Friday, June 22, 2018

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.2

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.2🌺
🌷
మూలమ్--
శ్రుతో హితోపదేశోఽయం పాటవం సంస్కృతోక్తిషు ।
వాచాం సర్వత్ర వైచిత్ర్యం నీతివిద్యాం దదాతి చ ॥౦.౨॥

🌺
పదవిభాగః--
శ్రుతః హితోపదేశః అయం పాటవం సంస్కృత-ఉక్తిషు । వాచాం సర్వత్ర వైచిత్ర్యం నీతి-విద్యాం దదాతి చ ॥౦.౨॥
🌸
అన్వయః--
అయం హితోపదేశః శ్రుతః। సంస్కృత-ఉక్తిషు పాటవం చ సర్వత్ర వాచాం వైచిత్ర్యం దదాతి। నీతి-విద్యాం చ (దదాతి) ॥౦.౨॥
🌼
ప్రతిపదార్థః--
అయం = మయా వక్ష్యమాణః; శ్రుతః హితోపదేశః = గ్రన్థవిశేషః; సంస్కృత-ఉక్తిషు = సంస్కృతభాషణాదిషు; పాటవం = కౌశలమ్; సర్వత్ర = సర్వవిషయేషు; వాచాం వైచిత్ర్యం = నానావిధోక్తి-చాతుర్యమ్; నీతి-విద్యాం = రాజనీతిం, వ్యవహారకౌశలం చ; దదాతి = (అత్ర) శిక్షయతి ॥౦.౨॥
🌻
తాత్పర్యమ్--
మయా వక్ష్యమాణః హితోపదేశః సంస్కృతభాషాప్రావీణ్యం, సర్వవిషయేషు చాతుర్యం, రాజనీతిం వ్యవహారజ్ఞానం చ దదాతి ॥౦.౨॥
🌿
హిన్ద్యర్థః--
యహ హితోపదేశ నామక గ్రన్థ పఢనేవాలోం కో సంస్కృత బోలనే మేం కుశలతా దేతా హై, ఔర సబ విషయోం మేం నానా భాషాఓం మేం బోలనేకీ నానా ప్రకార కీ సున్దర-సున్దర రీతియాఁ సిఖాతా హై ఔర నీతి-విద్యా భీ సిఖాతా హై ॥౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(ఈ గ్రంథపఠనప్రయోజనాన్ని వివరించుచున్నాడు)
అయం = (నాచే రచింపబడిన) ఈ; హితోపదేశః =హితోపదేశమనే గ్రంథము; శ్రుతః = వినినది (అయితే) (అధ్యయనం చేసినట్లైతే) , సంస్కృత-ఉక్తిషు > సంస్కృత = సంస్కృతభాషా సంబంధమైన; ఉక్తిషు = (మాటల యందు) వచనముల యందు; పాటవం = (నైపుణ్యమును) సామర్థ్యమును; దదాతి = ఇచ్చుచున్నది; చ = మరియు; సర్వత్ర = అన్ని వ్యవహారముల యందలి; వాచాం = మాటలలో; వైచిత్ర్యం = (నేర్పరితనమును) వైవిధ్యమును; దదాతి = ఇచ్చుచున్నది; చ = మరియు; నీతివిద్యాం > నీతి = (జీవనవిధివిధానాలకు సంబంధించిన, నాయకత్వ లక్షణాలను అందించే) నీతి సంబంధమైన; విద్యాం = (జ్ఞానాన్ని) విద్యను; దదాతి = (వినేవారికి, అధ్యయనం చేసేవారికి) అందించుచున్నది ॥౦.౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
నాచే రచింపబడిన ఈ హితోపదేశమనే విశిష్టగ్రంథము వినినట్లైతే మరియు అధ్యయనం చేసినట్లైతే, సంస్కృతభాషా సంబంధమైన మాటలయందు నైపుణ్యమును మరియు సామర్థ్యమును ఇచ్చుచున్నది. మరియు అన్ని వ్యవహారముల యందలి మాటలలో నేర్పరితనమును, వైవిధ్యమును ఇచ్చుచున్నది. [నీతి సంబంధమైన (మరియు జీవన విధివిధానాలకు సంబంధించిన, నాయకత్వ లక్షణాలను అందించునది.) విద్యను అనగా జ్ఞానాన్ని వినేవారికి, అధ్యయనం చేసే వారికి కూడా హితోపదేశమనే గ్రంథము అందించుచున్నది అని భావము.] ॥౦.౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః – 0.1

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః – 0.1🌹
అథ మఙ్గలాచరణమ్
🌷
మూలమ్--
సిద్ధిః సాధ్యే సతామస్తు ప్రసాదాత్ తస్య ధూర్జటేః ।
జాహ్నవీఫేనలేఖేవ యన్మూర్ధ్ని శశినః కలా ॥౦.౧॥

🌺
పదవిభాగః--
సిద్ధిః సాధ్యే సతామ్ అస్తు ప్రసాదాత్ తస్య ధూర్జటేః । జాహ్నవీ-ఫేన-లేఖా ఇవ యత్-మూర్ధ్ని శశినః కలా ॥౦.౧॥
🌸
అన్వయః--
తస్య ధూర్జటేః ప్రసాదాత్ సతాం సాధ్యే సిద్ధిః అస్తు। యత్-(యస్య =ధూర్జటేః) మూర్ధ్ని శశినః కలా జాహ్నవీ-ఫేన-లేఖా ఇవ (శోభతే) ॥౧॥
🌼
ప్రతిపదార్థః--
తస్య ధూర్జటేః =శివస్య; ప్రసాదాత్ = కృపయా; సతాం = సజ్జనానామ్; సాధ్యే = కర్తవ్యే కర్మణి; సిద్ధిః = అభీష్టలాభః; అస్తు। యత్-(యస్య =ధూర్జటేః) మూర్ధ్ని శశినః కలా జాహ్నవీ-ఫేన-లేఖా ఇవ ~ జాహ్నవ్యాః ఫేనాః తేషాం లేఖాః। = గఙ్గాయాః వారికఫాః తేషాం పఙ్క్తిః ఇవ (శోభతే) ॥౧॥
🌻
తాత్పర్యమ్--
యస్య శివస్య శిరసి గఙ్గాఫేనపఙ్క్తిరివ చన్ద్రకలా అస్తి, తస్య శివస్య కృపయా సజ్జనానాం క్రియాసు సిద్ధిః భవతు ॥
🌿
హిన్ద్యర్థః--
జిన మహాదేవజీ కే శిర పర శుక్లపక్ష కీ ద్వితీయా కే చన్ద్రమా కీ కలా గఙ్గా కే ఫేన కీ తరహ శోభాయమాన హోతీ హై, ఉన (మహాదేవజీ) కే ప్రసాద సే సజ్జనోం కే సభీ కార్య సిద్ధ హోవేం ॥౦.౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః-
(ఈ గ్రంథపఠనప్రయోజనాన్ని వివరించుచున్నాడు)
అయం = (నాచే రచింపబడిన) ఈ; హితోపదేశః =హితోపదేశమనే గ్రంథము; శ్రుతః = వినినది (అయితే) (అధ్యయనం చేసినట్లైతే) , సంస్కృత-ఉక్తిషు > సంస్కృత = సంస్కృతభాషా సంబంధమైన; ఉక్తిషు = (మాటల యందు) వచనముల యందు; పాటవం = (నైపుణ్యమును) సామర్థ్యమును; దదాతి = ఇచ్చుచున్నది; చ = మరియు; సర్వత్ర = అన్ని వ్యవహారముల యందలి; వాచాం = మాటలలో; వైచిత్ర్యం = (నేర్పరితనమును) వైవిధ్యమును; దదాతి = ఇచ్చుచున్నది; చ = మరియు; నీతివిద్యాం > నీతి = (జీవనవిధివిధానాలకు సంబంధించిన, నాయకత్వ లక్షణాలను అందించే) నీతి సంబంధమైన; విద్యాం = (జ్ఞానాన్ని) విద్యను; దదాతి = (వినేవారికి, అధ్యయనం చేసేవారికి) అందించుచున్నది ॥౦.౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
నాచే రచింపబడిన ఈ హితోపదేశమనే విశిష్టగ్రంథము వినినట్లైతే మరియు అధ్యయనం చేసినట్లైతే, సంస్కృతభాషా సంబంధమైన మాటలయందు నైపుణ్యమును మరియు సామర్థ్యమును ఇచ్చుచున్నది. మరియు అన్ని వ్యవహారముల యందలి మాటలలో నేర్పరితనమును, వైవిధ్యమును ఇచ్చుచున్నది. [నీతి సంబంధమైన (మరియు జీవన విధివిధానాలకు సంబంధించిన, నాయకత్వ లక్షణాలను అందించునది.) విద్యను అనగా జ్ఞానాన్ని వినేవారికి, అధ్యయనం చేసే వారికి కూడా హితోపదేశమనే గ్రంథము అందించుచున్నది అని భావము.] ॥౦.౨॥
🙏

పరిచయం

నమస్సులు -----------------------------
ఇది --హితోపదేశః, గురుప్రసాదశాస్త్రీ 'అభినవరాజరక్ష్మీ' సంస్కృతటీకా --ఆధారితంగా ఏర్పాటు చేసిన కృతి.
-----------------------------
ఆంధ్రప్రతిపదార్థ తాత్పర్యాలు- శ్రీ లక్ష్మణస్వామి
పదవిభాగం, అన్వయం, సంస్కృత సరలార్థం-- సంకా ఉషారాణి
హిందీ అర్థం-- గురుప్రసాద శాస్త్రీ (గ్రంథం నుండి యథాతథం)
 
 -----------------------------
    నారాయణ పండితులు రచించిన ఈ హితోపదేశం సంస్కృతార్థులకు ఏమాత్రం పరిచయంతో పని లేని విశిష్ట గ్రంథం. పంచతంత్రం, మహాభారతం వంటి ఎన్నో గ్రంథాలు పరికించినమీదట- ఆందులో కథలు, నీతులు, ధర్మవిషయాల ఆధారంగా ఈ గ్రంథం రూపొందింది. ఇది చదివితే వ్యవహారజ్ఞానం, తెలివితేటలు, కుశలబుద్ధి, ద్వైదీభావాలలో సైతం సరైన నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం- అంతే కాక మరెన్నో కోణాలలో వ్యక్తిత్వం వికసిస్తుంది. వ్యక్తిత్వ వికాసాల పేరుతో పైకం నష్టం చేసుకోకుండా ఈ గ్రంథాన్ని మాత్రం పిల్లలకు, యువతకు అధ్యయనం చేయిస్తే వారిలో ఎన్నో రకాల జీవన క్షేత్రాలలో సరైన నిర్వహణ చేయగలిగే లక్షణం రూపొందుతుంది.
    అంత మహోన్నతమైన ఈ గ్రంథాన్ని శ్లోకాలు మాత్రం సేకరించి, పదవిభాగం, అన్వయం, ప్రతిపదార్థం, సంస్కృతంలో సరళ తాత్పర్యాన్ని కూర్చి, సంస్కృతవిద్యార్థుల కోసం దేవనాగరి లిపిలో అందించే ప్రయత్నం చేసే మహదవకాశం దేవవాణి కృపన నాకు లభించింది. దానినే తెలుగు ప్రతిపదార్థం, అనువాదం చేర్చి అందించారు మా సంస్కృత సహోదరులు *లక్ష్మణస్వామి* గారు. వారికి ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు. వాట్సాప్ లో ఉన్న మా సంస్కృతసంస్కృతీ సదస్సులోని సభ్యులకోసం ఈ ప్రయత్నం జరిగింది. వీటిని చదివి లాభం పొందుతున్నామని, కొనసాగించమని మనసారా ప్రోత్సహించిన మా సదస్సు సభ్యులందరికి ధన్యవాదాలు.
    చేసిన పని చలవాణిలో వృథా పోకుండా పొందుపరిచే ప్రయత్నంతో పాటు ఇతర తెలుగు భాషీయులైన సంస్కృతార్థులకై దీన్ని అందించాలనే తపనతో ఈ బ్లాగు రూపొందించటమైనది. 

 -----------------------------
    {ఇందులో హిందీ ఎరిగినవారు ఆ భాషలో కూడా అర్థాన్ని తెలుసుకనే అవకాశం ఉంటుందని, (లిపి పరివర్తినిద్వారా దేవనాగరి నుండి తెలుగు లిపికి మార్చిన) హిందీ తాత్పర్యాన్ని అట్లాగే ఉంచటమైనది. హిందీ వలె హలంత శబ్దోచ్చారణం ప్రకారం కాక తెలుగు లాగా అజంతం ఉండటానికి కారణం సమయాభావమే కానీ మరొకటి కాదు. అదనపు సౌకర్యం కోసమే కానీ పనిలో భాగంగా అనుకుని పెట్టినది కాదు}
-----------------------------

అస్య కృతేః పరిచయః ఏవమ్---

పూర్వతనశ్లోకాః అత్ర-
https://hitopadesha-subhashita.blogspot.in/
పుస్తకమత్ర-
హితోపదేశః, గురుప్రసాదశాస్త్రీ, 'అభినవరాజరక్ష్మీ' సంస్కృతటీకా
https://archive.org/details/Hitopadesha-OCR
 


----------------------------- 

    ఇందులో ఉన్నవి-
1.    మూలశ్లోం- (పూర్తి సంస్కృత ప్రమాణాలతో- వర్గపంచమాలతో, సంధిసహితంగా)
2.    పదవిభాగం- (పదాలను గుర్తు పట్టే విధంగా సంధులను విడదీసి, సమాసాలను సూచిస్తూ చిన్న గీతలతో వేరు చేసి చూపటం),
3.    అన్వయం- (సంస్కృతంలో శ్లోకంలోని పదాలనే భారతీయభాషా వాక్య క్రమంలో తిరిగి కూర్పు చేయటం. అన్వయంలో పదవిభాగం ఇవ్వపడదు, వాక్యనిర్మాణంలో అది సరైన ప్రమాణం కాదు కనుక)
4.    ప్రతిపదార్థం- సంస్కృతంలోనూ, తెలుగు లోనూ. విడిపదం అర్థం ఇవ్వటం పూర్తి కాంగనే ; ఈ గుర్తును పెట్టాము. కనుక అర్ధవిరామం (కామా) చూసి పదం పూర్తైందని భావించవద్దు.
5.    ప్రతిపదార్థంలో మరియు తాత్పర్యంలో శ్లోకం మూలంలో లేని పదం వేసి అర్తం విశదీకరించవలసి వచ్చిన్పపుడు విధివత్ కోష్టకాలను వాడాము. దాని వల్ల మూలం లో లేతపోయినా అర్తం కోసం వివరించే అవకాశంతో పాటు,  ఆ పదం వచ్చినందున శ్లోకంతో భ్రమపాటు కలగకుండా ఉంటుంది. విద్యార్థదశలో ఇది ఎంతో ఉపయుక్తం.
6.    తాత్పర్యం- సరళ సంస్కృతం, హిందీ, తెలుగులలో. ఇక్కడ కూడా అదనపు పదాలను వాడినా శ్లోకంలో మూలంలో లేనివాటిని కోష్టకాలలో పెట్టాము.
7.    సంధులు ప్రత్యేకించి ఇవ్వలేదు. కారణం పదవిభాగంలో మొదలే ఉంటయి కనుక.
8.    సమాసాలేమైనా ఉంటే వాటిని ప్రతిపదార్థాలలో మొదలు > గుర్తుతో ఇచ్చి, అందులో విడిపదాలకు విడిగా తెలుగులో అర్థం ఇచ్చి, తరువాత మళ్ళీ పూర్తి అర్థాన్ని ఇచ్చే ప్రమాణం పాటించాము.
[ప్రశ్నలు కూడా తయారు చేయాలనే సంకల్పం ఉన్నది. ఈశ్వరేచ్ఛ. భవిష్యత్తులో కుదిరితే చూద్దాము.]


-----------------------------
 సంస్కృతం శ్లోకం తో కూడిన గ్రంథాన్ని అధ్యయనం చేసే విధానం-
1.    మొదలు మూల శ్లోకం, తరువాత అదే క్రమంలో మిగిలినదంతా – పదవిభాగాదులను చదవటం.
2.    పూర్తి అయినాక మళ్ళీ విరుద్ధ దిశగా కిందనుండి పైకి చదివటం. అంటే తెలుగు అనువాదం, ప్రతిపదార్థం, అన్వయం – అట్లా.
3.    తరువాత అనువాదంలోని ఫలానా తెలుగు పదం మూలంలో ఎక్కడున్నది- అని ఊహిస్తూ మూలంలోనైనా పదవిభాగంలోనైనా చూసుకోవటం.
4.    సంస్కృతవాక్యం అన్వయక్రమం ప్రకారం తెలుగు అనువాదాన్ని సరిపోల్చుకోవటం. అది ఒకసారి ఇది ఒకసారి చదవటం.
5.    సంధులను పదవిభాగంలోనే శ్లోకాధ్యయనం చివరలో సంధుల దృష్టితో మరోసారి చదవటం మంచిది. (పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, ఈ స్థాయిలో పదాన్ని విడదీసే విధానం తెలిస్తే చాలు)
6.    సమాసాలను ప్రతిపదార్థంలో చదివి సద్వినియోగం చేసుకోవటం మంచిది. (ఈ స్థాయిలో సమాసాల పేర్లు తెలియకపోయినా ఫరవాలేదు, విగ్రహం రాకపోయినా విడదీసే విధానం తెలిస్తే చాలు అని భావం.)
7.    ఏవైనా ప్రయోగవిశేషాలు గమనించటం- ‘ఓహో, ఈ భావాన్ని వ్యక్తపరచాలంటే ఈ పదాన్ని సంస్కృతంలో ఇట్లా వాడతారన్నమాట.. బాగుంది.’ అని నుడికారాన్ని గమనించటం వల్ల భవిష్యత్తులో మంచి లాభం జరుగుతుంది. అవి సూచించే ప్రయత్నం చేయాలని అనుకున్నా. సమయాభావం, మరియు కార్యభారం వల్ల చేయలేకపోయాను. కనుక మీరు స్వయంగా గ్రహించటం, గుర్తించి ప్రయోగాలలో అలవాటు చేసుకోవటం మంచిది.
8.    చివరగా స్వీయపరీక్ష- (లేదా ఎవరి చేతనైనా అడిగించుకోటం)
అ) ఏదైనా సంస్కృతపదాన్ని చదివి, తెలుగు చూడకుండా అర్థం గుర్తు తెచ్చుకోవటం.
ఆ) ఏదైనా తెలుగుపదాన్ని చదివి, సంస్కృతం చూడకుండా మూలపదం గుర్తు తెచ్చుకోవటం.
ఇ) అట్లాగే సంధి, సమాసం చూసుకోవటం
9.    ఇంత చేసేసరికి శ్లోకంలో పదాలన్ని నోటికి వచ్చినట్టు అవుతుంది. అప్పుడు మరో రెండు మూడు సార్లు చదివేస్తే శ్లోకం నోటికి వచ్చేస్తుంది.
10.    చివ్వరగా సంస్కృతశ్లోకాన్ని చదువుతూ భావాన్ని లోపల అనుకోవటం. ఇక్కడ ఏ పదమూ ఆటంకం కలగకపోతే ఇంక ఆ శ్లోకం మనకు అవగతమైనట్టే.

-----------------------------
     ఈ పద్ధతిని మీరిక్కడే కాదు, ఎక్కడైనా ఇతరత్రా కూడా వాడుకోవచ్చు. శ్లోకరూపంలో ఉన్నది, సానువాదం లభించిన ఏ సంస్కృతం గ్రంథాన్ని అయినా ఇట్లాగే చదివి లాభం పొందవచ్చు.
    ఇట్లా చేయటం వల్ల విషయం మొత్తం అవగతమై, సంస్కృతాన్ని మూలంనుంచే ఆనందించి, లాభం పొందుతారని ఆదరిస్తారని ఆశతో-

-మీ సంస్కృతానురాగిణి
సంకా ఉషారాణి


-----------------------------
సంస్కృత హితోపదేశం బ్లాగుకు వ్రాసిన సంస్కృతం ఉపోద్ఘాతం.. ఇక్కడ తెలుగు లిపిలో--

( https://hitopadesha-subhashita.blogspot.in/ )
సంస్కృతం నామ దైవీవాగన్వాఖ్యాతా మహర్షిభిః।

భాషేయం దేవవాణీ। వాగియం పరమపవిత్రా। అస్యాః జ్ఞానాయావగమనాయ చ జనా ఈహన్తే। అవబుధ్య స్వయం సమున్నతా భవామః- ఇతి భావనయా తుష్యన్తి। ఆత్మనః సన్తుష్టిరియం పురుషం ధార్మికే ప్రగతిపథే నయతి।

సంస్కృతం సంస్కృతేర్మూలమ్। యథా చాచార్యః కపిలదేవ ద్వివేదీ కథయతి--

"సువిదితమేతత్ సమేషామపి శేముషీమతాం యద్ భారతీయా-సంస్కృతిః న అధిగన్తుం పార్యతే సంస్కృతజ్ఞానమన్తరా। సంస్కృతిమన్తరేణ నిర్జీవం జీవనం జీవినః। సంస్కృతిర్హి స్వాన్తస్య సంస్కర్త్రీ, సద్భావానాం భావయిత్రీ, గుణగణస్య గ్రాహయిత్రీ, ధైర్యస్య ధారయిత్రీ, దమస్య దాత్రీ సదాచారస్య సఞ్చారయిత్రీ, దుర్గుణగణస్య దమయిత్రీ, అవిద్యాన్ధతమసస్య అపనోదయిత్రీ, ఆత్మావబోధస్య అవగమయిత్రీ, సుఖస్య సీధయిత్రీ, శాన్తేః సన్ధాత్రీ చ కాచిదనుత్తమా శక్తిః। సేయం సంస్కృతిః అజస్రం రక్షణీయా, పాలనీయా, పరివర్ధనీయేతి భారతీయ-సంస్కృతేః సముద్ధారాయ అవబోధాయ చ సంస్కృతజ్ఞానమనివార్యమ్। సమగ్రమపి పురాతనం భారతీయం వాఙ్మయం సంస్కృతమాశ్రిత్య అవతిష్ఠతే।" ఇతి।

అతః సంస్కృతభాషాజ్ఞానాయ, శిక్షణాయ, ప్రచారాయ, ప్రసారాయ చ కేచన ప్రయత్నాః క్రియన్తే స్వస్వప్రతిభాః, అభిరుచీత్యాదికమనుసృత్య తజ్జ్ఞైః। తాదృశః కశ్చన ప్రయత్నః మయా క్రియమాణః భవతాం సంస్కృతానురాగిణాం పురతః సప్రణామం ప్రస్తూయతే।

"ధర్మేణ హీనాః పశుభిః సమానాః", "విద్యా దదాతి వినయమ్", "అనభ్యాసే విషం విద్యా", "ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః", "ఉద్యమేన హి సిధ్యన్తి కార్యాణి, న మనోరథైః", "పూర్వజన్మకృతం కర్మ తద్దైవమితి కథ్యతే ।" ---ఏతాని సుప్రసిద్ధాని వాక్యాని కుత్రచిత్ శ్రుతానీవ భాసన్తే కిల। ఏతాని హితోపదేశగ్రన్థే సన్తి। భారతీయ-సనాతన-ధర్మస్యాంశానామ్ ఉద్ఘోషణం కుర్వన్నయం గ్రన్థః జనసామాన్యే ప్రఖ్యాతః। సంస్కృతశిక్షణే ప్రాథమికదశాయాం హితోపదేశ-శ్లోకాన్ కణ్ఠస్థీకారయన్తి శిక్షకాః విద్యార్థీన్। ధార్మికజీవనాయ, అమూల్యజ్ఞానసమ్పన్నతాయై చ శ్లోకానామేతేషాముపయోగితాం మనసి నిధాయ, టిప్పణీసహితం ప్రతిపదార్థతాత్పర్యయుక్తం సరలం వ్యాఖ్యానమత్ర ప్రస్తూయతే।

వ్యాఖ్యానం సర్వం కిఞ్చిత్ప్రయోజనముద్దిశ్య సంస్కృతేనైవ కృతమ్। యే జనా సంస్కృతభారత్యా సంస్కృతం శిక్షిత్వా ఆగచ్ఛన్తి, తేషామ్ అవగతిః సంస్కృతమూలగ్రన్థానాం పఠనాయ నాలమ్। హిన్దీ-ఆఙ్గ్లేయ్యాది-భాషా-సాహాయ్యం అపేక్ష్యతే తైః। అతస్తాదృశానామనువాదం వినైవ సంస్కృతే చిన్తనం వర్ధతామితి సఙ్కల్పం కృత్వా ప్రయాసోయం ఆరబ్ధః।

అత్ర రచనాప్రణాలీ ఏవమ్--- సర్వప్రథమం మూలశ్లోకః దీయతే। తదనన్తరం పదవిభాగః-- యత్ర పదాని సర్వాణి విసన్ధీకృత్య ప్రదర్శ్యన్తే। తత అన్వయః-- యత్ర భారతీయభాషాణాం వాక్యనిర్మితిమనుసృత్య శ్లోకస్థశబ్దానాం అనుక్రమః యోజ్యతే। తత్పశ్చాత్ ప్రతిపదార్థః-- యత్ర శ్లోకే స్థితానాం కఠినశబ్దానాం సామాన్యార్థః దీయతే। ఏతే అర్థాః శ్రీమతః గురుప్రసాదశాస్త్రిణః 'అభినవరాజరక్ష్మీ' ఇతి సంస్కృతటీకాతః నిర్మితాః। యత్ర వ్యాఖ్యాకృతా న కోపి అర్థః దత్తః, తత్ర మయా యథాశక్తి అర్థాః కృతాః। తస్మాత్ పరం తాత్పర్యం భవతి-- యత్ర సంస్కృతవాక్యేన శ్లోకభావః ప్రకటీకృతః। తాత్పర్యం తు స్వతన్త్రతయా మయా కృతమ్।

కార్యమిదం న సమ్పూర్ణమ్। ప్రతిదినం ఏకైకం శ్లోకం ఏవంరూపేణ నిర్మీయ ప్రకట్యతే అత్ర। అద్యావధి యావన్తః కృతాః తావన్తః ప్రదర్శితాః। అగ్రేపి కార్యమిదం ప్రచలిష్యతి।

అత్ర యత్రకుత్రచిత్ సన్తి చేద్దోషాః సూచ్యా ఇతి నమ్రం నివేదనమ్। యత్కిఞ్చిద్వక్తవ్యం, ప్రయత్నస్యాస్య సంవర్ధనాయ, సంశోధనాయ చ ప్రయోజనకరం తత్ సర్వం విమర్శనరూపేణ వదన్తు ఇతి ప్రార్థనా।

మదీయః ప్రయత్నః సంస్కృతాధ్యాయిభ్యః యది కిఞ్చిదపి ఉపయోగాయ, ప్రయోజనసిద్ధయే వా సంసేత్స్యతి, తర్హి సఫలో జాతః యావాన్ సమయః అత్ర యాపిత ఇతి హర్షమనుభవిష్యామి। అనుగృహ్ణన్తు। నమాంసి।