Thursday, August 1, 2019

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.7

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.7🌺
🌷
మూలమ్--
విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే ।
ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయాద్రియతే సదా ॥౦.౭॥

🌺
పదవిభాగః--
విద్యా శస్త్రం చ శాస్త్రం చ ద్వే విద్యే ప్రతిపత్తయే । ఆద్యా హాస్యాయ వృద్ధత్వే ద్వితీయా ఆద్రియతే సదా ॥౦.౭॥
🌸
అన్వయః--
(మనుష్యస్య) ప్రతిపత్తయే, శస్త్రం విద్యా చ శాస్త్రం (విద్యా) చ ద్వే విద్యే (ప్రసిద్ధే)। ఆద్యా వృద్ధత్వే హాస్యాయ। ద్వితీయా (లోకే) సదా ఆద్రియతే ॥౦.౭॥
🌼
ప్రతిపదార్థః--
ప్రతిపత్తయే = జ్ఞానాయ, యశోలాభాయ చ; శస్త్రం విద్యా = ధనుర్వేదాది; శాస్త్రం (విద్యా) చ ద్వే విద్యే; ఆద్యా = ప్రథమా ; వృద్ధత్వే = వృద్ధావస్థాయాం, బలక్షయే; హాస్యాయ = ఉపహాసప్రదా; ద్వితీయా = శాస్త్రవిద్యా; (లోకే) సదా; ఆద్రియతే = పూజ్యతే ॥౦.౭॥
🌻
తాత్పర్యమ్--
మనుష్యస్య జ్ఞానార్జనాయ, యశసే చ ద్వే విద్యే స్తః- శస్త్రవిద్యా, శాస్త్రవిద్యా చేతి। శస్త్రవిద్యయా గతే వయసి న కోఽపి లాభః (శారీరిక-బలాభావాత్)। కిన్తు శాస్త్రవిద్యయా జనః ఆజీవనం పూజ్యతే లోకే (వృద్ధోఽపి సన్ విద్యాం న త్యజతి, అత్యాగేన అపహాసత్వమపి న యాతి।) ॥౦.౭॥
🌿
హిన్ద్యర్థః--
విద్యా దో ప్రకార కీ హై। ఏక శస్త్రవిద్యా ఔర దూసరీ శాస్త్రవిద్యా । దోనోం విద్యాఓంసే హీ లోక మేం ప్రతిష్ఠా హోతీ హై । పరన్తు పహిలీ విద్యా (శస్త్రవిద్యా) వృద్ధావస్థా మేం హఁసీ కరాతీ హై, పరన్తు దూసరీ (శాస్త్ర) విద్యా కా తో సదా హీ ఆదర హోతా హై ॥౦.౭॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
(ఇహ = ఈ లోకంలో) శస్త్రస్య = వివిధ అస్త్రశస్త్రములకు సంబంధించిన; విద్యా = (జ్ఞానము) విద్య; చ = మరియు; శాస్త్రస్య = వేదాదిశాస్త్రసంబధమైన; విద్యా చ = విద్య అనియు; (ఇత్థం = ఇట్లు) ద్వే = రెండు; (విధములైన) విద్యే = విద్యలు; ప్రతిపత్తయే = (మానవుల యొక్క) జ్ఞానము కొరకు; (స్తః = ఉన్నవి). (తయోః ఆ రెండింటిలో) ఆద్యా = మొదటిదైన; శస్త్రవిద్యా = శస్త్రవిద్య; వృద్ధత్వే = ముసలితనంలో; హాస్యాయ = అపహాస్యమునకై; (భవతి = అగుచున్నది) ద్వితీయా = రెండవదైన; శాస్త్రవిద్యా = శాస్త్రసంబధమైన; విద్య; సదా = ఎల్లప్పుడు; (మానవుని యొక్క అన్ని దశల యందు) ఆద్రియతే = (అందరి చేత) ఆదరింపబడచున్నది. ॥౦.౭॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రశంసాత్మకము)
ఈ లోకంలో వివిధ అస్త్రశస్త్రములకు సంబంధించిన విద్య మరియు వేదాదిశాస్త్రసంబధమైన విద్య అని, ఇలా రెండువిధములైన విద్యలు మానవుని యొక్క జ్ఞానము కొరకు ఉన్నవి. ఆ రెండింటిలో కూడా మొదటిదైన శస్త్రవిద్య, ముసలితనంలో ఉపయోగం లేకుండా పోతుంది, కాని రెండవ దైన శాస్త్రసంబధమైన విద్య, ఎల్లప్పుడు అనగా మానవుని యొక్క అన్ని దశల యందు అందరిచేత ఆదరింపబడచున్నదిఅని భావము. ॥౦.౭॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.6🌺
🌷
మూలమ్--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ ।
పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥

🌺
పదవిభాగః--
విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతామ్ । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి ధనాద్ ధర్మం తతః సుఖమ్ ॥౦.౬॥
🌸
అన్వయః--
విద్యా వినయం దదాతి। వినయాద్ పాత్రతాం యాతి । పాత్రత్వాత్ ధనమ్ ఆప్నోతి। ధనాద్ ధర్మం (ఆప్నోతి) తతః సుఖమ్ (చాప్నోతి) ॥౦.౬॥
🌼
ప్రతిపదార్థః--
విద్యా; వినయం = సౌజన్యం; దదాతి; వినయాద్; పాత్రతామ్ = యోగ్యతామ్; యాతి = తత్స్థితిం లభతే; పాత్రత్వాత్; ధనమ్; ఆప్నోతి ; ధనాద్; ధర్మం; తతః; సుఖమ్; (చాప్నోతి) ॥౦.౬॥
🌻
తాత్పర్యమ్--
(విద్యైవ సర్వసుఖసాధనమ్ ఇత్యాశయః)। విద్యావాన్ వినయం ప్రాప్య, తేన పాత్రత్వం లభతే। పాత్రభూతః సజ్జనో ధనం ప్రాప్నోతి, ధనాత్ ధర్మోపార్జనం శక్యం కర్తుమ్। తతః సుఖం చ సమ్ప్రాప్నోతి ॥౦.౬॥
🌿
హిన్ద్యర్థః--
ఔర విద్యా నమ్రతా దేతీ హై, నమ్రతా సే మనుష్య పాత్ర ( యోగ్య) బనతా హై। పాత్రతా ( యోగ్యతా) సే ధన మిలతా హై, ధన సే ధర్మ ప్రాప్త హో సకతా హై, ఔర ధర్మ సే సుఖ ప్రాప్త హోతా హై ॥౦.౬ ॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
(మానవునికి) విద్యా = (శాస్త్రజ్ఞానము) నేర్చుకున్న విద్య; వినయం = (నమ్రతను) వినయాన్ని; (వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని) దదాతి = ఇస్తుంది. (ఆ మానవుడే) వినయాత్ = (ఆ) వినయం వలన; పాత్రతామ్ = (జీవనసాఫల్యహేతువైన) అర్హతను; యాతి = పొందుచున్నాడు; పాత్రత్వాత్ = (ఆ) అర్హత వలన; ధనమ్ = (డబ్బును) ధనమును; ఆప్నోతి = పొందుచున్నాడు; ధనాత్ = (ఆ) ధనము వలన; ధర్మం = ధర్మమును; (యాతి = పొందుచున్నాడు) తతః = (ఈ పైవన్నీ పొందిన తర్వాత) అటు తర్వాత; సుఖమ్ = సుఖమును; (ఆప్నోతి = పొందుచున్నాడు) ॥౦.౬॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
మానవునికి విద్య వినయాన్ని అనగా...అణిగి మణిగి ఉండే గుణాన్ని ఇస్తుంది. ఆ మానవుడే, ఆ వినయం వలన జీవనసాఫల్యహేతువైన అర్హతను పొందుచున్నాడు, ఆ అర్హత వలన అతడు ధనాన్ని పొందుచున్నాడు, ఆ ధనము వలన ధర్మమును అనగా నిస్వార్థజీవన విధానాన్ని పొందుచున్నాడు, ఈ పైవన్నీ పొందిన తర్వాత, అప్పుడు సుఖమును పొందుచున్నాడు అని భావము.
[సాధారణంగా ఈ లోకంలో ఎవరికైనా సుఖమే కావాలి అని ఉంటుంది. కాని ఆ సుఖం ఎలా లభిస్తుందో ఈ శ్లోకంలో చక్కగా వివరింప బడింది.] ॥౦.౬॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.5

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.5🌺
🌷
మూలమ్--
సంయోజయతి విద్యైవ నీచగాపి నరం సరిత్ ।
సముద్రమివ దుర్ధర్షం నృపం భాగ్యమతః పరమ్ ॥౦.౫॥

🌺
పదవిభాగః--
సంయోజయతి విద్యా ఏవ నీచగా అపి నరం సరిత్ । సముద్రమ్ ఇవ దుర్ధర్షం నృపం భాగ్యమ్ అతః పరమ్ ॥౦.౫॥
🌸
అన్వయః--
నీచగా అపి సరిత్ సముద్రమ్ (యథా సంయోజయతి) ఇవ విద్యా ఏవ (నీచగా అపి) దుర్ధర్షం నరం నృపం సంయోజయతి। అతః పరం భాగ్యమ్ (ప్రమాణమ్) ॥౦.౫॥
🌼
ప్రతిపదార్థః--
నీచగా అపి = నిమ్నగా అపి; సరిత్ = నదీ; సముద్రమ్ ఇవ; విద్యా; ఏవ = కేవలం; (నీచగా అపి = నీచజనస్థా అపి) దుర్ధర్షం = దురాసదం, దుష్ప్రాపం, దుర్లభదర్శనం; నృపం = రాజానం; నరం సంయోజయతి = తేన సహ పురుషం సఙ్గమయతి। అతః పరం = తేన సహ సమాగమానన్తరం; భాగ్యమ్ = భాగ్యానుసారేణ (తతో ధనరత్నాదీనాం లాభః) ॥౦.౫॥
🌻
తాత్పర్యమ్--
నదీ యథా నిమ్నస్థానాత్ గచ్ఛన్తీ అపి సముద్రం గచ్ఛతి, తథైవ విద్యా నీచజనమపి- రాజ్ఞః సఙ్గతిం నయతి। తదుపరి యథా దైవానుకూలతా, తథా ఘటతే (రాజ్ఞా యత్ ప్రాప్తవ్యం లబ్ధవ్యం వా తత్ ప్రాప్నోతి।) ॥౦.౫॥
🌿
హిన్ద్యర్థః--
జైసే నదీ నీచే బహనేవాలీ భీ హై తో భీ స్వాశ్రితోం కో వహ సముద్ర సే మిలా దేతీ హై, ఉసీ ప్రకార యది విద్యా నీచ కే పాస భీ హోవే తో భీ వహ విద్యా ఉస మనుప్య కో దుర్ధర్ష రాజా తక పతుఁచా దేతీ హై । ఇసకే బాద ఉస మనుష్య కా జైసా భాగ్య హోతా హై, వైసా హీ ఉసే రాజా సే లాభ హోతా హై ॥౦.౫॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంసా)
నీచగా అపి = పల్లమునకు ప్రవహించునదైనను; సరిత్ = నది; (ఆ నదిని ఆశ్రయించిన) నరం = మానవుడిని; దుర్ధర్షం = (వ్యక్తి తనకు తానుగా) పొందుటకు వీలుగాని; సముద్రమ్ = సముద్రమును; (యథా = ఏ విధముగా) సంయోజయతి = (నది తన శక్తితో) కలుపుచున్నదో; తథా = (ఆ నది వలె) అదే విధముగా; విద్యా ఏవ = (ఈ) విద్యయే; నీచగా అపి = వ్యక్తిగత యోగ్యత లేకపోయినను; నరం = (అలాంటి) మానవుణ్ణి; దుర్ధర్షం = (వ్యక్తి తనకు తానుగా) పొందుటకు వీలుగాని; నృపం = రాజును; (అలాంటి వ్యక్తితో) సంయోజయతి = కలుపుచున్నది; అతః పరం = (అలా కలిపిన తరువాత) ఆ పైన; భాగ్యమ్ = (ఆ వ్యక్తి యొక్క) అదృష్టము. ॥౦.౫॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రశంసా)
పల్లమునకు ప్రవహించునదైననునది, ఆ నదిని ఆశ్రయించిన మానవుణ్ణి, వ్యక్తి తనకు తానుగా పొందుటకు వీలుగాని సముద్రమును ఏ విధముగా నది తన శక్తితో కలుపుచున్నదో, ఆ నది వలే వ్యక్తి గతయోగ్యత లేకపోయినను, ఈ విద్యయే అలాంటి మానవుణ్ణి, ఒక సాధారణవ్యక్తి తనకు తానుగా పొందుటకు వీలుగాని, రాజును కూడా అలాంటి వ్యక్తితో కలుపుచున్నది. అలా ఆ వ్యక్తిని ఆ రాజుతో కలిపిన తరువాత ఇక ఆ పైన ఆ వ్యక్తి యొక్క యోగ్యత మరియు అదృష్టం పై భవిత ఆధారపడి ఉంటుంది అని భావము ॥౦.౫॥
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.4🌺
🌷
మూలమ్--
సర్వద్రవ్యేషు విద్యైవ ద్రవ్యమాహురనుత్తమమ్ ।
అహార్యత్వాదనర్ఘత్వాదక్షయత్వాచ్చ సర్వదా ॥౦.౪॥

🌺
పదవిభాగః--
సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ ద్రవ్యమ్ ఆహుః అనుత్తమమ్ । అహార్యత్వాద్ అనర్ఘత్వాద్ అక్షయత్వాత్ చ సర్వదా ॥౦.౪॥
🌸
అన్వయః--
సర్వదా (అన్యేన కేనాపి) అహార్యత్వాద్, అనర్ఘత్వాద్, అక్షయత్వాత్ చ సర్వ-ద్రవ్యేషు విద్యా ఏవ అనుత్తమమ్ ద్రవ్యమ్ (ఇతి విద్వాంసః) ఆహుః ॥౦.౪॥
🌼
ప్రతిపదార్థః--
సర్వదా; (అన్యేన కేనాపి) అహార్యత్వాద్ = హర్తుమ్ అశక్యత్వాత్; అనర్ఘత్వాద్ = బహుమూల్యత్వాత్; అక్షయత్వాత్ చ = దానాదినా అపి అక్షీయమాణత్వాత్; సర్వ-ద్రవ్యేషు = సర్వసాధనోపేక్షయా; విద్యా ఏవ; అనుత్తమమ్ = సర్వశ్రేష్ఠమ్; ద్రవ్యమ్ = ధనం; ఆహుః ॥౦.౪॥
🌻
తాత్పర్యమ్--
సర్వకాలేషు సర్వధనేషు విద్యా ఏవ సర్వశ్రేష్ఠం ధనమ్ ఇతి విద్వద్వచనమ్। యతః– తత్ అన్యైః హర్తుం న శక్యతే। బహుమూల్యా వర్తతే। కదాపి క్షయం న యాతి ॥౦.౪॥
🌿
హిన్ద్యర్థః--
సంసార కే సబ ద్రవ్యోం సే ఉత్తమ ధన విద్యా హీ హై। క్యోం కి న యహ చురాఈ జా సకతీ హై, న ఇసకా కోఈ మోల హీ లగా సకతా హై ఔర న ఇసకా కభీ క్షయ (నాశ, ఘటనా) హీ హో సకతా హై ॥౦.౪॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యాప్రశంస)
సర్వదా = అన్ని కాలములయందు; (ఈ విద్య) , అహార్యత్వాత్ = (ఇతరులచే) దొంగిలింపరానిదైనందు వలన; అనర్ఘత్వాత్ = వెల కట్టరానిదైనందు వలన; అక్షయత్వాత్ చ = (ఎంత ఇచ్చిననూ) తరగనిదైనందు వలన కూడా; విద్యా ఏవ = (ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ) విద్యయే; సర్వద్రవ్యేషు > సర్వ = అన్ని రకములైన; ద్రవ్యేషు = (విలువైన వాటి యందు) ద్రవ్యముల యందు; అనుత్తమమ్ = (అత్యంత విలువైన) సర్వోత్తమమైన; ద్రవ్యం (ఇతి) = ద్రవ్యము (అని); (విద్వాంసః = విద్వాంసులు) ఆహుః = చెప్పుచున్నారు.
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(ఈ శ్లోకము విద్యాప్రశంసాత్మకము)
అన్ని కాలములయందు ఈ విద్య, ఇతరులచే దొంగిలింపరానిదైనందు వలన, వెల కట్టరానిదైనందు వలన, ఎంత ఇచ్చిననూ, పంచిననూ, తరగనిదైనందు వలన కూడా, ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ విద్యయే అన్ని రకముల విలువైన ద్రవ్యముల యందు, సర్వోత్తమమైన ద్రవ్యము అని విద్వాంసులు చెప్పుచున్నారు అని భావము.
🙏

హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.3

🙏హితోపదేశ-సుభాషిత-శ్లోకాః - 0.3🌺
విద్యాప్రశంసా
🌷
మూలమ్--
అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థం చ చిన్తయేత్ ।
గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ ॥౦.౩॥

🌺
పదవిభాగః--
అజర-అమర-వత్ ప్రాజ్ఞః విద్యామ్ అర్థం చ చిన్తయేత్ । గృహీతః ఇవ కేశేషు మృత్యునా ధర్మమ్ ఆచరేత్ ॥౦.౩॥
🌸
అన్వయః--
ప్రాజ్ఞః అజర-అమర-వత్ విద్యామ్ అర్థం చ చిన్తయేత్। మృత్యునా కేశేషు గృహీతః ఇవ ధర్మమ్ ఆచరేత్ ॥౦.౩॥
🌼
ప్రతిపదార్థః--
ప్రాజ్ఞః = విద్వాన్; అజర-అమర-వత్ = జరా-మరణ-వర్జితమ్ ఆత్మానం మన్యమాన ఇవ; విద్యామ్ = ధర్మశాస్త్రాదికం, కలాకలాపవిజ్ఞానం, జ్ఞానం చ; అర్థం చ = ధనం చ; చిన్తయేత్ = అభ్యసేత్, ఉపార్జయేత్ చ; మృత్యునా కేశేషు గృహీతః ఇవ = కాలకవలితమ్ ఇవ ఆత్మానం పశ్యన్; ధర్మమ్; ఆచరేత్ = సేవేత, పాలయేత్ చ ॥౦.౩॥
🌻
తాత్పర్యమ్--
విద్వాన్ జరామరణరహితః ఇవ శాస్త్రవిద్యామభ్యసేత్। (ఆజీవనం శాస్త్రాధ్యయనం కుర్యాత్।) మృత్యుదేవః కేశాన్ గృహీత్వా తిష్ఠతి (మరణకాలః ఆసన్నః, అత్యన్తం నికటే అస్తి) ఇతి మత్వా ధర్మాచరణం కుర్యాత్ ॥౦.౩॥
🌿
హిన్ద్యర్థః--
బుద్ధిమాన్ మనుష్య కో చాహిఏ కి అపనే (ఆత్మా) కో అజర వ అమర సమఝకర విద్యా తథా ధన కో కమావే । పరన్తు ధర్మాచరణ కే సమయ తో మృత్యు కో అపనే శిర పర బైఠీ హీ సమఝే ॥౦.౩॥

ఆన్ధ్రప్రతిపదార్థః :-
(విద్యయొక్క ప్రాశస్త్యాన్ని ఈ శ్లోకము వివరిస్తుంది)
ప్రాజ్ఞః = బుద్ధిమంతుడైన వాడు; అజరామరవత్ > అజరవత్ = ముసలి తనం లేని వాని వలే; అమరవత్ = మరణం లేని వాని వలే; విద్యామ్ = (వేద ధర్మశాస్త్రాది) విద్యను; చ = మరియు; అర్థం చ = ధనమును కూడా; చిన్తయేత్ = (సాధించుటకై) చింతించవలెను; (మరియు) కేశేషు = (తల) వెంట్రుకల యందు; మృత్యునా = యముని చేత; గృహీతః ఇవ = పట్టుకున్నట్లు వలే; (ప్రతి వ్యక్తి) ధర్మమ్ = ధర్మమును; ఆచరేత్ = (సాధించవలెను) ఆచరించవలెను. ॥౦.౩॥
🍀
ఆన్ధ్రతాత్పర్యమ్ :-
(విద్యాప్రాశస్త్యవర్ణణాత్మకమీ శ్లోకము).
బుద్ధిమంతుడైన వాడు, తనకు ముసలితనం లేని వాని వలే, మరియు మరణం లేని వాని వలే, (వేదధర్మశాస్త్రాది సమస్త) విద్యలను మరియు (అవసరాలకు తగినంత) ధనమును కూడా తప్పక సాధించుటకై ఆలోచించవలెను. మరియు తనయొక్క తల వెంట్రుకలను యముడు పట్టుకున్నట్లుగా భావించి, ప్రతి వ్యక్తి ధర్మమును ఆచరించవలెను అని భావము ॥౦.౩॥
🙏