Tuesday, December 22, 2020

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.36

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.36🌺
🌷
మూలమ్--
ఉద్యమేన హి సిధ్యన్తి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః ॥౦.౩౬॥

🌺
పదవిభాగః--
ఉద్యమేన హి సిధ్యన్తి కార్యాణి న మనోరథైః । న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః ॥౦.౩౬॥
🌸
అన్వయః--
ఉద్యమేన హి కార్యాణి సిధ్యన్తి। మనోరథైః న। సుప్తస్య సింహస్య ముఖే మృగాః న హి ప్రవిశన్తి॥౦.౩౬॥
🌼
ప్రతిపదార్థః--
ఉద్యమేన = ఉద్యోగేన, ప్రయత్నేన ; సిధ్యన్తి = సఫలాని భవన్తి ; కార్యాణి = ఉద్దిష్టాని కర్మాణి ; మనోరథైః = కామనాభిః ; హి = యతః ; సుప్తస్య = శయితస్య (బుభుక్షితస్యాపి) ; సింహస్య ; ముఖే= వదనే ; మృగాః = పశవః ; న ప్రవిశన్తి = ఆహారో న భవన్తి ;॥౦.౩౬॥
🌻
తాత్పర్యమ్--
ఆకాఙ్క్షితైః, 'మమేదం భవతు' 'సిధ్యతు మమేద'మిత్యాది-మనోరథమాత్రేణ కర్మాణి న సమ్పద్యన్తే । సింహః యదా శేతే, తదా (స క్షుదా పీడిత ఇతి కృత్వా స్వయమేవాగత్య) జన్తవః తస్య ముఖాన్తే (అన్నం భూత్వా) న ప్రవిశన్తి ।కిన్తు తదర్థం సింహోఽపి యత్నం కరోతి । ఏవమేవ సర్వైరపి యత్నో విధేయః ॥౦.౩౬॥
🌿
హిన్ద్యర్థః--
క్యోంకి- కార్య కీ సిద్ధి ఉద్యోగ సే హీ హోతీ హై, కేవల ఇచ్ఛామాత్ర సే నహీం । క్యోంకి సోయే హుయే భూఖే సింహ కే ముఖ మేం మృగ స్వయం నహీం చలే జాతే హైం, కిన్తు ఉసకో భీ శికార పకడ़నే కే లిఏ యత్న కరనా హీ హోతా హై॥౦.౩౬॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
ఉద్యమేన = ప్రయత్నము చేత (నే) ; కార్యాణి = పనులు ; సిధ్యన్తి = సాధింపబడుచున్నవి ; మనోరథైః = కోరికలచేత ; న = (సాధింపబడవు) కాదు;హి = ఎట్లనగా ; సుప్తస్య = నిద్రిస్తున్న ; సింహస్య = సింహముయొక్క ; ముఖే = నోటిలోకి ; మృగాః = జంతువులు ; న ప్రవిశన్తి = (వాటికి అవిగా) ప్రవేశించుచులేవు. ( మృగరాజైన సింహమైనను తన తిండి తానే ప్రయత్నంతో సాధించుకుంటున్నట్లు స్వప్రయత్నవిశేషములచేతనే సర్వకార్యములు నెరవేరగలవని అర్థము). ॥౦.౩౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ప్రయత్నము చేతనే పనులు సాధింపబడుచున్నవి కానీ కోరికలచేత సాధింపబడవు . ఎట్లనగా... నిద్రిస్తున్న సింహముయొక్క నోటిలోకి జంతువులు, అవే వచ్చి తినమని ప్రవేశించుచులేవు కదా. మృగరాజైన సింహమైనను తన తిండి తానే ప్రయత్నంతో సాధించుకుంటున్నట్లు... స్వప్రయత్నవిశేషములచేతనే సర్వకార్యములు సాధించుకొనవలెనని భావము. ॥౦.౩౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.35

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.35🌺
🌷
మూలమ్--
కాకతాలీయవత్ ప్రాప్తం దృష్ట్వాపి నిధిమగ్రతః ।
న స్వయం దైవమాదత్తే పురుషార్థమపేక్షతే ॥౦.౩౫॥

🌺
పదవిభాగః--
కాక-తాలీయ-వత్ ప్రాప్తం దృష్ట్వా అపి నిధిమ్ అగ్రతః । న స్వయం దైవమ్ ఆదత్తే పురుషార్థమ్ అపేక్షతే ॥౦.౩౫॥
🌸
అన్వయః--
కాక-తాలీయ-వత్ ప్రాప్తం నిధిమ్ అగ్రతః దృష్ట్వా అపి దైవం స్వయం న ఆదత్తే । పురుషార్థమ్ అపేక్షతే ॥౦.౩౫॥
🌼
ప్రతిపదార్థః--
కాకస్య ఆగమనమివ, తాలస్య పతనమివ-కాకతాలం, కాకతాలమివ~ కాకతాలీయం = సహసా ఉపనతమ్ ; తద్వత్ = కాకతాలీయవత్ = కాకాగమనేన తాలపతనవద్, కస్మాత్, దైవవశాత్ ; ప్రాప్తం = లబ్ధం, నిధిమ్ = శేవధిమ్ = (ఖజానే కో) ; అగ్రతః = పురతః, దృష్ట్వాపి ; దైవం = భాగ్యం ; స్వయమ్ = స్వతః ; న ఆదత్తే = న గృహ్ణాతి ; కిన్తు-- ఆదానే-పురుషార్థే = హస్తచాలనాదికం పురుషవ్యాపారమ్ ; అపేక్షతే = ఆశ్రయతే ఏవ ; సహాయమపేక్షతే ఏవ॥౦.౩౫॥
🌻
తాత్పర్యమ్--
కాకతాలీయమివ (కస్యచిత్ మనుష్యస్య) పురతః పతితం ధనమపి భాగ్యేన న గృహ్ణాతి । తదర్థమపి ప్రయత్న అపేక్ష్యతే ॥౦.౩౫॥
🌿
హిన్ద్యర్థః--
కాకతాలీయ న్యాయ సే (అర్థాత్ అకస్మాత్, భాగ్య సే) సామనే ప్రాప్త హుఏ ధన కో భీ ఉఠాకర రఖనే మేం పురుషార్థ కీ జరూరత రహతీ హీ హై॥౦.౩౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
కాకతాలీయవత్ = (తలవని తలంపుగా) అనుకోకుండా ; ప్రాప్తం = (సంభవించిన) పొందిన ; నిధిమ్ = విశేషసంపదను ; అగ్రతః = (తన) ముందు ; దృష్ట్వా అపి =చూచి కూడా ; (ఆ చూచిన నిధిని), దైవం = (అదృష్టము) భాగ్యము ; స్వయమ్ = తనకు తానుగా ; న ఆదత్తే = తీసుకొనజాలదు ; (తత్ర = అక్కడ), పురుషార్థం = (చూచిన వ్యక్తియొక్క) హస్తచాలనాది వ్యక్తిగత ప్రయత్నము ; అపేక్షతే = కోరబడుచున్నది ; (తన ప్రమేయం, ప్రయత్నం లేకుండా ఎవరూ ఏమీ సాధించలేరని అర్థము). ॥౦.౩౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
తలవని తలంపుగా తన ముందే ఎదురైన విశేషసంపదను, (అదృష్టము) భాగ్యము తనకు తానుగా దానిని తీసుకొనజాలదు. తనకు తానుగా తీసుకొన లేని ఆ భాగ్యము దానిని ఇతరులకెలా అందించగలదు. ఆ సందర్భములో ఆ చూచిన వ్యక్తియొక్క హస్తచాలనాదివ్యక్తిగతప్రయత్నము అవసరమగుచున్నది. కావున వ్యక్తిగతప్రమేయం, ప్రయత్నం లేకుండా ఎవరూ ఏమీ సాధించలేరని భావము. ॥౦.౩౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.34

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.34🌺
🌷
మూలమ్--
యథా మృత్పిణ్డతః కర్తా కురుతే యద్ యదిచ్ఛతి ।
ఏవమాత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే ॥౦.౩౪॥

🌺
పదవిభాగః--
యథా మృత్పిణ్డతః కర్తా కురుతే యద్ యద్ ఇచ్ఛతి । ఏవమ్ ఆత్మకృతం కర్మ మానవః ప్రతిపద్యతే ॥౦.౩౪॥
🌸
అన్వయః--
యథా మృత్పిణ్డతః కర్తా యద్ యద్ ఇచ్ఛతి (తత్తత్) కురుతే । ఏవమ్ మానవః ఆత్మకృతం కర్మ ప్రతిపద్యతే ॥౦.౩౪॥
🌼
ప్రతిపదార్థః--
యథా మృత్పిణ్డతః = మృత్తికాసంఘేన ; కర్తా = (అత్ర) కులాలః ; యద్యత్ = శరావోదఞ్చన-ఘటాదికమ్ ; ఇచ్ఛతి = కర్తుం వాఞ్ఛతి ; తత్తత్-కురుతే = స్వప్రయత్నేన సమ్పాదయతి ; ఏవం = పూర్వోపపాదితయా రీత్యా ; మానవః = కర్తా ; ఆత్మకృతమేవ = స్వయమాచరితమ్ ; కర్మ = కర్మఫలమ్ ; ధటాదికఞ్చ ; ప్రతిపద్యతే = లభతే, ప్రాప్నోతి॥౦.౩౪॥
🌻
తాత్పర్యమ్--
యథా కులాలః మృత్తికాముపయుజ్య యద్వస్తు ఆవశ్యకం తత్ నిర్మాతి, (కార్యేషు ఉపయునక్తి చ) తథా మనుష్యోఽపి స్వయమాచరితస్య కర్మణః ఏవ ఫలం భునక్తి ॥౦.౩౪॥
🌿
హిన్ద్యర్థః--
జైసే కుమ్హార మిట్టీ కే పిణ్డ సే జో జో వస్తు చాహతా హై, అపనీ ఇచ్ఛా కే అనుసార బనాతా హై, ఉసీ ప్రకార మనుష్య అపనే కియే హుఏ కర్మ కే అనుసార హీ ఫల పాతా హై॥౦.౩౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యథా = ఎట్లైతే ; కర్తా = (కుమ్మరి వాడు),చేయువాడు ; మృత్పిణ్డతః = మట్టిముద్దవలన ; యద్యత్ = (ఏ విధముగా), ఏదేదైతే ; ఇచ్ఛతి = ఇష్టపడుచున్నాడో ; (తత్తత్ = ఆయా విధముగా), కురుతే = చేయుచున్నాడు. ఏవం = అలాగే ; మానవః = మనిషి (అపి =కూడా) ; ఆత్మకృతమేవ = (తనకు తోచిన విధంగానే), తన స్వభావానుసారమే ; కర్మ = (కర్మఫలమును) పనిని ; ప్రతిపద్యతే = పొందుచున్నాడు. (తనకు తోచిన విధంగా చేసే పనియొక్క ఫలము శుభఫలకారణమై, అశుభఫలకారణమై ఉంటుందని అర్థము). ॥౦.౩౪॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎట్లైతే కుమ్మరి వాడు మట్టిముద్దను తను ఏ విధంగా ఇష్టపడుచున్నాడో ఆయా విధముగా చేయుచున్నాడు. అలాగే మనిషి కూడా తనకు తోచిన విధంగా అనగా తన స్వభావానుసారముగా పనిని చేస్తూ...ఆ కర్మఫలమును మాత్రమే పొందుచున్నాడు.కావున తనకు తోచిన విధంగా చేసే పనియొక్క ఫలము శుభఫలకారణమై, అశుభఫలకారణమై కూడా ఉండవచ్చునని భావము. ॥౦.౩౪॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.33

 🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.33🌺
🌷
మూలమ్--
పూర్వజన్మకృతం కర్మ తద్ దైవమితి కథ్యతే ।
తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాదతన్ద్రితః ॥౦.౩౩॥

🌺
పదవిభాగః--
పూర్వ-జన్మ-కృతం కర్మ తద్ దైవమ్ ఇతి కథ్యతే । తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాద్ అతన్ద్రితః ॥౦.౩౩॥
🌸
అన్వయః--
పూర్వ-జన్మ-కృతం కర్మ తద్ దైవమ్ ఇతి కథ్యతే । తస్మాత్ పురుషకారేణ అతన్ద్రితః యత్నం కుర్యాద్॥౦.౩౩॥
🌼
ప్రతిపదార్థః--
పూర్వజన్మని = గతే జన్మకాలే ; కృతం యత్కర్మ = ఆచరితాని కార్యాణి ; తత్ = తదేవ ; దైవమితి కథ్యతే = ‘దైవపదవాచ్యమ్, ఇతోఽన్యద్దైవం నామ కిఞ్చిదపి నాస్తి ; తస్మాత్ = పురుషకారేణ వినా దైవస్య సిద్ధేరభావాత్ ; పురుషకారేణ = పురుషార్థమాస్థాయ, ప్రయత్నం కృత్వా; అతన్ద్రితః = ఆలస్యవర్జితః, సావధానః సన్ ; పుమాన్ = పురుషః, మనుష్యః ; యత్నం కుర్యాత్ = ఉద్యమం కుర్యాత్ ॥౦.౩౩॥
🌻
తాత్పర్యమ్--
గతే జన్మని యద్యదాచరితం కర్మ వర్తతే, తదేవ అస్మిన్ జన్మని భాగ్యరూపేణ పరిణమతి। అతః (పూర్వకాలే వా భవతు) ప్రయత్నేనైవ భాగ్యస్యాపి కల్పితత్వాత్, సావధానో భూత్వా ప్రయత్నః అవశ్యం కరణీయః ॥౦.౩౩॥
🌿
హిన్ద్యర్థః--
పూర్వజన్మ మేం కియా హుఆ కర్మ హీ దూసరే జన్మ మేం భాగ్య కహా జాతా హై । ఇసలియే మనుష్య కో పురుషార్థం (ఉద్యోగ, కర్మ) కరనా హీ చాహిఏ॥౦.౩౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
పూర్వజన్మని = గత జన్మయందు ; కృతం = ఆచరించిన ; యత్కర్మ = ఏ (వ్యవహారమో) పనియో ; తత్ = ఆ పనినే ; దైవమితి = (భాగ్యమని) దైవమని ; కథ్యతే = చెప్పబడుచున్నది ; (దైవమనగా మరియొకటి కాదు) ; తస్మాత్ = అందువలన ; అతన్ద్రితః = వాయిదాలు లేని ; పురుషకారేణ = స్వశక్తియుక్తులతో ; (స్థిరచిత్తంతో), యత్నం = (సత్కార్యాచరణకై), (తీవ్ర) ప్రయత్నమును ; కుర్యాత్ = చేయవలయును. (జీవనసార్థక్యమునకు అన్యోపాయము లేదు అని అర్థము). ॥౦.౩౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
గత జన్మయందు ఆచరించిన ఏ వ్యవహారము లేక పనియో దానినే భాగ్యమని లేక దైవమనియు శాస్త్రమందు చెప్పబడుచున్నది. దైవమనగా మరియొకటి కాదు. అందువలన, వాయిదాలు వేయకుండా, స్వశక్తియుక్తులతో, స్థిరచిత్తంతో, సత్కార్యాచరణకై తీవ్రప్రయత్నమును చేయవలయును.జీవనసార్థక్యమునకు ఇక అన్యోపాయము లేదు అని భావము. ॥౦.౩౩॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.32

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.32🌺
🌷
మూలమ్--
యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ ।
తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥

🌺
పదవిభాగః--
యథా హి ఏకేన చక్రేణ న రథస్య గతిః భవేత్ । తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌸
అన్వయః--
యథా హి ఏకేన చక్రేణ రథస్య గతిః న భవేత్ । తథా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌼
ప్రతిపదార్థః--
యథా = యేన ప్రకారేణ ; ఏకేన ; చక్రేణ = రథాఙ్గేన ; రథస్య ; గతిః = అగ్రే చలనం ; న భవేత్ = న భవతి ; ఏవం = తథైవ ; పురుషకారేణ = మానవప్రయత్నేన, సహాయభూతేన పౌరుషేణ ; వినా ; దైవమ్ = కేవలమ్ అదృష్టం ; న సిధ్యతి = నైవ ఫలతీత్యర్థః॥౦.౩౨॥
🌻
తాత్పర్యమ్--
యథా రథః ద్వయోః చక్రయోః చలతి, ఏకేన చక్రేణ నాగ్రే గన్తుం పారయతి, తథైవ మనుష్యస్య ప్రయత్నేన వినా కేవలం భాగ్యేన కార్యం న సిద్ధ్యతి ॥౦.౩౨॥
🌿
హిన్ద్యర్థః--
🙏
జైసే ఏక చక్ర సే రథ నహీం చల సకతా హై, ఉసీ ప్రకార ఉద్యోగ కే వినా కేవల భాగ్య సే హీ సిద్ధి నహీం హో సకతీ హై॥౦.౩౨॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
యథా = ఎట్లైతే ; ఏకేన చక్రేణ = ఒకే చక్రముతో ; రథస్య = రథముయొక్క ; గతిః = (ప్రయాణము) గ మనము ; న భవేత్ = అగుచు లేదో ; ఏవం = ఆలాగే ; పురుషకారేణ వినా = మానవప్రయత్నం లేకుండా ; దైవమ్ = (కేవలం) అదృష్టము ; న సిధ్యతి = సిద్ధించదు ; (కార్యసాధనకు సహకరించదని అర్థము). ॥౦.౩౨॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
ఎలాగైతే ఒకే చక్రముతో రథముయొక్క ప్రయాణము అనగా గమనము అగుచు లేదో, అదే విధంగా... మానవప్రయత్నం లేకుండా, కేవలం అదృష్టము వలననే కార్యము సిద్ధించదు . కార్యసాధనకు తన స్థిరప్రయత్నము కూడా ఉండవలెనని భావము . ॥౦.౩౨॥
🙏