Thursday, August 1, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.10

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.10🌺
🌷
మూలమ్--
అనేకసంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శకమ్ ।
సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యన్ధ ఏవ సః ॥౦.౧౦॥

🌺
పదవిభాగః--
అనేక-సంశయ-ఉచ్ఛేది పరోక్ష-అర్థస్య దర్శకమ్ । సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్తి అన్ధః ఏవ సః ॥౦.౧౦॥
🌸
అన్వయః--
అనేక-సంశయ-ఉచ్ఛేది, పరోక్ష-అర్థస్య దర్శకమ్, సర్వస్య లోచనం (చ యత్) శాస్త్రం (తత్) యస్య (పుంసః) నాస్తి, సః అన్ధః ఏవ ॥౦.౧౦॥
🌼
ప్రతిపదార్థః--
అనేక-సంశయ-ఉచ్ఛేది ~ అనేకాన్ సంశయాన్ ఉచ్ఛినత్తి తచ్ఛీలమ్ = నానా-వితర్క-వినాశకమ్; పరోక్ష-అర్థస్య = అతీత-అనాగతాది-అర్థస్య; దర్శకమ్ = బోధకమ్; సర్వస్య లోచనం = లోచనమ్ ఇవ మార్గదర్శకమ్; శాస్త్రం యస్య (పుంసః) నాస్తి, సః; అన్ధః = లోచనవికలః; ఏవ; ॥౦.౧౦॥
🌻
తాత్పర్యమ్--
సకలాన్ సన్దేహాన్ అపాకుర్వత్, అప్రత్యక్షస్య, నిగూఢస్యార్థస్య చ దర్శకం యత్ శాస్త్రం, తత్ సర్వేషాం నయనమివ విలసతి। యస్య మనుష్యస్య శాస్త్రజ్ఞానం నాస్తి, సః దృష్టిహీన ఏవ ॥౦.౧౦॥
🌿
హిన్ద్యర్థః--
సబ ప్రకార కే సంశయ కో దూర కరనే వాలా, తథా పరోక్ష వస్తుఓంకో భీ ప్రత్యక్ష కరానేవాలా శాస్త్ర హీ సబకా సచ్చా నేత్ర హై, ఔర జిసకే పాస వహ శాస్త్ర రూపీ నేత్ర నహీం హై, వహ మనుష్య అన్ధే కే సమాన హై ॥౦.౧౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అనేక-సంశయ-ఉచ్ఛేది - అనేక= నానావిధ (విషయములతో కూడిన) , సంశయ = సందేహములను, ఉచ్ఛేది = (తొలగించునది) నివారించునటువంటి; పరోక్ష-అర్థస్య - పరోక్ష = కళ్ళకు కనబడని, అర్థస్య = ప్రయోజనము యొక్క; దర్శకం = (గోచరింప జేయునది) చూపునటువంటిది;) (ఇదం = ఈ) శాస్త్రం = శాస్త్రము; (అస్మిన్ లోకే = ఈ లోకము యందు) సర్వస్య = ప్రతీ వ్యక్తికి; లోచనం = (జ్ఞాన) నేత్రము; (ఇదం = ఈ) శాస్త్రం = శాస్త్రము; యస్య = ఎవనికి; నాస్తి = లేదో; సః = అలాంటి వాడు; అన్ధః ఏవ = (కళ్ళు ఉండియు) గ్రుడ్డి వాడే. ॥౦.౧౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
శాస్త్రప్రయోజనాన్ని వివరిస్తున్నారు. వివిధవిషయములతో కూడిన సందేహములను నివారించునటువంటి, కళ్ళకు కనబడని ప్రయోజనమును (గోచరింప జేయునది) చూపునటువంటి, ఈ శాస్త్రము, ఈ లోకము యందు ప్రతీ వ్యక్తికీ (జ్ఞాన) నేత్రము వంటిది. ఈ శాస్త్రమనే నేత్రము ఎవనికి లేదో, అలాంటి వాడు కళ్ళు ఉండియు గ్రుడ్డి వాడే. శాస్త్రజ్ఞానం లేకుండా పరోక్షార్థమును దర్శింప జాలడని భావము. ॥౦.౧౦॥
🙏

No comments:

Post a Comment