Thursday, August 1, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6🌺
🌷
మూలమ్--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ ।
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥

🌺
పదవిభాగః--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥
🌸
అన్వయః--
విద్యా వినయం దదాతి। వినయాద్ పాత్రతాం యాతి । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి। ధనాద్ ధర్మం (ఆప్నోతి) తతః సుఖమ్ (చాప్నోతి) ॥౦.౬॥
🌼
ప్రతిపదార్థః--
విద్యా; వినయం = సౌజన్యం; దదాతి; వినయాద్; పాత్రతామ్ = యోగ్యతామ్; యాతి = తత్స్థితిం లభతే; పాత్రత్వాత్; ధనమ్; ఆప్నోతి ; ధనాద్; ధర్మం; తతః; సుఖమ్; (చాప్నోతి) ॥౦.౬॥
🌻
తాత్పర్యమ్--
(విద్యైవ సర్వసుఖసాధనమ్ ఇత్యాశయః)। విద్యావాన్ వినయం ప్రాప్య, తేన పాత్రత్వం లభతే। పాత్రభూతః సజ్జనో ధనం ప్రాప్నోతి, ధనాత్ ధర్మోపార్జనం శక్యం కర్తుమ్। తతః సుఖం చ సమ్ప్రాప్నోతి ॥౦.౬॥
🌿
హిన్ద్యర్థః--
ఔర విద్యా నమ్రతా దేతీ హై, నమ్రతా సే మనుష్య పాత్ర ( యోగ్య) బనతా హై। పాత్రతా ( యోగ్యతా) సే ధన మిలతా హై, ధన సే ధర్మ ప్రాప్త హో సకతా హై, ఔర ధర్మ సే సుఖ ప్రాప్త హోతా హై ॥౦.౬ ॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
(మానవునికి) విద్యా = (శాస్త్రజ్ఞానము) నేర్చుకున్న విద్య; వినయం = (నమ్రతను) వినయాన్ని; (వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని) దదాతి = ఇస్తుంది. (ఆ మానవుడే) వినయాత్ = (ఆ) వినయం వలన; పాత్రతామ్ = (జీవనసాఫల్యహేతువైన) అర్హతను; యాతి = పొందుచున్నాడు; పాత్రత్వాత్ = (ఆ) అర్హత వలన; ధనమ్ = (డబ్బును) ధనమును; ఆప్నోతి = పొందుచున్నాడు; ధనాత్ = (ఆ) ధనము వలన; ధర్మం = ధర్మమును; (యాతి = పొందుచున్నాడు) తతః = (ఈ పైవన్నీ పొందిన తర్వాత) అటు తర్వాత; సుఖమ్ = సుఖమును; (ఆప్నోతి = పొందుచున్నాడు) ॥౦.౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మానవునికి విద్య వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని ఇస్తుంది. ఆ మానవుడే, ఆ వినయం వలన జీవనసాఫల్యహేతువైన అర్హతను పొందుచున్నాడు, ఆ అర్హత వలన అతడు ధనాన్ని పొందుచున్నాడు, ఆ ధనము వలన ధర్మమును అనగా నిస్వార్థజీవన విధానాన్ని పొందుచున్నాడు, ఈ పైవన్నీ పొందిన తర్వాత, అప్పుడు సుఖమును పొందుచున్నాడు అని భావము.
[సాధారణంగా ఈ లోకంలో ఎవరికైనా సుఖమే కావాలి అని ఉంటుంది. కాని ఆ సుఖం ఎలా లభిస్తుందో ఈ శ్లోకంలో చక్కగా వివరింప బడింది.] ॥౦.౬॥
🙏

No comments:

Post a Comment