Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.46

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.46🌺
🌷
మూలమ్--
యథోదయగిరేర్ద్రవ్యం సన్నికర్షేణ దీప్యతే ।
తథా సత్సన్నిధానేన హీనవర్ణోఽపి దీప్యతే ॥౦.౪౬॥

🌺
పదవిభాగః--
🌸
అన్వయః--
యథా ఉదయగిరేః ద్రవ్యం సన్నికర్షేణ దీప్యతే । తథా సత్సన్నిధానేన హీనవర్ణః అపి దీప్యతే ॥౦.౪౬॥
🌼
ప్రతిపదార్థః--
ఉదయగిరేః = ఉదయపర్వతస్య ; ద్రవ్యం = పాషాణవృక్షాదికం వస్తుజాతమపి ; సన్నికర్షేణ = సామీప్యం, సమ్పర్కః ; దీప్యతే = సూర్యసమ్పర్కాత్ ప్రకాశతే, శోభతే ; హీనవర్ణః = బుద్ధివిషయే నీచః, మూఢః ; దీప్తిరహితోఽపి = ప్రజ్ఞాదిగుణైః విహీనోఽపి; దీప్యతే = సంవర్ధ్యతే॥౦.౪౬॥
🌻
తాత్పర్యమ్--
యథా సూర్యోదయానన్తరమ్ ఉదయాచలసమీపే స్థితం సర్వం వస్తు సూర్యప్రకాశసమ్పర్కేణ శోభతే, తథైవ మూర్ఖజనః సతాం సన్నిధౌ వివేకశీలీ భవతి। తస్య బుద్ధివికాసో జాయతే ॥౦.౪౬॥
🌿
హిన్ద్యర్థః--
ఔర భీ- జైసే ఉదయాచల కీ సభీ వస్తు సూర్య కే సమీప హోనే సే చమకనే లగతీ హైం, ఉసీ తరహ సజ్జనోం కే సంసర్గ సే మూర్ఖ భీ విద్వానోం జాతే హైం॥౦.౪౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యథా = ఎట్లైతే ; ద్రవ్యం = (ఏదైనా) పదార్థము ; ఉదయగిరేః = ఉదయపర్వతముయొక్క ; సన్నికర్షేణ = సామీప్యం చేత ; దీప్యతే = ప్రకాశించుచున్నది ; (తథా = అట్లే), హీనవర్ణః అపి = మూఢుడు కూడా ; సత్సన్నిధానేన = సత్పురుషుల సాంగత్యం చేత ; దీప్యతే = ప్రకాశించుచున్నాడు. (అనగా సజ్జనసాంగత్యము అజ్ఞాననివారక మని అర్థము). ॥౦.౪౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎట్లైతే, ఏదైనా పదార్థము, ఉదయపర్వతం వద్దకు చేరగానే అప్రయత్నంగా ఆ పదార్థము ప్రకాశించుచున్నదో, అదేవిధంగా మూఢుడైన వాడు కూడా, సత్పురుషుల సాంగత్యప్రభావం చేత క్రమికవికాసమును పొంది ప్రకాశించుచున్నాడు.కావున సజ్జనసాంగత్యము అజ్ఞాననివారక మని,బహులార్థసాధకమనీ భావము. ॥౦.౪౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.45

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.45🌺
🌷
మూలమ్--
కీటోఽపి సుమనః సఙ్గాదారోహతి సతాం శిరః ।
అశ్మాపి యాతి దేవత్వం మహద్భిః సుప్రతిష్ఠితః ॥౦.౪౫॥
🌺
పదవిభాగః--
కీటః అపి సుమనః సఙ్గాద్ ఆరోహతి సతాం శిరః । అశ్మా అపి యాతి దేవత్వం మహద్భిః సుప్రతిష్ఠితః ॥౦.౪౫॥
🌸
అన్వయః--
కీటః అపి సుమనః సఙ్గాద్ సతాం శిరః ఆరోహతి । అశ్మా అపి మహద్భిః సుప్రతిష్ఠితః (భూత్వా) దేవత్వం యాతి॥౦.౪౫॥
🌼
ప్రతిపదార్థః--
కీటః = భృఙ్గాదిః । పామరశ్చ । సుమనః సఙ్గాత్ = పుష్పసమ్బన్ధాత్ । విద్వత్సఙ్గాచ్చ । సతాం = సజ్జనానాం, మహతాఞ్చ । శిరః = మస్తకమపి । ఆరోహతి = తత్పూజ్యో భవతి । అశ్మా = పాషాణః । మహద్భిః = విద్వద్భిః, శ్రేష్ఠైశ్చ । సుప్రతిష్ఠితః = స్థాపితః॥౦.౪౫॥
🌻
తాత్పర్యమ్--
 (అస్మిన్ పద్యే అల్పవస్తూనాం మహద్వస్తుసాఙ్గత్యేన మహత్త్వప్రాప్తిః ఉక్తా।) కీటాః పుష్పాణాం సాఙ్గత్యేన సజ్జనస్య శిరసి న్యస్యతే। పాషాణశ్చ శ్రేష్ఠైః జనైః మన్దిరాదిషు సంస్థాపితః, ప్రతిష్ఠితః సన్ దేవః భూత్వా పూజ్యత్వం ప్రాప్నోతి। (అత్ర కీటస్య, పాషాణస్య చ తులనా పామరజనేన, పుష్పానాం, ప్రతిష్ఠయా దేవత్వప్రాప్తేః చ పణ్డితజనేన తులనా కృతా।) ॥౦.౪౫॥
🌿
హిన్ద్యర్థః--
పుష్పోం కే సాథ హోనే సే కీడా భీ బడ़ే లోగోం కే శిర పర చఢ़ జాతా హై । ఔర బడ़ే లోగోం సే ఆదర ప్రతిష్ఠా పాకర పత్థర భీ దేవతా బన జాతా హై॥౦.౪౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
కీటః అపి = పురుగు కూడా ; సుమనః సఙ్గాత్ = పుష్పసంబంధము వలన ; సతాం = సజ్జనులయొక్క ; శిరః = తలను ; ఆరోహతి = అధిరోహించుచున్నది ; (తథా = అలాగే) అశ్మా అపి= (శిల) బండరాయి కూడా ; మహద్భిః = మహాత్ములచేత ; సుప్రతిష్ఠితః = (శాస్త్రోక్తవిధానంతో) ప్రతిష్ఠింపబడినచో ; దేవత్వం = (దేవభావనను), దైవశక్తిని ; యాతి = పొందుచున్నది.॥౦.౪౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
విలువ లేని పురుగు కూడా మాలలోని పుష్పసంబంధము వలన, సజ్జనులయొక్క తలను అధిరోహించుచున్నది. అలాగే ఆదరణ లేని బండరాయి కూడా, మహాత్ములచేత శాస్త్రోక్తవిధానంతో ప్రతిష్ఠింపబడినచో, దేవభావనను, దైవశక్తిని కూడా పొందుచున్నది అని భావము ॥౦.౪౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.44

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.44🌺
🌷
మూలమ్--
అస్మింస్తు నిర్గుణం గోత్రే నాపత్యముపజాయతే ।
ఆకరే పద్మరాగాణాం జన్మ కాచమణేః కుతః ॥౦.౪౪॥

🌺
పదవిభాగః--
అస్మిన్ తు నిర్గుణం గోత్రే న అపత్యమ్ ఉపజాయతే । ఆకరే పద్మ-రాణాణాం జన్మ కాచమణేః కుతః ॥౦.౪౪॥
🌸
అన్వయః--
అస్మిన్ గోత్రే తు నిర్గుణమ్ అపత్యమ్ న ఉపజాయతే । పద్మ-రాగాణామ్ ఆకరే కాచమణేః జన్మ కుతః ॥౦.౪౪॥
🌼
ప్రతిపదార్థః--
అస్మిన్ = భవతాం ప్రసిద్ధే ; గోత్రే = వంశే, (అత్ర) రాజకులే ; నిర్గుణం = గుణశూన్యమ్ ; అపత్యం = సన్తానం, పుత్ర ఇతి యావత్, తోకం ; న ఉపజాయతే = న ఉత్పద్యతే ; యతః ; పద్మరాగాణాం = తన్నామవిశిష్ట-మణయః తేషాం ; ఆకరే = ఖనౌ ; కాచమణేః = కాచస్య ; జన్మ = ఉత్పత్తిః ; కుతః = కస్మాద్ హేతోః భవతి? నైవ సంభవతి ఇత్యర్థః॥౦.౪౪॥
🌻
తాత్పర్యమ్--
 (సద్గుణవిశిష్టే) అస్మిన్ రాజకులే గుణశూన్యం సన్తానం న కదాపి సఞ్జాయతే। (అమూల్యే) పద్మరాగమణీనామ్ ఉత్పత్తిస్థానే (అయోగ్యః) కాచమణిః కథముత్పద్యతే ॥౦.౪౪॥
🌿
హిన్ద్యర్థః--
పరన్తు ఇస (ఆపకే) వంశ మేం మూర్ఖ సన్తతి హో హీ నహీం సకతీ హై । జైసే పద్మరాగమణి (లాల' 'చున్నీ') కీ ఖాన సే కభీ కాచ కీ ఉత్పత్తి నహీం హోతీ హై॥౦.౪౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
అస్మిన్ = మీవంటి ; గోత్రే = (ప్రసిద్ధమైన కులమందు), వంశమందు ; నిర్గుణం = గుణశూన్యమైన ; అపత్యం = (పుత్రుడు) సంతానము ; న ఉపజాయతే = పుట్టబోదు ; (యతః = ఎందుకనగా) పద్మరాగాణాం = (ఎరుపు రంగుతో కూడిన) మాణిక్యమణులయొక్క ; ఆకరే = గనియందు ; కాచమణేః = (మణిని పోలిన), గాజుపెంకయొక్క; జన్మ = పుట్టుక ; కుతః = (ఏ విధంగా) ఎట్లు ; భవిష్యతి = కాగలదు, అని అర్థము ॥౦.౪౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మీవంటి ప్రసిద్ధమైన (కులమందు), వంశమందు, గుణశూన్యమైన పుత్రుడు పుట్టలేడు. ఎందుకనగా ఎరుపు రంగుతో కూడిన విలువైన మాణిక్యమణులయొక్క గనియందు, గాజుపెంకయొక్క పుట్టుక ఎట్లు కాగలదు, అని భావము. ॥౦.౪౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.43

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.43🌺
🌷
మూలమ్--
నాద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ భవేత్ ।
న వ్యాపారశతేనాపి శుకవత్ పాఠ్యతే బకః ॥౦.౪౩॥

🌺
పదవిభాగః--
న అద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ భవేత్ । న వ్యాపార-శతేన అపి శుకవత్ పాఠ్యతే బకః ॥౦.౪౩॥
🌸
అన్వయః--
అద్రవ్యే నిహితా కాచిత్ క్రియా ఫలవతీ న భవేత్ । వ్యాపార-శతేన అపి బకః శుకవత్ న పాఠ్యతే॥౦.౪౩॥
🌼
ప్రతిపదార్థః--
దేవ = హే రాజన్ ; అద్రవ్యే = అయోగ్యే, అపాత్రే చ ; నిహితా = యోజితా, స్థాపితా చ ; క్రియా = సంస్కారః, శిక్షా చ = శిక్షణం ; ఫలవతీ = సఫలా ; వ్యాపార-శతేన అపి= ఉపాయ-శతేన అపి ; బకః = పక్షివిశేషః ; న ఖలు ; పాఠ్యతే=పాఠయితుం శక్యతే ॥౦.౪౩॥
🌻
తాత్పర్యమ్--
అపాత్రం శిక్షయిత్వా సంస్కారయితుం కృతాని ప్రయతనాని న కదాపి సఫలాని భవన్తి। బకః శుకవత్ భణితుం న పారయతి। అతః తం శిక్షయితుం ప్రయత్నః వ్యర్థః భవతి ॥౦.౪౩॥
🌿
హిన్ద్యర్థః--
అయోగ్య అపాత్ర మేం కోఈ భీ సుధార సఫల నహీం హోతా హై । అనేక ఉపాయ కరనే పర భీ కోఈ భీ బగులే కో శుక (సుగ్గే) కీ తరహ కభీ నహీం పఢా సకతా హై॥౦.౪౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
దేవ = ఓ రాజా ; అద్రవ్యే = (అర్హత లేని దానియందు), అయోగ్యమైన దానియందు ; నిహితా = (చేయబడిన) ఉంచబడిన ; కాచిత్ = ఏదైనా ; క్రియా = (ప్రయత్నము), పని ; ఫలవతీ = సఫలమైనదై ; న భవేత్ = కాజాలదు ; (యథా = ఎట్లనగా), వ్యాపార-శతేన అపి = వంద ఉపాయములచేత కూడా ; బకః = కొంగ ; శుకవత్ = చిలుక వలే ; న పాఠ్యతే= నేర్పింప బడజాలదు. ॥౦.౪౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఓ రాజా ! అర్హత లేని దానియందు అనగా, అయోగ్యమైన దానియందు చేయబడిన ఏ ప్రయత్నము, పనియు సఫలమైనదిగా కాజాలదు. ఎట్లనగా, వంద ఉపాయములచేత కూడా ఒక కొంగ, చిలుక వలే నేర్పింప బడజాలదు.మాట్లాడ లేదు కూడా అని భావము.॥౦.౪౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.42

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.42🌺
🌷
మూలమ్--
హీయతే హి మతిస్తాత హీనైః సహ సమాగమాత్ ।
సమైశ్చ సమతామేతి విశిష్టైశ్చ విశిష్టతామ్ ॥౦.౪౨॥

🌺
పదవిభాగః--
హీయతే హి మతిః తాత హీనైః సహ సమాగమాత్ । సమైః చ సమతామ్ ఏతి విశిష్టైః చ విశిష్టతామ్ ॥౦.౪౨॥
🌸
అన్వయః--
తాత, హీనైః సహ సమాగమాత్ మతిః హీయతే హి । సమైః చ సమతామ్ ఏతి । విశిష్టైః చ విశిష్టతామ్ ॥౦.౪౨॥
🌼
ప్రతిపదార్థః--
‘తాతే’తి సమ్బోధనమ్; తాత = హే వత్స! ; హీనైః = అధమైః, మూర్ఖైః ; సమాగమాత్ = మిత్రత్వాత్, సాఙ్గత్యాత్ ; మతిః = బుద్ధిః ; హీయతే = అల్పతామ్ ఏతి, క్షయమేతి ; సమైః = స్వాత్మతుల్యైః, యే సమానబుద్ధయః భవన్తి తైః సహ ; సమతాం = సమాన-బౌద్ధిక-స్థితిం ; విశిష్టైః = స్వస్మాద్ అధికైః, యే విలక్షణ-బుద్ధయః భవన్తి తైః సహ ; విశిష్టతా= వైదుష్యం, మహత్త్వఞ్చ॥౦.౪౨॥
🌻
తాత్పర్యమ్--
హే వత్స, అల్పబుద్ధిభిః సహవాసేన ధీశక్తిః క్షీయతే। స్వతుల్యధీభిః సహ సాఙ్గత్యేన సమా ధీస్థితిః భవతి। స్వస్మాత్ విశేషేణ అధికమతిభిః సహ సఖ్యతయా నరః స్వయమపి మహాన్ భవతి॥౦.౪౨॥
🌿
హిన్ద్యర్థః--
కిసీ నే కహా భీ హై కి ‘హే తాత, నీచోం కే సఙ్గ-సాథ సే మనుష్య కీ బుద్ధి ఛోటీ హో జాతీ హై, ఔర అపనే బరాబర బుద్ధివాలోం కే సాథ సే బుద్ధి సాధారణ రహతీ హై, ఔర అపనే సే బద్ధి లోగోం కే సఙ్గ సే మనుష్య కీ బుద్ధి ఉత్కృష్ట (ఉన్నత) హోతీ హై॥౦.౪౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
 (‘తాత !’ అని సంబో ధన). తాత = ఓ కుమారా ! ; హీనైః సహ = అధములతో ; సమాగమాత్ = కలిసి ఉండడంవలన ; మతిః = బుద్ధి ; హీయతే = క్షీణించుచున్నది ; (తథైవ = అలాగే) సమైః = (నీ గుణములతో) సమానులైన వారితో ; మతిః = బుద్ధి ; సమతాం = సమానత్వమును ; (తథైవ = అలాగే) విశిష్టైః = (యే విలక్షణ-బుద్ధయః భవన్తి తైః సహ) (నీకంటే) గొప్ప వారిచేత ;సమాగమాత్ = కలిసి ఉండడంవలన ;మతిః = బుద్ధి విశిష్టతామ్ = వైదుష్యమును,వైశిష్ట్యమును ; మహత్త్వమును ;యాతి = పొందుచున్నది.॥౦.౪౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
‘తాత !’ అని సంబోధన. ఓ కుమారా ! అధములతో కలిసి ఉండడంవలన, నీయొక్క బుద్ధి క్షీణించుచున్నది. అలాగే...నీ గుణములతో సమానులైన వారితో కలిసి ఉండడంవలన నీయొక్క బుద్ధి సమానత్వమును పొందుచున్నది. అలాగే... నీకంటే గొప్ప వారిచేత కలిసి ఉండడంవలన నీయొక్క బుద్ధి, వైదుష్యమును,వైశిష్ట్యమును ; మహత్త్వమును పొందుచున్నది అని భావము. ॥౦.౪౨॥
🙏