః; (తేన) పుత్రేణ జాతేన = ఉత్పన్నేనాపి; కః అర్థః = కిం ప్రయోజనమ్?; కాణేన = దర్శనశక్తిశూన్యేన; ఏకచక్షుర్యుక్తః (కాణత్వఞ్చ చక్షురిన్ద్రియశూన్యైకగోలకవత్త్వమ్); చక్షుషా = నేత్రేణ; కిం వా = కిం ను ఫలం, న కిమపి ఫలం; చక్షుః-పీడా ఏవ = శారీరికవ్యథా; కేవలమ్ = మాత్రమ్; ॥౦.౧౨॥
🌻
తాత్పర్యమ్--
యః సుతః విద్వత్త్వం న ధారయతి, ధర్మం వా నాచరతి, సః సమ్భూయ అపి న కస్యాపి ప్రయోజనం కారయతి। అస్యోదాహరణమేవమ్– దర్శనశక్తిహీన-గోలరూపేణాక్ష్ణా వస్తుదర్శనం న శక్యతే। కేవలం తత్వ్యథాం కారయతి, న కస్యాప్యుపయోగాయ భవతి ॥౦.౧౨॥
🌿
హిన్ద్యర్థః--
ఉస పుత్ర కే ఉత్పన్న హోనే సే క్యా లాభ హై, జో న విద్వాన్ హై ఔర న ధార్మిక హీ । క్యోం కి కానీ ఆఁఖ సే కోఈ లాభ నహీం హోతా, వహ తో కేవల పీడా హీ దేనే కే లియే హోతీ హై ॥౦.౧౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(ఎలాంటి స్వభావ ముంటే పుత్రుడని అనబడుతాడో క్రమంగా వర్ణించ బోతున్నాడు)
యః = ఏ పుత్రుడైతే; న విద్వాన్ = (జ్ఞాని కాడో) విద్వాంసుడు కాడో; న ధార్మికః = (ధర్మాచరణహీనుడో) ధార్మికుడు కాడో; (తేన = అటువంటి స్వభావంతో) జాతేన = పుట్టిన; పుత్రేణ = కొడుకుతో; కః అర్థః = ఏమి ప్రయోజనము?; (యథా = ఎట్లనగా) కాణేన = చూడ లేని; (కాణత్వఞ్చ చక్షురిన్ద్రియశూన్యైకగోలకవత్త్వమ్); చక్షుషా = కన్నుతో; కిం వా = ఏమీ? (ఏమైనా ప్రయోజనమా?) (న కిమపి ఫలం = ఏలాంటి ఉపయోగ ముండదు సరి కదా) కేవలం చక్షుః = కేవలము ఆ కన్ను వలన; (కలుగునది) పీడా ఏవ = శారీరిక బాధయే. ॥౦.౧౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎలాంటి స్వభావ ముంటే పుత్రుడని అనబడుతాడో క్రమంగా వర్ణించ బోతున్నాడు....
ఏ పుత్రుడైతే విద్వాంసుడు కాడో, ధార్మికుడు కాడో,అనగా ధర్మాచరణహీనుడో, అటువంటి స్వభావంతో పుట్టిన కొడుకుతో ఏమి ప్రయోజనము? నిష్ప్రయోజనమే. ఎట్లనగా... చూడలేని కన్నుతో ఏమైనా ప్రయోజనముంటుందా? ఏలాంటి ఉపయోగముండక పోగా, ఆ కన్ను వలన లభించేది కేవలం శారీరిక బాధయే కదా అని భావము. ॥౦.౧౨॥
🙏
a

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.11

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.11🌺
🌷
మూలమ్--
యౌవనం ధనసమ్పత్తిః ప్రభుత్వమవివేకితా ।
ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్ ॥౦.౧౧॥
🌺
పదవిభాగః--
యౌవనం ధన-సమ్పత్తిః ప్రభుత్వమ్ అవివేకితా । ఏకైకమ్ అపి అనర్థాయ కిము యత్ర చతుష్టయమ్ ॥౦.౧౧॥
🌸
అన్వయః--
యౌవనం, ధన-సమ్పత్తిః, ప్రభుత్వమ్, అవివేకితా - (అత్ర) ఏకైకమ్ అపి (పుంసామ్) అనర్థాయ (భవతి)। యత్ర చతుష్టయమ్ (తత్ర) కిము (అనర్థస్య విషయే వక్తవ్యమ్?) ॥౦.౧౧॥
🌼
ప్రతిపదార్థః--
యౌవనం = యువావస్థా; ధన-సమ్పత్తిః = విత్తసమృద్ధిః; ప్రభుత్వమ్ = ఐశ్వర్యమ్, అధికారః; అవివేకితా = విచార-వైకల్యమ్, మూఢతా; ఏకైకమ్ అపి (పుంసాం); అనర్థాయ = విపత్కారకం భవతి; యత్ర = యస్మిన్ పుంసి; చతుష్టయమ్ (తత్ర); కిము = కిం వా వక్తవ్యమ్; ॥౦.౧౧॥
🌻
తాత్పర్యమ్--
యువావస్థా, విత్తసమృద్ధిః, అధికారస్థానం, అవివేకః- ఇత్యేతేషు గుణస్థితిషు ప్రత్యేకం (అన్యజనేభ్యః) ఆపత్కరం భవతి। యది కస్మింశ్చిత్ పురుషే సర్వాణి మిలిత్వా విద్యన్తే, తర్హి అనర్థకత్వస్య కిం విశేషతయా వక్తవ్యం భవతి? తదవశ్యమేవ ఆపత్స్థానం భవతి ॥౦.౧౧॥
🌿
హిన్ద్యర్థః--
యువావస్థా, ధనసమ్పత్తి, ప్రభుత్వ, అజ్ఞానతా- ఇన చారోం మేం ఏక భీ జహాఁ వస్తు హో వహాఁ అనర్థ (జిస మనుష్య మేం) హీ ప్రాయః హోతా హై । ఫిర జహాఁ యే చారోం ఏకత్ర హో, వహాఁ కీ తో బాత హీ క్యా హై? ॥౦.౧౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యౌవనం = (యువతీయువకదశ) యౌవనదశ; ధన-సమ్పత్తిః = ధన = (సంపదల యొక్క) డబ్బు యొక్క; సంపత్తిః = (అవసరాలకు మించి) ఉండడం; ప్రభుత్వమ్ = అధికారము; అవివేకితా = వివేకరాహిత్యము; (అనే ఈ నాలుగింటిలో) ఏకైకమ్ అపి = ఏ ఒక్కటైనను; (ఉన్నను) (ఆ వ్యక్తికి కలిగే) అనర్థాయ = ఆపదకై (భవతి = అగుచున్నది) యత్ర = ఏ వ్యక్తి యందైతే; చతుష్టయమ్ = ఈ నాలుగు (ఉన్నవో) (తత్ర = ఆ వ్యక్తి గురించి; కిము = (సంభవించే ఆపదల గురించి) ఏమి; (వక్తవ్యమ్ = చెప్పాలి. ॥౦.౧౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మొదటిది యువతీయువకదశ అనగా యౌవనదశ, రెండవది అవసరాలకు మించి సంపదలు ఉండడం, మూడవది అధికారము, నాల్గవది వివేకరాహిత్యము అనే ఈ నాలుగింటిలో, ఏ ఒక్కటైనను ఉన్నను ఆ వ్యక్తికి సంభవించే ఆపదలు ఎన్నో.ఇక ఏ వ్యక్తి యందైతే ఈ నాలుగు ఉన్నవో, ఆ వ్యక్తికి సంభవించే ఆపదల గురించి వర్ణించడం సాధ్యమా ? అసాధ్యమని భావము. ॥౦.౧౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.10

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.10🌺
🌷
మూలమ్--
అనేకసంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శకమ్ ।
సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యన్ధ ఏవ సః ॥౦.౧౦॥

🌺
పదవిభాగః--
అనేక-సంశయ-ఉచ్ఛేది పరోక్ష-అర్థస్య దర్శకమ్ । సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అన్ధః ఏవ సః ॥౦.౧౦॥
🌸
అన్వయః--
అనేక-సంశయ-ఉచ్ఛేది, పరోక్ష-అర్థస్య దర్శకమ్, సర్వస్య లోచనం (చ యత్) శాస్త్రం (తత్) యస్య (పుంసః) నాస్తి, సః అన్ధః ఏవ ॥౦.౧౦॥
🌼
ప్రతిపదార్థః--
అనేక-సంశయ-ఉచ్ఛేది ~ అనేకాన్ సంశయాన్ ఉచ్ఛినత్తి తచ్ఛీలమ్ = నానా-వితర్క-వినాశకమ్; పరోక్ష-అర్థస్య = అతీత-అనాగతాది-అర్థస్య; దర్శకమ్ = బోధకమ్; సర్వస్య లోచనం = లోచనమ్ ఇవ మార్గదర్శకమ్; శాస్త్రం యస్య (పుంసః) నాస్తి, సః; అన్ధః = లోచనవికలః; ఏవ; ॥౦.౧౦॥
🌻
తాత్పర్యమ్--
సకలాన్ సన్దేహాన్ అపాకుర్వత్, అప్రత్యక్షస్య, నిగూఢస్యార్థస్య చ దర్శకం యత్ శాస్త్రం, తత్ సర్వేషాం నయనమివ విలసతి। యస్య మనుష్యస్య శాస్త్రజ్ఞానం నాస్తి, సః దృష్టిహీన ఏవ ॥౦.౧౦॥
🌿
హిన్ద్యర్థః--
సబ ప్రకార కే సంశయ కో దూర కరనే వాలా, తథా పరోక్ష వస్తుఓంకో భీ ప్రత్యక్ష కరానేవాలా శాస్త్ర హీ సబకా సచ్చా నేత్ర హై, ఔర జిసకే పాస వహ శాస్త్ర రూపీ నేత్ర నహీం హై, వహ మనుష్య అన్ధే కే సమాన హై ॥౦.౧౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అనేక-సంశయ-ఉచ్ఛేది - అనేక= నానావిధ (విషయములతో కూడిన) , సంశయ = సందేహములను, ఉచ్ఛేది = (తొలగించునది) నివారించునటువంటి; పరోక్ష-అర్థస్య - పరోక్ష = కళ్ళకు కనబడని, అర్థస్య = ప్రయోజనము యొక్క; దర్శకం = (గోచరింప జేయునది) చూపునటువంటిది;) (ఇదం = ఈ) శాస్త్రం = శాస్త్రము; (అస్మిన్ లోకే = ఈ లోకము యందు) సర్వస్య = ప్రతీ వ్యక్తికి; లోచనం = (జ్ఞాన) నేత్రము; (ఇదం = ఈ) శాస్త్రం = శాస్త్రము; యస్య = ఎవనికి; నాస్తి = లేదో; సః = అలాంటి వాడు; అన్ధః ఏవ = (కళ్ళు ఉండియు) గ్రుడ్డి వాడే. ॥౦.౧౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
శాస్త్రప్రయోజనాన్ని వివరిస్తున్నారు. వివిధవిషయములతో కూడిన సందేహములను నివారించునటువంటి, కళ్ళకు కనబడని ప్రయోజనమును (గోచరింప జేయునది) చూపునటువంటి, ఈ శాస్త్రము, ఈ లోకము యందు ప్రతీ వ్యక్తికీ (జ్ఞాన) నేత్రము వంటిది. ఈ శాస్త్రమనే నేత్రము ఎవనికి లేదో, అలాంటి వాడు కళ్ళు ఉండియు గ్రుడ్డి వాడే. శాస్త్రజ్ఞానం లేకుండా పరోక్షార్థమును దర్శింప జాలడని భావము. ॥౦.౧౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.8

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.8🌺
🌷
మూలమ్--
యన్నవే భాజనే లగ్నః సంస్కారో నాన్యథా భవేత్ ।
కథాచ్ఛలేన బాలానాం నీతిస్తదిహ కథ్యతే ॥౦.౮॥

🌺
పదవిభాగః--
యత్ నవే భాజనే లగ్నః సంస్కారః న అన్యథా భవేత్ । కథా-ఛలేన బాలానాం నీతిః తద్ ఇహ కథ్యతే ॥౦.౮॥
🌸
అన్వయః--
యత్, నవే భాజనే లగ్నః సంస్కారః అన్యథా న భవేత్, తద్ ఇహ కథా-ఛలేన బాలానాం నీతిః (మయా) కథ్యతే ॥౦.౮॥
🌼
ప్రతిపదార్థః--
యత్ = యస్మాత్ కారణాత్; నవే = నవీనే, అపక్వే బాలే; భాజనే = పాత్రే, పుంసి చ; లగ్నః = సంసక్తః; సంస్కారః = గుణాధానమ్; అన్యథా న భవేత్ = దూరీభవేత్; తద్ = తస్మాత్ కారణాత్; ఇహ = హితోపదేశే; కథా-ఛలేన = కాకకూర్మాదీనామ్ ఆఖ్యానకానాం వ్యాజేన; బాలానాం = బాలోపదేశార్థం; నీతిః = రాజనీతిః వ్యవహారనీతిశ్చ; కథ్యతే = మయా నిబధ్యతే ॥౦.౮॥
🌻
తాత్పర్యమ్--
నవీనే పాత్రే పరివేషితం (?) భోజనం యథా న నశ్యతి, తథైవ నవవయస్కేషు బాలకేషు నిక్షిప్తః సంస్కారః నైవ వినశ్యతి। అతః (హితోపదేశ)కథామాధ్యమేన నీతివ్యవహారాదీనాం జ్ఞానం బాలకాన్ ఉపదిశామి ॥౦.౮॥
🌿
హిన్ద్యర్థః--
నవీన పాత్ర మేం తథా ఛోటే-ఛోటే బాలకో మేం స్థపిత కియా హుఆ (దియా హుఆ) సంస్కార వ శిక్షణ ఆది కభీ నష్ట నహీం హోతా హై, ఇస లియే ఇస గ్రన్థ మేం కథా కే బహానే సే మైం బాలకోం కే లిఏ నీతిశాస్త్ర కా సార నికాల కర కహతా హూఁ ॥౦.౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యత్ = ఏ విధంగా నైతే; నవే = క్రొత్తదైన; భాజనే = (గిన్నెయందు) పాత్రయందు; లగ్నః = వేయబడిన; సంస్కారః = (నగిషీ) చిత్తరువు; అన్యథా = వేరే విధముగా; న భవేత్ = అగుచు లేదో; తత్ = ఆ విధముగానే; ఇహ = ఈ హితోపదేశ గ్రంథము యందు; కథా-ఛలేన = కాకకూర్మాదివివిధకథల ద్వారా; బాలానాం = (శిశువులకు) పిల్లలకు; నీతిః = రాజనీతి, వ్యవహారనీతి, మొదలగు మంచిని; కథ్యతే = చెప్పబడుచున్నది. ॥౦.౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ విధంగా నైతే క్రొత్తదైన పాత్రయందు వేయబడిన నగిషీలు, చిత్తరువులు వాడినను, వేరే విధముగా అగుచు లేవో, ఆ విధముగనే ఈ హితోపదేశ గ్రంథము యందు కాకకూర్మాది వివిధకథల ద్వారా, (శిశువులకు) పిల్లలకు రాజనీతి వ్యవహారనీతి మొదలగు జీవనాధారమైన నీతివిషయములను బాల్యం లోనే చెప్పబడుచున్నది. ॥౦.౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.7

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.7🌺
🌷
మూలమ్--
విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే ।
ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా ॥౦.౭॥

🌺
పదవిభాగః--
విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే । ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయా ఆద్రియతే సదా ॥౦.౭॥
🌸
అన్వయః--
(మనుష్యస్య) ప్రతిపత్తయే, శస్త్రం విద్యా చ శాస్త్రం (విద్యా) చ ద్వే విద్యే (ప్రసిద్ధే)। ఆద్యా వృద్ధత్వే హాస్యాయ। ద్వితీయా (లోకే) సదా ఆద్రియతే ॥౦.౭॥
🌼
ప్రతిపదార్థః--
ప్రతిపత్తయే = జ్ఞానాయ, యశోలాభాయ చ; శస్త్రం విద్యా = ధనుర్వేదాది; శాస్త్రం (విద్యా) చ ద్వే విద్యే; ఆద్యా = ప్రథమా ; వృద్ధత్వే = వృద్ధావస్థాయాం, బలక్షయే; హాస్యాయ = ఉపహాసప్రదా; ద్వితీయా = శాస్త్రవిద్యా; (లోకే) సదా; ఆద్రియతే = పూజ్యతే ॥౦.౭॥
🌻
తాత్పర్యమ్--
మనుష్యస్య జ్ఞానార్జనాయ, యశసే చ ద్వే విద్యే స్తః- శస్త్రవిద్యా, శాస్త్రవిద్యా చేతి। శస్త్రవిద్యయా గతే వయసి న కోఽపి లాభః (శారీరిక-బలాభావాత్)। కిన్తు శాస్త్రవిద్యయా జనః ఆజీవనం పూజ్యతే లోకే (వృద్ధోఽపి సన్ విద్యాం న త్యజతి, అత్యాగేన అపహాసత్వమపి న యాతి।) ॥౦.౭॥
🌿
హిన్ద్యర్థః--
విద్యా దో ప్రకార కీ హై। ఏక శస్త్రవిద్యా ఔర దూసరీ శాస్త్రవిద్యా । దోనోం విద్యాఓంసే హీ లోక మేం ప్రతిష్ఠా హోతీ హై । పరన్తు పహిలీ విద్యా (శస్త్రవిద్యా) వృద్ధావస్థా మేం హఁసీ కరాతీ హై, పరన్తు దూసరీ (శాస్త్ర) విద్యా కా తో సదా హీ ఆదర హోతా హై ॥౦.౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
(ఇహ = ఈ లోకంలో) శస్త్రస్య = వివిధ అస్త్రశస్త్రములకు సంబంధించిన; విద్యా = (జ్ఞానము) విద్య; చ = మరియు; శాస్త్రస్య = వేదాదిశాస్త్రసంబధమైన; విద్యా చ = విద్య అనియు; (ఇత్థం = ఇట్లు) ద్వే = రెండు; (విధములైన) విద్యే = విద్యలు; ప్రతిపత్తయే = (మానవుల యొక్క) జ్ఞానము కొరకు; (స్తః = ఉన్నవి). (తయోః ఆ రెండింటిలో) ఆద్యా = మొదటిదైన; శస్త్రవిద్యా = శస్త్రవిద్య; వృద్ధత్వే = ముసలితనంలో; హాస్యాయ = అపహాస్యమునకై; (భవతి = అగుచున్నది) ద్వితీయా = రెండవదైన; శాస్త్రవిద్యా = శాస్త్రసంబధమైన; విద్య; సదా = ఎల్లప్పుడు; (మానవుని యొక్క అన్ని దశల యందు) ఆద్రియతే = (అందరి చేత) ఆదరింపబడచున్నది. ॥౦.౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రశంసాత్మకము)
ఈ లోకంలో వివిధ అస్త్రశస్త్రములకు సంబంధించిన విద్య మరియు వేదాదిశాస్త్రసంబధమైన విద్య అని, ఇలా రెండువిధములైన విద్యలు మానవుని యొక్క జ్ఞానము కొరకు ఉన్నవి. ఆ రెండింటిలో కూడా మొదటిదైన శస్త్రవిద్య, ముసలితనంలో ఉపయోగం లేకుండా పోతుంది, కాని రెండవ దైన శాస్త్రసంబధమైన విద్య, ఎల్లప్పుడు అనగా మానవుని యొక్క అన్ని దశల యందు అందరిచేత ఆదరింపబడచున్నదిఅని భావము. ॥౦.౭॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6🌺
🌷
మూలమ్--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ ।
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥

🌺
పదవిభాగః--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥
🌸
అన్వయః--
విద్యా వినయం దదాతి। వినయాద్ పాత్రతాం యాతి । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి। ధనాద్ ధర్మం (ఆప్నోతి) తతః సుఖమ్ (చాప్నోతి) ॥౦.౬॥
🌼
ప్రతిపదార్థః--
విద్యా; వినయం = సౌజన్యం; దదాతి; వినయాద్; పాత్రతామ్ = యోగ్యతామ్; యాతి = తత్స్థితిం లభతే; పాత్రత్వాత్; ధనమ్; ఆప్నోతి ; ధనాద్; ధర్మం; తతః; సుఖమ్; (చాప్నోతి) ॥౦.౬॥
🌻
తాత్పర్యమ్--
(విద్యైవ సర్వసుఖసాధనమ్ ఇత్యాశయః)। విద్యావాన్ వినయం ప్రాప్య, తేన పాత్రత్వం లభతే। పాత్రభూతః సజ్జనో ధనం ప్రాప్నోతి, ధనాత్ ధర్మోపార్జనం శక్యం కర్తుమ్। తతః సుఖం చ సమ్ప్రాప్నోతి ॥౦.౬॥
🌿
హిన్ద్యర్థః--
ఔర విద్యా నమ్రతా దేతీ హై, నమ్రతా సే మనుష్య పాత్ర ( యోగ్య) బనతా హై। పాత్రతా ( యోగ్యతా) సే ధన మిలతా హై, ధన సే ధర్మ ప్రాప్త హో సకతా హై, ఔర ధర్మ సే సుఖ ప్రాప్త హోతా హై ॥౦.౬ ॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
(మానవునికి) విద్యా = (శాస్త్రజ్ఞానము) నేర్చుకున్న విద్య; వినయం = (నమ్రతను) వినయాన్ని; (వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని) దదాతి = ఇస్తుంది. (ఆ మానవుడే) వినయాత్ = (ఆ) వినయం వలన; పాత్రతామ్ = (జీవనసాఫల్యహేతువైన) అర్హతను; యాతి = పొందుచున్నాడు; పాత్రత్వాత్ = (ఆ) అర్హత వలన; ధనమ్ = (డబ్బును) ధనమును; ఆప్నోతి = పొందుచున్నాడు; ధనాత్ = (ఆ) ధనము వలన; ధర్మం = ధర్మమును; (యాతి = పొందుచున్నాడు) తతః = (ఈ పైవన్నీ పొందిన తర్వాత) అటు తర్వాత; సుఖమ్ = సుఖమును; (ఆప్నోతి = పొందుచున్నాడు) ॥౦.౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మానవునికి విద్య వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని ఇస్తుంది. ఆ మానవుడే, ఆ వినయం వలన జీవనసాఫల్యహేతువైన అర్హతను పొందుచున్నాడు, ఆ అర్హత వలన అతడు ధనాన్ని పొందుచున్నాడు, ఆ ధనము వలన ధర్మమును అనగా నిస్వార్థజీవన విధానాన్ని పొందుచున్నాడు, ఈ పైవన్నీ పొందిన తర్వాత, అప్పుడు సుఖమును పొందుచున్నాడు అని భావము.
[సాధారణంగా ఈ లోకంలో ఎవరికైనా సుఖమే కావాలి అని ఉంటుంది. కాని ఆ సుఖం ఎలా లభిస్తుందో ఈ శ్లోకంలో చక్కగా వివరింప బడింది.] ॥౦.౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.5

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.5🌺
🌷
మూలమ్--
సంయోజయతి విద్యైవ నీచగాపి నరం సరిత్ ।
సముద్రమివ దుర్ధర్షం నృపం భాగ్యమతః పరమ్ ॥౦.౫॥

🌺
పదవిభాగః--
సంయోజయతి విద్యా ఏవ నీచగా అపి నరం సరిత్ । సముద్రమ్ ఇవ దుర్ధర్షం నృపం భాగ్యమ్ అతః పరమ్ ॥౦.౫॥
🌸
అన్వయః--
నీచగా అపి సరిత్ సముద్రమ్ (యథా సంయోజయతి) ఇవ విద్యా ఏవ (నీచగా అపి) దుర్ధర్షం నరం నృపం సంయోజయతి। అతః పరం భాగ్యమ్ (ప్రమాణమ్) ॥౦.౫॥
🌼
ప్రతిపదార్థః--
నీచగా అపి = నిమ్నగా అపి; సరిత్ = నదీ; సముద్రమ్ ఇవ; విద్యా; ఏవ = కేవలం; (నీచగా అపి = నీచజనస్థా అపి) దుర్ధర్షం = దురాసదం, దుష్ప్రాపం, దుర్లభదర్శనం; నృపం = రాజానం; నరం సంయోజయతి = తేన సహ పురుషం సఙ్గమయతి। అతః పరం = తేన సహ సమాగమానన్తరం; భాగ్యమ్ = భాగ్యానుసారేణ (తతో ధనరత్నాదీనాం లాభః) ॥౦.౫॥
🌻
తాత్పర్యమ్--
నదీ యథా నిమ్నస్థానాత్ గచ్ఛన్తీ అపి సముద్రం గచ్ఛతి, తథైవ విద్యా నీచజనమపి- రాజ్ఞః సఙ్గతిం నయతి। తదుపరి యథా దైవానుకూలతా, తథా ఘటతే (రాజ్ఞా యత్ ప్రాప్తవ్యం లబ్ధవ్యం వా తత్ ప్రాప్నోతి।) ॥౦.౫॥
🌿
హిన్ద్యర్థః--
జైసే నదీ నీచే బహనేవాలీ భీ హై తో భీ స్వాశ్రితోం కో వహ సముద్ర సే మిలా దేతీ హై, ఉసీ ప్రకార యది విద్యా నీచ కే పాస భీ హోవే తో భీ వహ విద్యా ఉస మనుప్య కో దుర్ధర్ష రాజా తక పతుఁచా దేతీ హై । ఇసకే బాద ఉస మనుష్య కా జైసా భాగ్య హోతా హై, వైసా హీ ఉసే రాజా సే లాభ హోతా హై ॥౦.౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
నీచగా అపి = పల్లమునకు ప్రవహించునదైనను; సరిత్ = నది; (ఆ నదిని ఆశ్రయించిన) నరం = మానవుడిని; దుర్ధర్షం = (వ్యక్తి తనకు తానుగా) పొందుటకు వీలుగాని; సముద్రమ్ = సముద్రమును; (యథా = ఏ విధముగా) సంయోజయతి = (నది తన శక్తితో) కలుపుచున్నదో; తథా = (ఆ నది వలె) అదే విధముగా; విద్యా ఏవ = (ఈ) విద్యయే; నీచగా అపి = వ్యక్తిగత యోగ్యత లేకపోయినను; నరం = (అలాంటి) మానవుణ్ణి; దుర్ధర్షం = (వ్యక్తి తనకు తానుగా) పొందుటకు వీలుగాని; నృపం = రాజును; (అలాంటి వ్యక్తితో) సంయోజయతి = కలుపుచున్నది; అతః పరం = (అలా కలిపిన తరువాత) ఆ పైన; భాగ్యమ్ = (ఆ వ్యక్తి యొక్క) అదృష్టము. ॥౦.౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రశంసా)
పల్లమునకు ప్రవహించునదైననునది, ఆ నదిని ఆశ్రయించిన మానవుణ్ణి, వ్యక్తి తనకు తానుగా పొందుటకు వీలుగాని సముద్రమును ఏ విధముగా నది తన శక్తితో కలుపుచున్నదో, ఆ నది వలే వ్యక్తి గతయోగ్యత లేకపోయినను, ఈ విద్యయే అలాంటి మానవుణ్ణి, ఒక సాధారణవ్యక్తి తనకు తానుగా పొందుటకు వీలుగాని, రాజును కూడా అలాంటి వ్యక్తితో కలుపుచున్నది. అలా ఆ వ్యక్తిని ఆ రాజుతో కలిపిన తరువాత ఇక ఆ పైన ఆ వ్యక్తి యొక్క యోగ్యత మరియు అదృష్టం పై భవిత ఆధారపడి ఉంటుంది అని భావము ॥౦.౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4🌺
🌷
మూలమ్--
సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమమ్ ।
అహార్యత్వాదనర్ఘత్వాదక్షయత్వాచ్చ సర్వదా ॥౦.౪॥

🌺
పదవిభాగః--
సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ ద్రవ్యమ్ ఆహుః అనుత్తమమ్ । అహార్యత్వాద్ అనర్ఘత్వాద్ అక్షయత్వాత్ చ సర్వదా ॥౦.౪॥
🌸
అన్వయః--
సర్వదా (అన్యేన కేనాపి) అహార్యత్వాద్, అనర్ఘత్వాద్, అక్షయత్వాత్ చ సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ అనుత్తమమ్ ద్రవ్యమ్ (ఇతి విద్వాంసః) ఆహుః ॥౦.౪॥
🌼
ప్రతిపదార్థః--
సర్వదా; (అన్యేన కేనాపి) అహార్యత్వాద్ = హర్తుమ్ అశక్యత్వాత్; అనర్ఘత్వాద్ = బహుమూల్యత్వాత్; అక్షయత్వాత్ చ = దానాదినా అపి అక్షీయమాణత్వాత్; సర్వ-ద్రవ్యేషు = సర్వసాధనోపేక్షయా; విద్యా ఏవ; అనుత్తమమ్ = సర్వశ్రేష్ఠమ్; ద్రవ్యమ్ = ధనం; ఆహుః ॥౦.౪॥
🌻
తాత్పర్యమ్--
సర్వకాలేషు సర్వధనేషు విద్యా ఏవ సర్వశ్రేష్ఠం ధనమ్ ఇతి విద్వద్వచనమ్। యతః– తత్ అన్యైః హర్తుం న శక్యతే। బహుమూల్యా వర్తతే। కదాపి క్షయం న యాతి ॥౦.౪॥
🌿
హిన్ద్యర్థః--
సంసార కే సబ ద్రవ్యోం సే ఉత్తమ ధన విద్యా హీ హై। క్యోం కి న యహ చురాఈ జా సకతీ హై, న ఇసకా కోఈ మోల హీ లగా సకతా హై ఔర న ఇసకా కభీ క్షయ (నాశ, ఘటనా) హీ హో సకతా హై ॥౦.౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంస)
సర్వదా = అన్ని కాలములయందు; (ఈ విద్య) , అహార్యత్వాత్ = (ఇతరులచే) దొంగిలింపరానిదైనందు వలన; అనర్ఘత్వాత్ = వెల కట్టరానిదైనందు వలన; అక్షయత్వాత్ చ = (ఎంత ఇచ్చిననూ) తరగనిదైనందు వలన కూడా; విద్యా ఏవ = (ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ) విద్యయే; సర్వద్రవ్యేషు > సర్వ = అన్ని రకములైన; ద్రవ్యేషు = (విలువైన వాటి యందు) ద్రవ్యముల యందు; అనుత్తమమ్ = (అత్యంత విలువైన) సర్వోత్తమమైన; ద్రవ్యం (ఇతి) = ద్రవ్యము (అని); (విద్వాంసః = విద్వాంసులు) ఆహుః = చెప్పుచున్నారు.
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(ఈ శ్లోకము విద్యాప్రశంసాత్మకము)
అన్ని కాలములయందు ఈ విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెల కట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ, పంచిననూ, తరగనిదైనందు వలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు అని భావము.
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.3

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.3🌺
విద్యాప్రశంసా
🌷
మూలమ్--
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ చిన్తయేత్ ।
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ ॥౦.౩॥

🌺
పదవిభాగః--
అజర-అమర-వత్ ప్రాజ్ఞః విద్యామ్ అర్థం చ చిన్తయేత్ । గృహీతః ఇవ కేశేషు మృత్యునా ధర్మమ్ ఆచరేత్ ॥౦.౩॥
🌸
అన్వయః--
ప్రాజ్ఞః అజర-అమర-వత్ విద్యామ్ అర్థం చ చిన్తయేత్। మృత్యునా కేశేషు గృహీతః ఇవ ధర్మమ్ ఆచరేత్ ॥౦.౩॥
🌼
ప్రతిపదార్థః--
ప్రాజ్ఞః = విద్వాన్; అజర-అమర-వత్ = జరా-మరణ-వర్జితమ్ ఆత్మానం మన్యమాన ఇవ; విద్యామ్ = ధర్మశాస్త్రాదికం, కలాకలాపవిజ్ఞానం, జ్ఞానం చ; అర్థం చ = ధనం చ; చిన్తయేత్ = అభ్యసేత్, ఉపార్జయేత్ చ; మృత్యునా కేశేషు గృహీతః ఇవ = కాలకవలితమ్ ఇవ ఆత్మానం పశ్యన్; ధర్మమ్; ఆచరేత్ = సేవేత, పాలయేత్ చ ॥౦.౩॥
🌻
తాత్పర్యమ్--
విద్వాన్ జరామరణరహితః ఇవ శాస్త్రవిద్యామభ్యసేత్। (ఆజీవనం శాస్త్రాధ్యయనం కుర్యాత్।) మృత్యుదేవః కేశాన్ గృహీత్వా తిష్ఠతి (మరణకాలః ఆసన్నః, అత్యన్తం నికటే అస్తి) ఇతి మత్వా ధర్మాచరణం కుర్యాత్ ॥౦.౩॥
🌿
హిన్ద్యర్థః--
బుద్ధిమాన్ మనుష్య కో చాహిఏ కి అపనే (ఆత్మా) కో అజర వ అమర సమఝకర విద్యా తథా ధన కో కమావే । పరన్తు ధర్మాచరణ కే సమయ తో మృత్యు కో అపనే శిర పర బైఠీ హీ సమఝే ॥౦.౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యయొక్క ప్రాశస్త్యాన్ని ఈ శ్లోకము వివరిస్తుంది)
ప్రాజ్ఞః = బుద్ధిమంతుడైన వాడు; అజరామరవత్ > అజరవత్ = ముసలి తనం లేని వాని వలే; అమరవత్ = మరణం లేని వాని వలే; విద్యామ్ = (వేద ధర్మశాస్త్రాది) విద్యను; చ = మరియు; అర్థం చ = ధనమును కూడా; చిన్తయేత్ = (సాధించుటకై) చింతించవలెను; (మరియు) కేశేషు = (తల) వెంట్రుకల యందు; మృత్యునా = యముని చేత; గృహీతః ఇవ = పట్టుకున్నట్లు వలే; (ప్రతి వ్యక్తి) ధర్మమ్ = ధర్మమును; ఆచరేత్ = (సాధించవలెను) ఆచరించవలెను. ॥౦.౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రాశస్త్యవర్ణణాత్మకమీ శ్లోకము).
బుద్ధిమంతుడైన వాడు, తనకు ముసలితనం లేని వాని వలే, మరియు మరణం లేని వాని వలే, (వేదధర్మశాస్త్రాది సమస్త) విద్యలను మరియు (అవసరాలకు తగినంత) ధనమును కూడా తప్పక సాధించుటకై ఆలోచించవలెను. మరియు తనయొక్క తల వెంట్రుకలను యముడు పట్టుకున్నట్లుగా భావించి, ప్రతి వ్యక్తి ధర్మమును ఆచరించవలెను అని భావము ॥౦.౩॥
🙏