Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.8

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.8🌺
🌷
మూలమ్--
ఇజ్యాధ్యయనదానాని తపః సత్యం ధృతిః క్షమా ।
అలోభ ఇతి మార్గోఽయం ధర్మస్యాష్టవిధః స్మృతః॥౧.౮॥

🌺
పదవిభాగః--
🌸
అన్వయః--
ఇజ్యా-అధ్యయన-దానాని తపః సత్యం ధృతిః క్షమా । అలోభః ఇతి మార్గః అయం ధర్మస్య అష్టవిధః స్మృతః॥౧.౮॥
🌼
ప్రతిపదార్థః--
ఇజ్యా = యజ్ఞః ; అధ్యయనం = (గురుముఖతః ఉచ్చారితస్య పునః ఉచ్చారణం) పఠనం ; దానం = అన్యేభ్యః ధనాదివస్తుత్యాగః ; తపః = ధార్మికఫలోద్దిష్టం విధియుక్తకర్మ ; సత్యం = యథార్థం, అవితథం ; ధృతిః = ధైర్యమ్ ; క్షమా = సహిష్ణుతా, సహనం ; అలోభః = తృష్ణారాహిత్యం ; ఇతి ; అయం ధర్మస్య = శుభాదృష్టస్య ; మార్గః = పన్థాః, ధర్మోపార్జనే ఉపాయ-భూతః ; అష్టవిధః ; స్మృతః = కథితః॥౧.౮॥
🌻
తాత్పర్యమ్--
ధర్మోపార్జనే ఉపాయభూతాః అష్టౌ మార్గాః। తే- యజ్ఞః, (వేద) పఠనం, ధనాదీనామ్ ఆర్తేభ్యః వితరణం, వైధశారీరక్లేశః, సత్యం, ధైర్యం, సహిష్ణుతా, అతృష్ణా చేతి ॥౧.౮॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి- ధర్మ కే ఆఠ మార్గ హైం, యజ్ఞ కరనా, పఢ़నా, దాన దేనా, తపస్యా కరనా, సత్య బోలనా, ధీరతా, క్షమా, ఔర నిర్లోభ హోనా॥౧.౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఇజ్యా = యజ్ఞము ; అధ్యయనం = (నేర్చకోవడం) పఠనము ; దానం = (ఇవ్వడం) దానము ; తపః = (సాధించాలనే తపన) తపస్సు ; సత్యం = యథార్థ (జీవన) ము ; ధృతిః = (భయరాహిత్యము) ధైర్యము ; క్షమా = సహనము; అలోభః = (తృష్ణారాహిత్యము) పిసినారితనము లేకపోవడం ; ఇతి =అని ; అయం = ఈ ;ధర్మస్య = ధర్మమునకు ; = అష్టవిధః = ఎనిమిది విధములైన ; మార్గః = మార్గము (పద్ధతి) ; (అని) స్మృతః = ఆలోచింపబడినది, అని అర్థము.
॥౧.౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ధర్మమునకు ఎనిమిది విధములైన
మార్గము అనగా పద్ధతి అని చెప్పబడినది...అందులో ఒకటవది యజ్ఞము, రెండవది, అధ్యయనం అనగా నేర్చకోవడం, పఠనం అని, మూడవది దానం అనగా... ఇవ్వడం, దానం చేయడం ; నాల్గవది‌, తపము అనగా, సాధించాలనే తపన తపస్సు, ఐదవది సత్యం అనగా యథార్థజీవనము, ఆరవది ధృతి అనగా... భయరాహిత్యము ధైర్యము, ఏడవది క్షమా అనగా సహనము, ఎనిమిదవది..అలోభం అనగా... తృష్ణారాహిత్యము, పిసినారితనము లేకపోవడం ఇలా ఎనిమిది విషయాలతో జీవించడమే, నిజమైన ధర్మమార్గమని భావము.
॥౧.౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.7

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.7🌺
🌷
మూలమ్--
న సంశయమనారుహ్య నరో భద్రాణి పశ్యతి ।
సంశయం పునరారుహ్య యది జీవతి పశ్యతి॥౧.౭॥

🌺
పదవిభాగః--
న సంశయమ్ అనారుహ్య నరః భద్రాణి పశ్యతి । సంశయం పునః ఆరుహ్య యది జీవతి పశ్యతి॥౧.౭॥
🌸
అన్వయః--
నరః సంశయమ్ అనారుహ్య భద్రాణి న పశ్యతి । పునః సంశయం ఆరుహ్య యది జీవతి, పశ్యతి॥౧.౭॥
🌼
ప్రతిపదార్థః--
నేతి । నరః = మానవః ; సంశయం= సఙ్కటం, ప్రాణసన్దేహమ్। అనారుహ్య = అననుభూయ, అనవాప్య చ ; భద్రాణి = శ్రేయాంసి, సుఖం, ధనాదిసమ్పత్తిఞ్చేతి యావత్ ; పునః =కిన్తు ; సంశయం = జీవనశఙ్కామ్ ; జీవతి = జీవన్నేవ సంశయదోలాయా యది ఉత్తరతి తర్హి ; పశ్యతి = అవశ్యం భద్రాణి పశ్యతీత్యర్థః॥౧.౭॥
🌻
తాత్పర్యమ్--
మానవః సన్దేహమ్ (ప్రాణసఙ్కటాదికం) అప్రాప్య సుఖాదికం న లభతే। తాదృశస్య విపత్తేః ప్రాప్తేరనన్తరం యది ప్రాణైః విహీనో న భవతి, తర్హి సుఖం భుఞ్జతే। (కష్టం వినా సుఖం అసమ్భవమితి భావః।) ॥౧.౭॥
🌿
హిన్ద్యర్థః--
మనుష్య బినా సంశయ మేం పడ़ే కభీ లాభ నహీం ఉఠా సకతా హై, యది సంశయ మేం పద కర భీ జీతా బచ జాతా హై, తో బహ (లాభ కా) సుఖ భోగతా హై॥౧.౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
సంశయం = సందేహమును ; అనారుహ్య = (జయించక) అధిష్టించక ; నరః = మానవుడు ; భద్రాణి = మంగళకరములైన వాటిని ; న పశ్యతి = (అనుభవించ లేడు) చూడలేడు ; (అతః = అందువలన), పునః = మళ్ళీ ; సంశయం = సందేహమును ; ఆరుహ్య అపి = (అధిగమించియు) అధిష్టించియు ; జీవతి యది = (సందేహాతీతుడై ధైర్యంగా) జీవించుచున్న వాడైతే ; భద్రాణి = మంగళకరములైన వాటిని ; పశ్యతి = (తప్పకుండా) చూస్తాడు అని అర్థము. సందేహనివృత్తిపూర్వకజీవనం శ్రేయోదాయక మని సారాంశము. ॥౧.౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
సందేహనివృత్తి కాకుండా, మానవుడు మంగళకరములైన వాటిని అనుభవించ లేడు...చూడలేడు . అందువలన సందేహమును అధిగమించి, ధైర్యంగా జీవించుచున్న వాడైతే, మంగళకరములైన జీవనసంబంధవిషయాలను తప్పకుండా చూస్తాడు అని భావము. సందేహనివృత్తిపూర్వకజీవనవిధానం శ్రేయోదాయక మని సారాంశము. ॥౧.౭॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.6

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.6🌺
🌷
మూలమ్--
అనిష్టాదిష్టలాభేఽపి న గతిర్జాయతే శుభా ।
యత్రాస్తే విషసంసర్గోఽమృతం తదపి మృత్యవే॥౧.౬॥

🌺
పదవిభాగః--
అనిష్టాద్ ఇష్టలాభే అపి న గతిః జాయతే శుభా । యత్ర ఆస్తే విష-సంసర్గః అమృతం తద్ అపి మృత్యవే॥౧.౬॥
🌸
అన్వయః--
అనిష్టాద్ ఇష్టలాభే అపి శుభా గతిః న జాయతే । యత్ర విష-సంసర్గః ఆస్తే (తత్ర) అమృతం, తద్ అపి మృత్యవే॥౧.౬॥
🌼
ప్రతిపదార్థః--
అనిష్టాద్ = అశుభోపాయాత్, అయుక్తేన మార్గేణ, దుష్టాద్వా పుంసః ; ఇష్టలాభే అపి = ఇష్టం వస్తు ప్రాప్యతే, తథాపి ; గతిః = పరిణతిః, ఫలం ; శుభా = కల్యాణకరీ, క్షేమకారీ ; యత్రేతి । విష-సంసర్గః = విషసంపృక్తమ్, గరలం ; అమృతం = పీయూషమపి ; మృత్యవే = మరణకారీ, మృత్యుప్రదం భవతీత్యర్థః॥౧.౬॥
🌻
తాత్పర్యమ్--
అయుక్తేన మార్గేణ ఇష్టం వస్తు ప్రాప్యతే, తథాపి తస్య పరిణామః న మఙ్గలకారీ। యస్మిన్ స్థానే గరలేన సంయుక్తః, తత్ర అమృతమపి ప్రాణహారకద్రవ్యం భవతి॥౧.౬॥
🌿
హిన్ద్యర్థః--
అపనే అహిత కారక- (శత్రు) సే ఇష్ట వస్తు మిలనే పర భీ ఉసకా పరిణామ అచ్ఛా నహీం హోతా హై । జైసే అమృత మేం విష కా సంసర్గ హో తో వహ అమృత భీ మృత్యు కా హీ కారణ హోతా హై ॥౧.౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అనిష్టాత్ = ఇష్టం కాని (సంఘటన) దాని వలన ; ఇష్టలాభే అపి = అభీష్టలాభప్రాప్తి కలిగినను ; శుభా = శుభప్రదమైన ; గతిః = (ఫలమై) స్థితి (గా) ; న జాయతే = అగుచులేదు ; (యథా = ఎట్లనగా) యత్ర = ఎందులో (ఏ పదార్థమందైతే), విష-సంసర్గః = విషంతో కలిసిన ; అమృతం = (పీయూషం), అమృతం కూడా ; తదపి = అది (ఆ పదార్థం) కూడా, మృత్యవే = మరణం కొరకు ; భవతి = అగుచున్నది అని అర్థము. ॥౧.౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఇష్టం కాని సంఘటన,లేక వ్యక్తి వలన ; అభీష్టలాభప్రాప్తి కలిగినను, శుభప్రదమైన ఫలాన్నిచ్చునదై అగుచులేదు ఎట్లనగా... విషంతో కలిసిన అమృతం కూడా, మరణహేతువై అగుచున్నది కదా అలా...అని భావము. ॥౧.౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.4

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.4🌺
🌷
మూలమ్--
ఉత్థాయోత్థాయ బోద్ధవ్యం మహద్భయముపస్థితమ్। (పాఠ. కిమద్య సుకృతం కృతమ్ ।)
మరణవ్యాధిశోకానాం కిమద్య నిపతిష్యతి॥౧.౪॥

🌺
పదవిభాగః--
ఉత్థాయ ఉత్థాయ బోద్ధవ్యం మహద్-భయమ్ ఉపస్థితమ్। (పాఠ. కిమ్ అద్య సుకృతం కృతమ్) । మరణ-వ్యాధి-శోకానాం కిమ్ అద్య నిపతిష్యతి॥౧.౪॥
🌸
అన్వయః--
ఉత్థాయ ఉత్థాయ ఉపస్థితం మహద్-భయమ్ బోద్ధవ్యం । (పాఠ. అద్య కిమ్ సుకృతం కృతమ్) । అద్య మరణ-వ్యాధి-శోకానాం కిమ్ నిపతిష్యతి (ఇతి) ॥౧.౪॥
🌼
ప్రతిపదార్థః--
ఉత్థాయ ఉత్థాయ = ముహుః ప్రబుధ్య ; ఉపస్థితం = ప్రాప్తం ; మహద్భయం = మహాభీతిః ; బోద్ధవ్యం=జ్ఞాతవ్యమ్ ; కిం జ్ఞాతవ్యమత ఆహ- మరణేతి ; మరణ-వ్యాధి-శోకానాం = మృత్యు-రోగ-మానసికపీడానాం మధ్యాత్ ; నిపతిష్యతి = ఆపతిష్యతి॥౧.౪॥
🌻
తాత్పర్యమ్--
జీవైః ప్రతిదినం (ప్రాతః నిద్రాతః) సముత్థాయ విచారణీయం (స్మర్తవ్యమ్) । సంసారే స్థితాభ్యః పీడాభ్యః కా వా అద్య మామ్ ఆగత్య పీడయేదితి (సర్వదా సావధానేన భవితవ్యమ్। విపత్తయే సన్నద్ధతయా స్థాతవ్యమ్) ॥౧.౪॥
🌿
హిన్ద్యర్థః--
సంసారీ జీవోం కో ప్రతిదిన ఉఠకర విచారనా చాహియే ఔర సదా సావధాన రహనా చాహిఏ కి ఆజ మృత్యు శోక భయ ఆది విపత్తియో మేం సే కౌన సీ విపత్తి ఆనేవాలీ హై? అర్థాత్ జానే కబ కౌన విపత్తి ఆజాఏ, అతః బుద్ధిమాన్ మనుష్య కో ఉసకే లిఏ సదా సావధాన రహనా చాహిఏ॥౧.౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అద్య =ఈ రోజు ; మరణ-వ్యాధి-శోకానాం = మృత్యు-రోగ-దుఃఖములలో ; కిం = (ఏదేని) ఏమి ; నిపతిష్యతి = (పడగలదు) ప్రాప్తించగలదు ; ఇతి = అనే), మహత్ భయం = (దారుణమైన),గొప్పనైన భయము ; ఉపస్థితం = (సంభవించినది) వచ్చినది ; (ఏవం = ఇలా, ప్రాతః = ప్రొద్దున), ఉత్థాయ ఉత్థాయ = లేస్తూ లేస్తూనే ; బోద్ధవ్యం= (తెలుసుకోవాలి) అనుకోవాలి అని అర్థము. (జాగ్రత్తగా ఉండాలని సారాంశం). ॥౧.౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈనాడు మృత్యు-రోగ-దుఃఖములలో ఏదేని పడగలదు అనగా ప్రాప్తించగలదు, అనే దారుణమైన భయము సంభవించినది లేక వచ్చినది. అని ఇలా ప్రొద్దున, లేస్తూ లేస్తూనే తెలుసుకోవాలి లేక అనుకోవాలి అని భావము.జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని ఈ శ్లోకసారాంశం. ॥౧.౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.3

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.3🌺
🌷
మూలమ్--
శోకస్థానసహస్రాణి భయస్థానశతాని చ ।
దివసే దివసే మూఢమావిశన్తి న పణ్డితమ్ ॥౧.౩॥

🌺
పదవిభాగః--
శోక-స్థాన-సహస్రాణి భయ-స్థాన-శతాని చ । దివసే దివసే మూఢమ్ ఆవిశన్తి న పణ్డితమ్ ॥౧.౩॥
🌸
అన్వయః--
శోక-స్థాన-సహస్రాణి భయ-స్థాన-శతాని చ । దివసే దివసే మూఢమ్ ఆవిశన్తి। పణ్డితమ్ న (ఆవిశన్తి) ॥౧.౩॥
🌼
ప్రతిపదార్థః--
శోక-స్థాన-సహస్రాణి = సహస్రశః శోకకారణాని, శోకావసరా ఇత్యర్థః ; భయస్థానశతాని = శతశో భయహేతవః ; దివసే-దివసే = ప్రతిదినమేవ ; మూఢం = మూర్ఖమేవ ; ఆవిశన్తి = ఆశ్రయన్తే, వ్యాకులం కుర్వన్తి ; పరన్తు పణ్డితం = విద్వాంసన్తు ; న = నైవ ఆవిశన్తి॥౧.౩॥
🌻
తాత్పర్యమ్--
సహస్రశః శోకకారణాని శతశో భయహేతవః ప్రతిదినమేవ మూర్ఖమ్ వ్యాకులం కుర్వన్తి ; పరన్తు విద్వాంసన్తు నైవ పీడయన్తి ॥౧.౩॥
🌿
హిన్ద్యర్థః--
మూర్ఖ మనుష్య కే సామనే తో ప్రతిదిన హజారోం శోక కే స్థాన ఏవం సైకడోం భయ కే స్థాన (అవసర) ఉపస్థిత హుఆ హీ కరతే హైం। పరంతు ఉనసే మూర్ఖ లోగ హీ విచలిత హోతే హైం పండిత నహీం।

ఆన్ధ్రప్రతిపదార్థః :-
శోక-స్థాన-సహస్రాణి = దుఃఖకారకములు వేల కొలది ; భయస్థానశతాని = భయహేతువులు వందల కొలది ; (ఇలా), దివసే-దివసే = ప్రతిదినము ; మూఢం = మూర్ఖున్ని ; ఆవిశన్తి = ఆశ్రయించుచున్నవి ; (పరన్తు = కాని), పణ్డితం = (జ్ఞానిని), విద్వాంసున్ని ; న = (దుఃఖభయాదులు) ఆశ్రయించుచు లేవు అని అర్థము ॥౧.౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
దుఃఖకారకములు వేల కొలది, భయహేతువులు వందల కొలది, ఇలా ప్రతిదినము, మూర్ఖున్ని అనగా అజ్ఞానిని మాత్రమే ఆశ్రయించుచున్నవి ; కాని, జ్ఞానిని అనగా పండితున్ని ఏలాంటి దుఃఖభయాది సంఘటనలు ఆశ్రయించుచు లేవు,అనగా అన్ని చెడు ఫలితాలకు అజ్ఞానమే మూలకారణమని భావము. ౹౹౧.౩॥
🙏