Thursday, August 1, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4🌺
🌷
మూలమ్--
సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమమ్ ।
అహార్యత్వాదనర్ఘత్వాదక్షయత్వాచ్చ సర్వదా ॥౦.౪॥

🌺
పదవిభాగః--
సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ ద్రవ్యమ్ ఆహుః అనుత్తమమ్ । అహార్యత్వాద్ అనర్ఘత్వాద్ అక్షయత్వాత్ చ సర్వదా ॥౦.౪॥
🌸
అన్వయః--
సర్వదా (అన్యేన కేనాపి) అహార్యత్వాద్, అనర్ఘత్వాద్, అక్షయత్వాత్ చ సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ అనుత్తమమ్ ద్రవ్యమ్ (ఇతి విద్వాంసః) ఆహుః ॥౦.౪॥
🌼
ప్రతిపదార్థః--
సర్వదా; (అన్యేన కేనాపి) అహార్యత్వాద్ = హర్తుమ్ అశక్యత్వాత్; అనర్ఘత్వాద్ = బహుమూల్యత్వాత్; అక్షయత్వాత్ చ = దానాదినా అపి అక్షీయమాణత్వాత్; సర్వ-ద్రవ్యేషు = సర్వసాధనోపేక్షయా; విద్యా ఏవ; అనుత్తమమ్ = సర్వశ్రేష్ఠమ్; ద్రవ్యమ్ = ధనం; ఆహుః ॥౦.౪॥
🌻
తాత్పర్యమ్--
సర్వకాలేషు సర్వధనేషు విద్యా ఏవ సర్వశ్రేష్ఠం ధనమ్ ఇతి విద్వద్వచనమ్। యతః– తత్ అన్యైః హర్తుం న శక్యతే। బహుమూల్యా వర్తతే। కదాపి క్షయం న యాతి ॥౦.౪॥
🌿
హిన్ద్యర్థః--
సంసార కే సబ ద్రవ్యోం సే ఉత్తమ ధన విద్యా హీ హై। క్యోం కి న యహ చురాఈ జా సకతీ హై, న ఇసకా కోఈ మోల హీ లగా సకతా హై ఔర న ఇసకా కభీ క్షయ (నాశ, ఘటనా) హీ హో సకతా హై ॥౦.౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంస)
సర్వదా = అన్ని కాలములయందు; (ఈ విద్య) , అహార్యత్వాత్ = (ఇతరులచే) దొంగిలింపరానిదైనందు వలన; అనర్ఘత్వాత్ = వెల కట్టరానిదైనందు వలన; అక్షయత్వాత్ చ = (ఎంత ఇచ్చిననూ) తరగనిదైనందు వలన కూడా; విద్యా ఏవ = (ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ) విద్యయే; సర్వద్రవ్యేషు > సర్వ = అన్ని రకములైన; ద్రవ్యేషు = (విలువైన వాటి యందు) ద్రవ్యముల యందు; అనుత్తమమ్ = (అత్యంత విలువైన) సర్వోత్తమమైన; ద్రవ్యం (ఇతి) = ద్రవ్యము (అని); (విద్వాంసః = విద్వాంసులు) ఆహుః = చెప్పుచున్నారు.
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(ఈ శ్లోకము విద్యాప్రశంసాత్మకము)
అన్ని కాలములయందు ఈ విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెల కట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ, పంచిననూ, తరగనిదైనందు వలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు అని భావము.
🙏

No comments:

Post a Comment