Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Wednesday, December 23, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.62

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.62🌺
🌷
మూలమ్--
బాలో వా యది వా వృద్ధో యువా వా గృహమాగతః ।
తస్య పూజా విధాతవ్యా సర్వస్యాభ్యాగతో గురుః॥౧.౬౨॥

🌺
పదవిభాగః--
బాలః వా యది వా వృద్ధః యువా వా గృహమ్ ఆగతః । తస్య పూజా విధాతవ్యా సర్వస్య ఆభ్యాగతః గురుః॥౧.౬౨॥
🌸
అన్వయః--
యది బాలః వా, వృద్ధః వా, యువా వా గృహమ్ ఆగతః, (తర్హి) తస్య పూజా విధాతవ్యా । ఆభ్యాగతః సర్వస్య గురుః (వర్తతే) ॥౧.౬౨॥
🌼
ప్రతిపదార్థః--
గృహమాగతః = స్వగృహ-ద్వారి సముపస్థితః, అతిథిః ; తస్య = అతిథేః ; పూజా = సత్క్రియా ; విధాతవ్యా = కర్తవ్యా ; అభ్యాగతః = అన్య-గ్రామాదాగతః అతిథిః ; గురుః = పూజ్యః॥౧.౬౨॥
🌻
తాత్పర్యమ్--
గేహస్య పురతః ఆగతః అతిథిః బాలకః, యువా, వృద్ధో వా భవతు- తస్య సముచితః సత్కారః కర్తవ్యః। అభ్యాగతః సర్వేషాం (సర్వవర్ణాశ్రమధర్మిణాం) పూజ్యః వర్తతే॥౧.౬౨॥
🌿
హిన్ద్యర్థః--
అతిథి యది బాలక హో యా వృద్ధ హో యా జవాన హో, వహ యది అపనే ఘర పర ఆ జాయ, తో ఉసకీ పూజా అవశ్య కరనీ చాహియే। క్యోం కి అతిథి సభీ కా గురు ఔర పూజ్య హోతా హై॥౧.౬౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
🍀
బాలో వా = పిల్లవాడైన ; వృధ్ధో వా = ముసలివాడైన ; వా = లేక ; యువా వా = యువకుడైనా ; యది గృహమాగతః = ఇంటికి వచ్చినట్లైతే ; తస్య = అతనికి ; పూజా = అర్హమైన సపర్య ; విధాతవ్యా =చేయవలెను ; (యతః = ఎందుకనగా) అభ్యాగతః = అతిథి ; సర్వస్య = ప్రతివానికి ; గురుః = పూజనీయుడే అని అర్థము.  ॥౧.౬౨॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
పిల్లవాడైనను, ముసలివాడైనను, లేక యువకుడైనను, (ఇలా ఏ వయసు వాడైనను,) ఇంటికి వచ్చినట్లైతే, అతనికి ; అర్హమైన సపర్యలను చేయవలెను. ఎందుకనగా...ఇంటికి వచ్చిన అతిథి, ప్రతి గృహస్థునకు  పూజనీయుడే, (ఆదరింపబడువాడే) అని భావము.  ॥౧.౬౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.61

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.61🌺
🌷
మూలమ్--
తృణాని భూమిరుదకం వాక్ చతుర్థీ చ సూనృతా ।
ఏతాన్యపి సతాం గేహే నోచ్ఛిద్యన్తే కదాచన॥౧.౬౧॥

🌺
పదవిభాగః--
తృణాని భూమిః ఉదకం వాక్ చతుర్థీ చ సూనృతా । ఏతాని అపి సతాం గేహే న ఉచ్ఛిద్యన్తే కదాచన॥౧.౬౧॥
🌸
అన్వయః--
సతాం గేహే- తృణాని, భూమిః, ఉదకం, వాక్, చతుర్థీ చ సూనృతా - ఏతాని అపి కదాచన న ఉచ్ఛిద్యన్తే॥౧.౬౧॥
🌼
ప్రతిపదార్థః--
తృణాని = ఆస్తరణార్థం పలాల-కుశాదీని ; భూమిః = నివాస-స్థానమ్ ; ఉదకం = పానాద్యర్థే శీతలం పయః ; ఏతత్ త్రితయం ; కిఞ్చ-చతుర్థీ- ; సూనృతా = ప్రియా, సత్యా చ ; వాక్ = వాణీ ; ['సూనృతం మఙ్గలేఽపి స్యాత్ ప్రియసత్యే వచస్యపీ'తి మేదినీ] ; ఏతాని = చత్వారి ; అపి = తు ; సతాం = సాధూనాం ; గేహే = గృహే ; న ఉచ్ఛిద్యన్తే కదాచన = న కదాచన విరలీభవన్తి ; సదైవ సులభాని ఏవ ఇత్యాశయః॥౧.౬౧॥
🌻
తాత్పర్యమ్--
సజ్జనానాం గృహే- (ఉపవేశనాయ, శయనాయ చ) తృణాని, (వాసయోగ్యా) ధరా, (తృషాశాన్త్యర్థం) జలం, మధురా చ వాణీ-ఏతాని వస్తూని కదాపి అనుపలబ్ధతాం న యాన్తి॥౧.౬౧॥
🌿
హిన్ద్యర్థః--
బిఛానే కే లిఏ ఔర బైఠనే కే లిఏ పుఆల ఆది ఘాస ఫూస, రహనే కో స్థాన, జల- యే తీన చీజ़ ఔర చౌథా మీఠా వచన, ఇన చార చీజ़ోం కీ కమీ తో సజ్జనోం కే ఘర మేం కభీ భీ నహీం హోతీ హై । అర్థాత్ కుఛ భీ ఘర మేం దేనే కో న హో తో భీ ఇన చార వస్తుఓం సే హీ అతిథి కా సత్కార కరనా చాహియే॥౧.౬౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
తృణాని = తృణనిర్మితాసనములు ; భూమిః = నివాసస్థానము ; ఉదకం = (పానయోగ్యమైన) నీరు ; చతుర్థీ- నాల్గవదైన ; సూనృతా = సత్యమై, ప్రియమైన ; వాక్ = మాట ;  ఏతాని అపి = ఇవి(నాలుగు)ఐతే ; సతాం = సజ్జనులయొక్క ; గేహే = గృహము యందు ; కదాచన = ఎప్పుడు కూడా ; న ఉచ్ఛిద్యన్తే = లోపించవు అని అర్థము. ॥౧.౬౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తృణనిర్మితాసనములు అనగా గడ్డితో తయారు చేయబడిన చాపలు, నివాసయోగ్యమైన స్థలము, పానయోగ్యమైన నీరు, మరియు నాల్గవదైన సత్యమై, ప్రియమైన మాట, ఇవి నాలుగు కూడా సజ్జనులయొక్క, గృహము యందు  ఎప్పుడు కూడా లోపించవు (అనగా కొరత ఉండదని) భావము. ॥౧.౬౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.60

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.60🌺
🌷
మూలమ్--
అరావప్యుచితం కార్యమాతిథ్యం గృహమాగతే ।
ఛేత్తుః పార్శ్వగతాచ్ఛాయాం నోపసంహరతే ద్రుమః॥౧.౬౦॥

🌺
పదవిభాగః--
అరౌ అపి ఉచితం కార్యమ్ ఆతిథ్యం గృహమ్ ఆగతే । ఛేత్తుః పార్శ్వగతాత్ ఛాయాం న ఉపసంహరతే ద్రుమః॥౧.౬౦॥
🌸
అన్వయః--
అరౌ అపి గృహమ్ ఆగతే (సతి) ఉచితం ఆతిథ్యం కార్యమ్ । ద్రుమః ఛేత్తుః అపి పార్శ్వగతాత్ ఛాయాం న ఉపసంహరతే॥౧.౬౦॥
🌼
ప్రతిపదార్థః--
అరావితి । అరౌ = శత్రౌ-అపి ; గృహమాగతే సతి- ఉచితం = యోగ్యమ్, ఆతిథ్యమ్ = అతిథిసత్కారః ; ద్రుమః = వృక్షః ; పార్శ్వగతాత్ = నికటస్థితాత్ ; ఛేత్తుః = స్వచ్ఛేదకాత్, తక్ష్ణః సకాశాదపి ; స్వచ్ఛాయాం నోపసంహరతే = న సఙ్కోచయతి॥౧.౬౦॥
🌻
తాత్పర్యమ్--
 (గృహస్థ-ధర్మః చ ఏషః–) యదా శత్రుః గృహమాగచ్ఛతి, తదాపి యోగ్యా సత్క్రియా కార్యా । (అత్రోపమానమ్) యదా (తరుం ఖణ్డశః కర్తుం) ఛేదకః పరితః ఆగచ్ఛతి, తదాపి వృక్షః (తం) ఛాయాం (ప్రదదాతి), న నివర్తయతి ॥౧.౬౦॥
🌿
హిన్ద్యర్థః--
శత్రు భీ యది అపనే ధర పర ఆ జాఏ తో ఉసకా భీ ఉచిత ఆతిథ్య సత్కార కరనా చాహిఏ । దేఖో- వృక్ష అపనే కాటనే వాలే బఢఈ, సుతార ఆది కీ ఓర సే భీ అపనీ సుశీతల ఛాయా కో కభీ నహీం హటాతా హై॥౧.౬౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
గృహం ఆగతే = ఇంటికి వచ్చిన ; అరౌ అపి = శత్రువు విషయమంలో కూడా ; ఉచితం = తగిన రీతిలో ; ఆతిథ్యమ్ = (భోజనవసతి సౌకర్యాలను) అతిథిసత్కారములను ; కార్యం = చేయాలి ; (యతః = ఎందుకనగా), ద్రుమః = చెట్టు ; ఛేత్తుః (అపి)=(తనను) నరికే వాడికి (కూడా) ;  పార్శ్వగతాం = (తన)సమీపమందున్న ;  ఛాయామ్ = నీడను ; న ఉపసంహరతే = ఇవ్వకుండా ఉండడం లేదు అని అర్థము. ॥౧.౬౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఇంటికి వచ్చిన శత్రువును కూడా, తగిన రీతిలో (భోజనవసతి సౌకర్యాలను కల్పించి  గౌరవించాలి) అతిథిసత్కారములను చేయాలి. (అదే ధర్మము). (ఎట్లనగా), చెట్టు తనను నరికే వాడికి కూడా, తన నీడను ఉపసంహరించుచు లేదు.(అందిస్తూ గౌరవిస్తుంది, సుఖపెడుతుంది)  అని భావము. ॥౧.౬౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.59

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.59🌺
🌷
మూలమ్--
జాతిమాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ ।
వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యోఽథవా భవేత్॥౧.౫౯॥

🌺
పదవిభాగః--
జాతి-మాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ । వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యః అథవా భవేత్॥౧.౫౯॥
🌸
అన్వయః--
జాతి-మాత్రేణ కిం కశ్చిద్ వధ్యతే పూజ్యతే క్వచిత్ । వ్యవహారం పరిజ్ఞాయ వధ్యః పూజ్యః అథవా భవేత్॥౧.౫౯॥
🌼
ప్రతిపదార్థః--
కశ్చిదపి ; క్వచిత్ = కస్మింశ్చిత్ స్థలేఽపి ; జాతిమాత్రేణ = 'అయం ఏవంజాతీయ' ఇత్యేతావన్మాత్రేణైవ ; కిం వధ్యతే = కిం హన్యతే ; కిం పూజ్యతే = కిం సత్క్రియతే ; నైవేత్యర్థః ; వ్యవహారం = తదాచారమ్ ; పరిజ్ఞాయ = దృష్ట్వా, అనురుధ్యైవ వధ్యః = హన్తవ్యః ; పూజ్యః = సత్కారయోగ్యః ॥౧.౫౯॥
🌻
తాత్పర్యమ్--
జన్మమాత్రేణ ప్రాప్తేన జీవాకారేణ ఏవ కోఽపి సత్క్రియార్హత్వం వా, హన్తవ్యత్వం వా న ప్రాప్నోతి । తస్య ప్రవృత్త్యా జ్ఞాయతే యత్ సః వ్యాపాదితవ్య ఉత సత్కారపాత్రం వేతి॥౧.౫౯॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి-కోఈ భీ వ్యక్తి జాతిమాత్ర హీ సే మారనే వా పూజనే లాయక నహీం హోతా హై, కిన్తు ఉనకా వ్యవహార దేఖ కర హీ ఉసే మారనా యా పూజనా చాహిఏ॥౧.౫౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
క్వచిత్ = ఎక్కడైనా ; కశ్చిత్ =ఎవడైనా ; జాతిమాత్రేణ = (చాండాల, బ్రాహ్మణాది) కులవివక్ష చేత ; కిం వధ్యతే = (అవమానింపబడుతాడా) చంపబడుతాడా ? కిం పూజ్యతే = పూజింపబడుతాడా ? వ్యవహారం = (ఆ వ్యక్తియొక్క) జీవనసరళిని ; పరిజ్ఞాయ = తెలుసుకుని ; వధ్యః = చంపబడేవాడుగా : అథవా = లేక; పూజ్యః = పూజింపబడువాడుగా ; భవేత్ = అగు గాక అని అర్థము. ॥౧.౫౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎక్కడైనా, ఎవడైనా, చాండాల, బ్రాహ్మణాది కులవివక్ష చేత అవమానించడం గాని, చంపబడడం గాని, లేక పూజింపబడడం గాని శాస్త్రవిరుద్ధము. అన్యాయము. ఎక్కడైనా, ఏ కాలమందైనా, ఏ కులం వాడైనా, ఆ వ్యక్తియొక్క జీవనసరళిని, స్వరూపస్వభావాలను తెలుసుకున్నాక మాత్రమే, చంపబడేవాడా ? లేక పూజింపబడేవాడా ? అని నిర్ణయించాలి. అంతేగాని కులచర్చ అప్రస్తుతం అని భావము. అనగా అవమానగౌరవాది విషయాలలో కులంకంటే. గుణమే ప్రధానమని భావము. ॥౧.౫౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.58

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.58🌺
🌷
మూలమ్--
తావద్ భయస్య భేతవ్యం యావద్ భయమనాగతమ్ ।
ఆగతం తు భయం వీక్ష్య నరః కుర్యాద్ యథోచితమ్॥౧.౫౮ ॥

🌺
పదవిభాగః--
తావద్ భయస్య భేతవ్యం యావద్ భయమ్ అనాగతమ్ । ఆగతం తు భయం వీక్ష్య నరః కుర్యాద్ యథోచితమ్॥౧.౫౮॥
🌸
అన్వయః--
యావద్ భయమ్ అనాగతం, తావద్ భయస్య భేతవ్యమ్ । ఆగతం భయం తు వీక్ష్య నరః యథోచితం కుర్యాత్॥౧.౫౮॥
🌼
ప్రతిపదార్థః--
భయస్య = భయజనకస్య చౌరవ్యాఘ్రాదేః ; భేతవ్యం = భీతిః కార్యా ; భయం = భయప్రదం చోరవ్యాఘ్రాదికమ్, ఆగతమ్ = ఉపస్థితమ్ ; వీక్ష్య = దృష్ట్వా తు ; యథోచితం = యథాయోగ్యం తత్ప్రతీకారోపాయమ్ ; కుర్యాత్ = విదధీత॥౧.౫౮॥
🌻
తాత్పర్యమ్--
ధైర్యహారకం, భీతిజనకం చ యద్యద్ కారణం భవతి, తస్య ఆగమనాత్ పూర్వమేవ భీతిర్న కార్యా। (తస్మాత్ ప్రాక్ ధైర్యం వోఢవ్యమ్ ।) తస్మిన్ ఆగతే సతి సకృత్ పరిశీల్య యద్ యోగ్యం తత్ కర్తవ్యమ్॥౧.౫౮॥
🌿
హిన్ద్యర్థః--
ఇసలిఏ మనుష్య కో సభీ ప్రకార కే అపనే బహుత సే మిత్ర కరనే చాహియే। దేఖో, చిత్రగ్రీవ కే మిత్ర చూహే నే కబూతరోం కో బన్ధన సే ఛుడ़ా దియా థా॥౧.౫౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యావత్ = ఎంతవరకు ; భయం = (భయపెట్టే సంఘటన) భయము ; అనాగతమ్ = రాలేదో ; తావత్ = అంతవరకు ; భయాత్ = భయము వలన ; భేతవ్యం = (ఎలా భయసంఘటన వస్తుందో అని) భయపడాలి ; తు = కానీ ; ఆగతం = వచ్చిన ; భయం = భయమును ; వీక్ష్య = చూచి ; నరః = మానవుడు ; యథోచితం = (భయనివారణ కొరకు) తగినట్లుగా ; కుర్యాత్ = చేయవలెను అని అర్థము. అనగా భయసంఘటన పట్ల జాగరూకతతో, జాగ్రత్తగా వ్యవహరించవలెనని అర్థము. ॥౧.౫౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎంతవరకు భయపెట్టే సంఘటన మరియు భయము రాలేదో, అంతవరకు భయము వలన ; ఎలా భయసంఘటన వస్తుందో అని భయపడాలి. కానీ వచ్చిన భయసంఘటనను భయమును చూచి, మానవుడు, భయనివారణ కొరకు తగినట్లుగా చర్యలు చేపట్టవలెను అని భావము. అనగా భయసంఘటన పట్ల జాగరూకతతో, జాగ్రత్తగా వ్యవహరించవలెనని భావము. ॥౧.౫౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.55

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.55🌺
🌷
మూలమ్--
యద్యేన యుజ్యతే లోకే బుధస్తత్ తేన యోజయేత్ ।
అహమన్నం భవాన్ భోక్తా కథం ప్రీతిర్భవిష్యతి॥౧.౫౫॥
భక్ష్యభక్షయోః ప్రీతిర్విపత్తేః కారణం మతమ్ ।

🌺
పదవిభాగః--
యద్ యేన యుజ్యతే లోకే బుధః తత్ తేన యోజయేత్ । అహమ్ అన్నం భవాన్ భోక్తా కథం ప్రీతిః భవిష్యతి । భక్ష్య-భక్షయోః ప్రీతిః విపత్తేః కారణం మతమ్॥౧.౫౫॥
🌸
అన్వయః--
లోకే యద్ యేన యుజ్యతే, బుధః తత్ తేన యోజయేత్ । అహమ్ అన్నం (అస్మి), భవాన్ (తు) భోక్తా (అస్తి), (అతః) కథం ప్రీతిః భవిష్యతి? భక్ష్య-భక్షయోః ప్రీతిః విపత్తేః కారణం (ఇతి) మతమ్॥౧.౫౫॥
🌼
ప్రతిపదార్థః--
యత్ = సౌహృదాది ; యేన = యేన సహ ; యుజ్యతే = తుల్యం భవతి ; యోజయేత్ = యోజనం కుర్యాత్ ; అన్నం = భక్ష్యభూతః, ఆహారః ; భోక్తా = భక్షకః ; ప్రీతిః = మైత్రీ, స్నేహశ్చ ; భక్ష్య-భక్షయోః = ఖాదితస్య, ఖాదతుః చ మధ్యే; ప్రీతిః = స్నేహభావః ; విపత్తేః = ఆపత్తేః ; కారణమితి మన్యతే॥౧.౫౫॥
🌻
తాత్పర్యమ్--
అస్మిన్ సంసారే ప్రజ్ఞావాన్ యోజ్యవస్తూని ఏవ పరస్పరం యోజయతి, నాన్యాని, విరుద్ధాని వా। ఆవయోః సా స్థితిః నాస్తి, యత్ సామ్యం లేశమపి భవేత్। భవతః అహం ఆహారోఽస్మి। భవాన్ మాం ఖాదతి। కథం సాధ్యమితి యావత్ । అతః ఆవయోః మిథః స్నేహభావః న యుక్తః॥౧.౫౫॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి-పణ్డిత కో చాహియే కి జిసకే సాథ మేల (మిత్రతా) హౌ సకతా హై, ఉసకే హీ సాథ మేల కరే । పరన్తు మైం తో ఆపకా అన్న (భక్ష్య) హూఁ ఔర ఆప మేరే భక్షక హైం । భలా హమారీ తుమారీ మిత్రతా కైసే హో సకతీ హై?॥౧.౫౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
లోకే = సంసారము యందు ; యత్ = ఏది ; యేన = దేనితో ; యుజ్యతే = కలుపుటకు యోగ్యమగుచున్నదో ; తత్ = దానిని ; తేన = దానితో ; యోజయేత్ = కలుపవలెను ; (తస్మాత్ = అందువలన) అహం = (మూషకమైన) నేను ; అన్నం = తినబడే వాడను ; భవాన్ = (కాకులైన) మీరు ; భోక్తా = (మూషకమును) తినువారు ; (అతః = అందువలన, ఆవయోః = మనిద్దరి మధ్య), కథం = ఎట్లు ; ప్రీతిః = అనురాగము, స్నేహము ; భవిష్యతి = కాగలదు అనగా ఉండగలదు అని అర్థము. ॥౧.౫౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
సంసారము యందు ఏది, దేనితో కలుపుటకు యోగ్యమగుచున్నదో, దానిని దానితో మాత్రమే కలుపవలెను. అందువలన మూషకమైన నేను తినబడే వాడను. కాకులైన మీరు మూషకమును తినువారు. అందువలన, మనిద్దరి మధ్య ఎట్లు అనురాగము, స్నేహము ఎలా కుదురుతుంది అని భావము. ॥౧.౫౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.53

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.53🌺
🌷
మూలమ్--
వ్యోమైకాన్తవిహారిణోఽపి విహగాః సమ్ప్రాప్నువన్త్యాపదం
బధ్యన్తే నిపుణైరగాధసలిలాత్ మత్స్యాః సముద్రాదపి ।
దుర్నీతం కిమిహాస్తి కిం సుచరితం కః స్థానలాభే గుణః
కాలో హి వ్యసనప్రసారితకరో గృహ్ణాతి దూరాదపి॥౧.౫౩॥

🌺
పదవిభాగః--
వ్యోమ-ఏకాన్త-విహారిణః అపి విహగాః సమ్ప్రాప్నువన్తి ఆపదం బధ్యన్తే నిపుణైః అగాధ-సలిలాత్ మత్స్యాః సముద్రాద్ అపి । దుర్నీతం కిమ్ ఇహ అస్తి కిం సుచరితం కః స్థానలాభే గుణః కాలః హి వ్యసన-ప్రసారిత-కరః గృహ్ణాతి దూరాద్ అపి॥౧.౫౩॥
🌸
అన్వయః--
విహగాః వ్యోమ-ఏకాన్త-విహారిణః అపి ఆపదం సమ్ప్రాప్నువన్తి । మత్స్యాః అగాధ-సలిలాత్ సముద్రాద్ అపి నిపుణైః బధ్యన్తే । ఇహ దుర్నీతం కిమ్ అస్తి? కిం సుచరితం (అస్తి) ? కః స్థానలాభే గుణః (అస్తి) ? వ్యసన-ప్రసారిత-కరః కాలః హి దూరాద్ అపి గృహ్ణాతి॥౧.౫౩॥
🌼
ప్రతిపదార్థః--
విహగాః = పక్షిణః ; వ్యోమైకాన్త-విహారిణః అపి = దూరతర-గగనాఙ్గణ-విహారిణః అపి ; ఆపదం = ప్రాణసఙ్కటం, జాలబన్ధనాది-విపదమ్ ; సమ్ప్రాప్నువన్తి = లభన్తే ; నిపుణైః = కుశలైః ; అగాధ-సలిలాత్ = అతల-స్పర్శిజల-పూర్యాత్ ; సముద్రాదపి = సాగరాదపి ; మత్స్యాః = మీనాః ; బధ్యన్తే = జలాత్ అపనీయ గృహ్యన్తే ; లౌకైరితి శేషః ; దుర్నీతం = దుశ్చరితం ; సుచరితం = శోభనమ్ ఆచరణం వా- కిమ్? । స్థానలాభే = దుర్ధర్ష-నిరాపద-దురాసద-దుర్గమ-స్థానలాభే వా ; కో గుణః = కిం ఫలమ్? ; కాలః = మృత్యుః ; వ్యసన-ప్రసారితకరః = విపదవసరే కరౌ ప్రసార్య ఇవ ; దూరాదపి = దుర్గమాదపి స్థానాత్ ; గృహ్ణాతి = ఆదత్తే॥౧.౫౩॥
🌻
తాత్పర్యమ్--
పక్షిణః దూరే గగనే డయమానా అపి సఙ్కటే పతన్తి । అగాధే వారినిధౌ స్థితా అపి మీనాః ధీవరైః ప్రసారితైః జాలైః నిర్బధ్యన్తే । ఇహ లోకే కిం సాధు, కిమసాధు? అత్యన్తం యోగ్యస్థానప్రాప్త్యా కిమ్? మృత్యుః దూరాదపి విపత్తిరూపేణ ఆగత్య కరౌ విస్తీర్య (అస్మాన్ అవశ్యం) ధరతి॥౧.౫౩॥
🌿
హిన్ద్యర్థః--
ఆకాశ కే ఏకాన్త ఔర అత్యుచ్చ ప్రదేశ మేం విహార కరనే వాలే పక్షీ భీ ఆపత్తి మేం ఫఁస జాతే హైం । చతుర లోగ అథాహ జల వాలే సముద్ర సే భో మఛలియోం కో పకడ़ లేతే హైం । ఇసలియే ఇస సంసార మేం క్యా అచ్ఛా హై? ఔర క్యా బురా హై? ఔర క్యా యోగ్య స్థాన కీ ప్రాప్తి మేం భీ లాభ హై? అర్థాత్ కుఛ నహీం । క్యోం కి కాలరూపీ శత్రు వ్యసన (విపత్తి) రూపీ హాథ పసారే బైఠా హై, ఔర వహ మౌకా పాతే హీ దూర సే భీ ప్రాణియోం కో పకడ़ లేతా హై॥౧.౫౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
వ్యోమైకాన్త-విహారిణః అపి = ఏకాంతంగా ఉండే ఆకాశంలో విహరించుచున్నవైన ; విహగాః = పక్షులు ; ఆపదం = (ప్రాణసంకటమగు) ఆపదను; సంప్రాప్నువన్తి = పొందుచున్నవి ; నిపుణైః = నైపుణ్యం కలవారిచేత ; అగాధ-సలిలాత్ = అగాధజలరాశి గల ; సముద్రాదపి = సాగరమునుండి కూడా ; మత్స్యాః = చేపలు ; బధ్యన్తే = బంధిపబడుచున్నవి ; ఇహ = ఈ లోకంలో ; దుర్నీతం = దుశ్చరిత్ర (అనగా జరుగరానిది) ; సుచరితం చ = సచ్చరిత్ర అనునది (అనగా జరుగునది) ; కిమ్ (అస్తి) ఏమి (ఉంది) ; స్థానలాభే = (ఆపదలు లేని) స్థానమును పొందినను ; కో గుణః = ఏమి ఫలము ? వ్యసన-ప్రసారితకరః = ఆక్రమించే వ్యసనము గల ; కాలః = మృత్యువు ; దూరాదపి = (ఎంత) దూరమునుండి అయినను ; గృహ్ణాతి = (మృత్యునిమిత్తమై) గ్రహించుచున్నది అని అర్థము. ॥౧.౫౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏకాంతంగా ఉండే ఆకాశంలో విహరించుచున్నవైన పక్షులు, ప్రాణసంకటమగు ఆపదను పొందుచున్నవి. నైపుణ్యం కలవారిచేత, అగాధజలరాశి గల సాగరమునుండి కూడా, చేపలు బంధిపబడుచున్నవి. ఈ లోకంలో దుశ్చరిత్ర అనగా జరుగరానిది, సచ్చరిత్ర అనగా జరుగునది అనునది ఇక ఏమి ఉంది. ఆపదలు లేని స్థానమందున్నను ఏమి ఫలము ? ఎక్కడున్న ఆక్రమించే వ్యసనము గల ఈ మృత్యువు, ఎంత దూరమునుండైనను, మృత్యురూపమున అన్నింటినీ, అందరినీ గ్రహించుచున్నది అని భావము. ॥౧.౫౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.52

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.52🌺
🌷
మూలమ్--
శశిదివాకరయోర్గ్రహపీడనం
గజభుజఙ్గమయోరపి బన్ధనమ్ ।
మతిమతాం చ విలోక్య దరిద్రతాం
విధిరహో బలవాన్ ఇతి మే మతిః॥౧.౫౨॥

🌺
పదవిభాగః--
శశి-దివాకరయోః గ్రహపీడనం గజ-భుజఙ్గమయోః అపి బన్ధనమ్ । మతిమతాం చ విలోక్య దరిద్రతాం విధిః అహో బలవాన్ ఇతి మే మతిః॥౧.౫౨॥
🌸
అన్వయః--
శశి-దివాకరయోః గ్రహపీడనం, గజ-భుజఙ్గమయోః అపి బన్ధనమ్ । మతిమతాం చ దరిద్రతాం విలోక్య “అహో, విధిః బలవాన్” ఇతి మే మతిః॥౧.౫౨॥
🌼
ప్రతిపదార్థః--
శశిదివాకరయోః = సూర్యచన్ద్రమసోః । గ్రహపీడనం = రాహుణా గ్రహణమ్ ; గజభుజఙ్గమయోః = హస్తిసర్పయోః ; బన్ధనం = నిగ్రహం చ ; విలోక్య = దృష్ట్వా ; చ = పునః ; మతిమతాం = విదుషాం ; దరిద్రతాం = దారిద్ర్యం చ ; విలోక్య ; అహో = ఇతి ఆశ్చర్యే, ఖేదే వా ; విధిః = దైవం ; బలవాన్ = అనివార్యమ్ ఇతి ; మే = మమ ; మతిః = నిశ్చయః ; 'గ్రహః, సూర్యాదౌ పూతనాదౌ చ సైహికేయోపరాగయోరితి మేదినీ ;॥౧.౫౨॥
🌻
తాత్పర్యమ్--
దినకర-నిశాకరయోః (రాహు) గ్రహేణ గ్రసనం, నాగద్వయోః (కరిణః, భుజగస్య చ ) (వ్యాధేన) నిర్బన్ధనం, పణ్డితానాం ధనహీనతా చ— ఏతత్ త్రితయం దృష్ట్వా (స్థితః అహం) ‘విధిః బలీయః’ ఇతి నిశ్చినోమి ॥౧.౫౨॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి-- ఔర భీ--చన్ద్రమా ఔర సూర్య కో గ్రహణ కీ పీడా, అర్థాత్ గ్రహణ లగనా, హాథోం ఔర సాఁపోం కా బన్ధన,పణ్డితోం కీ భీ దరిద్రతా,ఇన సబ బాతోం కో దేఖకర మైం తో సమఝతా హూఁ కి భాగ్య హీ సబసే ప్రబల హై॥౧.౫౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
శశిదివాకరయోః = (లోకరక్షకులైన)సూర్యచంద్రులకు ; గ్రహపీడనం = (రాహుకేతువుల చేత) గ్రహణబాధ ; గజభుజఙ్గమయోః = ఏనుగుపాములకు ; బన్ధనం = నియంత్రణం (అనే బాధ) ; మతిమతాం = బుద్ధిమంతులకు ; దరిద్రతాం = దారిద్ర్యము ; విలోక్య = (ఇలాంటివి) చూచి ; అహో = ఆహా ! విధిః = భాగ్యము ; బలవాన్ = బలవత్తరము ; (ఇతి = అని), మే = నాయొక్క ; మతిః = (నిర్ణయము, అవగాహన) బుద్ధి అని అర్థము. ॥౧.౫౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
లోకరక్షకులైన, సూర్యచంద్రులకు రాహుకేతువుల చేత గ్రహణబాధ, ఏనుగుపాములకు నియంత్రింపబడడం అనే బాధ, బుద్ధిమంతులకు దారిద్ర్యము అనే బాధ, ఇలాంటివి చూచి, ఆహా ! విధికంటే బలవత్తరమైనది! లోకంలో ఏదియు లేదని నాయొక్క నిర్ణయము, అవగాహన అని భావము. ॥౧.౫౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.51

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.51🌺
🌷
మూలమ్--
యోఽధికాద్ యోజనశతాత్ పశ్యతీహామిషం ఖగః ।
స ఏవ ప్రాప్తకాలస్తు పాశబన్ధం న పశ్యతి॥౧.౫౧॥

🌺
పదవిభాగః--
యః అధికాద్ యోజన-శతాత్ పశ్యతి ఇహ ఆమిషం ఖగః । సః ఏవ ప్రాప్త-కాలః తు పాశబన్ధం న పశ్యతి॥౧.౫౧॥
🌸
అన్వయః--
యః ఖగః యోజన-శతాత్ అధికాద్ ఇహ ఆమిషం పశ్యతి, సః ఏవ ప్రాప్త-కాలః తు పాశబన్ధం న పశ్యతి॥౧.౫౧॥
🌼
ప్రతిపదార్థః--
ఖగః = గృధ్రాదిః ; యోజనశతాద్ అపి అధికాత్ = శతమపి యోజనానాం పారే ; ఆమిషం = స్వభక్ష్యం మాంసం ; పశ్యతి = (అత్ర) ద్రష్టుం శక్నోతి ; స ఏవ = దూరదృష్టిః ఖగః; ప్రాప్త-కాలః = ఆసన్నమృత్యుః సన్ ; పాశబన్ధం = జాలం ; న పశ్యతి = నైవ లక్షయతి॥౧.౫౧॥
🌻
తాత్పర్యమ్--
యః పక్షీ శతాధికయోజనదూరాత్ ఖాద్యపదార్థం మాంసం ద్రష్టుం శక్నోతి, స ఏవ ముత్యౌ సమీపే స్థితే సతి (సమీపస్థం) జాలం న పశ్యతి ॥౧.౫౧॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి--జో యజ్ఞ ఆది పక్షీ, సౌ యోజన (౪౦౦ కోశ) సే అధిక కీ దూరీ సే భీ మాఁస కో దేఖ సకతా హై, వహీ పక్షీ బురా సమయ ఆనే పర అపనే ఫఁసానే కే లిఏ బిఛాయే గఏ జాల కో భీ నహీం దేఖతా హై ఔర ఉసమేం ఫఁసకర అపనే ప్రాణ దేదేతా హై॥౧.౫౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యః ఖగః = (గద్ద, డేగ మొదలగు)ఏ పక్షి (ఐతే) ; ఇహ = ఈ లోకమందు ; యోజనశతాత్ (అపి) = నూరు యోజనములనుండి (కూడా)(యోజనమనగా నాలుగు కోసులు. కోసు అనగా 4 మైళ్ళు ) ; ఆమిషం = మాంసమును ; పశ్యతి = చూచుచున్నది ; స ఏవ = అలాంటి (దూరదృష్టి కలిగిన) పక్షియే ; ప్రాప్త-కాలః = చెడు కాలము సంప్రాప్తించినపుడు ; పాశబన్ధం = (ఆ మాంసం ప్రక్కనే ఉన్న, తనను) బంధించే వలను ; న పశ్యతి = చూడలేకపోతుంది అని అర్థము. అనగా ఈ లోకంలో స్వల్పప్రయోజనములకు ఆశపడి, విలువైనవి కోల్పోతున్నారు అని సారాంశము. ॥౧.౫౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
గద్ద, డేగ మొదలగు ఏ పక్షి ఐతే, ఈ లోకమందు నూరు యోజనములనుండి కూడా, యోజనమనగా నాలుగు కోసులు. కోసు అనగా 4 మైళ్ళు, అంత దూరము నుండి తనకు కావలిసిన మాంసమును చూడగలుగుతుంది. కానీ అంతటి దూరదృష్టి కలిగిన పక్షియే, తనకు చెడు కాలము సంప్రాప్తించినపుడు, ఆ మాంసం ప్రక్కనే ఉన్న, తనను బంధించే వలను చూడలేకపోతుంది అని భావము. అనగా ఈ లోకంలో స్వల్పప్రయోజనములకు ఆశపడి, విలువైనవి కోల్పోతున్నారు అని సారాంశము. ॥౧.౫౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.50

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.50🌺
🌷
మూలమ్--
శరీరస్య గుణానాం చ దూరమత్యన్తమన్తరమ్ ।
శరీరం క్షణవిధ్వంసి కల్పాన్తస్థాయినో గుణాః॥౧.౫౦॥

🌺
పదవిభాగః--
శరీరస్య గుణానాం చ దూరమ్ అత్యన్తమ్ అన్తరమ్ । శరీరం క్షణ-విధ్వంసి కల్పాన్త-స్థాయినః గుణాః॥౧.౫౦॥
🌸
అన్వయః--
శరీరస్య గుణానాం చ అన్తరమ్ అత్యన్తం దూరమ్ । శరీరం క్షణ-విధ్వంసి । గుణాః కల్పాన్త-స్థాయినః॥౧.౫౦॥
🌼
ప్రతిపదార్థః--
శరీరస్య = దేహస్య ; అత్యన్తం దూరం = నితరాం విప్రకృష్టమ్ ; అన్తరం = ప్రభేదః ; క్షణవిధ్వంసి = అచిరవినాశి, క్షణభఙ్గురమ్ ; గుణాః = దయాదాక్షిణ్యాదయః, యశ ఇతి యావత్ । కల్పాన్తస్థాయినః = ప్రలయపర్యన్తస్థాయినః॥౧.౫౦॥
🌻
తాత్పర్యమ్--
దేహస్య గుణానాం చ మధ్యే భేదః మహాన్। కాయః అవిలమ్బేన వినశ్యతి। గుణాస్తు సృష్టివిలయం యావత్ తిష్ఠన్తి ॥౧.౫౦॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి- శరీర మేం ఔర గుణోం మేం బహుత బడా భేద హై, శరీర తో క్షణ హీ మేం నష్ట హో జాతా హైం, పరన్తు గుణ ప్రలయ కాల తక రహతే హైం॥౧.౫౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
శరీరస్య = దేహమునకు ; గుణానాం చ = దయాదాక్షిణ్యాది గుణములకు ;అత్యన్తం = చాలా ; దూరం = దూరము ; (అపి చ = మరియు) అన్తరం (అపి) = భేదము (కూడా) ; (ఎట్లనగా), శరీరం = శరీరము ; క్షణవిధ్వంసి = క్షణంలో నశించునది ; (కింతు = కానీ) గుణాః = దయాదాక్షిణ్యాదివిశిష్ట)గుణములు ; కల్పాన్తస్థాయినః = సృష్టిపర్యంతము ఉండునవి అని అర్థము. ॥౧.౫౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
దేహమునకు, దయాదాక్షిణ్యాది గుణములకు స్వభావస్వరూపలక్షణాలలో చాలా తేడా ఉంటుంది. ఎట్లనగా...ఈ శరీరము ఏ క్షణంలో నైనా నశించవచ్చు. నశించడం అనివార్యం కూడా. కానీ దయాదాక్షిణ్యాదివిశిష్టగుణములు మాత్రము ఈ ఆకల్పాంతము అనగా సృష్టిపర్యంతము ఉంటాయి అని భావము. అనగా మానవుడు ఈ శరీరం పై అహంకారమమకారములను వదిలి, శాశ్వతత్వాన్ని అందించే ఉత్తమగుణములను ఆశ్రయిస్తూ, వాటిని కలిగియుండవలెనని భావము. ॥౧.౫౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.49

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.49🌺
🌷
మూలమ్--
యది నిత్యమనిత్యేన నిర్మలం మలవాహినా ।
యశః కాయేన లభ్యేత తన్న లబ్ధం భవేన్ ను కిమ్॥౧.౪౯॥

🌺
పదవిభాగః--
యది నిత్యమ్ అనిత్యేన నిర్మలం మలవాహినా । యశః కాయేన లభ్యేత తత్ న లబ్ధం భవేత్ ను కిమ్॥౧.౪౯॥
🌸
అన్వయః--
యది నిత్యం, నిర్మలం, యశః- అనిత్యేన, మలవాహినా, కాయేన- లభ్యేత తత్ (తర్హి) న లబ్ధం కిమ్ ను భవేత్ ?॥౧.౪౯॥
🌼
ప్రతిపదార్థః--
నిత్యం = చిరస్థాయి ; నిర్మలం = స్వచ్ఛమ్ ; యశః = కీర్తిః ; అనిత్యేన = నశ్వరేణ ; మలవాహినా = మలమూత్రపరిపూర్ణేన ; కాయేన = శరీరేణ ; తత్ర 'ను'-ఇతి వితర్కే । కిం లబ్ధం న భవేత్ = సర్వమేవ లబ్ధం భవేదిత్యర్థః॥౧.౪౯॥
🌻
తాత్పర్యమ్--
యది శాశ్వతీ, మలరహితా కీర్తిః, అశాశ్వతకేన, దూషితేన దేహేన (తన్మాధ్యమేన) లభ్యతే, తర్హి న కిమపి అప్రాప్తం శిష్యతే। (సర్వమేవ లబ్ధమితి యావత్।) ॥౧.౪౯॥
🌿
హిన్ద్యర్థః--
అనిత్య ఔర సూత్ర విష్ఠా ఆది మలోం కో వహన కరనే వాలే శరీర కే బదలే మేం యది నిర్మల ఔర నిత్య యశ మిలే, తో ఫిర కహో క్యా నహీం మిలా? । అథపి సబ కుఛ మిల గయా॥౧.౪౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అనిత్యేన = అశాశ్వతమైన ; మలవాహినా = పురీషాదిమలవాహనశీలమైన ; కాయేన = శరీరము చేత ; నిత్యం = చిరస్థాయి యైన ; నిర్మలం = (నిష్కల్మషమైన) విశుద్ధమైన ; యశః = కీర్తి ; యది లభ్యేత = పొందినచో ; తత్ =అలా ; కిం ను = (ఉత్కృష్టమైన) దేనిని ; లబ్ధం న భవేత్ = (ఇక)పొందనిది ఏముంటుంది ? అనగా ఈ శరీరంతో అన్నీ సాధించినట్లే అని అర్థము. ॥౧.౪౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అశాశ్వతమైన, పురీషాదిమలవాహనశీలమైన, ఈ శరీరము చేత, చిరస్థాయి యైన ; నిష్కల్మషమైన మరియు విశుద్ధమైన కీర్తిని పొందినచో, ఇక ఈ లోకంలో ఉత్కృష్టమైనది పొందనిది ఏముంటుంది ? అనగా సత్కీర్తిని పొందినచో, ఈ శరీరంతో అన్నీ సాధించినట్లే. అనగా సత్కీర్తిని పొందినప్పుడే మానవజన్మకు సార్థకత లభించునని ఉద్దేశ్యము. ॥౧.౪౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.48

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.48🌺
🌷
మూలమ్--
మాంసమూత్రపురీషాస్థిపూరితేఽస్మిన్ కలేవరే ।
వినశ్వరే విహాయాస్థాం యశః పాలయ మిత్ర మే॥౧.౪౮॥
🌺
పదవిభాగః--
మాంస-మూత్ర-పురీష-అస్థి-పూరితే అస్మిన్ కలేవరే । వినశ్వరే విహాయ ఆస్థాం యశః పాలయ మిత్ర మే॥౧.౪౮॥
🌸
అన్వయః--
మిత్ర, అస్మిన్ మాంస-మూత్ర-పురీష-అస్థి-పూరితే వినశ్వరే కలేవరే, ఆస్థాం విహాయ మే యశః పాలయ॥౧.౪౮॥
🌼
ప్రతిపదార్థః--
మిత్ర = హే సుహృత్ ; మాంసం = పిశితమ్ ; మూత్రం = మేహనమ్ ; పురీషం = విష్ఠా ; అస్థి = కీకసమ్ ; నిర్మితే = విరచితే, పరిపూర్ణే చ ; వినశ్వరే = వినాశశీలే ; కలేవరే = శరీరే ; ఆస్థాం = ఆలమ్బనం, ఆదరం వా ; మే యశః = మమ కీర్తిమ్ ; పాలయ = రక్ష ;॥౧.౪౮॥
🌻
తాత్పర్యమ్--
హే సఖే, కాయః విణ్మూత్రాదినా నిర్మితః అశాశ్వతః। అతః త్వం (తత్ పరిత్యజ్య) మమ అపేక్షాం విహాయ (శాశ్వతస్థాయినం) ఖ్యాతిం అవ ॥౧.౪౮॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ- హే మిత్ర! మాఁస, మూత్ర, విష్ఠా, హడ్డీ ఆది సే బనే హుఏ మేరే ఇస నాశ-శీల శరీర కే బచానే కీ ఇచ్ఛా కో లోక మేం ఆప మేరీ కీర్తి కీ హీ రక్షా కరో॥౧.౪౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
హే)మిత్ర = ఓ స్నేహితుడా ; మాంస-మూత్ర-పురీష-అస్థి-పూరితే = మాంసము, మూత్రము, మలము, బొక్కల చేత నిండియున్న; వినశ్వరే = నశించి పోయే ; కలేవరే = శరీరము యందు ; ఆస్థాం = (అతిరక్షణ అనే)ప్రయత్నమును ; విహాయ = వదిలి ; మే = నాయొక్క ; యశః = (స్వాశ్రితరక్షణజనితమైన) కీర్తిని ; పాలయ = రక్షించుమా అని అర్థము. ॥౧.౪౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ స్నేహితుడా ! మాంసము, మూత్రము, మలము, బొక్కల చేత నిండియున్న, ఈ నశించి పోయే నా శరీరమును రక్షించడమనే ప్రయత్నమును వదిలి, ముందుగా ఆ కపోతములను రక్షించి, స్వాశ్రితజనరక్షణజనితమైన నాయొక్క కీర్తిని, నీవు రక్షించుము అని భావము. ॥౧.౪౮॥
🙏

Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.47

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.47🌺
🌷
మూలమ్--
వినా వర్తనమేవైతే న త్యజన్తి మమాన్తికమ్ ।
తన్మే ప్రాణవ్యయేనాపి జీవయైతాన్ మమాశ్రితాన్॥౧.౪౭॥

🌺
పదవిభాగః--
వినా వర్తనమ్ ఏవ ఏతే న త్యజన్తి మమ అన్తికమ్ । తత్ మే ప్రాణ-వ్యయేన అపి జీవయ ఏతాన్ మమ ఆశ్రితాన్॥౧.౪౭॥
🌸
అన్వయః--
ఏతే వర్తనం వినా ఏవ న మమ అన్తికం న త్యజన్తి । తత్ ఏతాన్ మమ ఆశ్రితాన్ మే ప్రాణ-వ్యయేన అపి జీవయ॥౧.౪౭॥
🌼
ప్రతిపదార్థః--
వర్త్తనం = జీవికాం, వేతనం ; వినైవ = (వేతనాదిగ్రహణం) వినాఽపి ; మమ అన్తికం = మత్సాన్నిధ్యం ; న త్యజన్తి = న పరిహరన్తి ; తత్ = తస్మాత్ ; ప్రాణ-వ్యయేనాపి = మత్ప్రాణోపయోగేన అపి ; జీవయ = పాశచ్ఛేదేన ఏనాన్ పరిపాలయ॥౧.౪౭॥
🌻
తాత్పర్యమ్--
 (కపోతానాం కథాయాం మూషకేన కపోత రాజా ఇత్థం వదతి-) ఏతేభ్యః కపోతేభ్యః మాసికభృతిః కాపి న దీయతే, తథాపి ఏతే సదా మమ సన్నిధావేవ వసన్తి, మాం న పరిత్యజన్తి। అతః మమ ప్రాణః అపగచ్ఛేత్ తథాపి ఇమాన్ మమ అధీనే స్థితాన్ పూర్వం రక్ష- ఇతి ॥౧.౪౭॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ- వినా కిసీ ప్రకార కీ జీవికా ఔర వేతన కే భీ యే మేరా సాథ నహీం ఛోడతే హైం, ఇసలియే మేరే ప్రాణోం కీ పర్వాహ న కరకే భీ ఆప పహిలే ఇన (మేరే ఆశ్రితోం) కో హీ బచాఇఏ॥౧.౪౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఏతే (కపోతాః)=ఇవి (ఈ పావురములు) ; వర్తనం = (లాభాపేక్ష లేకుండగనే) ఆహారాది ప్రయోజనము ; వినైవ = లేకుండగనే ; మమ అన్తికం = నా సామీప్యాన్ని ; న త్యజన్తి = విడుచుచు లేవు ; తత్ = అందువలన ; మే = నాయొక్క ; ప్రాణ-వ్యయేనాపి = ప్రాణము తరిగి పోయినను ; మమ = (చిత్రగ్రీవుడనే ముషాకరాజును) నన్ను ; ఆశ్రితాన్ = (నిస్స్వార్థంగా) ఆశ్రయించిన ; ఏతాన్ =వీటిని(ఈ పావురములను ; జీవయ = (వలలో చిక్కిన వీటిని) బ్రతికించుమా అని అర్థము. చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉండడం మహాత్ముల లక్షణం. ॥౧.౪౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈ పావురములు, లాభాపేక్ష లేకుండగనే ఆహారాది స్వార్థప్రయోజనము లేకున్నను, ఈ కష్టకాలంలో నన్ను విడిచి పోవడం లేదు. అందువలన నాయొక్క ప్రాణరక్షణకంటే, నన్ను నిస్స్వార్థంగా ఆశ్రయించి, కాపాడిన ఈ పావురములయొక్క ప్రాణరక్షణమే నాకు ముఖ్యము. కావున ముందుగా వలలో చిక్కిన ఈ పావురములను బ్రతికించుము అని భావము. చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉండడం మహాత్ముల లక్షణం అని సారాంశము. ॥౧.౪౭॥
🙏


హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.45

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.45🌺
🌷
మూలమ్--
ధనాని జీవితఞ్చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్ ।
సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి॥౧.౪౫॥

🌺
పదవిభాగః--
ధనాని జీవితం చ ఏవ పరార్థే ప్రాజ్ఞః ఉత్సృజేత్ । సన్నిమిత్తే వరం త్యాగః వినాశే నియతే సతి॥౧.౪౫॥
🌸
అన్వయః--
ప్రాజ్ఞః ధనాని జీవితం చ ఏవ పరార్థే ఉత్సృజేత్ । వినాశే నియతే సతి సన్నిమిత్తే త్యాగః వరమ్॥౧.౪౫॥
🌼
ప్రతిపదార్థః--
ప్రాజ్ఞః = విద్వాన్ ; జీవితం = ప్రాణాన్ ; పరార్థే = పరోపకారాయ ; ఉత్సృజేత్ = దద్యాత్ ; వినాశే = మరణే ; నియతే = నిశ్చితే సతి ; సన్నిమిత్తే = సత్కార్యసిద్ధయే, పరోపకారాయ ; త్యాగః = ప్రాణపరిత్యాగః ; వరం = కిఞ్చిత్ శ్రేష్ఠః॥౧.౪౫॥
🌻
తాత్పర్యమ్--
బుధజనః పరేషాముపయోగాయ విత్తం జీవనం చార్పయతి। నాశనమేవ యది (అశాశ్వతేఽస్మిన్) లోకే నియమః భవతి, తర్హి సత్కార్యాచరణార్థం ధనప్రాణయోః ఉపయోగః ఏవ శ్రేష్ఠః ॥౧.౪౫॥
🌿
హిన్ద్యర్థః--
కిసీ నే ఠీక హీ కహా హై, కి- విద్వాన్ లోగోం కో అపనే ధన తథా ప్రాణోం కో స్వరోం కే ఉపకార కే లిఏ సమర్పణ కర దేనా చాహిఏ । క్యోం కి జబ ఉన ప్రాణోం కా ఔర ధన కా నాశ హోనా నిశ్చిత హీ హై, తో ఉన్హేం సదుపయోగ మేం లగా దేనా హీ అచ్ఛా హై॥౧.౪౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ప్రాజ్ఞః = విద్వాంసుడు ; ధనాని = సంపదలను ; జీవితం = (తన) జీవితాన్ని; పరార్థే = పరోపకారము కొరకు ; ఉత్సృజేత్ = (నిశ్శంకగా) వదలవలెను ; వినాశే = మరణము ; నియతే = నిశ్చయమై ఉండగా ; సన్నిమిత్తే = (ఉత్తమఫలసాధకమైన పరోపకారమనే) ఉత్తమకారణము కొరకు ; త్యాగః = (సర్వ)పరిత్యాగము ; వరం = శ్రేష్ఠమైనది అని అర్థము. ॥౧.౪౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
విద్వాంసుడు తనవైన సంపదలను, చివరకు తన జీవితాన్ని కూడా పరోపకారము కొరకు నిశ్శంకగా వదలవలెను. ఎందుకనగా ఈ జీవితంలో మరణము నిశ్చయమై ఉండగా, ఉత్తమఫలసాధకమైన పరోపకారమనే ఉత్తమకారణము కొరకు ఎవరికైనా వారి వారి ధనజీవితాదులను త్యాగము చేయగలుగుట అనునది ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ధన్యతను అందించునది అని భావము. ॥౧.౪౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.44

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.44🌺
🌷
మూలమ్--
ధర్మార్థకామమోక్షాణాం ప్రాణాః సంస్థితిహేతవః ।
తాన్ నిఘ్నతా కిం న హతం రక్షతా కిం న రక్షితమ్॥౧.౪౪॥

🌺
పదవిభాగః--
ధర్మార్థ-కామ-మోక్షాణాం ప్రాణాః సంస్థితి-హేతవః । తాన్ నిఘ్నతా కిం న హతం రక్షతా కిం న రక్షితమ్॥౧.౪౪॥
🌸
అన్వయః--
ప్రాణాః ధర్మార్థ-కామ-మోక్షాణాం సంస్థితి-హేతవః । తాన్ నిఘ్నతా కిం న హతమ్ ? రక్షతా కిం న రక్షితమ్? ॥
🌼
ప్రతిపదార్థః--
ప్రాణాః = ప్రాణాపానాదిపఞ్చవాయవః ; సంస్థితిహేతవః = యథావత్పాలనాది-హేతవః, జీవనే కారణభూతాని ; తాన్ప్రాణాన్ స్వశరీరమితి యావత్ ; నిఘ్నతా = వినాశయతా ; రక్షతా = పాలయతా ; ధర్మార్థకామమోక్షాఖ్యాశ్చత్వారః పురుషార్థాః ॥౧.౪౪॥
🌻
తాత్పర్యమ్--
 (శరీరస్య ధారణే యే హేతవః తే) ప్రాణాః ఏవ ధర్మాది-పురుషార్థ-చతుష్టయస్య సంస్థాపనేఽపి కారణమ్। పురుషః ప్రాణాన్ హత్వా సర్వం హన్తి, ప్రాణాన్ ఊత్వా (అవ్+త్వా) సర్వమ్ అవతి ॥౧.౪౪॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ- ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇన చారోం పురుషార్థోం కే మూల కారణ ప్రాణ హీ హైం । అతః జిసనే అపనే ప్రాణోం కా నాశ కియా ఉసనే కిస చీజ కా నాశ నహీం కియా? అర్థాత్ సబకా నాశ కియా । ఔర జిసనే ఉన ప్రాణోం కీ రక్షా కీ తో ఉసనే కిసకీ రక్షా నహీం కీ? । అర్థాత్ సబకీ రక్షా కీ॥౧.౪౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ప్రాణాః = (జీవనాధారమైన) ప్రాణములు ; ధర్మార్థకామమోక్షాణామ్ =పురుషార్థచతుష్టయము యొక్క ; సంస్థితిహేతవః = సాధనకు, రక్షణకు కారణములు ; తాన్ (ప్రాణాన్) = అలాంటి (ప్రాణములను మరియు శరీరమును, అవగాహన లేకుండా) ; నిఘ్నతా = చంపుకుంటే ; కిం=(ఇక) దేనిని ; న హతం = చంపనట్టు ? (ఏవం = అలాగే) రక్షతా = రక్షిస్తుంటే ; కిం=(ఇక) దేనిని ; రక్షతా = రక్షించనట్టు అని అర్థము. అనగా ప్రాణరక్షణమే జీవికి ప్రథమకర్తవ్యము అని అర్థము. ॥౧.౪౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
జీవనాధారమైన ప్రాణములు, పురుషార్థచతుష్టయము యొక్క సాధనకు, రక్షణకు కారణములు. అలాంటి ప్రాణములను మరియు శరీరమును అవగాహన లేకుండా చంపుకుంటే, ఇక దేనిని చంపనట్టు ? అనగా మూలాన్నే చంపుకున్నట్టు. అలాగే అలాంటి ప్రాణములను రక్షిస్తుంటే, ఇక దేనిని రక్షించనట్టు అని భావము. అనగా ప్రాణరక్షణమే జీవికి ప్రథమకర్తవ్యము. తదనంతరమే ధర్మసాధనాదులు అనియు సారాంశము. ॥౧.౪౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.43

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.43🌺
🌷
మూలమ్--
ఆపదర్థే ధనం రక్షేద్ దారాన్ రక్షేద్ధనైరపి ।
ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి॥౧.౪౩॥
🌺
పదవిభాగః--
ఆపద్-అర్థే ధనం రక్షేద్ దారాన్ రక్షేద్ ధనైః అపి । ఆత్మానం సతతం రక్షేద్ దారైః అపి ధనైః అపి॥౧.౪౩॥
🌸
అన్వయః--
ఆపదర్థే ధనం రక్షేత్। ధనైః అపి దారాన్ రక్షేత్ । దారైః అపి ధనైః అపి ఆత్మానం సతతం రక్షేత్॥౧.౪౩॥
🌼
ప్రతిపదార్థః--
ఆపదర్థే = ఆపత్ప్రతీకారాయ ; రక్షేత్ = అర్జయేత్, నిభృతం స్థాపయేత్ ; దారాన్ = కలత్రమ్ ; ధనైః = ధనదానాదిభిః ; రక్షేత్ = గోపాయేత్ ; ఆత్మానం = స్వశరీరన్తు ; దారైరపి = పత్న్యపేక్షయాపి ; ధనైరపి = ధనాపేక్షయాపి చ, తద్వ్యయేనాపి చ ; రక్షేత్ = పాలయేత్॥౧.౪౩॥
🌻
తాత్పర్యమ్--
కదాచిత్ భవిష్యత్కాలే విపత్తిస్థితిః సమ్భవేదితి ధియా కిఞ్చిత్ ధనమ్ ఉపయోగార్థం నికటే స్థాపనీయమ్। ధనస్యాపేక్షయా పత్న్యాః రక్షణం కార్యమథవా సమయే ఆపతితే విత్తేన భార్యా రక్షణీయా। తతశ్చ యదా ఆత్మనః విపత్కాలః ఆపతేత్, తదానీం ధనపత్న్యోరపేక్షయా, అథవా భార్యయా, ధనేన చ స్వస్య రక్షణం కరణీయమ్ ॥౧.౪౩ ॥🌹
🌿
హిన్ద్యర్థః--
ఆపత్తికాల కే లియే ధన కీ రక్షా కరనీ చాహిఏ, ఔర ధన కో ఖర్చ కర కే భీ స్త్రీ కో రక్షా కరనీ చాహిఏ, ఔర స్త్రీ ఔర ధన దోనోం సే భీ (ఉనకీ చిన్తా ఛోడకర, యా ఉనకో దేకర భీ) సదా అపనీ రక్షా కరనీ చాహిఏ॥౧.౪౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఆపదర్థే = (ఉత్పన్నమయ్యే) ఆపదల కొరకు ; ధనమ్ = ద్రవ్యమును ; రక్షేత్ = (సంపాదించిన దానినుండి కొంత) కాపాడుకోవలెను ;(అపిచ = మరియు) దారాన్ = భార్యను ; ధనైః = సంపదలతో ; రక్షేత్ = రక్షించవలెను ; దారైరపి = భార్యారక్షణంతో పాటుగా ; (ఏవం = అలాగే) ధనై రపి = ద్రవ్యరక్షణంతో పాటుగా ; ఆత్మానం = తనను తాను ; సతతం = ఎల్లప్పుడు ; రక్షేత్ = రక్షించుకోవలెను. తనకుమాలిన ధర్మం లేదు కనుక అని భావము. ॥౧.౪౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఉత్పన్నమయ్యే ఆపదల కొరకు ద్రవ్యమును, సంపాదించిన దానినుండి కొంత కాపాడుకోవలెను. మరియు భార్యను కూడా తన సంపదలతో రక్షించవలెను. మరియు భార్యారక్షణంతో పాటుగా, అలాగే ద్రవ్యరక్షణంతో తనను తాను కూడా ఎల్లప్పుడు రక్షించుకోవలెను. తనకుమాలిన ధర్మం లేదు కనుక అని భావము. ॥౧.౪౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.42

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.42🌺
🌷
మూలమ్--
రోగశోకపరీతాపబన్ధనవ్యసనాని చ ।
ఆత్మాపరాధవృక్షాణాం ఫలాన్యేతాని దేహినామ్॥౧.౪౨॥

🌺
పదవిభాగః--
రోగ-శోక-పరీతాప-బన్ధన-వ్యసనాని చ । ఆత్మా-అపరాధ-వృక్షాణాం ఫలాని ఏతాని దేహినామ్॥౧.౪౨॥
🌸
అన్వయః--
ఏతాని దేహినామ్ ఆత్మా-అపరాధ-వృక్షాణాం ఫలాని (భవన్తి) -- రోగ-శోక-పరీతాప-బన్ధన-వ్యసనాని చ (ఇతి) ॥౧.౪౨॥
🌼
ప్రతిపదార్థః--
దేహినాం = శరీరిణామ్ ; పరీతాపః = సన్తాపః ; బన్ధనం = కారాది-ప్రాప్తిః ; తాన్యేవ- వ్యసనాని = విపత్తయః ; తాని చ-- ఆత్మాపరాధవృక్షాణాం ~ఆత్మనా కృతాః అపరాధాః, తే ఏవ వృక్షాః తేషామ్-- అపరాధాః = పాపాని ; వృక్షాణాం = స్వకర్మ-వృక్షాణాం, ఫలాని = ఫలభూతాన్యేవ [స్వకృతైరేవ పాపైర్దుఃఖాని జనో లభతే, నాన్యైరితి భావః] ॥౧.౪౨॥
🌻
తాత్పర్యమ్--
ఆతురతా, హృత్పీడా, పశ్చాత్తాపః, నిర్బన్ధః, దుఃఖకాలాశ్చ ప్రాణినాం స్వయమాచరితానామ్ అకార్యాణాం పరిణామత్వేన సమ్భవన్తి॥౧.౪౨॥
🌿
హిన్ద్యర్థః--
రోగ, శోక, సన్తాప, బన్ధన, విపత్తి, యే సబ మనుష్య కే అపనే కిఏ హుఏ అపరాధ (పాప) రూపీ వృక్ష కే హీ ఫల హైం॥౧.౪౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
రోగ-శోక-పరీతాప-బన్ధన-వ్యసనాని, రోగః = రోగము ; శోకః = దుఃఖము ; పరీతాపః = సన్తాపము ; బన్ధనం = (బహువిధవిషయసంపర్కము) బంధింపబడడం ; వ్యసనాని చ = అలవాట్లు కూడా ; ఏతాని =ఈ రోగము మొదలగునవి; ఆత్మాపరాధవృక్షాణాం ~ దేహినాం = ప్రాణుల యొక్క ; ఆత్మాపరాధవృక్షాణామ్ = తన(తను చేసిన, చేస్తున్న) అపరాధమనే వృక్షముల యొక్క ; ఫలాని = (పరిణామములు) ఫలము అనగాఫలితములు ; అని అర్థము. ॥౧.౪౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అనుచితప్రవర్తనల వలన అంటించుకుంటున్న రోగము, సృష్టించుకుంటున్న దుఃఖము, తొందర పడడం వలన కలుతున్న సంతాపము, బహువిధవిషయసంపర్కములతో బంధింపబడడం, చెడు అని తెలిసినా వదలలేని అలవాట్లు, ఇవి అన్నియు ప్రాణులు తాము చేసిన, చేస్తున్న, అపరాధమనే వృక్షముల యొక్క ఫలములు అనగా ఫలితములే. తమకు తాముగా వచ్చినవి కాదు అని భావము. ॥౧.౪౨॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.41

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.41🌺
🌷
మూలమ్--
యస్మాచ్చ యేన చ యథా చ యదా చ యచ్చ
యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ ।
తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ
తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి॥౧.౪౧॥

🌺
పదవిభాగః--
యస్మాత్ చ యేన చ యథా చ యదా చ యత్ చ యావత్ చ యత్ర చ శుభ-అశుభమ్ ఆత్మకర్మ । తస్మాత్ చ తేన చ తథా చ తదా చ తత్ చ తావత్ చ తత్ర చ విధాతృ-వశాద్ ఉపైతి॥౧.౪౧॥
🌸
అన్వయః--
శుభ-అశుభమ్ ఆత్మకర్మ, యస్మాత్ చ యేన చ యథా చ యదా చ యత్ చ యావత్ చ యత్ర చ (ఆచరతి) తస్మాత్ చ తేన చ తథా చ తదా చ తత్ చ తావత్ చ తత్ర చ విధాతృ-వశాద్ (ఫలమ్) ఉపైతి॥౧.౪౧॥
🌼
ప్రతిపదార్థః--
యస్మాద్ధేతోః, యేన-కరణేన హస్తాదినా, యథా చ = యేన చ ప్రకారేణ ; యదా చ = యస్మిన్ కాలే చ, యత్-శుభాశుభశుభమ్ అశుభం వా ; ఆత్మకర్మ = స్వస్య పాపపుణ్య-సుఖదుఃఖాదికం ; యావత్ = యావన్మితం ; యత్ర =యస్మిన్దేశే చ భావి ; తత్ = తస్మాత్ కారణాత్ ; తేనైవ = ఉపకరణేన, తథా తేనైవ ప్రకారేణ ; తదా చ = తస్మిన్నేవ కాలే చ ; తచ్చ = తత్ఫలమ్ ; తావచ్చ = తావత్ ప్రమాణమేవ ; తత్రైవ దేశే ; విధాతృవశాత్ = భాగ్యవశాత్ ; ఉపైతి = శుభాశుభమాత్మఫలం స్వయమేవ నరముపయాతి॥౧.౪౧॥
🌻
తాత్పర్యమ్--
జీవః- ౧. యేన కారణేన, ౨. యేనోపాయేన, ౩. యేన విధానేన, ౪. యస్మిన్ కాలే, ౫. యస్మిన్ దేశే, ౬. యత్స్వరూపకం, ౭. యత్ప్రమాణకం చ, -పాపమథవా పుణ్యకర్మ ఆచరతి, తస్య ఫలమపి తత్కారణకం, తదుపాయకం, తద్విధానకం, తత్కాలకం, తద్దేశకం, తత్ప్రమాణకం, తథైవ చ భవతి॥౧.౪౧॥
🌿
హిన్ద్యర్థః--
పుణ్య అథవా పాప కర్మ జిస కారణ సే, జిస ఉపాయ సే, జిస ప్రకార సే, జిస సమయ మే, జైసా, జితనా, జిస స్థాన పర కరతా హై, వహ ప్రాణీ ఉసీ కారణ సే, ఉసీ ఉపాయ సే, ఉసీ ప్రకార సే, ఉసీ సమయ, వైసా హీ, ఉతనా హీ, ఉసీ స్థాన పర, ఉస పాపపుణ్య కే ఫల కో అవశ్య హీ (భాగ్యవశ) పాతా హై॥౧.౪౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్మాత్ (హేతోః,) = ఏ కారణము వలన ; యేన(కరణేన) = ఏ సాధనము చేత ; యథా చ = ఏ ప్రకారము చేత ; యదా చ = ఏ కాలము యందు ; యావత్ = ఎంత పరిమాణము యందు ; యత్ర చ = ఏ స్థానము యందు ; యత్ = ఎటువంటి ; శుభాశుభమ్...శుభమ్ = పుణ్యము ; అశుభం చ = పాపమును ; ఆత్మకర్మ = తన పనిగా ; (కరోతి = చేయుచున్నాడో) ; తత్ = ఆ కారణము వలన ; ; తేనైవ = ఆ సాధనము చేతనే ; తథా తేనైవ ప్రకారేణ = ఆ ప్రకారము చేతనే ; తదా చ = ఆ కాలమందే ; తచ్చ = తత్ఫలమ్ ; తావచ్చ = అంతే పరిమాణము ; తత్రైవ = ఆ స్థానము యందే ; విధాతృవశాత్ = భాగ్యవశము వలన ; తచ్చ = అలాంటి శుభాశుభఫలమే ; ఉపైతి = పొందుచున్నాడు అని అర్థము. ॥౧.౪౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఏ కారణము వలన, ఏ సాధనము చేత, ఏ ప్రకారముగా, ఏ కాలము యందు, ఎంత పరిమాణము యందు, ఏ స్థానము యందు, ఎటువంటి పుణ్యమును, పాపమును ; తన పనిగా చేయుచున్నాడో... ఆ కారణము వలన, ఆ సాధనము చేతనే, ఆ ప్రకారముగానే ; ఆ కాలమందే, ఆ ఫలము, అంతే పరిమాణముగా, ఆ స్థానము యందే, తను చేసిన పనికి, భాగ్యవశము వలన, అలాంటి శుభాశుభఫలమునే పొందుచున్నాడు అని భావము. అనగా ఎలాంటి పని చేస్తే, అలాంటి ఫలితమే వస్తుంది కానీ, తను అనుకుంటున్న ఫలితము రాదు అని సారాంశము. ॥౧.౪౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.40

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.40🌺
🌷
మూలమ్--
యస్య మిత్రేణ సమ్భాషో యస్య మిత్రేణ సంస్థితిః ।
యస్య మిత్రేణ సంలాపస్తతో నాస్తీహ పుణ్యవాన్॥౧.౪౦॥

🌺
పదవిభాగః--
యస్య మిత్రేణ సమ్భాషః యస్య మిత్రేణ సంస్థితిః । యస్య మిత్రేణ సంలాపః తతః న అస్తి ఇహ పుణ్యవాన్॥౧.౪౦॥
🌸
అన్వయః--
యస్య మిత్రేణ సమ్భాషః, యస్య మిత్రేణ సంస్థితిః, యస్య మిత్రేణ సంలాపః (చ) తతః పుణ్యవాన్ ఇహ న అస్తి॥౧.౪౦॥
🌼
ప్రతిపదార్థః--
యస్య మిత్రేణ = సుహృదా సహ ; సమ్భాషః = ఆలాపః ; సంస్థితిః = సహావస్థానమ్., సహవాసః ; సంలాపః = ముహుర్ముహః కథా, గోష్ఠీబన్ధః ; తతః = తదపేక్షయా ; ఇహ జగతి ; పుణ్యవాన్ = సుకృతీ॥౧.౪౦॥
🌻
తాత్పర్యమ్--
యః నిత్యం సఖ్యా ఆలపతే, సహ తిష్ఠతి, వార్తాలాపరతో భవతి, తతః భాగ్యవాన్ నరః న భవతి అన్యః॥౧.౪౦॥
🌿
హిన్ద్యర్థః--
జో అపనే మిత్ర కే సాథ సమ్భాషణ (మధుర భాషణ) కరతా హై ఔర జో అపనే మిత్ర కే సాథ రహతా హై ఔర జో అపనే మిత్ర కే సాథ ప్రేమ పూర్వక 'వార్తాలాప కరతా హై, ఉససే బఢ़కర ఇస పుణ్యవాన్ సంసార మేం దూసరా కోఈ నహీం హై॥౧.౪౦॥
🙏
ఆన్ధ్రప్రతిపదార్థః :-
యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సమ్భాషః = మాట, ముచ్చట ; యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సంస్థితిః = కలిసి ఉండడం ; యస్య = ఎవనికి ; మిత్రేణ = స్నేహితునితో ; సంలాపః = పరస్పరసంభాషణము ; ఇహ = ఈ సంసారంలో ; తతః = అంతకంటే ; పుణ్యవాన్ = పుణ్యాత్ముడు ; నాస్తి = లేడు, ఉండడు అని అర్థము. ॥౧.౪౦॥
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎవనికి స్నేహితునితో మాట, ముచ్చటకు అవకాశం కలదో, ఎవనికి స్నేహితునితో స్వేచ్ఛగా కలిసి ఉండే అవకాశం కలదో, ఎవనికి స్నేహితునితో ఇష్టానుసారము పరస్పరసంభాషణము చేయు అవకాశం కలదో, ఈ సంసారంలో అంతకంటే పుణ్యాత్ముడు, లేడు, ఉండడు. అనగా తనను అర్థం చేసుకుని ఆదరించే స్నేహితుని కలిగియున్న వాడు చాలా అదృష్టవంతుడని భావము. ॥౧.౪౦॥

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.39

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.39🌺
🌷
మూలమ్--
మాతా మిత్రం పితా చేతి స్వభావాత్ త్రితయం హితమ్ ।
కార్యకారణతశ్చాన్యే భవన్తి హితబుద్ధయః॥౧.౩౯॥

🌺
పదవిభాగః--
మాతా మిత్రం పితా చ ఇతి స్వభావాత్ త్రితయం హితమ్ । కార్య-కారణతః చ అన్యే భవన్తి హిత-బుద్ధయః॥౧.౩౯॥
🌸
అన్వయః--
మాతా మిత్రం పితా చ ఇతి స్వభావాత్ త్రితయం హితమ్ । అన్యే చ కార్య-కారణతః హిత-బుద్ధయః భవన్తి॥౧.౩౯॥
🌼
ప్రతిపదార్థః--
మాతా = జననీ ; పితా = జనకః ; మిత్రం = సుహృత్ ; స్వభావాత్ = ప్రకృత్యైవ ; త్రితయం = ఏతే త్రయః ; హితం = హితకారకమ్ ; అన్యే తు = ఏతత్-త్రితయాతిరిక్తాస్తు ; కార్యకారణతః = కార్యకారణ-ప్రసఙ్గేనైవ ; కిమపి కార్యం, కారణం వా ఉద్దిశ్యైవ ; హితబుద్ధయః = హితకారకాః భవన్తి॥౧.౩౯॥
🌻
తాత్పర్యమ్--
పితరౌ, సఖా చేతి త్రయః ప్రకృత్యా శ్రేయస్కరాః భవన్తి। ఏతాన్ విహాయ అన్యజనాః యం కమపి లాభం మనసి నిధాయ శుభచిన్తకా భవన్తి ॥౧.౩౯॥
🌿
హిన్ద్యర్థః--
మాతా పితా ఔర మిత్ర యే తీనోం స్వభావ హీ సే హిత చాహతే హైం, పరన్తు దూసరే లోగ తో కార్యవశ హీ హితేషీ హుఆ కరతే హైం॥౧.౩౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
మాతా = తల్లి ; మిత్రం = స్నేహితుడు ; పితా = తండ్రి ; స్వభావాత్ = (ఏ కారణము లేకుండగానే) స్వభావము వలేననే ; త్రితయం = ఈ మూడింటి సమూహము ; హితం = మంచిని చేయునది ; అన్యే తు = ఈ మూడింటికి భిన్నమైనవి ; కార్యకారణతః = కారణకార్యముల వలన (మాత్రమే) ; హితబుద్ధయః = మంచిచేయు సంకల్పము కలవారుగా భవన్తి = అగుచున్నారు అని అర్థము. ॥౧.౩౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఈ లోకంలో తల్లి, స్నేహితుడు, తండ్రి ఈ ముగ్గురు ఏ కారణము లేకుండగనే, అనగా ప్రతిఫలాపేక్ష లేకుండగనే, సహజంగానే మంచిని చేయువారు. ఈ ముగ్గురికంటే మిగిలినవారు కారణకార్యముల వలన మాత్రమే అనగా తమ లాభము చూసుకుని, మంచిచేయు సంకల్పము కలవారగుచున్నారు అని భావము. ॥౧. 39 ||
🙏