Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.41

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.41🌺
🌷
మూలమ్--
కాచః కాఞ్చనసంసర్గాద్ ధత్తే మారకతీర్ద్యుతీః ।
తథా సత్సన్నిధానేన మూర్ఖో యాతి ప్రవీణతామ్ ॥౦.౪౧॥

🌺
పదవిభాగః--
కాచః కాఞ్చన-సంసర్గాద్ ధత్తే మారకతీః ద్యుతీః । తథా సత్సన్నిధానేన మూర్ఖః యాతి ప్రవీణతామ్ ॥౦.౪౧॥
🌸
అన్వయః--
కాచః కాఞ్చన-సంసర్గాద్ మారకతీః ద్యుతీః ధత్తే । తథా మూర్ఖః సత్సన్నిధానేన ప్రవీణతామ్ యాతి॥౦.౪౧॥
🌼
ప్రతిపదార్థః--
కాచః = మృత్తికాభేదః ; కాఞ్చనసంసర్గాద్ ~కాఞ్చనమ్ = సువర్ణమ్ ; సంసర్గాద్ = సమ్పర్కాత్ ; మారకతీః= మరకతమణి-సమ్బన్ధినీః, తత్తుల్యతామితి యావత్ [మరకతః=ఒక మణి] ; ద్యుతీః = ప్రకాశాన్ ; సత్సన్నిధానేన = సతాం సాఙ్గత్యేన ; ప్రవీణతాం = కుశలతాం, పాణ్డిత్యఞ్చ ; యాతి = లభతే ॥౦.౪౧॥
🌻
తాత్పర్యమ్--
కాఞ్చనస్య సమ్పర్కేణ కాచః అపి మరకతమణిరివ కాన్తిం ప్రాప్నోతి। తథైవ బుద్ధిహీనోఽపి సజ్జనానాం సఙ్గతౌ కౌశల్యం లభతే ॥౦.౪౧॥
🌿
హిన్ద్యర్థః--
క్యోం కి-జైసే కాచ భీ సువర్ణ కే సమ్బన్ధ సే మరకత మణి (పన్నా) కీ సీ శోభా కో పాతా హై, ఇసీ ప్రకార సజ్జనోం కే సంసర్గ సే మూర్ఖ భీ చతుర హో జాతా హై॥౦.౪౧॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
కాచః = ("కాచః క్షారః" = అని నిఘంటువు) గాజు పెంకు ; కాఞ్చనసంసర్గాత్ = బంగారంతో కలిసినందువలన ; మారకతీః = మరకతమణుల వంటి ; ద్యుతీః = (కాంతులను) ప్రకాశములను ; ధత్తే = ధరించుచున్నది ; తథా = అదే విధముగా ; సత్సన్నిధానేన = (సతాం సన్నిధానం సత్సన్నిధానం) సజ్జనసాంగత్యముచేత ; మూర్ఖః = అల్పజ్ఞుడు కూడా ; ప్రవీణతాం = ప్రావీణ్యమును ; యాతి = పొందుచున్నాడు. ॥౦.౪౧॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
"కాచః క్షారః" = అని నిఘంటువు. కాచః అనగా గాజు పెంకు. అది బంగారంతో కలిసినందువలన మరకతమణి వంటి కాంతిని ధరించుచున్నది. అదే విధముగా, సజ్జనసాంగత్యముచేత అల్పజ్ఞుడు కూడా, సజ్జనసంబధమైన ప్రావీణ్యమును పొందుచున్నాడు అని భావము. ॥౦.౪౧॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.40

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.40🌺
🌷
మూలమ్--
మూర్ఖోఽపి శోభతే తావత్ సభాయాం వస్త్రవేష్ఠితః ।
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కిఞ్చిన్న భాషతే॥౦.౪౦॥

🌺
పదవిభాగః--
మూర్ఖః అపి శోభతే తావత్ సభాయాం వస్త్రవేష్ఠితః । తావత్ చ శోభతే మూర్ఖః యావత్కిఞ్చిన్న భాషతే॥౦.౪౦॥
🌸
అన్వయః--
మూర్ఖః అపి సభాయాం వస్త్రవేష్ఠితః తావత్ శోభతే । మూర్ఖః యావత్ కిఞ్చిత్ న భాషతే తావత్ చ శోభతే॥౦.౪౦॥
🌼
ప్రతిపదార్థః--
మూర్ఖః = మూఢబుద్ధిః, అల్పధీః, అర్ధజ్ఞానీ ; శోభతే = సాధు దృశ్యతే ; సభాయాం = విద్వద్గోష్ఠ్యామ్ ; తావత్ = నిశ్చయేన ; వస్త్రవేష్టితః = మహార్హ-పట్ట-వస్త్రావృతః, (దుశాలా ఓఢే హుఏ) ; భాషతే = వదతి॥౦.౪౦॥
🌻
తాత్పర్యమ్--
మూఢః పురుషః అపి (సుసజ్జీభూయ సున్దర) వస్త్రాణి ధృత్వా సభాయాం నిశ్చయేన శోభనో దృశ్యతే । యావత్కాలం సః కిమపి న వదతి, తావత్ పర్యన్తం సః (పణ్డిత ఇవ) ఆదరం ప్రాప్నోతి ॥౦.౪౦॥
🌿
హిన్ద్యర్థః--
విద్వానోం కీ సభా మేం అచ్ఛా కపడా పహన కర కదాచిత్మూర్ఖ భీ శోభతా హై, పరన్తు వహ తభీ తక శోభతా హై, జబ తక వహ కుఛ బోలతా నహీం హై । అర్థాత్ ఉసకే బోలతే హీ ఉసకీ యోగ్యతా (మూర్ఖతా) మాలూమ హో జాతీ హై॥౦.౪౦॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
సభాయాం = (విద్వత్) సభయందు ; వస్త్రవేష్టితః = (పండితులవంటి) వస్త్రములచే చుట్టబడిన ; తావత్ = అంతవరకు ; మూర్ఖః అపి = మందబుద్ధి కలవాడు కూడా ; శోభతే = (పండతుడి వలే) ప్రకాశించుచున్నాడు ; (సః = అటువంటి),మూర్ఖః = అల్పజ్ఞుడు ; తావత్ (ఏవ) = అంతవరకే ; శోభతే = ప్రకాశిస్తాడు ; యావత్ = ఎంతవరకు ; న భాషతే = మాట్లాడడో .॥౦.౪౦॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
విద్వత్ సభయందు పండితులవంటి వస్త్రములను ధరించినంతవరకు, మందబుద్ధి కలవాడు కూడా, పండితుడి వలే ప్రకాశించుచున్నాడు . అటువంటి అల్పజ్ఞుడు అంతవరకే ప్రకాశిస్తాడు, ఎంతవరకైతే అతడు మాట్లాడడో. ॥౦.౪౦॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.39

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.39🌺
🌷
మూలమ్--
రూపయౌవనసమ్పన్నా విశాలకులసమ్భవాః ।
విద్యాహీనా న శోభన్తే నిర్గన్ధా ఇవ కింశుకాః ॥౦.౩౯॥

🌺
పదవిభాగః--
రూప-యౌవన-సమ్పన్నాః విశాల-కుల-సమ్భవాః । విద్యాహీనాః న శోభన్తే నిర్గన్ధాః ఇవ కింశుకాః ॥౦.౩౯॥
🌸
అన్వయః--
రూప-యౌవన-సమ్పన్నాః విశాల-కుల-సమ్భవాః (అపి) విద్యాహీనాః నిర్గన్ధాః కింశుకాః ఇవ న శోభన్తే॥౦.౩౯॥
🌼
ప్రతిపదార్థః--
రూప-యౌవన-సమ్పన్నాః ~రూపేణ = సౌన్దర్యేణ, శరీరకాన్త్యా చ ; యౌవనేన = యువత్వకృతేన వపుః ; సమ్పన్నాః = శోభితాః అపి ; కిఞ్చ--విశాలకులసమ్భవాః = మహాకులప్రసూతా అపి ; విద్యాహీనాః = మూర్ఖాః ; నిర్గన్ధాః = (సురూపా అపి) గన్ధశూన్యాః, కింశుకాః = పలాశకుసుమానీవ, న శోభన్తే = లోకే న విరాజన్తే॥౦.౩౯॥
🌻
తాత్పర్యమ్--
సున్దరాః, యువకాః, ఉన్నత-కులే జాతాః అపి నరాః జ్ఞానేన వినా, గన్ధహీన-కింశుక-పుష్పాణీవ న శోభన్తే॥౦.౩౯॥
🌿
హిన్ద్యర్థః--
అచ్ఛే కుల మేం ఉత్పన్న, సున్దర, యువా మనుష్య భీ విద్యాహీన హోనే సే నిర్గన్ధ పలాశ (ఢాక) కే ఫూల కే సమాన శోభా నహీం పాతే హైం॥౦.౩౯॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
రూప-యౌవన-సమ్పన్నాః ~ రూప = (అందము) సౌన్దర్యము ; యౌవన = (యూనో భావః యౌవనమ్), తారుణ్యము ; (అను వాటిని) సమ్పన్నాః (అపి) =కలిగి యున్నవారైనను ; (కిఞ్చ=మరియు) విశాలకులసమ్భవాః (అపి) = మహాకులమందు జన్మించిన వారైనను ; విద్యాహీనాః = విద్య రానివారు ; నిర్గన్ధాః = (చూచుటకు అందంగా ఉండియు) సుగంధము లేని ; కింశుకాః = (పలాశకుసుమముల వలే) మోదుగుపువ్వుల వలే ;, న శోభన్తే = (సమాజంలో) శోభించరు. (గౌరవింపబడరని అర్థము).॥౦.౩౯॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
అందము,మరియు శక్తిసమన్వితమైన యౌవనము,అను వాటిని కలిగి యున్నవారైనను, మరియు గొప్పనైన కులమందు జన్మించిన వారైనను, విద్య రానివారు,అనగా సంస్కారం లేనివారు, చూచుటకు అందంగా ఉండియు సుగంధము లేని మోదుగుపువ్వుల వలే ఈ సమాజంలో శోభించరు.అనగా గౌరవింపబడరని అర్థము. ॥౦.౩౯॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.38

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.38🌺
🌷
మూలమ్--
మాతా శత్రుః పితా వైరీ యేన బాలో న పాఠితః ।
న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా ॥౦.౩౮॥

🌺
పదవిభాగః--
మాతా శత్రుః పితా వైరీ యేన బాలః న పాఠితః । న శోభతే సభా-మధ్యే హంస-మధ్యే బకః యథా ॥౦.౩౮॥
🌸
అన్వయః--
మాతా శత్రుః పితా వైరీ యేన బాలః న పాఠితః । సభా-మధ్యే (సః) హంస-మధ్యే యథా బకః (తథా) న శోభతే॥౦.౩౮॥
🌼
ప్రతిపదార్థః--
మాతా = జననీ ; శత్రుః = అరిః ; పితా = జనకః ; వైరీ = రిపుః ; యేన = పిత్రా ; బాలః = పుత్రః ; న పాఠితః = అధ్యయనం న కారితః, శిక్షా న ప్రాపయితః ; సభామధ్యే = పణ్డితానాం సమవాయే, విద్వత్సమాజే ; హంసమధ్యే బక ఇవ ; న శోభతే = న ప్రతిష్ఠాం లభతే। 'యాభ్యా'మితి పాఠాన్తరమ్ ॥౦.౩౮॥
🌻
తాత్పర్యమ్--
యం బాలం మాతా పితా చ న జ్ఞానం ప్రదాపయన్తి, తౌ (తస్య) శత్రూ ఇవ భవతః । సః విదుషాం పురతః న స్థాతుం శక్నోతి । హంసానాం సమూహే బక ఇవ స భవతి।
యౌ పితరౌ స్వపుత్రం న శిక్షయన్తి తౌ అశిక్షితాయ స్వపుత్రాయ శత్రూ భవతః, హంసానాం సమూహే బకః యథా న ప్రకాశతే తథైవాయమశిక్షితః బాలోపి విదుషాం సమూహే న శోభతే, తస్మాత్ పితృభ్యామవశ్యమపత్యాని శిక్షణీయానీతి అస్య భావః ॥౦.౩౮॥
🌿
హిన్ద్యర్థః--
వే పితా మాతా శత్రు హైం, జిన్హోంనే అపనే బాలక పుత్ర కో నహీం పఢ़ాయా । క్యోం కి హంసో కే బీచ మేం బగులే కీ తరహ వహ మూర్ఖ బాలక భీ విద్వానోం కే బీచ మేం కభీ శోభా నహీం దేతా హై॥౦.౩౮॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యేన = ఎవరిచేత ; బాలః = పుత్రుడు ; న పాఠితః = చదివింపబడలేదో ; (తాదృశీ = అలాంటి) మాతా = తల్లి ; శత్రుః = శత్రువు ; తాదృశః = అలాంటి) పితా = తండ్రి ; వైరీ = విరోధి ; (యతః = ఎందుకనగా ; తయోః = ఆ తల్లి దండ్రులయొక్క, బాలః = కుమారుడు;) సభామధ్యే = జ్ఞానుల సభయందు ; హంసమధ్యే = (విశిష్టమైన) హంసల నడుమ (ఉన్న) ;బక ఇవ = కొంగ వలే; న శోభతే = శోభించడు. (అనగా గౌరవింప బడడని అర్థము).।
 ॥౦.౩౮॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎవరిచేత వారి పుత్రుడు (పుత్రిక) చదివింపబడలేదో, అలాంటి తల్లి శత్రువు. మరియు అలాంటి తండ్రియు విరోధి. ఎందుకనగా... ఆ తల్లి దండ్రులయొక్క కుమారుడు, జ్ఞానుల సభయందు, విశిష్టమైన హంసల నడుమ ఉన్న కొంగ వలే శోభించడు. అనగా గౌరవింప బడడని భావము. ॥౦.౩౮॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.37

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.37🌺
🌷
మూలమ్--
మాతాపితృకృతాభ్యాసో గుణితామేతి బాలకః ।
న గర్భచ్యుతిమాత్రేణ పుత్రో భవతి పణ్డితః॥౦.౩౭॥

🌺
పదవిభాగః--
మాతా-పితృ-కృత-అభ్యాసః గుణితామ్ ఏతి బాలకః । న గర్భ-చ్యుతి-మాత్రేణ పుత్రః భవతి పణ్డితః॥౦.౩౭॥
🌸
అన్వయః--
మాతా-పితృ-కృత-అభ్యాసః బాలకః గుణితామ్ ఏతి । గర్భ-చ్యుతి-మాత్రేణ పుత్రః పణ్డితః న భవతి॥౦.౩౭॥
🌼
ప్రతిపదార్థః--
మాత్రా చ పిత్రా చ కృతః, కారితః అభ్యాసో యేనాసౌ ~ మాతాపితృ-కృతాఽభ్యాసః = మాతాపితృభ్యాం కారితాభ్యాసః ; బాలకః = పుత్రః ; గుణితాం = విద్వత్త్వం, గుణవత్త్వఞ్చ ; ఏతి = ప్రాప్నోతి, లభతే ; కేవలం గర్భ-చ్యుతి-మాత్రేణ = జన్మగ్రహణ-మాత్రేణైవ ; పుత్రః = బాలకః ; పణ్డితో న భవతి॥౦.౩౭॥
🌻
తాత్పర్యమ్--
మాతా పితా చ యం బాలకం (సద్గుణానాం) అభ్యాసం కారయన్తి, స ఏవ గుణీ భవతి। జన్మప్రాప్తిమాత్రేణ న కోఽపి పుత్రః పణ్డితః భవతి। (అతః శిక్షణమావశ్యకమ్।) ॥౦.౩౭॥
🌿
హిన్ద్యర్థః--
మాతా పితా కే అభ్యాస కరానే సే హరీ బాలక గుణీ హోతా హై । జన్మతే హీ కోఈ పణ్డిత నహీం హో జాతా హై। అతః బాలకా కో ఉత్తమ శిక్షా దేనీ చాహిఏ॥౦.౩౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
మాతా పిత్రా చ కృతః, కారితః అభ్యాసో యేనాసౌ ~ మాతాపితృ-కృతాఽభ్యాసః = మాతాపితృభ్యాం కారితాభ్యాసః ;
మాత్రా = తల్లి చేత ; పిత్రా చ = తండ్రి చేతయును ; కృతః = (అందించిన) చేయించబడిన ; అభ్యాసః = (కార్యసాధనాదక్షత) అభ్యాసము గల ; బాలకః = పుత్రుడు ; గుణితాం = (విద్వత్త్వమును),ప్రతిభను ; ఏతి = పొందుచున్నాడు; (పరంతు = కాని) గర్భ-చ్యుతి-మాత్రేణ = జన్మించినంత మాత్రమున ; పుత్రః = బాలకుడు ; పణ్డితః = జ్ఞాని ; న భవతి = అగుచులేడు. (జ్ఞానము అభ్యాసముచే సాధించవలెనని అర్థము.)
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తల్లిదండ్రులచేత చేయించబడిన (కార్యసాధనాదక్షత) అభ్యాసము గల పుత్రుడు మాత్రమే, విద్వత్త్వమును, ప్రతిభను, జ్ఞానమును పొందుచున్నాడు ; అంతే కాని... తల్లి గర్భంనుండి పుట్టినంత మాత్రమున ఆ బాలకుడు పణ్డితుడు అగుచులేడు. కావున జ్ఞానము అభ్యాసముచే సాధించవలెనని భావము. ॥౦.౩౭॥
🙏