🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.14🌺
🌷
మూలమ్--
మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ।
ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి స పణ్డితః॥౧.౧౪॥
🌺
పదవిభాగః--
మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ । ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సః పణ్డితః॥౧.౧౪॥
🌸
అన్వయః--
పరదారేషు మాతృవత్, పరద్రవ్యేషు లోష్టవత్, సర్వభూతేషు ఆత్మవత్ (చ) యః పశ్యతి సః పణ్డితః॥౧.౧౪॥
🌼
ప్రతిపదార్థః--
పరదారేషు = పరకలత్రేషు, పరేషాం భార్యావిషయే ; మాతృవత్ = మాతృభావేన యః పశ్యతి ; లోష్టవత్ = మృత్ఖణ్డవత్, పాషాణపిణ్డవత్ వా ; పశ్యతీతి శేషః ; పణ్డితః = తత్త్వజ్ఞః॥౧.౧౪॥
🌻
తాత్పర్యమ్--
పరనరాణాం పత్నీః స్వస్య జననీ ఇతి భావనయా, పరేషాం ధనాని పాషాణఖణ్డా ఇతి ధియా, సర్వాన్ ప్రాణినః ఆత్మా ఇతి బుద్ధ్యా- యః భావయతి, సః విద్వాన్ భవతి ॥౧.౧౪॥
🌿
హిన్ద్యర్థః--
జో మనుష్య దూసరోంకీ స్త్రియోం కో అపనీ మాతా కీ తరహ సమఝేం, దూసరే కే ద్రవ్య కో మిట్టీ కా ఢేలా (టుకడా) సమఝే ఔర ప్రాణిమాత్ర కో అపనీ హీ తరహ సమఝే, వహీ సచ్చా పణ్డిత హై॥౧.౧౪॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఆత్మవత్ + తనవలెనే ;సర్వభూతేషు = అన్ని ప్రాణుల విషయము యందు ; యః = ఎవడైతే పశ్యతి = చూస్తాడో ; పరదారేషు = పరుల భార్యలందు, మాతృవత్ = మాతృ భావముతో; పర ద్రవ్యేషు=ఇతరుల ధనములందు;లోష్టవత్= మట్టి గడ్డవలె యః పశ్యతి= ఎవరు (భావిస్తారో)చూస్తారో; సఃపణ్డితః = అతడు పండితుడు (జ్ఞాని)॥౧.౧౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
పర సతులయందు తల్లి అనే భావంతో,పరుల సొత్తును మట్టిబెడ్డవలె ఎవరైతే భావిస్తారో అతడు జ్ఞాని.
🙏
నారాయణపండితుల సుప్రసిద్ధ కథాసంగ్రహ గ్రంథం నుండి సుభాషిత విజ్ఞానం - పదవిభాగ, అన్వయసహితంగా, సంస్కృతం తెలుగు ప్రతిపదార్థాలతో; సంస్కృతం, హిందీ, తెలుగు తాత్పర్యాలతో సంస్కృతార్థులకై సమర్పితం-
Tuesday, December 22, 2020
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.14
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.13
🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.13🌺
🌷
మూలమ్--
ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖదుఃఖే ప్రియాప్రియే ।
ఆత్మౌపమ్యేన పురుషః ప్రమాణమధిగచ్ఛతి॥౧.౧౩॥
🌺
పదవిభాగః--
ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖ-దుఃఖే ప్రియ-అప్రియే । ఆత్మా-ఔపమ్యేన పురుషః ప్రమాణమ్ అధిగచ్ఛతి॥౧.౧౩॥
🌸
అన్వయః--
పురుషః ప్రత్యాఖ్యానే చ దానే చ సుఖ-దుఃఖే ప్రియ-అప్రియే ఆత్మా-ఔపమ్యేన ప్రమాణమ్ అధిగచ్ఛతి॥౧.౧౩॥
🌼
ప్రతిపదార్థః--
ప్రత్యాఖ్యానే = ప్రార్థనాభఙ్గే, పరతిరస్కారే వా ; సుఖే = సుఖప్రదానే, దుఃఖే = క్లేశదానే, దుఃఖోత్పాదనే చ । ప్రియే = ఇష్టాచరణే, అప్రియే = అనిష్టాచరణే చ ; ఆత్నౌపమ్యేన = ఆత్మానమేవ నిదర్శనం కృత్వా ; ప్రమాణం = నిశ్చయమ్ ; అధిగచ్ఛతి = లభతే ;॥౧.౧౩॥
🌻
తాత్పర్యమ్--
పరైః తిరస్కారే ప్రాప్తే, సుఖే లబ్ధే, దుఃఖే అనుభూతే వా, ప్రియే ఘటితే, అప్రియే సమ్భూతే వా- కింవిధః అనుభవః భవతీతి నరః కథం జానీయాత్? తత్తదనుభవప్రాప్తౌ స్వస్మిన్ యథా భావనా జాగర్తి, తథైవాన్యేషామపి భవతీతి ఆత్మనః ఉపమానేన అవగచ్ఛేత్। (ఇష్టాత్ సుఖమ్ అనిష్టాద్ దుఃఖఞ్చోత్పద్యతే ఇత్యాదికం స్వాత్మౌపమ్యేన జ్ఞాతుం శక్యతే ఇతి యావత్) ॥౧.౧౩॥
🌿
హిన్ద్యర్థః--
ప్రత్యాఖ్యాన (కోఈ కుఛ కహే తో ఉసకే టాల దేనా, నా హీం కర దేనా), దాన, సుఖ ఔర దుఃఖ మేం అర్థాత్ కిసీ కో సుఖీ యా దుఃఖీ బనానా, కిసీ కో భలా బురా కహనా, ఇన బాతోం సే లోగోం కో కితనా సుఖ యా దుఃఖ హోతా హై। ఇసకా అనుమాన మనుష్య కో అపనే ఊపర హీ కరనా చాహిఏ॥౧.౧౩॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ప్రత్యాఖ్యానే = ఇతరులను విమర్శించుట, లేక తిరస్కరించుట; సుఖే = సుఖమును కలిగించుట, దుఃఖే = దుఃఖమును కలిగించుట, ప్రియే = ఇష్టమైన పని చేయుట, అప్రియే = ఇష్టముండని పని చేయుట ; ఆత్నౌపమ్యేన = తనకు జరిగితే (అని ఆలోచించి)ప్రమాణం = ప్రమాణముగా ; అధిగచ్ఛతి = తీసుకోవాలి ;॥౧.౧౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఇతరులను విమర్శించుట, తిరస్కరించుట, సుఖమును కానీ దుఃఖమును కానీ కలిగించుట, ఇష్టమైన పని చేయుట లేక అయిష్టమైన పని చేయుట మొదలైనవి తన పట్ల జరిగితే ఎట్లా ఉంటుందో దానిని ప్రమాణంగా తీసుకోవాలి.
🙏
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.12
🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.12🌺
🌷
మూలమ్--
ప్రాణా యథాత్మనోఽభీష్టా భూతానామపి తే తథా ।
ఆత్మౌపమ్యేన భూతానాం దయాం కుర్వన్తి సాధవః॥౧.౧౨॥
🌺
పదవిభాగః--
ప్రాణాః యథా ఆత్మనః అభీష్టాః భూతానామ్ అపి తే తథా । ఆత్మా-ఔపమ్యేన భూతానాం దయాం కుర్వన్తి సాధవః॥౧.౧౨॥
🌸
అన్వయః--
యథా ఆత్మనః ప్రాణాః అభీష్టాః తే భూతానామ్ అపి తథా । సాధవః ఆత్మా-ఔపమ్యేన భూతానాం దయాం కుర్వన్తి॥౧.౧౨॥
🌼
ప్రతిపదార్థః--
ఆత్మనః = స్వస్య; అభీష్టాః = ప్రియాః ; భూతానాం = స్వాతిరిక్తానాం సర్వేషాం జీవానామపి ; తే = ప్రాణాః ; తథా = తథైవ ప్రియాః ; అత ఆత్మౌపమ్యేన = స్వాత్మానమ్ ఉపమానం కృత్వా ; సాధవః = సజ్జనాః, దయాలవః ; భూతానాం = జీవానాం, ప్రాణినాం ; దయాం కుర్వన్తి = అనుకమ్పాం, కరుణాం, కృపాం వా దర్శయన్తి ॥౧.౧౨॥
🌻
తాత్పర్యమ్--
యథా స్వస్య ప్రాణాః స్వస్య అత్యన్తమిష్టాః భవన్తి, తథైవ అన్యేషాం జీవానామపి తే అభీప్సితా భవన్తి। అతః సాధవః అన్యానపి జీవాన్ ఆత్మనః సమానమేవ పశ్యన్తి ॥౧.౧౨॥
🌿
హిన్ద్యర్థః--
ఔర జైసే మనుష్య అపనే ప్రాణోం కో ప్రియ సమఝతా హై, వైసే హీ దూసరే ప్రాణియోం కో భీ అపనే-అపనే ప్రాణ ప్యారే హైం । ఇసలియే మహాత్మా లోగ అపనీ హీ తరహ దూసరోం కో భీ సమఝ కర సభీ జీవోం పర సమాన రూప సే హీ దయా కరతే హైం ॥౧.౧౨॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఆత్మనః = తనయొక్క; అభీష్టాః = ప్రియమో ; భూతానాం = తాను తప్ప అన్య జీవుల యొక్క ; తే = ప్రాణములు ; తథా =అలాగే ప్రియమైనవి ; అత ఆత్మౌపమ్యేన = తన వలెనే భావించి; సాధవః = సజ్జనులు, దయగల వారు ; భూతానాం = జీవుల యొక్క, ప్రాణుల యొక్క( జీవుల పట్ల) ; దయాం కుర్వన్తి = దయను కరుణను చూపుతారు., ॥౧.౧౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ప్రతి వారికీ తమ ప్రాణములు ఏ విధంగా ప్రియమైనవో, ఆ విధంగానే ఇతర జీవులకు వాటి ప్రాణములు కూడా ప్రియమయినవే. అందువల్ల సాధు సజ్జనులు తమ వలెనే అన్య జీవులను భావించి కరుణను చూపుతారు.
🙏
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.11
🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.11🌺
🌷
మూలమ్--
మరుస్థల్యాం యథా వృష్టిః క్షుధార్తే భోజనం తథా ।
దరిద్రే దీయతే దానం సఫలం పాణ్డునన్దన॥౧.౧౧॥
🌺
పదవిభాగః--
మరు-స్థల్యాం యథా వృష్టిః క్షుధా-ఆర్తే భోజనం తథా । దరిద్రే దీయతే దానం సఫలం పాణ్డు-నన్దన॥౧.౧౧॥
🌸
అన్వయః--
పాణ్డు-నన్దన, యథా మరు-స్థల్యాం వృష్టిః, క్షుధా-ఆర్తే భోజనం, తథా దరిద్రే (యత్) దానం దీయతే (తత్) సఫలం (భవతి) ॥౧.౧౧॥
🌼
ప్రతిపదార్థః--
పాణ్డునన్దన = హే యుధిష్ఠిర! ; మరుస్థల్యాం = మరుభూమౌ, నిర్జలప్రదేశే ; యథా వృష్టిః = యథా వృష్టిః సఫలా, నితరాముచితా ; క్షుధార్తే = బుభుక్షయా పీడితాయ ; తథా = తథైవ ; దరిద్రే = ధనహీనాయ ; యద్దానం దీయతే తదపి సఫలమిత్యన్వయః॥౧.౧౧॥
🌻
తాత్పర్యమ్--
హే యుధిష్ఠిర, యథా జలరహితదేశే వర్షణేన వృష్టిః సఫలా భవతి, భోజనేచ్ఛోః అన్నదానేన క్షుధానివారణేన చ అనన్దానం సఫలం భవతి, తథైవ నిర్ధనాయ దత్తం దానం సఫలం భవతి। (జలం యత్ర ప్రభూతం తత్ర వృష్టయే న కోఽపి ఆర్తః। అన్నం ఖాదిత్వా యః తృప్తః తస్య అన్నస్యావశ్యకతా నాస్తి। తథైవ ధనికాయ ధనదానేన న లాభః। యత్ర యన్నాస్తి, తత్ర తద్దాతవ్యమ్ ఇతి యావత్।) ॥
🌿
హిన్ద్యర్థః--
హే యుధిష్ఠిర! జైసే మరుస్థల (మారవాడ़) మేం వర్షా సఫల హై ఔర భూఖే కో భోజన దేనా సఫల హై, వైసే దరిద్ర కో దియా హుఆ దాన భీ సఫల హోతా హై॥౧.౧౧॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
పాణ్డునన్దన = ఓ యుధిష్ఠిరుడా! ; యథా = ఎట్లైతే ; మరుస్థల్యాం = ఎడారియందు ( నిర్జలప్రదేశమునందు) ; వృష్టిః = వర్షము ; సఫలా = సఫలమగుచున్నదో ; తథా = అలాగే ; క్షుధార్తే = ఆకలితో బాధపడుతున్న వాని విషయంలో ; భోజనం = ఆహారము సఫలా = సఫలమగుచున్నది ; తథా =అలాగే ; దరిద్రే = ధనహీనుడైన వాని విషయమున ; దానం = దానము (వితరణము) ; దీయతే = ఇవ్వబడుతుందో ; తదపి = (ఆ దానం) అదికూడా ; సఫలం = ఫలవంతమైనదై ; భవతి = అగుచున్నది ;అని అర్థము.. ॥౧.౧౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ యుధిష్ఠిరుడా! ఎట్లైతే ఎడారియందు అనగా నిర్జలప్రదేశమునందు వర్షము పడినచో సఫలమగుచున్నదో ; అలాగే ఆకలితో బాధపడుతున్న వానికి విషయంలో ఆహారము పెడితే, సఫలమగుచున్నది, అలాగే ధనహీనుడైన అనగా దరిద్రునికి ఇవ్వబడిన దానము కూడా ఫలవంతమైనదై, మరియు సార్థకమైనదై అగుచున్నది అని భావము.. ॥౧.౧౧॥
🙏
హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.9
🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 1.9🌺
🌷
మూలమ్--
తత్ర పూర్వశ్చతుర్వర్గో దమ్భార్థమపి సేవ్యతే ।
ఉత్తరస్తు చతుర్వర్గో మహాత్మన్యేవ తిష్ఠతి॥౧.౯॥
🌺
పదవిభాగః--
🌸
అన్వయః--
తత్ర పూర్వః చతుర్వర్గః దమ్భార్థమ్ అపి సేవ్యతే । ఉత్తరః తు చతుర్వర్గః మహాత్మని ఏవ తిష్ఠతి॥౧.౯॥
🌼
ప్రతిపదార్థః--
తత్ర = అష్టవిధే పూర్వోక్తే ధర్మమార్గే ; పూర్వశ్చతుర్వర్గః = ఇజ్యాధ్యయనతపో-దానాత్మకః ; దమ్భార్థం = లోకసఙ్గ్రహ-లోకవఞ్చనాద్యర్థమపి ; సేవ్యతే = ఆశ్రీయతే ; 'లోకై'రితి శేషః ; ఉత్తరః చతుర్వర్గః తు = సత్య-ధృతి-క్షమా-అలోభాత్మకో ధర్మమార్గస్తు మహాత్మస్వేవ సమ్భవతి, న క్షుద్రాశయేషు॥౧.౯॥
🌻
తాత్పర్యమ్--
(ఇజ్యాధ్యయనతపోదానాః, సత్యధృతిక్షమాలోభాశ్చ ధర్మోపార్జనమార్గాః।) తత్ర పూర్వగణం న కేవలం ధర్మాయ, అపి తు దమ్భప్రదర్శనాది-లౌకికప్రయోజనార్థమపి భజతే నరః। అపరగణే స్థితాః గుణాస్తు మహాపురుషేషు, సన్తజనేషు ఏవ దృశ్యన్తే ॥౧.౯॥
🌿
హిన్ద్యర్థః--
ఇన ఆఠోం మేం సే పహలే కే చారోం కో (యజ్ఞ, పఢ़నా, దాన, తప, ఇన చారోం కో) మహానతాకో దిఖలానే కే లియే పాఖణ్డీ లోగ భీ కర సకతే హైం, పరన్తు అన్తిమ చార (సత్య, ధైర్య, క్షమా, అలోభ-సన్తోష) కా అనుష్ఠాన తో మహాత్మా లోగ హీ కరతే హైం॥౧.౯॥
☘
ఆన్ధ్రప్రతిపదార్థః :-
తత్ర = ముందు చెప్పబడిన ఎనిమిది ధర్మమార్గములయందు ; పూర్వశ్చతుర్వర్గః = ఇజ్యా -అధ్యయన -తప - దానములనే నాలుగు ; (లోకైః = జనులచేత), దమ్భార్థం అపి = (చేయాలని లేకున్నను),కపటం కొరకు కూడా ; సేవ్యతే = ఆశ్రయింపబడుచున్నది ; ఉత్తరః చతుర్వర్గః తు = (ఇక మిగిలిన) సత్యము - ధృతి-క్షమా-అలోభము అను నాలుగింటి ధర్మమార్గము ; మహాత్మని (జనే) ఏవ = శ్రేష్ఠస్వభావంకలిగిన జనమందే ; తిష్ఠతి = ఉంటున్నది అని అర్థము.
॥౧.౯ ౹౹
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎనిమిది ధర్మమార్గములయందు ఇజ్యా -అధ్యయన -తప - దానములనే ముందు చెప్పబడిన నాలుగు, చేయాలని ఇష్టం లేకున్నను, కపటంతో కూడా జనులచేత ఆశ్రయింపబడుచున్నది. ఇక మిగిలిన సత్యము - ధృతి-క్షమా-అలోభము అను నాలుగింటి ధర్మమార్గము శ్రేష్ఠస్వభావంకలిగిన జనమందే ఉంటున్నది అనగా... మహాత్ములైనవారు ధర్మమార్గమందే చరింతు రని భావము. ॥౧.౯౹౹
🙏